Tag Archives: insurance

బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.12 కట్ అయ్యాయా? అయితే మీకు 2 లక్షలు బెనిఫిట్?

మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంటే మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.12 కట్ అయినట్లు మెసేజ్ వచ్చిందా? ఈ విధంగా మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.12 కట్ అయినట్లు మెసేజ్ వస్తే మీకు రూ.2 లక్షల రూపాయల బెనిఫిట్ కలిగినట్టే. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే ఈ బెనిఫిట్ మీరు పొందలేకపోతున్నట్టు. మే 31లోగా మీ ఖాతా నుంచి రూ. 12 కట్ అయితే మీరు ఈ పథకానికి అర్హులు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకానికి ప్రతి సంవత్సరం మే నెలలో మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.12 కట్ చేస్తారు. ఈ విధంగా కట్ చేయడం వల్ల మీరు రెండు లక్షల రూపాయల బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రమాదవశాత్తు మీరు మరణిస్తే మీ కుటుంబ సభ్యులకు రెండు లక్షల బీమా వర్తిస్తుంది. మరణించిన లేక ప్రమాదవశాత్తు ఏదైనా అంగవైకల్యం ఏర్పడిన ఈ బీమా పథకం ద్వారా రెండు లక్షలను పొందవచ్చు.

ఇప్పటివరకు ఈ పథకంలో చేరని వారు సరాసరి బ్యాంకుకు వెళ్లి ఈ పథకంలో సభ్యత్వం పొందవచ్చు. ఈ విధంగా ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం మే నెలలో పన్నెండు రూపాయలు కట్ అవుతాయి. ఈ విధంగా మన బ్యాంకు ఖాతా నుంచి రూ.12కట్ అయినట్లు మనకు మెసేజ్ వచ్చినప్పుడు మాత్రమే మనం భీమా పథకానికి అర్హులని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో చేరాలనుకునే వారు ఇప్పుడే మీ ప్రాంతంలోని బ్యాంకుకు వెళ్లి ప్రమాద బీమా పథకంలో చేరవచ్చు.

ఫ్రీగా 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్.. ఎలా పొందాలంటే..?

రోజులు మారుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనిషికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అత్యవసర సమయల్లో ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా ఉంటాం. ప్రతి నెలా ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంతో పోల్చి చూస్తే ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలలో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.

అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కొన్నింటి ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ లభిస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లో భాగంగా ఈ ఇన్సూరెన్స్ ను పొందవచ్చు. వీటితో పాటు బ్యాంకు ఖాతాలు ఉన్నవాళ్లకు కూడా ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఖాతాగా కలిగి ఉండి క్రెడిట్ లేడా డెబిట్ కార్డ్ ఉండే ఇన్సూరెన్స్ ను పొందవచ్చు.

క్రెడిట్ కార్డు కంపెనీలు రెగ్యులర్ గా క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించే కస్టమర్లకు 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ను అందిస్తాయి. అయితే బ్యాంకును బ్యాంకును బట్టి నియమనిబంధనల్లో మార్పులు ఉంటాయి. బ్యాంక్ డెబిట్ కార్డుల ద్వారా కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే వినియోగించే డెబిట్ కార్డును బట్టి ఇన్సూరెన్స్ లో మార్పులు ఉంటాయని సమాచారం.

అయితే ఈ ఇన్సూరెన్స్ ల గురించి తెలుసుకోవాలంటే బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. అయితే రీఛార్జ్ చేసుకున్న సమయంలో మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈపీఎఫ్‌వో సైతం ఖాతాదారులకు ఫ్రీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుండగా ఈ ఇన్సూరెన్స్ లపై అవగాహన ఉంటే వీటి ద్వారా ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంటుంది.

వాహన కొనుగోలుదారులకు శుభవార్త.. ఫ్రీగా లక్ష రూపాయల ప్రయోజనాలు..?

కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. ప్రజలు ఉన్న కొద్దిపాటి నగదును అవసరాలకు తగిన విధంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు నగదు ఖర్చు పెట్టడం లేదు. కరోనా మహమ్మారి విజృంభణ మరికొన్ని నెలలు కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం కోసమే నెల జీతంలో ఎక్కువ మొత్తం కేటాయిస్తున్నారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆటోమొబైల్ పరిశ్రమ పండగను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించాలని భావిస్తోంది.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి బొలెరో పికప్ వెహికల్ ను కొంటే లక్ష రూపాయల మేర వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా మహీంద్రా అండ్ మహీంద్రా నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ఈ వాహనాన్ని కొనుగోలు చేస్తారో వారికి కంపెనీ లక్ష రూపాయల కరోనా వైరస్ ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తోంది. వాహనం కొన్న వ్యక్తితో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులకు ఈ మేర ప్రయోజనాలు కలగనున్నాయి.

ఈ నెల 1 నుంచి వచ్చే నెల 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. 60 రోజుల కాలంలో బొలెరో పికప్ వాహనం కొన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రయోజనాలు పొందవచ్చు. సిటీ పికప్, చాంపర్, పికప్ మ్యాక్సి ట్రక్ లాంటి వాహనాలు కొనుగోలు చేసే వాళ్లకు సైతం మహీంద్రా అండ్ మహీంద్రా శుభవార్త చెప్పింది. వీళ్లకు ఫ్రీ కరోనా పాలసీ వర్తిస్తుంది. ఫ్రీ కరోనా పాలసీల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తోంది.

వాహనం కొనుగోలు చేసిన రోజు నుంచి దాదాపు 10 నెలలు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో జత కట్టి ఈ ఆఫర్లను అందిస్తోంది. వాహనం కొనుగోలు చేసిన వాళ్లు ఆస్పత్రిలో చేరినా హోం క్వారంటైన్ లో ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో పాటు ఇతర కంపెనీలు సైతం వాహనదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.