Tag Archives: jabardasth

Anasuya: నాకు పిల్లల్ని కనాలని ఉంది… ఆ విషయంలో తృప్తిగా లేనట్టు షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ?

Anasuya: బుల్లితెర యాంకర్ గా వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకప్పుడు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం వెండి తెరపై సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అనసూయ శశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కానీ పిల్లల విషయంలో అనసూయ తృప్తి పొందలేదని తెలుస్తుంది ఈమెకు ఇంకా పిల్లల్ని కనాలని ఉంది అంటూ తాజాగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు ఇద్దరు అబ్బాయిలే ఉన్నారని కాకపోతే తనకు కూతురు కావాలని కోరిక ఎప్పటినుంచో ఉంది కానీ వీలు కాలేదు అంటూ అనసూయ తెలిపారు. తనకు కూతురు కావాలని కోరిక ఉందని ఆ కోరిక తీరలేదని ఈమె తెలిపారు.

కూతురు లేని లోటు ఉంది..

ఇద్దరు కొడుకులు పుట్టినప్పటికీ కూతురు లేదు అన్న అసంతృప్తి తనలో అలాగే ఉంది అంటూ పిల్లల గురించి అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా ఈమె మరోసారి ప్రెగ్నెంట్ అయ్యే విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తాను మరొక బిడ్డకు కూడా జన్మనివ్వడానికి సిద్ధంగానే ఉన్నాను అంటూ థాంక్యూ బ్రదర్ సినిమా ప్రమోషన్ల టైం లో పిల్లల్ని కనడం గురించి కూడా ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Sudheer: హీరో అయిన కమెడియన్ అని పిలుస్తున్నారు… సుధీర్ సంచలన వ్యాఖ్యలు?

Sudheer: బుల్లి తెర కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ ప్రస్తుతం హీరోగా వెండి తెర పై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా సుధీర్ కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గాలోడు సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సుధీర్ తాజాగా కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సుధీర్ ఈ సినిమా ద్వారా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఇక ఈ సినిమా నిర్మాతలకు కూడా నష్టాలని మిగిల్చిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుధీర్ కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

సుధీర్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళకముందు జబర్దస్త్ కమెడియన్ గా ప్రేక్షకులను మెప్పించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన హీరో అయినప్పటికీ కూడా ఈయనని జబర్దస్త్ కమెడియన్ అనే ట్యాగ్ మాత్రం వదలడం లేదు. దీంతో ఈ విషయంపై సుధీర్ కి ప్రశ్న ఎదురయింది. మీరు వెండి తెర పై హీరోగా నటిస్తున్న జబర్దస్త్ కమెడియన్ అనే ట్యాగ్ మాత్రం వదలలేదు. అలా పిలవడం వల్ల ఫీల్ అవుతున్నారా అనే ప్రశ్న ఎదురయింది.

జబర్దస్త్ లేకపోతే నేనులేను…

ఈ ప్రశ్నకు సుధీర్ సమాధానం చెబుతూ నన్ను జబర్దస్త్ కమెడియన్ అంటే నేను ఎప్పుడు ఫీల్ అవ్వనని తెలిపారు. ఎందుకంటే నేను ఇక్కడ వరకు వచ్చాను అంటే అందుకు కారణం జబర్దస్త్. ఈ కార్యక్రమం లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు అంటూ సుధీర్ తెలిపారు. నన్ను జబర్దస్త్ కమెడియన్ అంటే కనుక తాను అసలు ఫీల్ అవ్వను అంటూ సుధీర్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Jabardasth: ఆగిపోనున్న జబర్దస్త్ కామెడీ షో.. ఎండ్ కార్డుకు అదే కారణమా?

Jabardasth: బుల్లితెరపై ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. గత దశబ్ద కాలం పైగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ కార్యక్రమానికి త్వరలోనే ముగింపు పలకపోతున్నారని తెలుస్తుంది. జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో కూడా హీరోలుగా డైరెక్టర్లుగాను కొనసాగుతున్నారు.

ఈ విధంగా ఎంతోమందికి లైఫ్ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం త్వరలోనే ముగియబోతోంది అని తెలియడంతో అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఈ కార్యక్రమం ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే రేటింగ్ తగ్గిపోవడమేనని తెలుస్తుంది ఈ కార్యక్రమం మొదట్లో రోజా నాగబాబు జడ్జిలుగా వ్యవహరించేవారు అదేవిధంగా హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటి వారు కూడా మంచి స్కిట్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరించారు ఇలా వీరందరూ ఫర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఈ కార్యక్రమాన్ని ఆదరించారు కానీ వీరందరూ కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో రేటింగ్ తగ్గిపోయింది.

రేటింగ్ తగ్గడమే కారణమా…

ఇలా ఈ కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో రేటింగ్ రాకపోవడంతో మల్లె మాల వారు ఈ కార్యక్రమాన్ని ఆపివేయాలి అని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా ఈ కార్యక్రమం ఆగిపోతుందనే విషయం తెలియడంతో ఎంతో మంది అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ కార్యక్రమం ఆగిపోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Hyper Aadi: జీతం వస్తే డబ్బులు అన్ని వడ్డీలకే సరిపోయేవి.. ఫ్యామిలీ కష్టాలు బయటపెట్టిన ఆది!

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కామెడీ పంచ్ డైలాగులతో అందరిని ఆకట్టుకున్నటువంటి ఈయన తమ స్కిట్లకు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పనిచేసేవారు. అలాగే తక్కువ సమయంలోనే టీం లీడర్ గా కూడా మారిపోయారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి ఈయన అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.

ఈ కార్యక్రమానికి దూరమైనటువంటి ఆది వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హైపర్ ఆది తన ఫ్యామిలీ గురించి అలాగే తన కెరీర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తమ తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు సంతానమని అయితే మమ్మల్ని చదివించడం కోసం మా నాన్న ఎన్నో అప్పులు చేశారని తెలిపారు. తాను మొదట్లో జాబ్ చేస్తూ వచ్చే సాలరీ మొత్తం ఈ అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోయేది ఇలా వడ్డీలు చెల్లిస్తూ ఉంటే ఇలాగే ఉంటామని చెప్పి ఉన్న మూడు ఎకరాల పొలం కాస్త అమ్మేసామని అది తెలియజేశారు. ఇక తన తండ్రి కూడా చిన్నప్పటినుంచి నాటకాలు వేసే వారని ఆయన లాగే నాకు కూడా నాటకాలపై ఆసక్తి కలిగి ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు.

హీరోగా రావాలని ఆలోచన లేదు…

ప్రస్తుతం స్క్రిప్ట్ రైటర్ గా ఉన్నటువంటి మీరు పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ తయారు చేసి హీరోగా ఎప్పుడు రాబోతున్నారు అంటూ కూడా ఈయనకు ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ స్క్రిప్ట్ రెడీ చేయాలి అంటే అంత సులువైన విషయం కాదని ప్రస్తుతం నేను కమిట్ అయినటువంటి వాటన్నింటినీ పక్కన పెడితేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. ఇక హీరోగా తాను ఎప్పుడూ కూడా నటించాలని అనుకోవడం లేదని ఆది తెలిపారు. ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి ప్రాజెక్టులతో చాలా సంతోషంగా ఉన్నానని ఈయన వెల్లడించారు.

Anchor Rashmi: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ రష్మీ… మా అన్న ఏం కావాలంటున్న సుధీర్ ఫాన్స్?

Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే సుధీర్ రష్మీ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ వీరిద్దరు నిజ జీవితంలో కూడా ఒకటైతే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడంతో ఈ జోడి బాగుందని వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలామంది భావించారు అయితే తాజాగా యాంకర్ రష్మీ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. గత కొద్దిరోజులుగా ఈమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ పెళ్లి వార్తలకు చెక్ పెట్టాలని తన కుటుంబ సభ్యులు భావించారట.

ఇలా రష్మికి పెళ్లి చేయాలి అనే నిర్ణయాన్ని తమ కుటుంబ సభ్యులు తీసుకున్నారని అయితే ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా తమ సొంత రాష్ట్రమైనటువంటి ఒడిస్సాకు చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. ఒడిస్సాలో ప్రముఖ వ్యాపారవేత్తతో రష్మీ పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి త్వరలోనే రశ్మి తన పెళ్లికి సంబంధించిన ఈ విషయాన్ని అధికారకంగా కూడా వెల్లడించనున్నట్లు సమాచారం.

సుధీర్ ని కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైన రష్మి…

ఈ విధంగా రష్మీ పెళ్లి చేసుకోబోతుందని ఈమె ఒక వ్యాపారవేత్తకు భార్యగా వెళ్లనున్నారు అనే విషయం తెలియడంతో సుధీర్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా మా అన్నకు అన్యాయం చేసి పెళ్లి చేసుకొని నీ దారి నువ్వు చూసుకుంటే మా అన్న ఏం కావాలి అంటూ పెద్ద ఎత్తున సుధీర్ అభిమానులు డిసప్పాయింట్ అవ్వడమే కాకుండా, సుధీర్ ని వదిలేయడం న్యాయం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి రష్మి పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Hyper Aadi: హీరోయిన్ తో కలిసి ఏడడుగులు వేయబోతున్న కమెడియన్ హైపర్ ఆది… ఎవరంటే?

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన ముందుగా జబర్దస్త్ కార్యక్రమానికి కమెడియన్ గా వచ్చి అనంతరం టీం లీడర్ గా మారిపోయారు. ఇలా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఆది సినిమాలలో కూడా కమెడియన్ గా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక హైపర్ ఆది ఏదైనా ఒక స్కిట్ చేసిన లేదా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన పెళ్లి గురించి ప్రస్తావనకు వస్తుంది అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే హైపర్ ఆది పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈయన హీరోయిన్ తో కలిసి పెళ్లి పీటలేకపోతున్నారంటే ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది అయితే నిజంగానే హైపర్ ఆది హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఈయన ఢీ షోలో సినిమా ప్రమోషన్ కోసం వచ్చినటువంటి హీరోయిన్ తో కలిసి పెళ్లికి సిద్ధమైనట్లు నటించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

ఏడడుగులు నడిచిన ఆది….

బిగ్ బాస్ ఫేమ్ సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమాలోని హీరోయిన్ హ్రితికతో కలిసి ఏడడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది. సౌండ్ పార్టీ సినిమా ప్రమోషన్లలో భాగంగా సన్నీ హ్రితిక ఇద్దరు కూడా ఈ షోలో సందడి చేశారు. ఆది ఆమెను చూడగానే ఆది .. పెళ్లి కొడుకు గెటప్ లో వచ్చి ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడమే కాకుండా తనతో కలిసి వేదికపైనే ఏడడుగులు నడిచారు. అయితే ఇదంతా చూసినటువంటి అందరూ కూడా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

Rithu Chowdary: పెళ్లి వీడియో షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చిన జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి… వీడియో వైరల్!

Rithu Chowdary: రీతూ చౌదరి పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ సందడి చేసినటువంటి ఈమె అనంతరం పలు బుల్లి తెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేయగా ఈ కార్యక్రమంతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

రీతు చౌదరి కెరియర్ విషయం పక్కన పెడితే ఈమె తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తున్నారు. గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని పరిచయం చేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు కూడా హల్చల్ చేశాయి.

ఇలా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు రావడంతో ఈమె ఉన్న ఫలంగా తన ప్రియుడితో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో వైరల్ గా మారడంతో తన గురించి వచ్చిన వార్తలు అవాస్తవమని తేలిపోయింది అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా పెళ్లి వీడియోని షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

Rithu Chowdary: షూటింగ్లో భాగంగా…


ఏంటి రీతు చౌదరి ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియోలో భాగంగా ఈమె హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియో చూస్తే నిజంగానే ఈమె పెళ్లి చేసుకున్నారా అన్న సందేహాలు రాక మానదు కానీ ఈమె పెళ్లి చేసుకోలేదని ఒక షూటింగ్లో భాగంగా ఇలా పెళ్లికూతురుగా ముస్తాబయ్యారని తెలుస్తోంది. ఈ వీడియోని షేర్ చేసిన ఈమె ఆన్ స్క్రీన్ మ్యారేజ్ వెరీ క్రేజీ అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

Punch Prasad: సర్జరీ తర్వాత బుల్లితెరపై సందడి చేసిన జబర్దస్త్ పంచ్ ప్రసాద్… ఎమోషనల్ అయిన కమెడియన్!

Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కమెడియన్ పంచ్ ప్రసాద్. ఈయన అద్భుతమైన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ప్రతి ఒక్కరిని కడప నవ్విస్తూ ఉంటారు. ఇలా పైకి నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండే పంచ్ ప్రసాద్ నవ్వు వెనక ఎన్నో కన్నీటి గాథలు కష్టాలు ఉన్నాయని చెప్పాలి. ఈయన పైకి నవ్వుతూ కనిపించిన ఆరోగ్యం పరంగా తాను ఎంతో నరకం అనుభవించారు అనే విషయం మనకు తెలిసిందే.

రెండు కిడ్నీలు పాడవడంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పంచ్ ప్రసాద తన ఆరోగ్య సమస్యలను కూడా పక్కనపెట్టి ప్రేక్షకులను సందడి చేయడానికి వేదిక పైకి వచ్చేవారు అయితే ఈయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడంతో ఈయనని పరీక్షించిన వైద్యులు తనకు వెంటనే సర్జరీ జరగాలని సూచించారు. ఈ విధంగా పంచ్ ప్రసాద్ కిసర్జరీ చేయాలని చెప్పడంతో నూకరాజు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు.

Punch Prasad: ఎమోషనల్ అయిన ప్రసాద్..


ఇక ఈ విషయం జబర్దస్త్ మాజీ జడ్జ్ ఏపీ మినిస్టర్ రోజా వరకు చేరడంతో ఈమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ప్రసాద్ సర్జరీకి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఇలా సర్జరీ సక్సెస్ అయిన తరువాత ప్రసాద్ దాదాపు మూడు నెలలపాటు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు అయితే ఈయన ఆరోగ్యం కుదట పడటంతో తిరిగి బుల్లితెరపై సందడి చేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసినటువంటి ఈయన తన పరిస్థితిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Rocking Rakesh: హీరోగా జబర్దస్త్ రాకింగ్ రాకేష్.. ఘనంగా పూజా కార్యక్రమాలు పూర్తి!

Rocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఈయన జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈయన సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందినటువంటి రాకింగ్ రాకేష్ హీరోగా ఒక సినిమాకు కమిట్ అయ్యారు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు ఎంతో ఘనంగా జరిగాయి ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ అలాగే ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

రాకేష్, అనన్య హీరో హీరోయిన్లుగా గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు అంజి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో సినిమాలకు డిఓపిగా పనిచేసినటువంటి ఈయన ప్రస్తుతం దర్శకుడుగా మారారు. ఇక ఈ సినిమాకు ఎంపీ సంతోష్ కుమార్ క్లాప్ కొట్టగా.. రోజా కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

Rocking Rakesh: హీరోగా రాకింగ్ రాకేష్…


ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వ‌హించి సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందజేశారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ అందరినీ నటించి మెప్పించినటువంటి రాకేష్ హీరోగా అవకాశాలు అందుకున్నారు మరి హీరోగా ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈయనకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు.

Sudigali Sudheer: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పేసిన సుధీర్!

Sudigali Sudheer:సుడిగాలి సుదీర్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెరపై కమెడియన్గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వెండితెరపై హీరోగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సుడిగాలి సుదీర్ బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు.

ఇలా నటుడిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.సుధీర్ ఏ కార్యక్రమానికి వెళ్లిన యాంకర్ రష్మీ గురించి అదే విధంగా ఆయన పెళ్లి గురించి తప్పనిసరిగా ప్రశ్నలు తనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు మరోసారి తన పెళ్లి గురించి ప్రశ్నలు వచ్చాయి.

ఈ సందర్భంగా యాంకర్ సుదీర్ ని ప్రశ్నిస్తూ మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని మీరు కోరుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సుధీర్ సమాధానం చెబుతూ పెళ్లి చేసుకోవాలని ఆలోచన మనలో ఉంటే మనం చేసుకోబోయే అమ్మాయిలు ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని ఉంటాయి అయితే నాకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే లేదు అంటూ సమాధానం చెప్పారు.

Sudigali Sudheer: పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు…


ఇలా సుధీర్ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు అంటూ షాకింగ్ సమాధానం చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి ఇక ఎవరైనా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నవారు అయితే తనకు కాబోయే భార్య కూల్ అలాగే హ్యాపీగా ఉంటే చాలని కోరుకుంటారు అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.