Tag Archives: jagan sarkar

Punch Prasad: పంచ్ ప్రసాద్ కి అండగా నిలిచిన జగన్ సర్కార్… సర్జరీకి ఏర్పాట్లు?

Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పంచ్ ప్రసాద్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈయనకు రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటున్నారు అయితే రోజురోజుకీ ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. అయితే సర్జరీ చేయించడం కోసం సరైన డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ కి త్వరగా సర్జరీ చేయాలి అని లేకపోతే పెద్ద ప్రమాదం జరుగుతుంది అంటూ ఈయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ మరొక కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని చేయడమే కాకుండా తనకు డబ్బు సహాయం చేయాలి అంటే ఫోన్ పే గూగుల్ పే నెంబర్లను కూడా ఈ వీడియోలో పొందుపరిచిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ కి సరైన ఆరోగ్య అందేలా చూడాలని సర్జరీకి అవసరమైన సదుపాయాలను తనకు కల్పించాలంటూ మంత్రి ఆర్కే రోజా సీఎం రిలీఫ్ ఫండ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కమెడియన్ ప్రసాద్ కి వైద్య సదుపాయాలను అందించాలని సూచించారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నటువంటి ఈయనకు ఏపీ సీఎంఓ ద్వారా సహాయం అందుతుంది.

Punch Prasad: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం


ఇదివరకే ఒక నేటిజన్ఈ వీడియోని ముఖ్యమంత్రి సహాయనిది కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణ టాగ్ చేయగా ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇప్పటికే తాము ప్రసాద్ కుటుంబ సభ్యులను అప్రోచ్ అయ్యామని ఆయన చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ప్రసాద్ వైద్య చికిత్సకు ఏపీ ప్రభుత్వం అండగా నిలవడం విశేషం.

Ap Government: వాల్తేరు వీరయ్య…. వీర సింహారెడ్డికి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్….. ప్రీ రిలీజ్ వేడుకలకు నో పర్మిషన్!

Ap Government: సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు కూడా సంక్రాంతి బరిలో పోటీకి సై అంటున్నారు.వీరిద్దరూ కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వాల్తేరు వీరసింహారెడ్డి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడంతో థియేటర్ల సమస్య కారణంగా మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే మైత్రి నిర్మాతలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సినిమాల పరిస్థితి వివరించి అదనపు షోలు టికెట్ల రేట్లు పెంపుదలపై మాట్లాడినట్టు సమాచారం. అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నారని త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఆశగా ఎదురు చూశారు.ఇలా ఏపీ ప్రభుత్వం నుంచి శుభవార్త కోసం ఎదురుచూస్తున్న మైత్రి మేకర్స్ కు జగన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.

వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకను విశాఖపట్నంలో నిర్వహించాలని భావించారు. అలాగే వీరసింహారెడ్డి సినిమా ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించాలని ప్లాన్ చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా మేకర్ సినిమా ఈవెంట్లను ప్లాన్ చేయడంతో ఈ ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించడానికి ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వలేదు.ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి పర్మిషన్ లేకుండా సినిమా వేడుకలను ఏర్పాటు చేస్తే బందోబస్తు నిర్వహించడానికి చాలా కష్టతరంగా మారుతుంది.

Ap Government: మైత్రి వారికి షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్…

ఈ విధంగా బహిరంగంగా రోడ్లపై ఇలాంటి వేడుకలను నిర్వహించడం వల్ల భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో వారిని కంట్రోల్ చేయలేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి బహిరంగ వేడుకలకు ఏపీ సర్కార్ అనుమతి తెలుపకపోవడంతో చేసేదేమీ లేక సినిమా ఈవెంట్లను మరొక ప్రాంతంలో నిర్వహించడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా వెల్లడించనున్నారు.

YSRCP: రోజా, అలీ, పోసాని తరువాత ఆ నటుడికి పదవి ఇవ్వనున్న జగన్ సర్కార్?

YSRCP:సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి అనుబంధం ఉంది సినిమాలలో కొనసాగిన వారందరూ కూడా రాజకీయాలలోకి వచ్చే ఎంతో మంచి పదవులలో కొనసాగుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే స్థాపించడం విశేషం.

ఈ రెండు పార్టీలతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో సినీ గ్లామర్ కాస్త తక్కువగా ఉందని చెప్పాలి మొదట్లో జగన్ తరుపున మద్దతు తెలపడానికి సినీ ప్రముఖులు పెద్దగా ఆసక్తి చూపించలేదు అయితే 2019 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జగన్ పార్టీకి అలీ, పోసాని, జయసుధ, రాజశేఖర్ దంపతులు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, వంటి వారు జగన్ పార్టీకి మద్దతు తెలిపారు.

ఇక జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగిన మంత్రి కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు. ఇకపోతే జగన్ పార్టీలోఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి సినీనటి రోజాకు సైతం మంత్రి పదవి ఇచ్చి తనకు ప్రాధాన్యత కల్పించారు. ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్ కు ఎస్ వి బి సి చైర్ పర్సన్ గా నియమించినప్పటికీ ఆయన తన పదవిని ఎక్కువ కాలం పాటు నిలబెట్టుకోలేక పోయారు.

ఇకపోతే ఇండస్ట్రీలో తన గురించి ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ పోసాని కృష్ణమురళి అలీ మాత్రం జగన్ పార్టీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం కూడా ఈ ఇద్దరు నటులకు ఏమాత్రం అన్యాయం చేయకుండా మంచి పదవులను కట్టబెట్టారు. పోసాని కృష్ణమురళి కి ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ మెంట్ చైర్ పర్సన్ గా బాధ్యతలు ఇవ్వగా, అలికి ఏపీ ఎలక్ట్రానిక్ విభాగానికి సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

YSRCP: తర్వాత పదవి ఆ నటుడి కేనా…


ఇలా తనని నమ్ముకున్న సినీ సెలబ్రిటీలకు జగన్ ఏదో ఒక పదవిలో కూర్చోబెడుతున్నారు అయితే వీరందరికీ మంచి పదవులు ఇవ్వగా తర్వాత జగన్ ప్రభుత్వంలో చోటు సంపాదించుకునే నటుడు కృష్ణుడు అని తెలుస్తోంది. వినాయకుడు సినిమా ద్వారా అందరికీ పరిచయమైన నటుడు కృష్ణుడు కూడా వైసిపి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంలో తర్వాత స్థానం ఈయనకే ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీలకు జగన్ సర్కార్ శుభవార్త.. మరో కొత్త స్కీం ప్రారంభం..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కులాల ప్రజలకు శుభవార్త చెప్పారు. జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం పేరుతో కొత్త స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేయనున్నారు. సీఎం జగన్ నేడు 2020 – 23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఈ కొత్త స్కీమ్ ను అమలులోకి తెచ్చామని వెల్లడించారు.

రాష్ట్రంలోని ఎస్సీలకు 16,2 శాతం, ఎస్టీలకు 6 శాతం చొప్పున భూములను కెటాయిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అధికారులు ఈ రెండు కులాలకు చెందిన వాళ్లలో ఎవరికైనా పరిశ్రమలు పెట్టుకోవాలనే ఆసక్తి ఉంటే ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియజేయాలని పేర్కొన్నారు. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించారు.

దసరా పండుగ నేపథ్యంలో ఈ కొత్త స్కీమ్ ను అమలు చేస్తున్నామని తెలిపారు. దసరా పండుగ సమయంలో ఈ స్కీంను అమలు చేయడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు కోటి రూపాయల ప్రోత్సాహకాలను ప్రకటించబోతున్నామని వెల్లడించారు.

పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీలు కల్పించబోతునామని సీఎంతెలిపారు. పేదల జీవితాలను మార్చాలనే ఉద్దేశంతో నవరత్నాల హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

విద్యార్థుల సెలవుల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..?

ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం విద్యారంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు చాలా నెలల నుంచే ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు చెబుతుండగా జగన్ సర్కార్ నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలను తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని పాఠశాలలన్నీ నవంబర్ 2 నుంచి రీఓపెన్ కానున్నాయి.

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ నవంబర్ నెలంతా హాఫ్ డే స్కూళ్లు నిర్వహిస్తారని.. ప్రతిరోజు పావుగంట సమయం కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టీచర్లు విద్యార్థులకు బోధిస్తారని తెలిపారు. కరోనా, లాక్ డౌన్ ఇప్పటికే విద్యార్థులు నాలుగున్నర నెలల పనిదినాలను నష్టపోయిన నేపథ్యంలో సంక్రాంతి, వేసవి సెలవులను తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ప్రభుత్వం తల్లిదండ్రులు అనుమతిస్తేనే పిల్లలు పాఠశాలలకు రావాలని సూచిస్తోంది.

నెల రోజులపాటు పాఠశాలలను నిర్వహించిన తరువాత పరిస్థితులకు అనుగుణంగా జగన్ సర్కార్ తరగతుల నిర్వహణ విషయంలో ముందుకెళ్లనుంది. కరోనా వైరస్ పై ప్రజల్లో గతంతో పోలిస్తే భయం తగ్గినా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల నిర్వహణ కోసం ప్రభుత్వం రెండు రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

స్కూళ్లు తెరిచిన తరువాత కొన్ని రోజుల పాటు పరిస్థితులను పూర్తిస్థాయిలో సమీక్షించనుంది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీల ఏర్పాటు ద్వారా జిల్లా స్థాయిలో స్కూళ్లలో పరిస్థితులను పరిశీలించనున్నారు. విద్యార్థులు కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ఏపీ పదో తరగతి విద్యార్థులకు జగన్ సర్కార్ తీపికబురు..!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నాయి. వేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడగా విద్యారంగంపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంది.

అయితే ఎన్ని రోజులైనా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాని నేపథ్యంలో జగన్ సర్కార్ విద్యాసంవత్సరం ప్రారంభం కోసం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించి ఈ ఏడాదికి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను కల్పించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో రాష్ట్రంలోను పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు.

ప్రతి సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల ఆధారంగా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు జరిగేవి. అయితే కరోనా వైరస్ విజృంభణ వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడంతో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా పదో తరగతి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

ప్రభుత్వం విద్యా సంవత్సరం వృథా కాకూడదనే ఉద్దేశంతో రెండో తేదీ నుంచి పాఠశాలల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. 1, 3, 5, 7 తరగతుల విద్యార్ధులకు ఒకరోజు 2,4,6.8 తరగతులకు మరో రోజు క్లాసులు జరుగుతాయని మంత్రి వెల్లడించారు.

నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త… 2,173 వాలంటీర్ల ఉద్యోగాలు..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిన జగన్ సర్కార్ తాజాగా రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

జగన్ సర్కార్ రాష్ట్రంలోని నెల్లూరు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాలలో 2,173 ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ప్రాతిపదికన ఎంపిక చేసే గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ప్రభుత్వం నెలకు 5,000 రూపాయల వేతనం చెల్లిస్తుంది. https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ లో ఉద్యోగానికి సంబంధించిన పూరి వివరాలు పొందుపరిచారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా జగన్ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాలపై అవగాహనతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో 211, అనంతపురం జిల్లాలో 981, చిత్తూరు జిల్లాలో 981 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆయా జిల్లాల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నెల్లూరు జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 23 చివరి తేదీ కాగా చిత్తూరు జిల్లా అభ్యర్థులకు 25వ తేదీ, అనంతపురం జిల్లా అభ్యర్థులకు 31వ తేదీ చివరి తేదీగా ఉంది. స్థానిక గ్రామ పంచాయితీ పరిధిలో నివశించే వాళ్లను మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

జగన్ సర్కార్ శుభవార్త.. ఉచితంగా నిత్యావసర సరుకులు!

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమపై వర్షాల ప్రభావం అంతగా లేకపోయినా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు వర్షాలు, వరదల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో వర్షాలు, వరదల ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ వరదల వల్ల వందల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తాజాగా జగన్ సర్కార్ వర్షాలు, వరదల వల్ల నిరాశ్రయులైన వాళ్లకు శుభవార్త చెప్పింది. వరద బాధితులకు ఉచితంగా ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేయడానికి ప్రభుత్వం నుంచి జీవో విడుదలైంది. రాష్ట్రంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో అధికారులు బాధితుల వివరాలను సేకరించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. బాధితులకు సరుకులు అందే విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల రేషన్ బియ్యం, లీటర్ పామాయిల్, కిలో కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు ఇవ్వనుంది. వేగంగా నిత్యావసర సరుకుల పంపిణీ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జగన్ సర్కార్ ఆదేశించింది. మరోవైపు పంట నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు నగదు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

జగన్ సర్కార్ ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రయోజనం చేకూర్చుతూ ఉండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. వారి ఖాతాల్లో రూ. 5 వేలు సాయం..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. విద్య, వైద్య రంగాలతో పాటు పేదలకు, రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకున్న వారికి 5 వేల రూపాయలు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

గత పది నెలల్లో జగన్ సర్కార్ ఏకంగా 2.10 లక్షల మందికి ఆరోగ్య ఆసరా కింద సాయం చేసింది. ఇందుకోసం ఏకంగా 134 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స పొందితే జగన్ సర్కార్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తోందని వెల్లడించారు.

వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా స్కీమ్ కుటుంబ పెద్దలు కోలుకునే సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సీఎం జగన్ ముందుచూపుకు ఈ నిర్ణయం మచ్చుతునక అని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 836 జబ్బులకు వైయస్సార్ ఆరోగ్య ఆసరా స్కీమ్ ద్వారా సహాయం అందుతోంది. రోగి చికిత్స చేయించుకునే సమయంలోనే ఆస్పత్రి సిబ్బంది రోగికి సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నారు.

ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి రోగి ఆస్పత్రిలో ఎన్ని రోజులు ఉన్నారనే వివరాలను బట్టి రోజుకు 225 రూపాయల చొప్పున గరిష్టంగా నెలకు 5 వేల రూపాయలు ఇస్తారు. ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్లు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరికైనా బ్యాంకు ఖాతా లేకపోతే వాళ్లు కుటుంబ సభ్యుల ఖాతాను ఇవ్వవచ్చు.