Tag Archives: kashmir files

Prakash Raj: ఆ సినిమాకు భాస్కర్ అవార్డు కూడా రాదు…ది కాశ్మీర్ ఫైల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్!

Prakash Raj: సౌత్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం. ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన ప్రకాష్ రాజ్ ఆ తర్వాత విలన్ గా నెగిటివ్ పాత్రలలో నటించడమే కాకుండా, తండ్రిగా మంచి పాజిటివ్ పాత్రలలో కూడా నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇలా భాషతో సంబంధం లేకుండా కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్ సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

ఇలా నటుడిగా గుర్తింపు పొందటమే కాకుండా రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా ఉంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలలో ఇప్పుడు చర్చాంశనీయంగా మారాయి. ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ అనే ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ప్రకాష్ రాజ్ ‘పఠాన్’ సినిమా సూపర్ హిట్ అవ్వడం గురించి మాట్లాడుతు షారుఖ్ సినిమాను పొగడటమే కాకుండా.. మరొకవైపు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘పఠాన్’ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు ఇడియట్స్ అన్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. ఇప్పుడు ‘పఠాన్’ సినిమాను బ్యాన్ చేయాలని గోల చేసినవారు అప్పుడు మోడీ సినిమాకి కనీసం రూ.30 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయారని విమర్శించాడు.

Prakash Raj: అత్యంత చెత్త సినిమా….

ఇలా సినిమా బ్యాన్ చేయాలని కేవలం సౌండ్ పొల్యూషన్ మాత్రమే చేస్తారు. ఈమధ్య కాలంలో వచ్చిన చెత్త సినిమాలలో “ది కాశ్మీర్ ఫైల్స్”సినిమా కూడా ఒకటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఆ సినిమా దర్శకుడు ఆస్కార్ నామినేషన్ రాలేదని అడుగుతున్నాడు. అలాంటి చెత్త సినిమాకు భాస్కర్ అవార్డు కూడా రాదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాలలో చర్చనీయంగా మారాయి.

IFFI: ఆ చెత్త సినిమాను ఎలా ప్రదర్శించారు.. ఫిలిం ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో జ్యూరీ హెడ్ షాకింగ్ కామెంట్స్!

IFFI: ప్రతిరోజు ఎన్నో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలను మాత్రమే ఎంపిక చేసి వాటిని ప్రపంచవ్యాప్తంగా పలు ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రదర్శితం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని గోవాలో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలో ఈ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా 15 చిత్రాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ భాషలలో సెలబ్రిటీలు ఇక్కడికి హాజరయ్యి సందడి చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమం కోసం 15 సినిమాలను ఎంపిక చేయగా ఇందులో 14 సినిమాలు మాత్రమే బాగున్నాయని ఒక సినిమా మాత్రం చౌకబారు సినిమా అంటూ ఈ ఫిలిం ఫెస్టివల్ హెడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

53వ ఇంటర్నేషనల్ ఫీలిమ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా కార్యక్రమం సోమవారం ఎంతో ఘనంగా ముగిసాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమ హెడ్ నదవ్ లపిడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన 14 సినిమాలు చాలా బాగున్నాయి. అయితే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా మాత్రం చాలా చౌకబారు సినిమా అని, ఈ సినిమా చూసి తాము షాక్ అయ్యామని ఇలాంటి ఒక చెత్త సినిమాని IFFI లో ఎలా ప్రదర్శించారని ఈయన మండిపడ్డారు.

IFFI: చౌకబారు సినిమాలను ప్రదర్శించడం మంచిది కాదు…

కళాత్మకమైన చిత్రాలను ప్రదర్శించబడే ఈ వేదికపై ఇలాంటి చిత్రాలను ప్రదర్శించడం మంచిది కాదని ఈయన పేర్కొన్నారు.లపిడ్ ఇజ్రాయెల్ కు చెందిన ఫిల్మ్ డైరెక్టర్. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకోవడమే కాకుండా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి కూడా ఈయన జూరీ హెడ్ గా నిలిచారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sai Pallavi: కొందరు నా మాటలను రాజకీయంగా వాడుకుంటున్నారు.. మరోసారి వివాదంపై స్పందించిన సాయి పల్లవి?

Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కాశ్మీర్ పండిట్ల హత్య, గో హత్యల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా సాయి పల్ల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.ఈ క్రమంలోనే సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు ఏకంగా ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.

విరాటపర్వం సినిమా విడుదల తర్వాత ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచాలని మాట్లాడటం లేదు. తాను మాట్లాడిన మాటలు నిజమేనని, మనలో మంచితనం ఉండాలి కానీ మతాలలో కాదని, మనలోనే మంచితనం లేనప్పుడు మతాలలో ఎక్కడుంటుంది అంటూ సాయి పల్లవి తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ఒక డాక్టర్ గా తనకు అన్ని ప్రాణులు సమానమేనని ఈమె క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే తాజాగా మరోసారి సాయి పల్లవి తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. నేను చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు రాజకీయంగా వాడుకుని పెద్ద ఎత్తున వివాదం సృష్టించారని పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో తాను ఎవరికి భయపడటం లేదని, తాను ఎప్పటికీ ఒకటే మాట పై కట్టుబడి ఉన్నానని, నిజా నిజాలు ఏంటో అందరికీ తెలుసు అంటూ సాయి పల్లవి మరోసారి ఈ విషయంపై స్పందించారు.

ఎవరికి భయపడటం లేదు.. ఒకే మాటపై ఉన్నా…

ఇకపోతే సాయి పల్లవి తాజాగా నటించిన గార్గి అనే సినిమా ఈనెల 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మరోసారి ఈ వివాదం గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.