Tag Archives: krishna

Super Star Krishna: నరేష్ చేసిన పనికి కృష్ణ ఆత్మ కూడా శాంతించదు.. సీనియర్ జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్!

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో చిత్ర పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. కృష్ణ గారు మరణించారని వార్త తెలియగానే సినీ లోకం తరలివచ్చి ఆయనకు కన్నీటితో నివాళులర్పిస్తున్నారు. మరి కాసేపట్లో కృష్ణ గారి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.ఇదిలా ఉండగా తాజాగా కృష్ణ మరణం అనంతరం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు కృష్ణ గారి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే కృష్ణ విజయ నిర్మలను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయనిర్మల కుమారుడైన నరేష్ తో కృష్ణ గారు ఎలా ఉండేవారు అనే విషయం గురించి యాంకర్ ప్రశ్నించగా ఇమంది రామారావు మాట్లాడుతూ.. నరేష్ అంటే కృష్ణకి పెద్దగా ఇష్టం ఉండేది కాదని తెలిపారు.ఇకపోతే కృష్ణ గారు మరణించారని వార్త తెలియగానే ఆయన ఏకంగా నటి పవిత్ర లోకేష్ ను వెంట పెట్టుకుని రావడం పట్ల రామారావు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

ఈ విధంగా కృష్ణ గారు మరణించారనే వార్త తెలియగానే నరేష్ పవిత్ర లోకేష్ తో పాటు ఆయనని చూడటానికి రావడంతో అక్కడ కృష్ణ గారి ఫ్యామిలీకి ఎలా ఉంటుంది వాళ్ళందరూ తలదించుకునే పని చేసినట్టే కదా అంటూ ఈయన మండిపడ్డారు. ఇక తను పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తే చేశారు కానీ ఇలా తనతో పాటు కలిసి కృష్ణ గారిని చూడటానికి రావడం ఏమాత్రం భావ్యంగా లేదని తెలిపారు.

Super Star Krishna: కృష్ణ ఫ్యామిలీకి అవమానమే

ఈ విధంగా నరేష్ చేసిన పనికి ఆయన కుటుంబ సభ్యులు తలదించుకోవడమే కాకుండా కృష్ణ గారి ఆత్మ కూడా శాంతించదు అంటూ ఇమంది రామారావు నటి పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహారం గురించి మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈయన చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక కృష్ణ గారు హాస్పిటల్ లో చేరారని విషయం తెలిసినప్పటి నుంచి నరేష్ తనతో పాటు ఉన్నారు. అయితే కృష్ణ గారి మరణం ఉన్న తర్వాత ఏదైనా నటి పవిత్ర లోకేష్ తో కలిపి ఆయనని చూడటానికి వచ్చారనే విషయం మనకు తెలిసిందే.

NTR -Krishan: ఎంతో స్నేహంగా ఉన్న ఎన్టీఆర్ కు కృష్ణకు మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయో తెలుసా?

NTR -Krishan: తెలుగు చిత్ర పరిశ్రమలు సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోలు అందరూ తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా నిలబడ్డారు. ఇలా ఈ హీరోలందరూ ఎలాంటి పాత్రలలోనైనా ఎంతో అవలీలగా నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా నిలిచారు. ఇకపోతే ఎన్టీఆర్ ను ప్రేరణగా తీసుకొని కృష్ణ సినిమాలలోకి వచ్చారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా అన్నదమ్ములుగా ఎంతో కలిసిమెలిసి ఉన్నటువంటి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా మనస్పర్ధలు వచ్చాయి.

ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.అల్లూరి సీతారామరాజు సినిమాని ఎన్టీఆర్ చేయాలని భావించారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమాని కృష్ణ ప్రకటించి ఈ సినిమాలో నటించారు ఇలా ఈ సినిమాలో కృష్ణ నటించిన కృష్ణ మధ్య విభేదాలు తలెత్తాయి.

ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమా ప్రకటించగా ఆయనకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం సినిమా చేయడంతో ఈ సినిమా సమయంలో కూడా వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.ఇక వీరిద్దరూ తమ వారసులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే సినిమాలను ప్రకటించారు అయితే ఈ రెండు సినిమాలకు ఒకే విధమైనటువంటి టైటిల్ ఉండడంతో ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా గొడవ జరగడం కోర్టు వరకు వెళ్లడం జరిగింది. ఈ విధంగా వీరిద్దరి మధ్య పలు విషయాలలో భేదాభిప్రాయాలు వచ్చి మనస్పర్ధలు రావడంతో ఇద్దరికీ మాటలు లేవు అయితే వీరి మధ్య ఎలాంటి వివాదం వచ్చినా అది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండేది.

NTR -Krishan: సినిమాల విషయంలోనే మనస్పర్ధలు..

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందిన అనంతరం ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చారు. రాజకీయాలలోకి వచ్చిన ఎన్టీఆర్ కి కృష్ణ పూర్తి మద్దతు తెలిపారు. అయితే అనూహ్యంగా రాజీవ్ గాంధీ పిలుపుమేరకు కృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలలోకి రావడంతో వీరిద్దరి మధ్య మరోసారి మనస్పర్ధలు వచ్చాయి. రాజీవ్ గాంధీ మరణం తర్వాత కృష్ణ రాజకీయాలకు దూరమయ్యారు తద్వారా తిరిగి వీరిద్దరి మధ్య మరోసారి మంచి స్నేహం ఏర్పడింది. ఇలా ఎంతో చనువుగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్య పలు విషయాలలో మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.

Krishna: సూపర్ స్టార్ కృష్ణ కోసం ఢిల్లీ పెద్దలను ఎదిరించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఎందుకో తెలుసా?

Krishna: ఒక సాధారణ వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ అనంతరం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలను సృష్టించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈయనే మొదటి జేమ్స్ బాండ్ మొదటి కౌబాయ్. తెలుగువారి అల్లూరి ఎవరంటే కృష్ణ గారి పేరు చెబుతారు. సింహాసనంలో రారాజుగా వెలిగినటువంటి కృష్ణ కానరాని లోకాలకు వెళ్ళిపోయారు.

ఇకపోతే చిత్ర పరిశ్రమలో ఈయన సాధించిన ఎన్నో అవార్డులు రివార్డులు మరే హీరోకి సాధ్యం కాలేదని చెప్పాలి. ఇండస్ట్రీలో కొనసాగిన కృష్ణ 350 పైగా సినిమాలలో నటించడమే కాకుండా ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నంది అవార్డులను కూడా అందుకున్నారు.2008వ సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకోవడమే కాకుండా 2009వ సంవత్సరంలో చిత్ర పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు.

ఈ విధంగా కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం వెనుక ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని తెలుస్తోంది.ఈ విషయాన్ని స్వయంగా తన కూతురు మంజులతో కలిసి చిట్ చాట్ నిర్వహించిన సమయంలో కృష్ణ వెల్లడించారు.ఈ క్రమంలోనే మంజుల మాట్లాడుతూ పద్మభూషణ్ బిరుదు రావడం పై మీ ఫీలింగ్ ఏంటి అని ప్రశ్నించగా పద్మభూషణ్ కోసం తాను ప్రయత్నం చేయలేదని కృష్ణ వెల్లడించారు.

Krishna: వైయస్సార్ ప్రమేయంతోనే పద్మభూషణ్…


ఇకపోతే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనతో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేసిన మీకు పద్మభూషణ్ రాకపోవడం ఏంటి అని బాధపడి స్వయంగా ఆయనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో మాట్లాడిన అనంతరం తన పేరును పద్మభూషణ్ అవార్డులో చేర్చారని ఆయన వల్లే తనకు ఈ అవార్డు దక్కిందని కృష్ణ వెల్లడించారు. ఇక అప్పట్లో ఈ విషయం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి కృష్ణ కోసం కేంద్రం పెద్దలను వైయస్సార్ ఎదిరించారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

Rajiv Gandhi: రాజీవ్ గాంధీ బ్రతికే ఉంటే కృష్ణ సీఎం అయ్యేవారా.. రాజీవ్ గాంధీతో కృష్ణకున్న అనుబంధం ఏంటి?

Rajiv Gandhi:టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణ కేవలం హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారు బాధ్యతలను నిర్వర్తించే రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఆంధ్రాలో ఎన్టీఆర్ ను ఎదిరించే నాయకుడు కావాలని కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే ఇందిరాగాంధీ మరణించిన సమయంలో ఆయన అంత్యక్రియలకు కృష్ణ హాజరు కావడంతో అప్పటినుంచి రాజీవ్ గాంధీతో మంచి స్నేహం ఏర్పడింది. ఇలా రాజీవ్ గాంధీతో ఏర్పడిన ఈ స్నేహం కారణంగానే రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కృష్ణ ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసే 71 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు.

అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎన్టీఆర్ ను ఎదిరించే దమ్మున్న నాయకుడు కృష్ణ అని భావించినటువంటి ఈయనకు సీఎం రేసులో దింపాలని భావించారు.ఈ విధంగా రాజీవ్ గాంధీ సైతం కృష్ణ ను సీఎం చేయాలని అహర్నిశలు కృషి చేశారు.ఇక వచ్చే ఎన్నికలలో కృష్ణ సీఎంగా పోటీ చేస్తారు అనే వార్తలు వచ్చాయి.

Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హత్యతో రాజకీయాలకు దూరమైన కృష్ణ…

అదే సమయంలోనే 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో ఒక్కసారిగా కృష్ణ రాజకీయ ప్రస్థానం అయోమయ పరిస్థితిలో పడిపోయింది.ఇలా రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో మద్యంతర ఎన్నికలు రావడం తిరిగి ఈయన పోటీ చేసిన ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా రాజీవ్ గాంధీ చనిపోవడంతో ప్రశ్న కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికలకు దూరమయ్యారు. ఒకవేళ రాజీవ్ గాంధీ కనుక బ్రతికే ఉంటే తెలుగు రాష్ట్రంలో కృష్ణ కూడా సీఎంగా ఉండేవారు అని తెలుస్తుంది.

Super Star Krishna: తనని తాను పరిచయం చేసుకుంటూ కృష్ణ రాసిన లేఖను చూశారా.. వైరల్ అవుతున్న లెటర్?

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు అయితే నేడు ఈయన తన సినీ ప్రస్థానానికి సెలవు పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లారు.అయితే కృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఈ క్రమంలోని అప్పట్లో కృష్ణ తనని తాను పరిచయం చేసుకుంటూ ఓ లేఖ రాశారు.

ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా కృష్ణ తనని పరిచయం చేసుకుంటూ ఈ రసిక ప్రపంచానికి నా వందనాలు నా పేరు కృష్ణ తేనె మనసులు సినిమాలో బసవరాజు పాత్రలో నటించాను సినిమాలలో నటించాలన్న ఆశతో ఎన్నో సంవత్సరాలుగా కలలకంటూ లెఫ్ట్ రైట్ కొడుతున్న నాకు ఈ రోజు రంగురంగుల కలగా ఈ స్టమన్ కలర్లో పరిచయమైంది.

దీనికోసం ఎంతోమంది దర్శకులు డాన్స్ మాస్టర్లు నా చేత అక్షరాల డ్రిల్ చేయించారు, నటన నేర్పించారు, డాన్సులు చేయించారు.చివరికి నా వేషం ఏంటి అని అడిగితే డ్రిల్ మాస్టర్ అని చెప్పారు. అయితే జీవితం డ్రిల్ కాకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాను. మీరందరూ చూసి బాగోగులు చెప్పే క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను.

Super Star Krishna: అస్తమించిన అల్లూరి…


ఉగాదికి నా శుభాకాంక్షలు అంటూ కృష్ణ గారు స్వయంగా తనని తాను పరిచయం చేసుకుంటూ రాసినటువంటి ఈ లేక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇలా తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైనటువంటి కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక జేమ్స్ బాండ్, ఒక కౌబాయ్, ఒక అల్లూరి సీతారామరాజు అని చెప్పాలి. ఇలా తెలుగు వారి అల్లూరి సీతారామరాజు నేడు అస్తమించడంతో ఎంతోమంది కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Naresh -Pavitra Lokesh: పవిత్ర లోకేష్ తో కలిసి కాంటినెంటల్ హాస్పిటల్ కి వెళ్ళిన నరేష్!

Naresh -Pavitra Lokesh: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు ఆయన నివాసానికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ నేడు ఉదయం 4 గంటల సమయంలో కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మహేష్ బాబు భార్య నమ్రత కాంటినెంటల్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.

ఇలా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటి లెటర్ పై చికిత్స అందించామని కాంటినెంటల్ హాస్పిటల్ సిబ్బంది పేర్కొన్నారు.కేవలం గుండెపోటు మాత్రమే కాకుండా మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బ తినడం అలాగే బ్రెయిన్ డామేజ్ కూడా ఉండడంతో క్షణక్షణానికి ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారని కాంటినెంటల్ వైద్యులు మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇక కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హాస్పిటల్ చేరుకున్నారు. ఈయన హాస్పిటల్లో అడ్మిట్ అయిన వెంటనే కృష్ణ కుమార్తెలు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాలు అందరూ కూడా కాంటినెంటల్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఇక నటుడు నరేష్ సైతం కాంటినెంటల్ హాస్పిటల్ కి వెళ్లారు.ఇక ఈయన మరణ వార్త తెలియగానే నరేష్ నటి పవిత్ర లోకేష్ తో కలిసి హాస్పిటల్ కి వెళ్లడం గమనార్హం.

Naresh -Pavitra Lokesh: కృష్ణ ఇంటికి చేరుకుంటున్న సినీ సెలబ్రిటీలు..


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హాస్పిటల్ లో నేడు తెల్లవారుజామున మరణించిన కృష్ణ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం కృష్ణ పార్థివదేహాన్ని ఆయన నివాసం వద్ద ఉంచారు. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు ఆయనను చివరిసారి చూడటం కోసం ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

Super Star Krishna: కృష్ణ మృతికి కారణాలు వెల్లడించిన కాంటినెంటల్ వైద్యులు.. ఏమన్నారంటే?

Super Star Krishna: నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ నేడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.ఇలా ఈయన మరణించారనే వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. గుండెపోటు రావడంతో ఈయనని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ కృష్ణ మరణించారు. ఇక ఈయన మరణం గురించి కాంటినెంటల్ వైద్యుడు గురు ఎన్ రెడ్డి స్పందించారు.

ఈ సందర్భంగా ఈయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ మరణించడానికి గల కారణాలను తెలియజేశారు. ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆసుపత్రికి తీసుకువచ్చారు అప్పటికే ఆయన స్పృహ లేకుండా పడిపోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు కష్టపడి సిపిఆర్ చేసి ఆయనని స్పృహలోకి తీసుకు వచ్చాము. అయితే అప్పటికే ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని గురు ఎన్ రెడ్డి తెలిపారు.

ఇలా స్పృహలోకి వచ్చిన ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించామని అయితే గంట గంట ఆయన పరిస్థితి విషమంగా మారిందని తెలిపారు.ఇలా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ ఆయనకు మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బ తినడంతో ఆయనకు నాలుగు గంటల తర్వాత డయాలసిస్ కూడా చేశామని డాక్టర్ వెల్లడించారు. అయితే గడిచే కొద్ది ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స అందించిన ఫలితం ఉండదని భావించి ఇదే విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలియజేశాము.

Super Star Krishna: బ్రెయిన్ డ్యామేజ్ కూడా జరిగింది..

ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చనీ కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వచ్చాము. ఇక అతనికి చికిత్స అందించిన ప్రయోజనం లేదని భావించి చివరి క్షణాలలో తనని ఇబ్బంది పెట్టకూడదనీ భావించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఇక ఈయనకు మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బ తినడమే కాకుండా బ్రెయిన్ లో డామేజ్ కూడా ఉండడంతో ఈయన పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని కృష్ణ మరణం గురించి కాంటినెంటల్ వైద్యుడు మీడియా సమావేశంలో తెలియజేశారు.

Actor Krishna: ఆ నాలుగు కోరికలు తీరకుండానే మరణించిన సూపర్ స్టార్.. ఆ కోరికలు ఏమిటంటే?

Actor Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. ఈయన నేడు తెల్లవారుజామున నాలుగు గంటలకు కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో కాంటినెంటల్ హాస్పిటల్ కు చేరిన కృష్ణ వెంటిలేటర్ చికిత్స తీసుకుంటూ నేడు తెల్లవారుజామున మృతి చెందారు.

ఈ విధంగా కృష్ణ మరణించడంతో ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు కృష్ణ నివాసానికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.ఇకపోతే కృష్ణ మరణించిన తర్వాత ఆయన గురించి ఎన్నో విషయాలు ఎంతోమంది గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కృష్ణ గారు మరణించడంతో ఆయన చివరి 4 కోరికలు తీరకుండానే మరణించారని వార్తలు వస్తున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లూరి సీతారామరాజు వట్టి అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసినటువంటి కృష్ణ అలాంటి తరహా పాత్రలో నటించాలని భావించారట. ఈ క్రమంలోనే చత్రపతి శివాజీ పాత్రలో నటించాలని ఆశపడ్డారు. అయితే ఇలాంటి సినిమాలలో నటిస్తే మతపరమైన వివాదాలు తలెత్తుతాయని ఈ పాత్రలో నటించకుండా ఉండిపోయారు.

Actor Krishna:తీరకుండా మిగిలిపోయిన కోరికలు…


ఇక తన కుమారుడు మహేష్ బాబుని జేమ్స్ బాండ్ లాంటి పాత్రలో చూడాలన్నది కృష్ణ గారి కోరికట. అయితే మహేష్ బాబు తన తండ్రి చేసిన సినిమాలను రీమేక్ చేయడానికి పూర్తిగా వ్యతిరేకత చూపించడంతో మహేష్ బాబును జేమ్స్ బాండ్ పాత్రలో చూడలేక ఆ కోరిక కూడా అలాగే మిగిలిపోయిందట.ఇక బాలీవుడ్ నటుడు అమితాబ్ నిర్వహిస్తున్నటువంటి కౌన్ బనేగా కరోడ్ పతి వంటి ఓ కార్యక్రమాన్ని చేయాలని కోరికగా ఉండేదట ఈ కోరిక కూడా నెరవేరకుండా పోయింది.ఇకపోతే తన కుమారులు మహేష్ బాబు రమేష్ బాబుతో కలిసి నటించిన కృష్ణకు తన మనవడితో కలిసి నటించాలని కోరికగా ఉండేది కథ కుదిరితే తప్పకుండా చేయాలని ఆశపడ్డారట. అయితే ఈ కోరికలు తీరకుండానే సూపర్ స్టార్ కృష్ణ గారు కన్నుమూశారు.

Mahesh Babu: మహేష్ బాబుకి దెబ్బ పై దెబ్బ.. మహేష్ కే ఎందుకిలా జరుగుతోంది?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.బాల నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగిన మహేష్ బాబు అనంతరం హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.ఇకపోతే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నేడు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

మహేష్ బాబుకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక ఏడాదిలోనే తన ఫ్యామిలీ మొత్తం ముగ్గురు మరణించడంతో మహేష్ బాబుకి దెబ్బ పై దెబ్బ పడుతుంది. జనవరిలో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో రమేష్ బాబు మరణించడం ఘట్టమనేని కుటుంబానికి తీరనిలోటు.

ఈ విధంగా మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించిన సంఘటన నుంచి కోలుకోక ముందే తన తల్లి ఇందిరా దేవి మరణించడం బాధాకరం.ఇందిరా దేవి మరణించిన సమయంలో మహేష్ బాబు ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే తన తల్లి మరణ వార్త నుంచి బయటపడుతూ సినిమాలలో బిజీ కానున్న మహేష్ బాబుకి మరో దెబ్బ ఎదురయింది.

Mahesh Babu: మహేష్ బాబుకి బ్యాడ్ టైం నడుస్తుందా…

మహేష్ బాబు తండ్రి నటుడు సూపర్ స్టార్ కృష్ణ నేడు తుది శ్వాస విడచడం అందరిని శోకసంద్రంలోకి ముంచింది. ఇలా తల్లి మరణ వార్త నుంచి కోలుకోక ముందే తిరిగి తండ్రి మరణించడంతో మహేష్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు.ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులు మహేష్ అన్నకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా దెబ్బ పై దెబ్బ పడటం నిజంగా బాధాకరం అంటూ అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sobhan Babu: ఎన్టీఆర్ వదులుకున్న సినిమాను చేసిన శోభన్ బాబు.. ఫీలైన ఎన్టీఆర్?

Sobhan Babu:తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలైన నందమూరి తారకరామారావు కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబు వంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలలోనైనా ఇట్టే ఇమిడిపోయే ఈ నటులు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.కేవలం కుటుంబ కథా చిత్రాలు ప్రేమకథా చిత్రాలు మాత్రమే కాకుండా పౌరాణిక చిత్రాలలో కూడా ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కూడా క్రమశిక్షణకు మారు పేరు అయితే ఇద్దరిలో ఒక్కటే తేడా ఉంది. ఎన్టీఆర్ నటించిన సినిమా ఏదైనా మంచి హిట్ అయితే ఆ సినిమా రాబట్టిన బడ్జెట్ అనుగుణంగా ఆయన తన తదుపరి సినిమాకు రెమ్యూనరేషన్ పెంచేవారు. ఈ క్రమంలోనే శోభన్ బాబు మాత్రం చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ఏడాదికి ఒకసారి తన రెమ్యూనరేషన్ పెంచే వారట.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని గుమ్మడి వెంకటేశ్వరరావు చేదు జ్ఞాపకాలు అనే పుస్తకంలో రచించారు. ఈ క్రమంలోనే బాబు రమణలు ఇద్దరు కూడా ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలని సంపూర్ణ రామాయణం సినిమాని ఎన్టీఆర్ కు వినిపించారట. ఎన్టీఆర్ ఈ సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో తనకు చెల్లించే రెమ్యూనరేషన్ తో ఈ సినిమా చేస్తామని భావించిన బాపు రమణలు ఈ సినిమాతో కృష్ణంరాజు వద్దకు వెళ్లారు.ఇక కృష్ణంరాజు అదే సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని శోభన్ బాబు దగ్గరికి తీసుకెళ్లారు.

Sobhan Babu: రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసిన ఎన్టీఆర్..

ఇక ఈ సినిమాలో శోభన్ బాబు నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా అందుకున్న విజయాన్ని చూసిన అనంతరం ఎన్టీఆర్ ఈ సినిమాని వదులుకొని చాలా తప్పు చేస్తానని భావించారట అందుకే అప్పటినుంచి తన సినిమాల రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమాలు చేస్తూ వచ్చారు. ఇకపోతే బాపు రమణ గారి దర్శకత్వంలో చేయాలన్న కోరికతోనే ఈయన శ్రీనాథ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆదరణ సంపాదించుకోలేకపోయింది.