Tag Archives: Letter

Sr.NTR: ఎన్టీఆర్ స్వహస్తాలతో రాసిన లెటర్ చూశారా… వైరల్ అవుతున్న లేఖ!

Sr.NTR: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందడంతో సెలబ్రిటీలు వారికి సంబంధించిన విషయాలను ఇంస్టాగ్రామ్ లేదా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు అయితే గతంలో అలా కాదు అభిమానులకు హీరోలు ఏదైనా తెలియచేయాలి అంటే వార్తాపత్రికల ద్వారా మాత్రమే తెలియజేసే వారు ఇలా హీరోలు తమ స్వహస్తాలతో అభిమానుల కోసం లేఖ రాసేవారు.

ఈ విధంగా అభిమానులు ఇలా హీరోలు తమ కోసం రాసిన ఈ లేఖలను చూసి ఎంతో సంతోషపడేవారు అయితే హీరోలు ఈ లేఖలను వార్తాపత్రికల ద్వారా మాత్రమే రాస్తూ అభినందనలను కృతజ్ఞతలను అభిమానులకు తెలియజేసేవారు.ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు కూడా అభిమానులను ఉద్దేశించి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రాసినటువంటి ఒక లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ విజయ చిత్ర పత్రిక ద్వారా 1966 నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు ఈ పత్రిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా నటుడిగా తనని ఈ స్థాయిలో నిలబెట్టినందుకు అభిమానులకు ప్రేక్షకులకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఈయన కృతజ్ఞతలు తెలియజేస్తూ రాసినటువంటి ఈ లేఖ ఎంతో చూడముచ్చటగా ఉంది.

Sr.NTR: అక్షర దోషాలు లేకుండా….


అచ్చ తెలుగులో ఎలాంటి అక్షర దోషాలు లేకుండా ముత్యాలు లాంటి అక్షరాలతో ఎన్టీఆర్ ఈ లేఖను ఎంతో అందంగా రాశారు. ఇక ఈ లేఖ రాసిన అనంతరం చివరిలో ఇట్లు మీ రామారావు అని ఆయన సంతకం కూడా చేశారు. ఇలా ఎన్టీఆర్ గతంలో రాసినటువంటి ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఎన్టీఆర్ చేతి రాత చూసి సంబర పడుతున్నారు. ప్రస్తుతం ఈ లేక వైరల్ గా మారింది.

Kaikala Satyanarayana: ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన కైకాల.. శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ!

Kaikala Satyanarayana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నవంబర్ నెలలో కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన విషయం మనకు తెలిసిందే.

Kaikala Satyanarayana: ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన కైకాల.. శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ!

ఇలా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కైకాల ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అనారోగ్య సమస్య చేసినప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని సహాయం అందించి తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడంతో కైకాల సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Kaikala Satyanarayana: ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన కైకాల.. శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ!

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియ చేయడమే కాకుండా తన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

మీ సహాయం నా కుటుంబానికి శక్తినిచ్చింది..

అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలైనప్పుడు ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా వ్యక్తిగతంగా నన్ను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి నాకు కావాల్సిన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మీరు చెప్పిన విధంగానే ఉన్నతాధికారులు నన్ను సంప్రదించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు నేను కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మీరు చేసిన సహాయం నాకు నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని, కళాకారుల పట్ల మీరు చూపిస్తున్న గౌరవం, ప్రజల పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే రాష్ట్రం మంచి చేతులలో ఉందనే భరోసా వస్తుందని కైకాల పేర్కొన్నారు.

Mohan Babu: మనకెందుకులే అని మౌనంగా ఉండాలా.. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు కాదు.. : మోహన్ బాబు

Mohan Babu Letter: సినిమా ఇండస్ట్రీకి దాసరి గారి మరణం తర్వాత పెద్దదిక్కు లేదనీ ఇండస్ట్రీకి మీరు పెద్ద దిక్కుగా ఉండాలని చిరంజీవి సినీ కార్మికులు అడగగా అందుకు చిరంజీవి నాకు అలాంటి బాధ్యత వద్దని, అలాంటి పదవికి అర్హుడు కాదని పేర్కొన్నారు.అయితే ఏ ఒక్క కార్మికుడికి ఆపద వచ్చినా ఆదుకోవడానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యల అనంతరం నటుడు మోహన్ బాబు బహిరంగంగా లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మోహన్ బాబు తెలియజేస్తూ…

Mohan Babu Letter: మనకెందుకులే అని మౌనంగా ఉండాలా..అందరం కలిసి సినిమాని బ్రతికిద్దాం..మోహన్ బాబు లెటర్ వైరల్!

మనకెందుకులే.. మనకెందుకులే అని మౌనంగా ఉండటం చేతకాని తనం కాదు. కొంతమంది శ్రేయోభిలాషులు మనకెందుకులే నీ మాటలు ఎంతో నిక్కచ్చిగా, ఇబ్బందికరంగా ఉంటాయి అన్నారు. ఇబ్బందికరంగా ఉన్న నిజాలే ఉంటాయి. ఇతరులను ఇబ్బంది పెట్టడం దేనికి? ఇదంతా నీకు అవసరమా? అని ఎంతో మంది అన్నారు. అంటే వాళ్ళు చెప్పినట్లు నేను బ్రతకాలా? సినిమా ఇండస్ట్రీ అంటే ఈ నలుగురు హీరోలు నలుగురు నిర్మాతలు కాదు సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వేల కుటుంబాల కల..కొన్ని వేల మంది జీవితాలు ఇండస్ట్రీ పై ఆధారపడి ఉన్నాయి ఇది నేను నా నలభై ఏడు సంవత్సరాల అనుభవంతో చెబుతున్న మాట.

అందరూ కలిసి ఒకచోట సమావేశం కావాలి…

ఇండస్ట్రీలో చిన్న పెద్ద అని లేకుండా చిన్న సినిమాలు ఆడాలి పెద్ద సినిమాలు ఆడాలి. సినిమాలు ఆడాలంటే సరైన ధరలు ఉండాలి.ఈ విషయంపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు మౌనంగా ఉంది. అసలు ప్రొడ్యూసర్లు ఎక్కడున్నారు..ఎంతో మంది జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సినిమా సమస్యలు పరిష్కారం కావాలంటే అందరం ఒకచోట సమావేశమై ఈ సమస్యకు గురించి సీఎంలకు వివరించాలి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి.. ఏం చేస్తే సినీ పరిశ్రమ మనుగడ బాగుంటుంది అని చర్చించుకోవాలని ఈ సందర్భంగా మోహన్ బాబు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రవి ఎలిమినేషన్ పై స్పందిస్తూ కేంద్ర మంత్రికి లేఖ రాస్తామన్న ఎమ్మెల్యే రాజా సింగ్!

బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం నుంచి 12వ వారం రవి ఎలిమినేట్ కావడంతో పూర్తిగా ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

టాప్ ఫైవ్ లో ఉంటారని భావించిన రవి ఇలా 12వ వారం ఎలిమినేట్ కావడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే రవి ఎలిమినేషన్ గురించి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అసలు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలను వెంటనే బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక తెలుగు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లినటువంటి యాంకర్ రవి 12వ వారం ఎలిమినేట్ కావడంతో ఆయన ఎలిమినేషన్ వెనుక ఏదో కుట్ర ఉందని అతను అనుమానాలను వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే తెలుగు హిందీలోప్రసారమవుతున్న ఈ కార్యక్రమాన్ని వెంటనే బ్యాన్ చేయాలని ఆయన కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని వెల్లడించారు.

ఇలా యాంకర్ రవి ఎలిమినేషన్ పై స్పందిస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల నుంచి బిగ్ బాస్ ఎవరినో సేవ్ చేయడానికి రవిని ఉద్దేశపూర్వకంగా బయటకు పంపించారు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. చదివితే కన్నీళ్లు ఆగవు..!

హీరో ఉదయ్ కిరణ్.. ప్రతీ ఒక్కరికీ అతడు సుపరిచితమే. ‘చిత్రం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఉదయ్ కిరణ్ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచిపోయింది. అంతే కాకుండా ఆ సినిమాతోనే ఎంతో మంది తెలుగులో ఇప్పటికీ నటులు కొనసాగుతున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా.. తన సొంత ట్యాలెంట్ పై నిలపడ్డాడు ఉదయ్ కిరణ్.

అతి కొద్ది సమయంలోనే పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తన సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలకు గురయ్యాడు. కొంత మంది సినీ పెద్దలు అతడికి అవకాశాలు లేకుండా చేశారనేది వార్తలు వినిపించాయి. ఆ కారణంగానే తను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అతడు విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా అతడికి సనిమా అవకాశాలు దగ్గాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదరయ్యాయి.

ఇక సంసార జీవితంతో కూడా అతడికి గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతడు
తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై.. ఆ ఒత్తిడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు అతడికి సంబంధించి ఓ లేఖ వైరల్ గా మారింది. అతడు చనిపోయేముందు ఆ లేఖ రాశారు. ఆ లెటర్ చదివి చాలా మంది ఎంతో బాధపడ్డారు. ఇంతకీ ఆలేఖలో ఏముందంటే.. ‘‘విషిత.. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో.. అంతటి స్థాయిలో నువ్వంటే కూడా ఇష్టం. మన మధ్య జరుగుతున్న గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధపడుతున్నారు. వారికి ఆ బాధ ఉండకూడదు.. నువ్వు అతడు మంచి వాడు అని నమ్ముతున్నావు.. కానీ అతడు మంచివాడు అస్సలు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే లోపు నీ పక్కన ఉదయ్ ఉండడు అంటూ అందులో పేర్కొన్నారు.

నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధపడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓసారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా..’’ అంటూ తన చివరి లేఖను రాశాడు. ఈ లేఖ ను చదివిన ఉదయ్ కిరణ్ అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తను పాస్ అవ్వాలంటే.. ఆ ఫోటో పంపాలంటూ.. విచిత్రమైన ఉత్త‌రం రాసిన అభిమాని.. విజయశాంతి ఏమి చేసారో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో నటీనటులకు అంత పాపులరిటీ రావడానికి కారణం వాళ్లను ఆదరించే అభిమానులు మాత్రమే. అభిమానులు, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే నటీనటులకు అంత క్రేజ్ ఉండేది కాదు. అయితే టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన విజయశాంతి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.

అయితే ఓ రోజు ఆమెకు బెంగుళూరు అభిమాని నుంచి ఓ విచిత్రమైన ఉత్తరం వచ్చింది. అందులో ఏముందంటే.. ప్రియ‌మైన విజ‌యశాంతి గారికి అంటూ రాశాడు ఆ అభిమాని. తాను సీఏ చదువుతున్నానని.. తనకు స్త్రీలతో స్నేహం చెయ్యడం అంటే ఎంతో ఇష్టమని.. వారి ద్వారా కలిగే ప్రేరణతో ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉందంటూ రాసుకొచ్చాడు.

తనకు ఓ స్నేహితురాలు ఉందని.. ఆమె కూడా సీఏ చదువుతున్నారాని.. ఆమె ఇచ్చిన ప్రేరణతో ఇద్దరం పోటీ పడి చదువుతున్నానమని ఉత్తరంలో రాశాడు. అయితే ఆమె కంటే ఎక్కువ మార్కులు రావాలంటే ఈ ఉత్తరానికి రిప్లైగా ఒక ఫొటో పంపిస్తే సరిపోతుందంటూ వేడుకున్నాడు. ఈ ఉత్త‌రానికి మీరు స‌మాధానం ఇస్తే.. తాను క‌ష్ట‌ప‌డి చ‌దివి సీఏ పాసై, విదేశాల‌కు వెళ్లడానికి సహాయపడిన వాళ్లు అవుతారంటూ రాశాడు.

ఇట్లు మీ ప్రియాతి ప్రియమైన అభిమాని అంటూ ముగించాడు ఆ బెంగళూరు అభిమాని. విజయశాంతిపై అతడికి ఉన్న అభిమానానికి ఆమె ఎంతో ఆనందించారట. అయితే తనకు రిప్లై గా ఫొటో పంపించడంతో పాటు ఆల్ ది బెస్ట్ అంటూ సమాధానం కూడా ఇచ్చినట్లు తెలిసింది.

సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ!

సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు టీపీసిసి రేవంత్ రెడ్డి. ఖమ్మం జైలులో మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన అధికారులను సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


కాగా సెప్టెంబర్‌ 17లోపు గిరిజనులకు పోడు భూములకు పట్టాలివ్వాలని అన్నారు రేవంత్ రెడ్డి. ఎస్సీ, గిరిజనులకు రూ.10లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.