Tag Archives: lokesh

Lokesh: మరోసారి మంగళగిరిలో లోకేష్ కి ఓటమి తప్పదా?

Lokesh: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికలలో మొదటిసారి పోటీ చేశారు. అయితే ఈయన గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైపు పోటీ చేసినటువంటి ఈయన ఆయన చేతిలో సుమారు 5000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.

ఇలగతే ఎన్నికలలోకేష్ ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా కూడా మంగళగిరిలో గెలవాలి అన్న ఉద్దేశంతో ఈయన ఈ ఐదు సంవత్సరాలపాటు మంగళగిరిలో తరచూ పర్యటిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా లోకేష్ మంగళగిరి నుంచి పోటీకి సిద్ధం కాగా ఎలాగైనా తనని ఓడించే దిశగా వైసిపి వ్యూహం రచిస్తోంది..

ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున మురుగుడు లావణ్యను రంగంలోకి దించారు .ఈమె బిసి మహిళా కావటం విశేషం మంగళగిరిలో పెద్ద ఎత్తున బిసి ఓట్లు ఉండటంతో తనకి సీటు కేటాయించారు అంతేకాకుండా ఈమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడంతో స్థానికంగా ఆమెకు మరింత మద్దతు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బీసీ ఓట్లే లక్ష్యంగా..
మొదటినుంచి కూడా మంగళగిరిలో వైకాపాకు మంచి మద్దతు లభిస్తుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి లోకేష్ కి కూడా కాస్త మద్దతు ఉందని చెప్పాలి. ఇలా ఈయనకు మద్దతు పెరిగిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక బీసీ మహిళ అయినటువంటి లావణ్యను జగన్ రంగంలోకి దించారు. దీంతో ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ కి ఓటమి తప్పదని అక్కడ వైసిపి జెండా ఎగురుతుందంటూ వైసిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికలలో లావణ్య లోకేష్ కి ఎలాంటి పోటీ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Ap Politics: అధికారం పోతుందన్న భయంతోనే వైసిపి గొడ్డలి ఎత్తుతున్నారు.. లోకేష్ కామెంట్స్ వైరల్!

Ap Politics: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చాలా వేడి మీద కొనసాగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగా ఉంటాయని సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల హడావిడి కావడంతో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతూ ఉన్నాయి.

ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు వైసిపి నుంచి టీడీపీకి టిడిపి నుంచి వైసీపీకి వలసలు వెళ్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇరువురి పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే ఈ గొడవలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సొంత బాయ్ బాయ్ మీదే గొడ్డలి వేటు వేసి దక్కించుకున్నటువంటి అధికారం ఈసారి పోతుందన్న భయంతోనే వైకాపా నేతలు గొడ్డలి ఎత్తుతూ దాడులకు పాల్పడుతున్నారని ఈయన కామెంట్లు చేశారు. జగన్ ఆయన సైకో సైన్యానికి ఇవే ఆఖరి రోజులని లోకేష్ తెలిపారు.

ఇవే ఆఖరి రోజులు..
ఇటీవల గిద్దలూరు మండలం గడికోటకు చెందిన మునయ్య వైకాపా నుంచి టిడిపిలోకి రావడంతో వైకాపా నేతలు తనని బెదిరించి గొడ్డలితో దారుణంగా నరికి చంపడంతో లోకేష్ ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారు. తప్పకుండా తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సురక్షితంగా ఉంటారని రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అంటూ ఇటీవల ప్రచార కార్యక్రమాలలో లోకేష్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

AP politics: లోకేష్ పవన్ కు పోటీగా మహిళ అభ్యర్థులు.. మహిళలను రంగంలోకి దింపిన జగన్?

AP politics: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు అభ్యర్థుల జాబితాను తెలియజేశారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో అందరీ చూపు రెండు నియోజక వర్గాల పైనే ఉంది.

ఒకటి పిఠాపురం కాగా మరొకటి మంగళగిరి. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈసారి గెలవాలనే ఉద్దేశంతో ఈయన పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కి పోటీగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీతా రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఈమె ఈసారి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు.

ఇక మంగళగిరిలో గత ఎన్నికలలో నారా లోకేష్ పోటీ చేసే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో ఈయన మరో నియోజకవర్గానికి వెళ్లకుండా ఈ ఎన్నికలలో కూడా అక్కడే విజయం సాధించాలన్న ధీమాతో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మంగళగిరి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈసారి ముడుగూరు లావణ్య అనే మహిళను జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు.

పోటీగా మహిళా అభ్యర్థులు..
ఇక వీరిద్దరికీ మాత్రమే కాకుండా బాలయ్యకు పోటీగా కూడా మహిళా అభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి దీపిక రంగంలోకి దిగారు. ఇలా ఈ ముగ్గురికి పోటీగా జగన్మోహన్ రెడ్డి మహిళా అభ్యర్థులను నియమించి భారీ ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ ఎన్నికలలో ఈ ముగ్గురు గెలిస్తే పర్వాలేదు కానీ లేకుంటే మహిళల చేతిలో ఓడిపోయారనే ఆపవాదం మూట కట్టుకోవాల్సి వస్తుందని చెప్పాలి.

Tarakaratna: తారకరత్నకు గుండెపోటు రావడానికి అదే కారణమా… అందుకే మరణం తప్పలేదా?

Tarakaratna: నందమూరి వారసుడు నందమూరి తారకరత్న అతి చిన్న వయసులోనే గుండెపోటుకు గురై మరణించిన విషయం మనకు తెలిసిందే. 39 సంవత్సరాల వయసులోనే తారకరత్న గుండెపోటుకు గురై ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు. ఇలా చిన్న వయసులోనే గుండెపోటుకు గురై తారకరత్న మరణించడానికి గల కారణం ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఈ ఉరుకుల పరుగుల జీవితంతో పాటు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే అధిక ఒత్తిడికి గురవుతూ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఇలా తమపై అధిక ఒత్తిడి పడుతుండడం వల్ల చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న సైతం ఇలాంటి ఒత్తిడికి గురయ్యారని తన సన్నిహితులు తెలియచేస్తున్నారు.

తారకరత్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఈయన మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోయారు. ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేనని బాధ ఒత్తిడి ఈయనలో అధికంగా ఉంది అయితే ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయినా కనీసం రాజకీయాలలో అయినా రాణించాలని తారకరత్న భావించారు.

Tarakaratna: ఒత్తిడికి గురైన తారకరత్న…

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈయన పోటీ చేయడం కోసం పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనారు. ఈ క్రమంలోనే లోకేష్ నిర్వహిస్తున్నటువంటి యువగలం పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ ఈయన పాల్గొన్నారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని ఈ గుండెపోటు కారణంగానే ఆయన మరణించారని సన్నిహితులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తారకరత్న మరణ వార్త ఇటు చిత్ర పరిశ్రమకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు తీరని లోటు అని చెప్పాలి.

Jr.Ntr: తారకరత్నకు గుండెపోటు.. బాలయ్యకు ఫోన్ చేసిన ఎన్టీఆర్!

Jr.Ntr: తాజాగా నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ తో పాటు నందమూరి తారకరత్న కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం కుప్పం మసీదు కు చేరుకొని అక్కడ ప్రార్థనలు ముగిసిన తర్వాత అక్కడి నుండి బయటికి వస్తుండగా తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే ఆయనని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేశారు.

ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన్ని పరీక్షించి గుండెపోటు రావటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించారు. గుండెపోటు రావడం వల్ల ఆయన శరీరం నీలం రంగులోకి మారిపోయి దాదాపు 45 నిమిషాల పాటు పల్స్ రేట్ పడిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. ఆ ఆయనకు యాంజీయోప్లాస్ట్‌ నిర్వహించారు. ఇదిలా ఉండగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆరా తీశాడు.

తారకరత్న అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సారిగా షాక్ అయ్యాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సోదరుడైన తారకరత్న వద్దకు వెళ్ళి పరామర్శించడానికి కుదరకపోవడంతో బాలకృష్ణకు ఫోన్ చేసినట్లు సమాచారం. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవటానికి జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు ఫోన్ చేశారట.

Jr.Ntr: నిలకడగ తారక్ రత్న ఆరోగ్యం…

తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ వెల్లడించాడు. అయితే మెరుగైన వైద్యం కోసం తారకరత్నని బెంగళూరు ఆసుపత్రికి తరలించనున్నట్లు బాలకృష్ణ వెల్లడించాడు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఆ తర్వాత తన సోదరుడు వరుసగా మృతి చెందటంతో నందమూరి కుటుంబంలో వారు లేని లోటు ఇప్పటికీ స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో నందమూరి తారకరత్న ఇలా అకస్మాత్తుగా అనారోగ్యం పాలవటంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు.

Nara Brahmani: మా నాన్నలా డైలాగ్స్ చెప్పేవారు ఎవరు లేరు…నారా బ్రాహ్మణి కామెంట్స్ వైరల్!

Nara Brahmani: నందమూరి వారసురాలిగా నారా ఇంటి కోడలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రాహ్మిని గురించి మనందరికీ సుపరిచితమే. బాలయ్య పెద్ద కుమార్తెగా, నారా లోకేష్ భార్యగా అందరికీ సుపరిచితమైన బ్రాహ్మిని వ్యాపార రంగంలో దూసుకుపోతూ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు పొందారు.

ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. ఇక ఈ సినిమా మొదటిరోజు మొదటి షో చూసిన అనంతరం నారా బ్రాహ్మణి ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

వీర సింహారెడ్డి సినిమా చూసిన అనంతరం ఈమె మీడియాతో మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్క సన్నివేశంలోనూ ప్రతి ఒక్క పాటలోను నాన్న నటన అద్భుతం అంటూ తెలియజేశారు.ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ కూడా నాన్న చాలా అద్భుతంగా చెప్పారంటూ బ్రాహ్మిని తన తండ్రి నటించిన ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

Nara Brahmani: నాన్నల డైలాగ్ చెప్పడం చాలా కష్టం…

ఇక ఈ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పమని మీడియా నారా బ్రాహ్మనీని అడిగారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నాన్నలా డైలాగ్ చెప్పడం తన వల్ల కాదని.. నాన్నల డైలాగ్స్ ఎవరు చెప్పలేరు అంటూ బాలకృష్ణపై ఈమె కామెంట్ చేశారు. ఇలా బాలకృష్ణ నటన గురించి ఆయన డైలాగ్ డెలివరీ గురించి నారా బ్రాహ్మిని చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nara Brahmani: నారా బ్రాహ్మణిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. వైరల్ అవుతున్న బ్రాహ్మణి బైక్ రైడింగ్ వీడియో!

Nara Brahmani: బాలయ్య కుమార్తెగా నందమూరి ఆడపడుచుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రాహ్మణి నారావారి ఇంట కోడలుగా అడుగు పెట్టింది.ఇలా బాలయ్య కుమార్తెగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్రాహ్మణి వివాహం అనంతరం వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు.

ఈమె హెరిటేజ్ ఫుడ్ సంస్థను ఎంతో విజయవంతంగా ముందుకు నడుపుతూ మహిళా పారిశ్రామికవేత్తగా పేరు ప్రఖ్యాతలు పొందారు.అదేవిధంగా తనదైన శైలిలో పలుసేవ కార్యక్రమాలను కూడా చేస్తూ ఈమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే నారా బ్రాహ్మణి కేవలం వ్యాపారవేత్తగా వరకు మాత్రమే మనకు తెలుసు.

మనకు తెలియని మరో యాంగిల్ బ్రాహ్మణిలో దాగి ఉందని తాజాగా బయటపడింది. ఈమెకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమట. ఇలా ప్రొఫెషనల్ బైక్ రైడింగ్ గ్రూప్లో కూడా ఈమె మెంబర్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె లడక్ హిల్ స్టేషన్ ఏరియాలో బైక్ రైడింగ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Nara Brahmani: బైక్ రైడింగ్ అంటే బ్రాహ్మణికి ఇంత పిచ్చా…

జావా యజ్దీ స్పోర్ట్స్ బైక్ పై లేహ్ లడక్ లాంటి ప్రాంతాలలోబైక్ రైడింగ్ చేసినటువంటి వీడియో వైరల్ అవ్వడమే కాకుండా ఈ రైడింగ్ విశేషాలను అనుభూతులను కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం బ్రాహ్మిని షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో ఈ వీడియో చూసినటువంటి ఎంతోమంది అభిమానులు బ్రాహ్మణిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Uma Maheswari: పాడే మోసి చెల్లెళ్లకు కన్నీటి వీడ్కోలు పలికిన బాలయ్య.. అత్త అంత్యక్రియలకు దూరమైన ఎన్టీఆర్?

Uma Maheswari: దివంగత నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈమె మరణ వార్త తెలియగానే నందమూరి కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నారు.ఇకపోతే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు దగ్గరుండి ఆమె అంత్యక్రియలను కూడా పూర్తి చేశారు.బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో హిందూ సాంప్రదాయాలు ప్రకారం ఈమెకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

ఇకపోతే నందమూరి బాలకృష్ణ తన చెల్లెలి పాడే మోస్తూ తన చెల్లెలికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఇక ఈమె అంత్యక్రియలలో భాగంగా పలువురు రాజకీయ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇలా బాలయ్య చెల్లెలకు పాడే మోయడం చూసిన అభిమానులు కంటి తడి పెట్టుకున్నారు.ఇక అంత్యక్రియలలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు లోకేష్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.

Uma Maheswari: లండన్ పర్యటనలో ఉన్న ఎన్టీఆర్…

ఇక మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి భౌతిక కాయానికి తన భర్త దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఈమె వ్యక్తిగతంగా ఎంతో మంచి మనసున్న వ్యక్తి ఎందరికో సహాయం చేసిన ఉమామహేశ్వరి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఏది ఏమైనా ఎంతో ఒక మంచి మనసున్న ఉమామహేశ్వరీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం నందమూరి కుటుంబానికి తీరని లోటు అంటూ పలువురు భావిస్తున్నారు.ఇకపోతే ఈమె అంత్యక్రియలకు నందమూరి కుటుంబం మొత్తం హాజరైనప్పటికీ ఎన్టీఆర్ మాత్రం దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్ లో ఉండటం వల్ల తన అత్తయ్య అంత్యక్రియలకు రాలేకపోయారు.

పృథ్వి రాజ్ ఆమెను గోకాడు.. ఏంటి ఈ దరిద్రం అంటూ ఫైర్ అయిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ!

సినిమా ఇండస్ట్రీలో ఓ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుని 30 ఇయర్స్ ఇండస్ట్రీ గా పేరు సంపాదించుకున్న కమెడియన్ పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన కామెడీతోఎంతోమందిని ఆకట్టుకున్న పృథ్విరాజ్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.

పృధ్విరాజ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉండేవారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పదవిలో ఉన్న పృద్విరాజ్ కొన్ని ఆరోపణల కారణంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై పృథ్వి రాజా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రోలింగ్ అంటే పృథ్వీరాజ్ అని చెప్పవచ్చు.సోషల్ మీడియా వేదికగా చాలామంది తన గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తుంటారని అయితే వాటన్నింటి గురించి తను ఏమాత్రం పట్టించుకోనని తెలిపారు.అయితే సన్నిహితులు బంధువులు వాటిని చూసినప్పుడు నాకు చెబుతున్నారని, అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోనని పృథ్విరాజ్ తెలియజేశారు. కుటుంబం పట్ల బాధ్యతగా ప్రవర్తించలేనివారు, ఎలాంటి పని పాట లేనివారు ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తుంటారని వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

అయితే గతకొద్ది రోజుల కిందట పృధ్విరాజ్ ఎవరినో గోకారంటూ పెద్ద ఎత్తున నా పై కామెంట్ చేస్తున్నారు. అలా తప్పుడు వ్యాఖ్యలు చేయటం వల్ల నాకు ఏ విధమైనటువంటి నష్టం జరగదని, ఈ సందర్భంగా పృధ్విరాజ్ తెలియజేశాడు. ఏ విధమైనటువంటి పని పాట లేనివారు ఎలాంటి కారణం లేకుండా నాపై పడి ఏడవడం ఎందుకు రా వెధవల్లారా అంటూ పృథ్వి రాజ్ తన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.