Tag Archives: manchu family

Mohan Babu: మంచు వారింటిలో సందడి చేసిన బలగం టీమ్…బలగం టీమ్ ను సన్మానించిన మోహన్ బాబు!

Mohan Babu: ప్రస్తుతం బలగం సినిమా పేరు మారుమోగుతోంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తెలంగాణ యాస,భాషలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్క తెలంగాణ ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ప్రభావం ఎంతగా పడింది అంటే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తెర కట్టి సినిమాని చూసేలా ఈ సినిమా ప్రభావం అందరిపై పడింది.

ఇకపోతే ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది అన్నదమ్ములుఅక్క చెల్లెలు వివాదాల ద్వారా మాట్లాడుకోకపోయినా ఈ సినిమా ద్వారా తిరిగి కలుసుకునేలా ఈ సినిమా అందరిపై ప్రభావం చూపుతోంది. ఇక ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను మాత్రమే కాకుండా సెలబ్రిటీలను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమా చూసినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇదివరకే డైరెక్టర్ వేణుని తన ఇంటికి ఆహ్వానించి ఆయనను సన్మానించిన విషయం మనకు తెలిసిందే. మోహన్ బాబు కూడా ఈ సినిమాని చూశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు విష్ణు బలగం సినిమా బృందాన్ని తమ ఇంటికి ఆహ్వానించి సన్మానం చేశారు.

Mohan Babu: నటనలో జీవించేసారు…


ఈ క్రమంలోనే ప్రియదర్శి వేణు రూప లక్ష్మిని తమ ఇంటికి ఆహ్వానించి వారికి ప్రత్యేకంగా సన్మానం చేయడమే కాకుండా సినిమాపై కూడా ప్రశంశాలు కురిపించారు.ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ వేణు తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన సినిమా చేశారని తెలిపారు అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా తమ పాత్రలలో జీవించారని మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Manchu Vishnu: ఇది చిన్న గొడవే… భూతద్దంలో పెట్టి చూడకండి… గొడవపై క్లారిటీ ఇచ్చిన విష్ణు!

Manchu Vishnu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు బ్రదర్స్ మధ్య జరిగినటువంటి వివాదం హాట్ టాపిక్ గా మారింది.గత కొద్దిరోజులుగా మనోజ్ విష్ణు మధ్య మాటలు లేవని అందుకే మనోజ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే మనోజ్ పెళ్లిలో భాగంగా ఎలాంటి మనస్పర్ధలు లేవని తెలిసినప్పటికీ విష్ణు మాత్రం పెళ్లికి ఒక అతిథిలా వచ్చి వెళ్లిపోవడంతో మరికొన్ని అనుమానాలు బలమయ్యాయి.

ఇక మనోజ్ పెళ్లి జరిగి నెల కూడా గడవకముందే విష్ణు ఏకంగా మనోజ్ పై దాడికి ప్రయత్నించారు.ఈ క్రమంలోనే మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి సారధి పై దాడి చేయడమే కాకుండా మనోజ్ పై కూడా విష్ణు దాడికి ప్రయత్నం చేశారు.అయితే ఇందుకు సంబంధించిన వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా తరచూ తన బంధువుల ఇంటికి వచ్చి కొడుతూ ఉంటారని తెలిపారు.

ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా ఈ గొడవపై మంచు విష్ణు స్పందించారు. ఇది నిన్న జరిగిన గొడవ ఇలాంటి గొడవలు మా మధ్య జరగడం సర్వసాధారణం. మనోజ్ చిన్నవాడు ఏదో ఆవేశంలో ఈ వీడియోని షేర్ చేశారు. ఈ గొడవను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

Manchu Vishnu: అన్నదమ్ముల మధ్య సర్వసాధారణం….

ఇది మా మధ్య తరచూ జరిగే చిన్న గొడవ దీనిని భూతద్దంలో పెట్టి చూడకండి అంటూ విష్ణు ఈ గొడవను చాలా తేలికగా తీసుకున్నారు.ఇక మంచు ఫ్యామిలీ సభ్యులు కూడా ఎలాంటి గొడవలు లేవంటూ అన్నదమ్ముల మధ్య ఇలాంటి గొడవలు ప్రతి ఒక్కరి ఇండ్లలోను జరుగుతాయి అంటూ చెప్పుకు రావడం చూస్తుంటే ఈ గొడవలు చాలా తేలికగా తీసుకున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Manchu Manoj -Vishnu: బయటపడ్డ మంచు ఫ్యామిలీ గొడవలు… మనోజ్ పై దాడికి ప్రయత్నించిన విష్ణు!

Manchu Manoj -Vishnu: సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మంచు కుటుంబంలో గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఎంతో సన్నిహితంగా ఉండే అన్నదమ్ముల మధ్య ఏదో ఒక విషయం గురించి విభేదాలు చోటు చేసుకున్నాయని అందుకే మనోజ్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఇలా ఈ విభేదాల కారణంగానే మనోజ్ తన పెళ్లి లక్ష్మీ ఇంటిలో జరిగిందని తెలుస్తుంది. ఇక ఈ పెళ్లి వేడుకలలో మంచు కుటుంబం దూరంగా ఉన్నారు. ఏదో అతిథిలా వచ్చి అక్షింతలు వేసి వెళ్ళిపోయారు.ఇలా ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య జరిగినటువంటి ఈ వివాదం ఒక్కసారిగా బయటపడటంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ గొడవకు సంబంధించిన వీడియోని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

విష్ణు తన కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే సారధి అనే వ్యక్తి గత కొంతకాలంగా మనోజ్ కి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విష్ణు సారథి ఇంట్లో మనోజ్ ఉండగా అక్కడికే వెళ్లి సారధి పై దాడి చేయగా ఆయన తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రికి వెళ్లారు.ఇక అక్కడే ఉన్నటువంటి మనోజ్ పై విష్ణు దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియోని మనోజ్ చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Manchu Manoj -Vishnu:విష్ణుని అడ్డుకున్న సారధి కుటుంబ సభ్యులు…

ఇందులో విష్ణు వాడేదో అంటున్నాడుగా అంటూ మనోజ్ పై దాడికి వెళుతూ ఉండగా సారధి కుటుంబ సభ్యులు తనని అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మనోజ్ ఇలా బంధువుల ఇళ్లపైకి వచ్చి కూడా దాడి చేస్తూ ఉంటాడు అంటూ ఈ వీడియోలో చెప్పారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారడంతో మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయని తెలుస్తోంది. అయితే ఈ విభేదాలకు కారణం ఏంటో తెలియాల్సి ఉంది.

Manchu Family: మంచు ఫ్యామిలీని అరెస్టు చేయాలి…. డిమాండ్ చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘాలు..?

Manchu Family: గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తరచూ ఏదో ఒక వార్తతో మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇక ఇటీవలే మంచు విష్ణు, మోహన్ బాబు వద్ద హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తున్న నాగ శ్రీను అనే వ్యక్తి మంచు వారి ఆఫీసులో 5 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను దొంగలించాడు అంటూ పోలీసులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగ శ్రీను ని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తూ పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Manchu Family: మంచు ఫ్యామిలీని అరెస్టు చేయాలి…. డిమాండ్ చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘాలు..?

అంతేకాకుండా ఈ విషయంపై నాగ శ్రీను ఒక సెల్ఫీ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అధికార పక్షాలు వైరల్ అయిపోయింది. ఆ వీడియోలో నాగ శ్రీను తాను ఎటువంటి దొంగతనం చేయలేదని, అనవసరంగా మంచు ఫ్యామిలీ తనపై లేని నిందలు వేస్తోందని తెలిపాడు. అదేవిధంగా తనను మంచు ఫ్యామిలీ వారి చెప్పుకోలేని విధంగా చిత్రహింసలు పెట్టారు అని చెప్పుకొచ్చాడు.అలాగే నాగ శ్రీను ని మోహన్ బాబు కులం పేరుతో దూషించడమే కాకుండా సదరు వ్యక్తి తల్లిని కూడా అసభ్యకర రీతిలో మాట్లాడుతూ ప్రవర్తించాడు అని పోలీసులకు తెలిపాడు.

Manchu Family: మంచు ఫ్యామిలీని అరెస్టు చేయాలి…. డిమాండ్ చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘాలు..?

ఇక నాగ శ్రీను ఆ మాటలు చెప్పిన అప్పటినుంచి ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా ఇదే వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగ శ్రీను ని కులం పేరుతో దూషించిన మోహన్ బాబు, మంచు విష్ణు వెంటనే అతనికి క్షమాపణలు తెలపాలి అన్ని నాయి బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీరికి మద్దతుగా బీసీ కుల సంఘాల నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారు. నాగ శ్రీను కి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. కానీ క్షమాపణ చెప్పకపోగా ఈ విషయం ఫై స్పందించడం గురించి పక్కన పెడితే అసలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

క్షమాపణలు తెలియజేయాలి…

దీనితో నాయి బ్రాహ్మణ సంఘాలు మరొకసారి ఈ విషయంపై స్పందించాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు ప్రభుత్వ అధికారులను కలిసి మంచు మోహన్ బాబు నాగ శ్రీనుకి క్షమాపణలు తెలపాలి అంటూ వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా నాగ శ్రీను చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని అనంతరం విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలి అని కోరాయి నాయి బ్రాహ్మణ సంఘాలు. దీనితో మరొకసారి మంచు బాబు ఫ్యామిలీ వార్తల్లోకెక్కింది. మరి ఈ సారి అయినా ఈ విషయంపై మంచు ఫ్యామిలీ స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి మరి. ఈ విధంగా మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు సోషల్ మీడియాలో నిలుస్తూ ట్రోలింగ్స్ కి గురవుతూ, నెటిజన్స్ ఆగ్రహానికి లోనవుతున్నారు. ఒకసారి మంచు విష్ణు సోషల్ మీడియాలో నిలువగా, మరొకసారి మంచులక్ష్మి, మరోసారి మంచు మోహన్ బాబు ఇలా ఒకరి తర్వాత ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

Mohan Babu: మంచు ఫ్యామిలీ పై ఆరోపణలు చేసిన హెయిర్ డ్రెస్సర్… అందుకే నా పై కేసు పెట్టారు!

Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ కుటుంబం నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో ఉంటారు. నిన్నటి వరకు ఈ కుటుంబం పై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా విష్ణు ఆఫీసులో దొంగతనం జరిగింది అంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Mohan Babu: మంచు ఫ్యామిలీ పై ఆరోపణలు చేసిన హెయిర్ డ్రెస్సర్… అందుకే నా పై కేసు పెట్టారు!

మంచు విష్ణు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ సుమారు 5 లక్షల వరకు దొంగతనం చేశాడని విష్ణు మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోని ఈ విషయంపై విష్ణు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ స్పందిస్తూ ఒక సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అసలు విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా విష్ణు హెయిర్ స్టైలిస్ట్ నాగ శీను మాట్లాడుతూ దొంగతనం విషయంపై అసలు విషయం తెలిపారు.

Mohan Babu: మంచు ఫ్యామిలీ పై ఆరోపణలు చేసిన హెయిర్ డ్రెస్సర్… అందుకే నా పై కేసు పెట్టారు!

నాగ శీను గత పది సంవత్సరాల నుంచి మంచు మోహన్ బాబు ఇంటిలో నమ్మకంగా పని చేస్తున్నారని తెలిపాడు. అయితే నేను ఆ ఇంటిలో ఎలాంటి దొంగతనం చేయలేదని మోహన్ బాబు విష్ణు కలిసి తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మోహన్ బాబు విష్ణు నన్ని ఎన్నో అసభ్యకరమైన పదాలతో దూషించారని ఆ పదాలు నా నోటివెంట చెప్పడానికి కూడా అసభ్యకరంగా ఉన్నాయని అలా కులం పేరుతో నన్ను దూషించి అవమానించడమే కాకుండా మోకాళ్ళపై కూర్చోపెట్టి నన్ను కొట్టారనీ కూడా నాగ శీను తెలిపారు.

ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు…

ఈ విధంగా నన్ను చిత్రహింసలకు గురి చేసి దారుణంగా అవమానించడంతో నేను ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ ఇంటి నుంచి వచ్చానని ఇలా రావడంతో నాపై ఈ విధమైనటువంటి దొంగతనం కేసు పెట్టారని నాగ శీను సెల్ఫీ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటన ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 1 గంట సమయంలో జరిగిందని నాగ శీను తెలిపారు. ప్రస్తుతం ఈయన షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై మంచు కుటుంబం ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Mohan Babu : మోహన్ బాబుకు గడ్డుకాలం.. ఆ 3 సంవత్సరాలు వరుసగా 6 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.!!

విలక్షణ నటుడు మోహన్ బాబు 1975లో “స్వర్గం నరకం” చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు 500 పైగా సినిమాలలో నటించారు. 70కి పైగా చిత్రాలను నిర్మించి, అనేక విజయాలను అందుకున్నారు. మోహన్ బాబు సినీ ప్రయాణంలో విజయాలతో పాటు 1992, 1993, 1994 సంవత్సరలలో కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ఆ సంవత్సరాలలో మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రాలు పరాజయాన్ని పొందాయి.

సీనియర్ వంశీ దాదాపు పాతిక చిత్రాలను నిర్మించిన గుర్తుండిపోయే చిత్రాలను నిర్మించారు. అలా విచిత్రంగా మోహన్ బాబుతో “డిటెక్టివ్ నారద” చిత్రాన్ని రూపొందించారు. 1992 సమీర్ ఎంటర్ప్రైజెస్, సీనియర్ వంశీ దర్శకత్వంలో “డిటెక్టివ్ నారద” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహిని హీరో, హీరోయిన్లుగా నటించారు. డిటెక్టివ్ పాత్రలో మోహన్ బాబు కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశారు. అయినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అసెంబ్లీ రౌడీ చిత్రం తర్వాత దివ్యభారతితో రెండోసారి మోహన్ బాబు జతకట్టారు.

1992 శ్రీధర్ రెడ్డి నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “చిట్టెమ్మ మొగుడు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు దివ్యభారతి హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పటి వరకు దివ్యభారతిని గ్లామర్ పాత్రల్లో చూసిన ప్రేక్షకులు ఒక్కసారి ఫ్యామిలీ పాత్రలో ఊహించుకోలేకపోయారు. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి విజయాలను మోహన్ బాబు అందుకున్నప్పటికీ ఆయన దర్శకత్వంలో హీరోగా నటించిన “చిట్టెమ్మ మొగుడు” చిత్రం పరాజయం పొందింది.

1992 గోపి ఆర్ట్ పిక్చర్స్, చలసాని గోపి నిర్మాణం, కె.ఎస్.ప్రకాష్ దర్శకత్వంలో “దొంగా పోలీస్” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో మోహన్ బాబు, మమతాకులకర్ణి హీరో, హీరోయిన్లుగా నటించారు. మోహన్ బాబు ఈ సంవత్సరంలో నటించిన మిగతా చిత్రాలతో పోలిస్తే ఈచిత్రం పర్వాలేదనిపించింది. 1993 స్రవంతి మూవీస్, స్రవంతి రవికిషోర్ నిర్మాణం, ఏ మోహన్ గాంధీ దర్శకత్వంలో “రౌడీ మొగుడు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. మోహన్ గాంధీ, స్రవంతి రవి కిషోర్, మోహన్ బాబు ఈ అరుదైన కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

1993 లక్ష్మీప్రసన్న పిక్చర్స్,దాసరి నారాయణరావు దర్శకత్వంలో “కుంతీపుత్రుడు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ‘కుంతీ పుత్రుడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.

1994 రమణమూర్తి నిర్మాణం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో “యమధర్మరాజు ఎమ్.ఎ”చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో మోహన్ బాబు, రంభ, సురభి హీరో, హీరోయిన్లుగా నటించారు. అలనాటి నటి సుజాత మరో ప్రధాన పాత్రలో కనిపించారు. రాజ్ కోటి స్వరపరిచిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మోహన్ బాబు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించారు. పోలీసుగా రాజకీయ నాయకుడిగా రెండు పాత్రల్లో కనిపించిన ఆయన సినిమా విజయాన్ని గట్టెక్కించలేకపోయారు. ఇలా మోహన్ బాబు మూడు సంవత్సరాలు పరాజయాలతో చతికిల పడ్డారు.

సిరివెన్నెల అంత్యక్రియలకు మంచు కుటుంబం దూరంగా ఉండడానికి కారణం అదేనా?

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30వ తేదీ లంగ్ క్యాన్సర్ తో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా సిరివెన్నెల మరణవార్త తెలుసుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ క్రమంలోనే సిరివెన్నెలతో పరిచయం ఉన్న ఎంతో మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

ఇక సిరివెన్నెల పార్ధివదేహాన్ని ఫిలింఛాంబర్ లో ఉంచగా చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాజమౌళి, క్రిష్,రాజశేఖర్‌, తివిక్రమ్‌, నాగబాబు, శర్వానంద్,అల్లు అర్జున్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు.

సిరివెన్నెల కడసారి చూపు కోసం టాలీవుడ్ సినీ ప్రపంచం మొత్తం కదిలి వచ్చినప్పటికీ ఆయన అంత్యక్రియలు మంచు కుటుంబం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ప్రముఖ సినీ గేయ రచయిత మరణిస్తే కడసారి చూపు కోసం మంచు ఫ్యామిలీ కనిపించకపోవడంతో ఎంతోమంది అసలు సిరివెన్నెల అంత్యక్రియలకు మంచు కుటుంబం దూరంగా ఉండడానికి కారణం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై మంచు మోహన్ బాబు స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం తిరుపతిలో నివసిస్తున్నటువంటి మోహన్ బాబు తమ్ముడు మరణించిన సంగతి మనకు తెలిసిందే. తన తమ్ముడు మరణించడం వల్ల తమ కుటుంబసభ్యులు బయటకు వెళ్లకూడదని చెప్పడం వల్ల ఎవరు కూడా సిరివెన్నెల అంత్యక్రియల్లో పాల్గొనలేదు. ఆయన ఎక్కడున్నా తన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మోహన్ బాబు తెలిపారు.

బాలయ్య టాక్ షో ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా?

వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే రికార్డులు సృష్టించిన నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా ఆహా యాప్ ద్వారా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ సినిమా సెలబ్రిటీలను ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాల గురించి ప్రేక్షకులకు తెలియజేయనున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమం దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానుందని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోలను కూడా ఆహ్వానించి ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెగా కుటుంబం, మంచు కుటుంబం ఈ కార్యక్రమానికి అతిధులుగా వస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఇకపోతే 4వ తేదీ ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి ఎవరు వస్తారు అనే విషయం పై ఎంతో ఆతృత నెలకొంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు రానున్నట్లు సమాచారం. బాలకృష్ణ మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబును పలు ప్రశ్నలు అడగడనున్నట్లు తెలుస్తోంది.

ఇక నందమూరి బాలకృష్ణ మోహన్ బాబు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉందని వీరిద్దరూ ఎంతో ఆప్యాయంగా సోదర అంటూ ఒకరినొకరు పరామర్శించకుంటారనే విషయం తెలిసిందే. మరి ఈ ఎపిసోడ్లో వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ కార్యక్రమం ఎలా కొనసాగనుంది అనేది తెలియాలంటే మొదటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.