Tag Archives: milk

మేకపోతు అతడి పాలిట శాపంగా మారింది.. అసలేమైందంటే..

అతడు గొర్రెలు, మేకలను ప్రతీ రోజు అడవికి తీసుకెళ్లి కాస్తాడు. అంటే గొర్రెల కాపరి అన్నట్లు. అయితే అతడికి సొంతంగా కొన్ని గొర్రెలు, మేకలు కూడా ఉన్నాయి. అయితే అతడు ఉదయం, సాయంత్రం రెండు పూటలు అతడి వద్ద ఉన్న మేకల్లో కొన్ని మేకల నుంచి పాలు పితుకుతాడు.

ఓ రోజు ఇలానే మేక దగ్గరకు వెళ్లి పాలు పితుకుతున్న క్రమంలో ఆ మంద నుంచి ఓ మేకపోతు వచ్చి అతడి తలపై తన కొమ్ములతో పొడిచింది. దీంతో అతడికి రక్త స్రావం అయింది. వెంటనే అతడిని ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. తర్వాత ఏమైందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. ఆ కాపరి పాలిట ఆ మేకపోతు కాల యముడైంది.

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన మేకల కాపరి చీకోటి చంద్రయ్య (46) గత నెల 25న తన మేకల వద్దకు పాలు పితికేందుకు వెళ్లాడు. అతడు సాధారణంగా రోజూ ఇలానే వెళ్లి పాలు పితికి ఇంట్లోకి వెళ్లేవాడు. ఆ రోజు అతడికి దురదృష్టం అలా ఉంది. పాలు పితుకుతున్న సమయంలో వెనకు నుంచి ఓ మేకపోతు వచ్చి.. కొమ్ములతో ఆ చంద్రయ్య తలపై పొడించింది.

వెంటనే అతడిని కుటుంబసభ్యులు ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. చికిత్స తీసుకున్నా తగ్గలేదు. దీంతో సిరిసిల్ల దవాఖానకు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో.. అక్కడ నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మరణించాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పొరపాటున కూడా ఈ పదార్థాలను ఫ్రిజ్లో పెట్టకండి.. ఎందుకో తెలుసా?

టెక్నాలజీ మారడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది.ప్రస్తుత జనరేషన్ లో చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిజ్ వాడకం ఎక్కువ అయిన తర్వాత మనం తినే ఆహార పదార్థాలు, కాయగూరలు, పండ్లు, పాల పదార్థాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఫ్రిజ్లో నిల్వ చేస్తూ ఉన్నాము. ఇలా ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల అవి చెడిపోకుండా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి పదార్థాలు ఫ్రిజ్లో పెట్టి పాడు చేస్తున్నామన్న విషయం మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే.. ఫ్రిజ్ లో కొన్ని రకాల పదార్థాలను నిల్వ చేయడం వల్ల వాటిలో ఉండే రుచి పోషక విలువలూ తగ్గుతాయి. అయితే ఫ్రిజ్ లో మనం ఏయే పదార్థాలను ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల వాటి వల్ల కలిగే అనర్ధాలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పాలు : ఫ్రిజ్ లో పాలను నిల్వ ఉంచినప్పుడు డైరీ మిల్క్, బీర్ లాగా విస్తరిస్తుంది.అందుకు గల ప్రధాన కారణం అందులో 87 శాతం నీరు ఉండడమే. పాలు ద్రవ పదార్థాల నుంచి ఘనపదార్థంలోకి మారినప్పుడు దాని ఆకృతి మారడమే కాకుండా జిగటగా కూడా మారుతుంది.

దోసకాయ : దోసకాయలను రిఫ్రిజిరేటర్‎లో ఉంచినప్పుడు, వాటి రుచి మారడంతో పాటు దోసకాయల ఆకృతి కూడా ప్రభావితం అవుతుంది.

గుడ్లు : ఫ్రిజ్ నిల్వ చేసిన గుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లను ఫ్రిజ్ లో ఎక్కువగా నిల్వ చేయడం వల్ల అది కుళ్ళిపోవడంతో పాటు, తిన్నప్పుడు పుల్లటి వాసన కూడా వస్తాయి.గుడ్లు ఫ్రిజ్ లో నిల్వ చేస్తే నీటి కంటెంట్ బయటి పొరను పగులగొట్టడానికి కారణమవుతుంది. ఇది అనేక బ్యాక్టీరియాలకు హాని కలిగిస్తుంది.

పండ్లు : చాలామంది మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను తాజాగా ఉంచడం కోసం ఆ పండ్లను ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు.వాటి వల్ల అందులో ఉన్న పోషక విలువలు కోల్పోతాయి. అంతే కాదు, ఫ్రిజ్‌లో పండ్లను ఉంచినప్పుడు అది వాటి రుచిని ప్రభావితం చేస్తుంది.

వేయించిన ఆహారాలు : వేయించిన ఆహారాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయరాదు. అలా చేయడం వల్ల వాటిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి.

పాస్తా : ఎక్కువ మంది మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో ఉంచుతారు. ఇలా ఉంచడం మంచిది కాదు.పూర్తిగా ఉడికిన ఆహార పదార్థాలు మళ్లీ వేడి చేయడం వల్ల మెత్తగా మారుతుంది.

టొమాటో సాస్ : టొమాటో సాస్‌ను రిఫ్రిజిరేటర్‎లో ఉంచినప్పుడు రుచి మారుతుంది. కాబట్టి టొమాటో సాస్‌ను ఫ్రిజ్ లో నిల్వ చేయకపోవడమే మంచిది.

బంగాళదుంపలు : బంగాళదుంపలను ఫ్రిజ్ లో ఉంచినప్పుడు మృదువైన గుజ్జు బంగాళదుంపలు తప్ప అందులో మరేమీ ఉండవు.

బెల్లం, పాల మిశ్రమంతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టేయవచ్చు..

పాలల్లో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతీ ఒక్కరూ పాలను తీసుకుంటారు. ప్రతిరోజు పాలు తాగితే ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవు. కొంతమంది అయితే అసలు పాలు తాగడానికి ఇష్టపడరు.

అలాంటి వాళ్ళు పాలలో చక్కెరతో పాటు ఏదన్నా ఫ్లేవర్ కలుపుకుని తాగుతారు. ఇలా పాలల్లో పంచదార కలుపుకొని తాగడం కంటే.. బెల్లం కలుపుకొని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.. దాని గురించి తెలుసుకుందాం..

జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు.. తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఈ పాలు, బెల్లం మిశ్రమంలో ఉండే పోషకాల వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్త హీనతతో బాధపడే వారు.. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే. ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడేవాళ్ళు పాలలో బెల్లం కలుపుకొని తాగడం వలన ఎముకలు దృడంగా అవడమే కాకుండా మొకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. చుండ్రు ఎక్కువగా ఉన్నవాళ్లు దీనిని తీసుకుంటే.. ఎక్కువగా ఆ సమస్య నుంచి బయపడొచ్చు. ఈ మిశ్రమానికి కర్పూరం, తులసి ఆకులు కలిపితే రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఈ మిశ్రమాన్ని కలుపుకొని తాగడం వల్ల చర్మం చాలా కాంతివంతంగా అవుతుంది.

పాలల్లో కల్తీ జరిగిందా.. లేదా అనేది ఎలా తెలుసుకోవాలో తెలుసా?

పాలల్లో వివిధ రకాల పోషకాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. దాదాపు ప్రతీ ఒక్కరు ఏదో రకంగా పాలతో ముడిపడి ఉన్నవాళ్లే.. ఎందుకంటే.. పాలను వినియోగించని మనిషి అంటూ ఎవరూ ఉండరు. పుట్టిన దగ్గర నుంచి ముందుగా అమ్మ పాలు తాగుతాడు.. తర్వాత టీ, కాఫీ లాంటివి తాగే సమయంలో అందులో కూడా పాలు ఉంటాయి.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ మాయ నడుస్తోంది. ఎక్కడ చూసినా నాణ్యమైన సరుకులు గానీ, నాణ్యమైన వస్తువులు కానీ కనిపించడం లేదు. ఆవు, గేదె నుంచి వచ్చే పాలల్లో కూడా కల్తీ రాజ్యం ఏలుతోంది. అయితే మన దగ్గరకు వచ్చిన పాలల్లో కల్తీని ఎలా గుర్తుపట్టాలో చాలామందకి తెలియదు. మనకు ఎందుకులే.. పాలు వచ్చాయా.. ఇంట్లో ఇచ్చామా.. ఛాయ్ తాగామా అన్నట్లే ఉంటున్నారు చాలామంది .

కల్తీపై గళం ఎత్తితే మన ఆరోగ్యాలను కాపాడుకునే వాళ్లం అవుతాం.. కానీ పట్టించుకునే వారు ఉండరు. కల్తీని ఎలా గుర్తు పట్టాలో ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మన దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ పరిశోధనల బృందం పాలలో కల్తీని గుర్తించగలిగే స్మార్ట్‌ ఫోన్ ఆధారిత సెన్సార్‌లను రూపొందించింది. అదెలా పని చేస్తుందంటే.. మొదట వాళ్లు ఆమ్లతను కొలవాడానికి ఒక కాగితాన్ని వినియోగించారు.

దాని దగ్గరకు వెళ్లి రంగు మార్పును గుర్తించగల ప్రోటోటైప్ స్మార్ట్‌ ఫోన్ – అనుకూల అల్గోరిథంను అభివృద్ధి చేశారు. పాలల్లో ఆ కాగితాన్ని ముంచి బయటకు తీసిన తర్వాత దాని ముందు ఫోన్ కెమెరాను ఉపయోగించి పాలలో సెన్సార్ స్ట్రిప్స్‌ లోని రంగు మార్పును పరిశీలిస్తుంది. దాని ద్వారా వచ్చే పీహెచ్ విలువ ద్వారా పాలల్లోని కల్తీని కనుక్కోవచ్చు.

ఆ దేవాలయంలో అపచారం.. ముదిరిన వివాదం.. ఇంతకు ఏం జరుగుతోంది..?

ఆ దేవాలయంలోని గోశాలలో పాలు విక్రయిస్తున్నారని.. ఇది అపచారం అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఆ దేవాలయం ఎక్కడో కాదు.. విశాఖ సింహాచలం నరసింహస్వామి ఆలయంలో ఈ పని జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితం ఈ వివాదం ఏర్పడడంతో ముదురుతూ వచ్చింది. తాజాగా వీటిపై దేవస్థానం అధికారులు వివరణ కూడా ఇచ్చారు.

ప్రస్తుతం కరోనా సమయంలో అన్నదానాలు నిలిచి పోవడంతో పాలు మిగులుతున్నాయని.. వృధాగా రోజూ పారబోయాల్సి వస్తుందని.. అందుకే దేవాలయ చుట్టుపక్కల వాళ్లకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ దేవాలయంలోని గోశాలలో గత సంవత్సరం ఏప్రిల్ నుంచి రోజూ ఉదయం 7 గంటలకు.. సాయంత్రం 5 గంటలకు దేవస్థానం అవసరాలకు పోగా మిగిలిన పాలను విక్రయిస్తున్నారు.

విశాఖ సింహాచలం నరసింహస్వామి దేవాలయ ఈఓ దేవస్థానంకు ఉపయోగించాల్సిన పాలను ఇంటికి తీసుకెళ్లాడని.. ఇది అపచారం అంటూ అనడం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ లీటరు పాలను రూ.40 కు విక్రయిస్తున్నారు. ఎవరికీ ఉచితంగా పాలను విక్రయించడం లేదని తెలిపారు. అలా విక్రయించగా వచ్చిన డబ్బులను దేవస్థానం అకౌంట్లోనే డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు దేవస్థానం అధికారులు.

పాలను విక్రయించడం వల్ల రోజుకు సుమారు రూ.800 వస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పాలను ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇందులో అపచారాలు, అన్యాయాలేమీ లేవని ఆలయ అధికారులు అంటున్నారు. అక్కడ చుట్టు పక్కల ఉన్న దేవాలయాలకు, ఉపదేవాలయాలకు పాలను పంపించిన తర్వాతనే మిగిలిన పాలను అమ్ముతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

శ్రావణమాసంలో పాలను తాగకూడదు.. ఒకవేళ తాగితే ఏమవుతుంది..?

శ్రావణమాసం రాగానే చాలామంది పాలను తాగరు. వాటిని దూరంగా ఉంచుతారు. దానికి గల కారణం ఏంటనేది చాలామందికి తెలవదు. లక్ష్మీదేవికీ, శివుడికీ ప్రీతిపాత్రమైన శ్రావణమాసం రాగానే ఎందుకు తాగరు అనే ప్రశ్న చాలా మంది మనసులో ఉంటుంది. దానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు పురాణాల్లో పాల సముద్రం నుంచి విషం బయటకు వచ్చింది.

ఆ విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకున్నట్లు పురాణాల ప్రకారం తెలుస్తోంది. అందువల్లే శ్రావణమాసంలో పాలకు దూరంగా ఉంటుంటారు. పూజకు తీసుకెళ్లిన పాలను స్వామికే అభిషేకం చేస్తే పరమేశ్వరుడి కృప పొందాలని భక్తులు అలా చేస్తారనే ప్రతీతి ఉంది. దీని వెనుక సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో పురుగులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి.

గేదెలు, ఆవులు తినే గడ్డిలో కూడా ఆ పురుగులు దాగి ఉంటాయి. పశువులు వాటిని తినేస్తాయి. దీంతో పాలలో హానికరమైన పదర్ధాలు ఉంటాయని.. అందువల్ల శ్రావణమాసంలో పాలను తాగరని చెబుతుంటారు. వ్యాధుల బారిన పడకుండా ఇలా పాలకు దూరంగా ఉంటడం మంచిదని పండితులు చెబుతుంటారు. అంతేకాకుండా వానాకాలంలో మనిషి వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.

ఉపవాస దీక్షలు చేయడంతో పొట్ట ఖాళీగా ఏర్పడుతుంది. అందులో పాలను తాగడం వల్ల అవి సరిగ్గా అరగవు. దీంతో గ్యాస్, డయేరియా, ఎసిడిటీ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. అందువల్ల పాలు తాగకపోయిన నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తే మంచిది.

పాలు.. చేపలు కలిపి తింటే చర్మ సమస్యలు వస్తాయా… దీనిలో నిజమెంత?

పాలు ప్రతిరోజు త్రాగటం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చేపలు ఎంతో మంది ఇష్టంగా తినే మాంసాహారం. కానీ ఈ రెండింటిని కలిపి తినటం వల్ల లేదా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే తీసుకోవటం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయని మన పెద్దలు చెబుతుంటారు. నిజానికి పురాతన కాలం నుండి ఆయుర్వేదాన్ని అనుసరించి మన పెద్దలు చేపలు మరియు పాలు కలిపి తీసుకోవటంవల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు.కానీ మన శాస్త్రవేత్తలు దీనిని కొట్టిపారేస్తున్నారు.

పాలు మరియు చేపలు కలిపి తినటం వల్ల అందరిలోనూ చర్మ సమస్యలు తలెత్తుతాయని చెప్పలేము. అయితే ఇది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కొందరిలో ఈ పాలు, చేపలను కలిపి తీసుకోవటంవల్ల స్వల్ప జీర్ణ సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం చేపలు మరియు పాలు కలిపి తినకూడదని కచ్చితంగా చెబుతున్నారు

ఆయుర్వేదం ప్రకారం పాలు మరియు చేపలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవటం వల్ల మన శరీరంలో లూకోడెర్మా స్థితి రావచ్చు. లూకోడెర్మా అంటే స్కిన్ పిగ్మెంటేషన్(చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడటం). కానీ కొందరు మాత్రం చేపలు అసిడిక్ ప్రభావాన్ని మరియు పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల అవి మన శరీరంలో జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు.

ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజు సూత్ మాత్రం చేపలు మరియు పాలు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనటానికి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. అందువలన పాలతో కలిపి ఎటువంటి ఆహారాన్ని అయినా తీసుకోవచ్చని ఆమె పేర్కొంది.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు ఫాలో కావాల్సిందే!

ఆధునిక యుగంలో మారుతున్న కాలానుగుణంగా మన జీవన విధానంలోనూ, ఆహారపు అలవాట్లలోను భిన్నమైన మార్పులు సంతరించుకున్నాయి.ప్రస్తుతం మనం ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడి అనేక వ్యాధులతో నిత్యం పోరాడుతూనే ఉన్నాం.అలాంటి సమస్యలలో నిద్రలేమి సమస్య ప్రధానమైనదిగా చెప్పవచ్చు.నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడేవారు భవిష్యత్తులో ప్రమాదకరమైన వ్యాధుల బారినపడే అవకాశాలు చాలా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిద్రలేమి సమస్యతో సతమతమయ్యే వారు ఎక్కువగా నిద్ర మాత్రలకు,మద్యపానానికి బానిసలుగా మారి ఏరికోరి మరిన్ని వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. అలా కాకుండా సహజమైన, ప్రశాంతత కలిగిన సుఖమైన నిద్ర కోసం ప్రతిరోజు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం,నడక వంటివి చేస్తూ ఉండాలి.
మన పడక గది సాధ్యమైనంత వరకూ ప్రశాంతంగా, శుభ్రంగా ఉండునట్లు చూసుకోవాలి. అదేవిధంగా
రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రిపూట వీలైనంత వరకు కాఫీ, టి,కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, మసాలా ఫుడ్ జోలికి పోకూడదు.

నిద్ర పోవడానికి ముందు స్మార్ట్ ఫోన్,ల్యాప్‌టాప్ ఎక్కువగా చూసినట్లయితే బ్లూ లైట్ కారణంగా కళ్లపై ఒత్తిడిపెరుగుతుంది.అలాగే మొబైల్ ఫోన్‌ను నిద్రపోయేటప్పుడు తలకు దగ్గర పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.నిద్రపోయే ముందు మనకి ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాన్ని చదవడం వల్ల తొందరగా నిద్రలోకి జారుకోవడం. ఈ విధంగా కొంతకాలం ప్రయత్నం చేసినట్లయితే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.

ఏపీలోని ఆ గ్రామాల్లో పాలు ఫ్రీ.. అమ్మితే కఠిన శిక్షలు..!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పాల ఖరీదు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లీటర్ పాల ధర 50 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే ఏపీలోని ఆ గ్రామాల్లో మాత్రం పాలు ఉచితంగా పోస్తారు. వినడానికి వింతగానే అనిపించినా దాదాపు 4 శతాబ్దాల నుంచి ఆ గ్రామాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఆ గ్రామాల్లో పాలకు డబ్బు ఇస్తామంటే మాత్రం చుక్క పాలు కూడా పోయరు.

అలా కాకుండా పాలు కావాలని అడిగితే ఇష్టంగా పోస్తారు. పాలు అమ్మడం ద్వారా వచ్చే డబ్బు తమకు వద్దని ఆ డబ్బు వల్ల పాడైపోతామని గ్రామస్తులు చెబుతుండటం గమనార్హం. ఇలా పాలు ఉచితంగా పోసే వింత గ్రామాలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. జిల్లాలోని గంజహళ్లి, కడిమెట్ల గ్రామస్తులు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. జిల్లాలోని గంజహళ్లిలో వందల సంఖ్యలో పశువులు ఉన్నాయి. ఆ పశువులు ఇచ్చే పాలలో ఇంటి అవసరాల మేరకు పాలను వినియోగించుకుని మిగిలిన పాలను ఇతరులకు ఇస్తారు.

కడిమెట్ల గ్రామంలో కూడా పాలు ఇతరులకు ఫ్రీగా ఇస్తారే తప్ప డబ్బులు తీసుకోరు. ఇలా ఈ రెండు గ్రామాల ప్రజలు పాలు అమ్మకపోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది. 4 శతాబ్దాల క్రితం గంజహళ్లి గ్రామంలో పశువులు అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డాయి. కొన్ని పశువులు చనిపోయాయి. ఆ సమయంలో ఆ ఊరిలో ఉండే బడేసాబ్ తాత కొడుకు హుస్సేన్‌ సాహెబ్‌ ను పాలు తీసుకురావాలని ఊరిలోకి పంపించాడు.

అయితే పశువులకు అంతుచిక్కని వ్యాధి సోకడంతో ఎవరూ పాలు పోయలేదు. దీంతో హుస్సేన్ సాహెబ్ చివరకు గ్రామ పెద్ద ఇంటికి వెళ్లి పాలు కావాలని కోరగా గ్రామ పెద్ద తమ ఆవు చనిపోయిందని.. ఆవు కళేబరం మారెమ్మ ఆలయం దగ్గర పడేశామని చెప్పాడు. హుస్సేన్ సాహెబ్ ఆ గుడి దగ్గరకు వెళ్లి దేవతను ప్రార్థించగా చనిపోయిన ఆవు లేచి పాలు ఇచ్చింది. అనంతరం బడే సాబ్ గ్రామస్తులకు పాలు అమ్మకూడదని, పశుగ్రాసాన్ని తగులబెట్టకూడదని, పశువులను చంపకూడదని సూచించగా అదే ఆచారాన్ని నేటికీ గ్రామస్తులు అనుసరిస్తున్నారు.