Tag Archives: money

Shakeela: సొంత వాళ్లను నమ్మి రెండు కోట్ల రూపాయలు నష్టపోయిన షకీలా.. చివరికి ఏం చేసిందంటే?

Shakeela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శృంగార తారగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న షకీలా అందరికీ సుపరిచితమే.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సినిమాలతో డబ్బు బాగా సంపాదించినప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Shakeela: సొంత వాళ్లను నమ్మి రెండు కోట్ల రూపాయలు నష్టపోయిన షకీలా.. చివరికి ఏం చేసిందంటే?

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా తన సినిమాలలో సంపాదించిన డబ్బును మొత్తం అయిన వాళ్లను నమ్మి దారుణంగా మోసపోయినట్లు వెల్లడించారు. తన సినిమాలలో సంపాదించిన డబ్బులు సుమారు రెండు కోట్ల వరకు తన అక్కను నమ్మి అక్క చేతిలో పెట్టాను. అయితే తన అక్కే తనని దారుణంగా మోసం చేసిందని ఈ సందర్భంగా షకీలా వెల్లడించారు.

Shakeela: సొంత వాళ్లను నమ్మి రెండు కోట్ల రూపాయలు నష్టపోయిన షకీలా.. చివరికి ఏం చేసిందంటే?

ఒకానొక సమయంలో వెళ్లి తన అక్కని డబ్బులు అడిగితే తాను వేరే వ్యక్తిని నమ్మి మోసపోయానని సమాధానం చెప్పింది.ఈ విధంగా అక్క తనకు మోసం చేసిన తాను అక్కతో మాట్లాడే దాన్ని కానీ అక్క తనతో మాట్లాడలేదని షకీలా తెలిపారు. తనతో మాట్లాడకూడదని అక్కకు తన కుటుంబ సభ్యులు చెప్పడంతో తనతో మాట్లాడలేదని షకీలా తెలిపారు.ఈ విధంగా తన సొంత అక్కని నమ్మి తాను రెండు కోట్ల రూపాయలు నష్టపోయానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరం..

బయట వ్యక్తులు ఎవరైనా మనల్ని మోసం చేస్తే మనం వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి న్యాయం కోసం పోరాటం చేయవచ్చు. కానీ సొంత వాళ్లే మోసం చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఎలా ఇస్తామని ఈ సందర్భంగా షకీలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా పెద్దఎత్తున డబ్బును నష్టపోయినట్లు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన షకీల ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

Tilak Varma: ఐపీఎల్ 2022 ముంబై ఇండియన్స్ ప్రదర్శించిన ఆట తీరు అందరికీ తెలిసిందే. ఈ ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆటతీరుతో ఎంతోమంది క్రికెట్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కేవలం 4 విజయాలు అందుకోగా 10 ఓటమి చవిచూసింది. ఆట తీరులో ముంబై ఇండియన్స్ విఫలమైన ఇందులో ఒకరిద్దరు ఆటతీరు ప్రేక్షకులకు కాస్త ఉత్సాహ పరిచిందని చెప్పాలి. అలాంటి వారిలో తిలక్ విక్రమ్ ఒకరు.

Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

తిలక్ విక్రమ్ 2022 ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వేలంలో ఇతనిని ఏకంగా రూ.1.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.ముంబై ఇండియన్ టీం లో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నప్పటికీ వారి కన్నా ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. తిలక్ ఏకంగా 14 మ్యాచ్లలో 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.

Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

ఈ విధంగా కష్టాల్లో ఉన్న జట్టును ముందుండి నడిపించిన తిలక్ వర్మ ఐపీఎల్ లో భాగంగా వచ్చిన డబ్బులతో అతను చేసిన పని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.తాను ఐపీఎల్లో గెలుచుకున్న డబ్బులు మొత్తం తన తండ్రికి ఇచ్చానని ఈ సందర్భంగా తిలక్ వెల్లడించారు. అండర్ 16 క్రికెట్ఆడుతున్న సమయంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఉదయం 6 గంటలకు గ్రౌండ్లోకి వెళితే సాయంత్రం ఎప్పుడు ఇంటికి వెళ్ళేవారని తెలిపారు.

క్రికెట్ కోసం తన జీవితంలో ఎన్నో ముఖ్యమైన వాటిని కూడా వదులుకున్నానని, క్రికెట్ ప్రాణంగా భావించి ప్రతి రోజూ గ్రౌండ్ కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాణ్ణి తెలిపారు. ఈ కష్టమే నేడు అతనికి మంచి ప్రతిఫలాన్ని అందించింది. ఇకపోతే ప్రతి ఒక్క మనిషి డబ్బుకు దాసోహం అవ్వడం సర్వసాధారణం.అలాంటి డబ్బుకు తాను దాసోహం కాకూడదని ఐపీఎల్లో గెలుచుకున్న డబ్బులు మొత్తం తన తండ్రి చేతిలో పెట్టి ఆ డబ్బును తనకు దూరంగా ఉంచమని చెప్పారట.

కష్టం విలువ తెలిసిన వ్యక్తి …

ఇలా ఒక ఎలక్ట్రీషియన్ కొడుకుగా తిలక్ క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టి తన కష్టంతో కృషితో ఇంత మంచి క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా చిన్నప్పటినుంచి డబ్బు విలువ తెలిసిన వ్యక్తిగా పెరగడంతో డబ్బును వృధాగా ఖర్చు చేయకుండా పొదుపుగా వాడుకుంటున్నారు.ఇక ఐపీఎల్ లో వచ్చిన డబ్బులు మొత్తం తన తండ్రి చేతిలో పెట్టారని తెలియడంతో ప్రస్తుత కాలంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. కష్టం విలువ తెలిసిన వాడు తిలక్ వర్మ అంటూ పెద్దఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

Indraja: నా కెరీయర్ లో క్రిటికల్ సిచువేషన్ అదే.. డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డాను: ఇంద్రజ

Indraja: నటి ఇంద్రజ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి, జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఇంద్రజ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Indraja: నా కెరీయర్ లో క్రిటికల్ సిచువేషన్ అదే.. డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డాను: ఇంద్రజ

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ వీడియో ద్వారా ఇంద్రజను ప్రశ్నిస్తూ.. మీ జీవితంలో క్రిటికల్ సిచువేషన్ ఏది అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఇంద్రజ సమాధానం చెబుతూ 1998 లో ఇంద్రజ తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేసి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అదే సమయంలోనే తన తల్లికి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు.చేతిలో రూపాయి కూడా లేదు అమ్మకు సర్జరీ ఎలా చేయాలో దిక్కు తెలియడం లేదనీ ఇంద్రజ తెలిపారు.

Indraja: నా కెరీయర్ లో క్రిటికల్ సిచువేషన్ అదే.. డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డాను: ఇంద్రజ

ఆ సమయంలో నేను పనిచేస్తున్న కంపెనీలో ఇచ్చిన రెండు చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. ఎవరిని అడగాలో తెలియని అయోమయంలో ఉన్నాను. ఆ సమయంలో నా నగలని తాకట్టు పెట్టి అలా ఏదో చేసి అమ్మకు ఆపరేషన్ చేయించాము. అలా అమ్మను బ్రతికించు ఉన్నామని అయితే ప్రస్తుతం తన తల్లి తనకు దూరం అయ్యారని ఇంద్రజ తన కన్నీటి కష్టాలను కార్యక్రమం ద్వారా తెలియజేశారు.

మనీ సెకండరీ

తన జీవితంలో చాలా క్రిటికల్ సిచువేషన్ అదేనని అప్పటి నుంచి తన లైఫ్ లో మనీ అనేది సెకండరీగా మారిపోయిందని ఈమె వెల్లడించారు. నాకు ఈ సిచువేషన్ ఎదురైన తర్వాత ఎంత బాధ పడ్డానో నాకే తెలుసు అందుకే ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే తన దగ్గర డబ్బు ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా వారికి ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.

John Abraham: నేను బాలీవుడ్ హీరోని… వాళ్ళలా తెలుగు సినిమాలలో నటించను… జాన్ అబ్రహం షాకింగ్ కామెంట్స్!

John Abraham: బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమాల సత్తా ఏంటో దేశవ్యాప్తంగా తెలిసిపోయింది.ఈ క్రమంలోనే తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాలు అంటే తప్పనిసరిగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో నటీనటులు నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

John Abraham: డబ్బు కోసం నేను వాళ్ళలా తెలుగు సినిమాలలో నటించను… సౌత్ సినిమాలపై జాన్ అబ్రహం షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన RRR సినిమా మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటివరకు హిందీ సినిమాలు కూడా సాధించలేని రికార్డులను తెలుగు సినిమాలు సొంతం చేసుకోవడంతో కొందరు తెలుగు సినిమాల పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం కూడా తెలుగు సినిమాల పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

John Abraham: డబ్బు కోసం నేను వాళ్ళలా తెలుగు సినిమాలలో నటించను… సౌత్ సినిమాలపై జాన్ అబ్రహం షాకింగ్ కామెంట్స్!

జాన్ అబ్రహం నేడు ఎటాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తెలుగు సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సలార్ సినిమాలో మీరు నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి,ఇందులో నిజం ఎంత ఉందని యాంకర్ ఇతనిని ప్రశ్నించగా.. జాన్ అబ్రహం మాట్లాడుతూ తాను హిందీ హీరోనని తను కేవలం హిందీ సినిమాలలో మాత్రమే నటిస్తానని తెలిపారు.

ప్రాంతీయ సినిమాలలో నటించను….

నేను ఎప్పటికీ ప్రాంతీయ సినిమాలలో నటించను కేవలం హిందీ చిత్రాలలో మాత్రమే నటిస్తాను. డబ్బు కోసం అందరి హీరోల మాదిరిగా తెలుగు సినిమాల్లో నటించనని జాన్ అబ్రహం తెలియచేయడంతో ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దూమారం రేపుతున్నాయి.ఇక ఈ విషయంపై సౌత్ ఇండస్ట్రీ సినీ ప్రేమికులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Geetha Singh: ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కితకితలు హీరోయిన్… చివరికి ఇలా!

Geetha Singh: పలు తెలుగు సినిమాలలో లేడీ కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి గీతాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పలు చిత్రాల్లో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించారు.

Geetha Singh: ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కితకితలు హీరోయిన్… చివరికి ఇలా!

ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న గీతా సింగ్ వరుస అవకాశాలను అందుకొని ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతా సింగ్ తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాననే విషయాన్ని వెల్లడించారు.

Geetha Singh: ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కితకితలు హీరోయిన్… చివరికి ఇలా!

ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని నమ్మి సుమారు 10 లక్షల వరకు చిట్టి వేసి ఉన్న డబ్బును మొత్తం పోగొట్టుకున్నానని ఈమె తెలిపారు. ఇలా అప్పటివరకు సంపాదించిన డబ్బు మొత్తం కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయానని తెలిపారు.అదే సమయంలో తనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వెంటాడయనీ తెలిపారు.

గుడి దగ్గర ప్రసాదం తిని ఆకలి తీర్చుకున్నా…

ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని అయితే తన సమస్యకు అది మాత్రమే పరిష్కారం కాదని, ఆ ఆలోచనను విరమించుకుని జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేశానని తెలిపారు.ఇక డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో విపరీతమైన ఆకలి వేయడంతో తినడానికి కూడా డబ్బులు లేక గుడి దగ్గర ప్రసాదం తిని ఆకలి తీర్చుకున్నాని ఈమె తెలిపారు.

Crime news: అతిగా ఆశ పడితే.. బంపర్ ఆఫర్ పేరిట టోకరా..

Crime news: ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. నమ్మితే చాలు డబ్బులు దోచేస్తున్నారు. లాటరీ తగిలిందని.. ఎంతో కొంత డబ్బులు కడితే కస్టమ్స్ క్లియరెన్స్ లభిస్తుందని.. ఇలా మనం కొనని లాటరీకి బంపర్ ఆఫర్ తగిలిందంటూ.. ఫ్రాడ్ చేస్తున్నారు. మనలో ఉన్న అధిక ఆశను దోపిడీదారులు సొమ్ము చేసుకుంటున్నారు. 

Crime news: అతిగా ఆశ పడితే.. బంపర్ ఆఫర్ పేరిట టోకరా..

ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజపేటలో  కూడా ఇలాంటి మోసం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బాధితుడు లింగాల వెంకటేష్ కు బంపర్ ఆఫర్ వచ్చిందని కేవలం… రూ. 1200 చెల్లిస్తే మంచి చీర, ముక్కుపుడక, మెడలో వేసుకునే గొలుసు అందచేస్తామని వారం క్రితం మొబైల్ నెంబర్ 7093492081 నుంచి కాల్ వచ్చినట్లు పేర్కొన్నాడు. 

Crime news: అతిగా ఆశ పడితే.. బంపర్ ఆఫర్ పేరిట టోకరా..

మంగళవారం అదే ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసి మీ ఆఫర్ పార్సిల్ పోస్టాఫీస్ కు వచ్చిందని.. త్వరగా వెళ్లి తీసుకోండని తెలిపారు. ఎంతో ఆనందంగా వెళ్లిన బాధితుడు వెంకటేష్.. అక్కక ఫోస్ట్ మాస్టర్ కు రూ. 1200.. పోస్టల్ ఛార్జీ రూ. 60 చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. 

పార్సిల్ లో కేవలం చీరమాత్రమే ఉంది:

ఎంతో ఆశగా పార్సిల్ తెరిచి చూస్తే.. అందులో కేవలం చీర మాత్రమే ఉందని మిగతా వస్తువులు ఏమీ లేవని వాపోయాడు. ఆ చీర కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతకమ్మ చీరను పోలి ఉందని ఆయన అన్నారు. తిరిగి ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే.. ఎలాంటి స్పందన రాలేదని బాధితుడు వెంకటేష్ వెల్లడించారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఆ పార్శిల్ పైన సాయిగంగ ఏజెన్సీ, ఏటీ కాలనీ, గుంటూరు-522001గా చిరునామా ఉందని తెలిపారు.

Actor Naresh: ఫోటోలను అడ్డుపెట్టుకొని కోట్లలో డబ్బులు వసూలు…. నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు!

Actor Naresh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్ ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ మూడవ భార్య పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

Actor Naresh: ఫోటోలను అడ్డుపెట్టుకొని కోట్లలో డబ్బులు వసూలు…. నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు!

నరేష్ గత కొన్ని సంవత్సరాల క్రితం ఏపీ మాజీ ముఖ్యమంత్రి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నారు.అయితే కొన్ని సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు అనంతరం మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు.

Actor Naresh: ఫోటోలను అడ్డుపెట్టుకొని కోట్లలో డబ్బులు వసూలు…. నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు!

వీరందరూ కలిసి ఉన్న సమయంలో రమ్య నరేష్ కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డుపెట్టుకొని కొందరి నుంచి అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ పేరిట కోట్ల రూపాయలలో మోసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు రమ్య పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

నాకు ఎలాంటి సంబంధం లేదు….

ఈ క్రమంలోనే నటుడు నరేష్ ఈ విషయంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఆమేతో తాను విడాకులు తీసుకున్నానని తాను తీసుకున్న డబ్బులకు, తన అప్పుకు నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని నరేష్ కొట్టిపారేశారు. ఈ విధంగా తన మాజీ భార్య గురించి నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదేవిధంగా నరేష్ కుటుంబ సభ్యులతో కలిసి రమ్య దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

GOOGLE PAY: ప్రస్తుతం లావాదేవీలన్నీ ఆన్ లైన్ అవతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేసే దేశాాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. అతి తక్కువ కాలంంలోనే ఇండియాలోని ప్రజలు డిజిటల్ లావాదేవీలకు అలవాటుపడ్డారు. 

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

కేంద్ర ప్రభుత్వం యూపీఐ తీసుకువచ్చిన తర్వాత.. భీమ్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి యాప్స్ నేరుగా క్యాష్ లెస్ లావాదేవీలకు ఊతమిచ్చాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ ఉందంటే.. వాటిలో ఈ యాప్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. షాపుల్లో, రెస్టారెంట్లలో, హోటళ్లలో,  మార్కెట్లలో, చివరకు చిన్న స్థాయి వర్తకులు కూడా డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని కూడా ఇండియాలో ప్రవేశపెడుతామని… బడ్జెట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

ముఖ్యంగా కరోనా తరువాత ఇండియాలోె డిజిటల్ లావాదేవీల విలువ పెరిగింది. గతంతో పోలిస్తే ఆన్ లైన్ పేమెంట్లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది.

గుగూల్ పే ద్వారా రూ. లక్ష పర్సనల్ లోన్:

ఇదిలా ఉంటే.. గూగుల్ పే పే వాడుతున్నవారికి ఆన్ లైన్ పేమెంట్ యాప్ శుభవార్త చెప్పింది. గుగుల్ పే యాప్ ఉపయోగించే వినియోగదారులకు రూ. లక్ష వరకు రుణం పొందేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారు మాత్రమే అర్హులని తెలిపింది. గూగుల్ పే పే ప్రిక్వాలిఫైయర్ యూజర్లకు డీఎంఐ ఫినాన్స్ కంపెనీ.. పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ రుణాలు ఇవ్వనుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వ్యక్తి గత రుణాలు ఇవ్వనుంది. తీసుకున్న రుణాన్ని 36 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో ఈ సదుపాయాన్ని మరింత మందికి  అందుబాటులోకి తేనుంది.

Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..!

Andhra Pradesh: జగన్ సర్కార్ ప్రవేశ పెడుతున్న ప్రతిష్టాత్మక పథకాల్లో జగన్న విద్యా దీవెన ఒకటి. విద్యార్థులకు బడులకు పంపించే తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద నగదు జమచేస్తోంది. 

Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..!

మార్చిలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులను ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. అయితే ఈ జగనన్న విద్యా దీవెన వెరిఫికేషన్ పూర్తి కాలేదని… సందేశాలు వచ్చిన విద్యార్థులు వెంటనే తమ గ్రామ సచివాలయాలకు వెళ్లి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ కు సంబంధించిన డ్యాక్యుమెంట్లను సమర్పించాలి. 

Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..!

వెరిఫికేషన్ పూర్తయి ఇన్ఎలిజిబుల్ అయితే.. సచివాలంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లను కలవాలి. అర్హత కలిగిన విద్యార్థులు అబ్జెక్షన్ తెలపడానికి ఈనెల 21 వరకు గడువు ఉంది. మార్చిలోగా జగనన్న విద్యా దీవెన డబ్బులు పడకుంటే.. చెక్ చేసుకునే విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. 

జ్ఞానభూమి వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు..

విద్యార్థులు జ్ఞానభూమి అనే వెబ్సైట్ ఓపెన్ చేసి స్టూడెం ట్ ఆధార్, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. అందులో వ్యూ లేదా ఫ్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టేటస్ తెలుసువాలి అని అనుకుంటున్నారో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మీ స్టేటస్ ఎలిజిబిబుల్ అని ఓటీఏ కంప్లీటెడ్ అని చూపిస్తే మీకు ఇంకా డబ్బులు రాలేదని అర్థం. ఒక వేళ రిలీస్డ్ అని చూపిస్తే మీకు నగదు వచ్చినట్లు అర్థం. టీబీఆర్ నెంబర్ జనరేట్ అయిన వారం రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది.

Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

Schemes Fraud: ప్రస్తుతం నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంట్లోకి చొరబడి దోచేయడం వంటివి చాలా వరకు తగ్గిపోయాయి. ప్రస్తుతం అంతా వైట్ కాలర్ మోసాలే జరుగుతున్నాయి. మనకు తెలియకుండా మన బ్యాంక్ అకౌంట్ల లోకి చొరబడుతున్నారు.

Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

అమాయకపు ప్రజలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఓటీపీ, డెబిట్ కార్డ్ పిన్ లతో మోసాలకు పాాల్పడుతున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ తరహా నేరాలు ఎక్కువగా నమోాదయ్యాయి. మనం మోసపోవడానికి మనచేతిలోని సెల్ ఫోన్, ఇంటర్నెట్ కారణమవుతోంది. టెక్నాలజీని యూజ్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ఇదిలా ఉంటే కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అధిక వడ్డీ, తక్కువ కాల వ్యవధి చూపుతూ… ఇన్వెస్ట్ చేయమంటూ.. స్కీముల పేరుతో మోసం చేస్తున్నారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపుతుండటంతో ప్రజలకు కూడా ఏం విచారణ చేయకుండా… సింపుల్ గా మోసపోతున్నారు.

సంబంధిత సమాచారం మొత్తం తెలుసుకోవాలి..

డబ్బులన్నీ స్కీముల్లో పెట్టి చివరకు ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొత్తగా వస్తున్న స్కీములకు సంబంధించిన మోసాలను పోంజి స్కీమ్స్ అని కూడా అంటారు. ఎప్పుడైనా స్కీముల పేరుతో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని కోరితే పూర్తిగా తెలుసుకొని ప్రొసీడ్ కావాలి. డబ్బులు పెట్టడానికి ముందే లిఖిత పూర్వకంగా ఇన్వెస్ట్మెంట్ కు  సంబంధిత సమాచారం మొత్తం తెలుసుకోండి.  అలానే ఇన్వెస్ట్మెంట్ ప్రమోటర్ను అడగడం, బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయండి. సర్వీసులు అందించడానికి లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోండి.