Tag Archives: naga chaitanya

Karthika Deepam: నాగచైతన్య సాయి పల్లవిని ఇమిటేట్ చేసిన డాక్టర్ బాబు వంటలక్క.. వీడియో వైరల్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని దాదాపు 1569 ఎపిసోడ్లు పాటు ప్రసారమైనటువంటి ఈ సీరియల్ మంచి ఆదరణ పొందడంతో ఈ సీరియల్ కి సీక్వెల్ తీసుకువస్తున్నారు.

కార్తీకదీపం 2 ద్వారా నేటినుంచి ఈ సీరియల్ ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తండేల్ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలకు సంబంధించినటువంటి రీల్ వీడియోని నాగచైతన్య వాలంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇందులో భాగంగా నాగచైతన్య బుజ్జితల్లే.. వచ్చేత్తున్న కదే, కాస్త నవ్వవే` అని ప్రేమగా పిలుస్తాడు చైతూ.దీనికి సాయిపల్లవి కూడా అంతా బాగా రియాక్ట్ అవుతుంది. మొదట్లో బాధలో నుంచి ఆమె నవ్విన తీరు ఆకట్టుకోవడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ రీల్ ను డాక్టర్ బాబు వంటలక్క ఇద్దరు చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సీరియల్ కి సీక్వెల్..
ఇక ఈ సీరియల్ నేటి నుంచి ప్రసారం కాబోతుంది ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు కార్తీకదీపం 2 ఇది నవ వసంతం అనే పేరిట ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సీరియల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమాలకు సీక్వెల్స్ రావడం చూసాము కానీ సీరియల్స్ కు సీక్వెల్ రావడం ఇది మొదటి సారి అని చెప్పాలి. ఇలా సీరియల్ కి సీక్వెల్ వస్తుంది అంటే ఈ సీరియల్ కి ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.

Samantha: చైతన్య సమంత ఫస్ట్ లవ్ కాదా… ఫస్ట్ లవ్ స్టోరీ బయటపెట్టిన సమంత?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పుష్కరకాలం పూర్తి అవుతున్న ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈమే సినిమాలో వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా మాయోసైటిసిస్ వ్యాధికి గురయ్యారు.

ఈ వ్యాధి కారణంగా ఈమె సినిమాలకు కాస్త విరామం ఇచ్చి ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి బయటపడే మార్గాలను వెతుకుతూ పలు దేశాలకు వెళుతూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యాధి నుంచి సమంత క్రమక్రమంగా బయటపడుతున్నారని తిరిగి ఈమె ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంతా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా సమంత తన ఫస్ట్ లవ్ గురించి బయట పెట్టారు. సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల విడిపోయారు అయితే నాగచైతన్య కంటే ఈమె ముందు మరొకరిని ప్రేమించారు అంటున్న ప్రేమ గురించి బయటపెట్టారు తను స్కూల్ చదువుతున్న రోజులలో ఒక బస్సు మారి స్కూల్ కి వెళ్లాల్సి ఉండేదని తెలిపారు.

రెండేళ్లు వెంటపడ్డాడు..
ఇలా బస్ స్టాప్ లో ప్రతిరోజు ఒక అబ్బాయి తనని రెండు సంవత్సరాల పాటు ఫాలో అవుతూ వచ్చారని అయితే ఎప్పుడు దగ్గరకు రాలేదు కానీ తనని ఫాలో అయ్యే వాడిని తెలిపారు. ఇలా ఒకరోజు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అంటే నేను నిన్ను ఫాలో కావడం ఏంటి అనేసారు దీంతో నేను షాక్ అయ్యానని మరి అది ప్రేమ కాదా అనేది నాకు తెలియదు కానీ నాకు మాత్రం అదే ఫస్ట్ లవ్ స్టోరీ అంటూ తన ఫస్ట్ లవ్ బయటపెట్టారు.

Sai pallavi: నాగచైతన్యతో సాయి పల్లవి లిప్ కిస్.. రూల్స్ బ్రేక్ చేసిందా.. క్లారిటీ ఇచ్చిన నటి?

Sai pallavi: సాయి పల్లవి పరిచయం అవసరం లేని పేరు ఈమె ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా వచ్చారు. అనంతరం తెలుగులో ఫిదా సినిమాలో నటించి ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైనటువంటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ ఎన్నో రూల్స్ పెట్టుకొని ఇండస్ట్రీలో కొనసాగుతుందనే విషయం మనకు తెలిసిందే.

ఈమె సినిమాకు ఒప్పుకోవాలి అంటే ఆ సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. అంతేకాకుండా ఎలాంటి గ్లామర్ షోకి తావు ఉండకూడదు లిప్ కిస్ వంటి సన్నివేశాలలో తాను నటించను అంటూ ఖరాకండిగా చెప్పేస్తూ ఉంటారు. అయితే ఇలా కొన్ని రూల్స్ పెట్టుకున్నటువంటి సాయి పల్లవి ఓ సినిమా విషయంలో తన రూల్స్ బ్రేక్ చేసింది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. నాగ చైతన్య సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో వీరిద్దరూ కూడా ఒక సన్నివేశంలో లిప్ కిస్ పెట్టుకుంటారు. ఈ సినిమాలో నిజంగానే సాయి పల్లవి నాగచైతన్యకు లిప్ కిస్ ఇచ్చారా ఈ సినిమా విషయంలో ఈమె తన రూల్స్ బ్రేక్ చేశారా అన్న సందేహం అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయం గురించి స్వయంగా సాయిపల్లవి క్లారిటీ ఇచ్చారు.

నో కిస్ పాలసీ..
ఆ సన్నివేశంలో సరైన ఎక్స్ ప్రెషన్స్ పలికించేందుకు తనే ఎక్కువ సమయం తీసుకుందని చెప్పింది. అది ఫేక్ కిస్ అని.. కెమెరా హ్యాండిల్ చేసే విధానంలో రియల్ కిస్ లా కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇక నో కిస్ పాలసీకి సాయి పల్లవి కట్టుబడే ఉన్నానని తెలిపారు. ఇక తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో తండేల్ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

Samantha: తనని చూస్తూ అలా ఉండిపోయాను.. చైతన్య హీరోయిన్ పై సమంత కామెంట్స్!

Samantha: సినీనటి సమంత అనారోగ్య సమస్యల బారిన పడటంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత గత కొద్దిరోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా సమంత మరో నటి సాయి పల్లవి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సమంతకు సాయి పల్లవి డాన్స్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. గతంలో ఆమె ఒక షోలో పెర్ఫార్మెన్స్ చేస్తున్న సమయంలో ఆ కార్యక్రమానికి తాను జడ్జిగా వెళ్లానని సమంత తెలిపారు.

స్టేజ్ మీద సాయి పల్లవి డాన్స్ చేస్తూ ఉంటే తనని అలా చూస్తూ ఉండిపోయానని కల్లార్పకుండా తన డాన్స్ చూస్తున్నానని ఈమె తెలియజేశారు. ఈ విధంగా సాయి పల్లవి గురించి సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సాయి పల్లవి నాగచైతన్య కలిసి ఇదివరకే లవ్ స్టోరీ సినిమాలో నటించారు. త్వరలోనే తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

తండేల్…

లవ్ స్టోరీతో హిట్ కొట్టినటువంటి నాగచైతన్య తదుపరి మరో హిట్ సినిమాని అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే మరోసారి సాయి పల్లవితో కలిసి ఈయన నటిస్తున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Amala: నాగచైతన్య నేను పెంచలేదు..చైతూ అఖిల్ మాదిరి కాదు.. అమల కామెంట్స్ వైరల్!

Amala: అక్కినేని హీరో నాగార్జున భార్యగా సినీ నటిగా అమల అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనంతరం నాగార్జున పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జునకు అమల రెండో భార్య. ఈయన మొదట దగ్గుబాటి లక్ష్మినీ పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

ఇలా లక్ష్మి విడాకులు ఇచ్చిన అనంతరం నాగార్జున అమలను రెండో వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా అఖిల్ నాగచైతన్య ల గురించి అమల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి నేను నాగచైతన్యను పెంచలేదని నాగచైతన్య తన తల్లి వద్ద పెరిగాడని తెలిపారు.

ఇక టీనేజ్ వచ్చేవరకు నాగచైతన్య తన తల్లి వద్ద ఉన్నారని అనంతరం నాగార్జున వద్దకు రాగా ఆయన హీరోగా తనని ప్రేక్షకులకు పరిచయం చేశారని తెలిపారు. ఇక నాగచైతన్య అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవారని తనతో అఖిల్ చాలా చనువుగా ఉండేవారని తన రాక కోసం అఖిల్ ఎదురు చూస్తూ ఉండేవారని అమల తెలిపారు.

చైతు కోసం ఎదురు చూసేవాడు…

ఇప్పటికి వీరిద్దరి మధ్య అదే అనుబంధం ఉందని అమల తెలిపారు. నాగచైతన్యకు తనకు మధ్య బాండింగ్ లేకపోయినా అఖిల్ తో మాత్రం నాగచైతన్యకు మంచి బాండింగ్ ఉంది అంటూ ఈ సందర్భంగా అమల అఖిల్ నాగచైతన్య గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nagarjuna: చైతన్య సమంత విడిపోయిన నాగార్జున అది అలాగే పెట్టారా… ఏమైందంటే?

Nagarjuna: అక్కినేని నాగచైతన్య సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో వీరిద్దరూ కూడా ఎంతో ఘనంగా 2017 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్న అనంతరం కొంతకాలం పాటు వైవాహిక జీవితంలోకి ఎంతో సంతోషంగా ఉన్నారు. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరి పెళ్లిని కాస్త బ్రేకప్ చేసుకున్నారు.

నాగచైతన్య సమంత 2021 అక్టోబర్ లో వీరి విడాకుల గురించి అధికారికంగా ప్రకటన ఇచ్చారు. ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం కెరియర్ పరంగా ఇద్దరూ కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే వీరిద్దరూ విడిపోయి కూడా దాదాపు మూడు సంవత్సరాలు దాటినప్పటికీ తరచూ సమంత నాగచైతన్య గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా సమంత నాగచైతన్యకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయిన నాగార్జున మాత్రం వీరి విషయంలో ఒక వస్తువుని అలాగే భద్రంగా దాచి పెట్టారని తెలుస్తుంది. సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చి అక్కినేని కుటుంబం నుంచి వెళ్లిపోయిన వీరి పెళ్లి ఫోటోని మాత్రం నాగార్జున తన ఇంటి హాల్లో అలాగే పెట్టారని తెలుస్తుంది.

ఫ్యామిలీ ఫోటో…


నాగార్జున ఇలా సమంత నాగచైతన్య ఫోటో పెట్టడానికే కారణం ఏంటి అనే విషయానికి వస్తే సమంత నాగచైతన్య పెళ్లిలో మాత్రమే అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసారని ఈ పెళ్లిలోనే వీరంతా కలిసి ఫ్యామిలీ ఫోటో దిగారని తెలుస్తోంది. ఇలా ఈ ఫోటోలో కుటుంబ సభ్యులందరూ కూడా ఉండటంతో ఈయన కూడా ఈ ఫోటోని భద్రంగా పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి.

Nagachaitanya: రోజుకు కోటి రూపాయలు ఆఫర్ చేసిన ఆఫర్ రిజెక్ట్ చేసిన చైతన్య… నిజంగా గ్రేట్ అంటూ?

Nagachaitanya: తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగచైతన్య ఒకరు ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో వర్ష సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. అయితే నాగచైతన్య ప్రస్తుతం డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్యకు అద్భుతమైన అవకాశం రావడంతో ఆ అవకాశాన్ని నిర్మొహమాటంగా వద్దని తిరస్కరించారట. రోజుకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తో క్రేజీ ఆఫర్ రాగా నాగచైతన్య మాత్రం సునాయసంగా ఈ ఆఫర్ రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇంతకీ నాగచైతన్యకు వచ్చిన ఆఫర్ ఏంటి అనే విషయానికి వస్తే నాగచైతన్యకు ఒక సినిమాలో గెస్ట్ రోల్ లో నటించే అవకాశం వచ్చిందట.

ఈ సినిమా కోసం ఈయన 10 రోజుల కాల్ షీట్స్ ఇస్తే చాలు ఈ పది రోజులకు గాను ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేయగా నాగచైతన్య మాత్రం తనుకు డబ్బు ముఖ్యం కాదని కథ మాత్రమే ముఖ్యం అంటూ ఈ ఆఫర్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. సినిమాలో సరైన పాత్ర రావడమే ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదు అంటూ సున్నితంగా ఈ ఆఫర్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

Nagachaitanya: పాత్ర ముఖ్యం డబ్బు కాదు…


ఈ విధంగా నాగచైతన్య ఈ ఆఫర్ తీరస్కరించడంతో సదరు డైరెక్టర్ చేసేదేమీ లేక మరొక యంగ్ హీరో వేటలో పడ్డారట. చైతన్య ఒక్కో సినిమా చేస్తే దాదాపు 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తారు అలాంటిది పది రోజులకు ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం ఈ సినిమా ఆఫర్ వదులుకోవడంతో నిజంగా గ్రేట్ అంటూ ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Nagachaitanya: ఖుషి ట్రైలర్ చూసి బయటకు వచ్చిన చైతు…. వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన హీరో!

Nagachaitanya: అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరు విడాకులు తీసుకున్న తరువాత కూడా వీరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలవుతుంది అయినప్పటికీ వీరి కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి తరచూ ఏదో ఒక వార్త చెక్కరలు కొడుతూనే ఉంటుంది.

ఇకపోతే తాజాగా నటి సమంతా ఖుషి సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత భార్య భర్తలుగా నటించారని చెప్పాలి.ఇకపోతే ఖుషి సినిమా ట్రైలర్ చూసి నాగచైతన్య ఆవేశంతో బయటకు వచ్చారు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

ఇటీవల సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో వచ్చిన బాయ్స్ హాస్టల్ సినిమా ఈనెల 26వ తేదీ విడుదలైంది అయితే ఈ సినిమా విడుదల ముందు ప్రీమియర్ షో వేశారట. ఈ ప్రీమియర్ షో చూడటానికి నాగచైతన్యను కూడా ఆహ్వానించారు. అయితే ఈ షో చూస్తున్న సమయంలోనే ఖుషి సినిమా ట్రైలర్ రావడంతో ఈయన కోపంతో బయటకు వచ్చారని వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు పై స్పందించిన నాగచైతన్య అదంతా అవాస్తవమని తెలియజేశారు.

Nagachaitanya: కావాలని సృష్టించిన రూమర్లు….

ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి నాగచైతన్య ఈ విషయం గురించి స్పందిస్తూ..తాను థియేటర్ నుంచి వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవాలు, కావాలని సృష్టించిన రూమర్స్. ఈ ఫేక్ న్యూస్ గురించి నా దృష్టికి వచ్చింది. దీనితో సదరు మీడియాకి ఆ వార్తలని సరి చేయమని సూచించినట్లు నాగచైతన్య వెల్లడించారు.

Samantha: చైతన్యతో తన ప్రేమకు గుర్తుగా ఉన్న ఆ జ్ఞాపకాన్ని కూడా సమంత చెరిపేసారా?

Samantha:సమంత నటుడు నాగచైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో ఇద్దరు ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి కోడలుగా అడుగుపెట్టడంతో సమంతకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే నటుడు నాగచైతన్యత ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సమంత చివరికి ఆయనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఈ విధంగా సమంత నాగచైతన్యవిడాకులు తీసుకొని విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ వీరి విడాకులకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇక సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ అంటూ నాగచైతన్య ఒక సందర్భంలో తెలియజేశారు.

ఇలా నాగచైతన్య సమంత ఇద్దరు విడిపోయిన వీరీ గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.ఇలా సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత వీరిద్దరూ వారి ప్రేమకు గుర్తుగా ఒకరికోసం ఒకరు ఇచ్చుపుచ్చుకున్నటువంటి కానుకలను వీరి మధ్య ఉన్నటువంటి జ్ఞాపకాలను కూడా చెరిపివేశారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా తొలగించారు.

Samantha: మ్యారేజ్ సర్టిఫికెట్ ను కాల్చి వేశారా…


చైతన్య జ్ఞాపకాలు ఏ ఒక్కటి తన వద్ద లేకుండా సమంత చెరిపేశారు. అయితే చివరిగా చైతన్య ప్రేమకు గుర్తుగా తన వద్ద ఉన్నటువంటి ఒక జ్ఞాపకాన్ని కూడా సమంత చెరిపేసారని తన కళ్ళముందే కాకుండా ఊహలలో కూడా చైతన్య జ్ఞాపకాలు ఉండకూడదని భావించిన ఈమె తన మ్యారేజ్ సర్టిఫికెట్ ను కాల్చి బూడిద చేసారని తెలుస్తోంది. విడాకుల తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ తో తనకు అవసరం లేదని ఈ ఒక్క జ్ఞాపకాన్ని కూడా ఆమె చెరిపేసారట.

Kriti Shetty: అవన్నీ ఫేక్ న్యూస్ ఎవరు నమ్మదు… తప్పుడు వార్తలపై క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి!

Kriti Shetty: ఉప్పెన సినిమా ద్వారా బేబమ్మగా అందరికీ పరిచయమయ్యారు నటి కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.అయితే గత మూడు సినిమాలు ఈమెకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇలా మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఈమె సినీ కెరియర్ కాస్త ఇబ్బందులలో ఉందని చెప్పాలి.

ఇకపోతే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నటువంటి కృతి శెట్టి గురించి ఓ వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈమెను ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక స్టార్ హీరో కుమారుడు చాలా వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఎక్కడికి వెళ్లినా తనకు మనశాంతి లేకుండా తనని టార్చర్ చేస్తున్నారంటూ స్వయంగా ఈమె ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా కృతి శెట్టి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమెను వేధిస్తున్నటువంటి ఆ స్టార్ హీరో ఎవరా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా తన గురించి ఈ వార్త రోజు రోజుకు వైరల్ అవడంతో ఎట్టకేలకు ఈ వార్తలపై కృతి స్పందించారు. ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు.

Kriti Shetty: ఇలాంటి వాటిని నమ్మను…


నేను ఇలాంటి వార్తలను అసలు నమ్మను. కానీ రోజు రోజుకు ఈ వార్త వైరల్ అవుతుంది. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ ఈ సందర్భంగా కృతి శెట్టి సోషల్ మీడియా వేదికగా తన గురించి వస్తున్నటువంటి వార్తలన్నీ ఆ వాస్తవమని కొట్టి పారేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.