Samantha: సమంత మాజీ భర్త నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య తిరిగి శోభిత ప్రేమలో పడ్డారు. ఇలా శోభితతో కలిసి ఈయన నిన్న ఏడడుగులు నడిచారు. అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యుల సమక్షంలో నాగచైతన్య శోభిత వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇలా నాగచైతన్య శోభిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమంత సోషల్ మీడియా వేదిక చేసిన పోస్ట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా వీరి పెళ్లి తర్వాత సమంత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. అయితే ఆమె పూర్తిగా తన కెరియర్ గురించి అలాగే తన వెబ్ సిరీస్ గురించి పోస్ట్ చేశారని చెప్పాలి.
సమంత నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్ట్ చేయడం విశేషం. అంతేకాదు ఫైట్ చేస్తే ఓ అమ్మాయిలాగా చేయాలంటూ మరో చిన్న వీడియోను కూడా స్టోరీస్ లో ఆమె షేర్ చేశారు.రూసో బ్రదర్స్ చేసిన ఓ పోస్ట్ స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ.. ఈ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే గురించి ఆమె ప్రస్తావించింది. అద్భుతమైన ప్రయాణం..
అద్భుతమైన డైరెక్టర్లు రాజ్ అండ్ డీకేతో హనీ బన్నీ వెబ్ సిరీస్లో నటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను అంటూ ఈమె పోస్ట్ చేశారు. అయితే ఈ శోభిత నాగచైతన్య వివాహం జరిగిన వెంటనే చేయడంతో ఇది కాస్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య తన వ్యక్తిగత జీవితంలో మరొక అడుగు ముందుకు వేసి రెండో పెళ్లి చేసుకున్నారు మరి సమంత కూడా అలాగే రెండో పెళ్లి చేసుకుంటుందా లేకపోతే తన మాజీ భర్త జ్ఞాపకాలలోనే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…