Sobhita: సినీ నటుడు నాగచైతన్య రెండోసారి శోభితను పెళ్లి చేసుకున్నారు సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈయన శోభితను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా అక్కినేని ఇంటి కోడలుగా శోభిత అడుగు పెట్టడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె అక్కినేని ఇంటిలోకి కోడలుగా అడుగు పెట్టిందో లేదో అప్పుడే మాజీ కోడలు సమంతను ఓ విషయంలో వెనక్కి నెట్టేసిందనే చెప్పాలి. మరి ఏ విషయంలో సమంతను శోభిత బీట్ చేసిందనే విషయానికి వస్తే…ఐఎండీబీ ఎప్పటికప్పుడు.. నటీ,నటులు ర్యాంకుల జాబితాలను విడుదల చేస్తుంటుంది.
ఈ జాబితాలో శోభిత ధూళిపాళ.. సమంతను వెనక్కు నెట్టేసినట్లు తెలుస్తొంది. శోభిత టాప్ ఐదవ స్థానంలో నిలిచారు. ఇక సమంత మాత్రం ఎనిమిదో స్థానంలో ఉండటంతో అభిమానులు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. నాగచైతన్య భార్యగ అక్కినేని ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే మాజీ భార్యను ఈ విషయంలో వెనక్కి నెట్టి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక సమంత నాగచైతన్య ఇద్దరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు కానీ వీరి వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో పెళ్లైన మూడు సంవత్సరాలకు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకుల తర్వాత నాగచైతన్య శోభిత ప్రేమలో పడటం ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…