Tag Archives: nagarjuna

JD Chakravarthy: శివ సినిమా సమయంలోనే నాగార్జునతో గొడవ.. వార్నింగ్ ఇచ్చి వెళ్లారు: జేడీ చక్రవర్తి

JD Chakravarthy: సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు జేడీ చక్రవర్తి ఒకరు. ఈయన సినీ ప్రయాణం శివ సినిమాలో విలన్ పాత్ర ద్వారా మొదలైంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించినటువంటి జెడి చక్రవర్తి అనంతరం హీరోగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి ఈయన కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి చక్రవర్తి ఇటీవల దయ అనే వెబ్ సిరీస్ తో పాటు ఇతర సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా మారినటువంటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తన మొదటి సినిమా సమయంలోనే నాగార్జున్ తో గొడవ జరిగిందని ఆయన తనకు వార్నింగ్ ఇచ్చారంటూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

తాను మొదట నటించిన సినిమా శివ అని తెలిపారు ఈ సినిమాలో నాగార్జునకు విలన్ పాత్రలో నటించానని ఈయన వెల్లడించారు. అయితే ఈ సినిమా సమయంలో నాగార్జునతో నాకు గొడవ జరిగింది. నా తప్పు లేకపోయినా నాగార్జున నన్ను తిట్టారు అని వెల్లడించారు ఈ సినిమా షూటింగ్ పటాన్ చెరువులో ఒక కేఫ్ లో జరుగుతుండగా నేను లోపల నుంచి బయటకు వస్తున్న సమయంలో నా భుజం నాగార్జునకు తగిలింది. అది అనుకోకుండా జరిగింది అందులో నా తప్పు లేదని తెలిపారు..

క్షమాపణ చెప్పలేదు..
ఆ క్షణం నేను నాగార్జునకు క్షమాపణలు చెప్పి ఉంటే అంతటితో ఆ గొడవ ఆగిపోయింది కానీ నేను అలా చేయకపోవడంతో నాగార్జున నాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నాకు శివ మొదటి సినిమా ఆ సమయంలో నేను క్షమాపణలు చెప్పి ఉంటే సరిపోయేది అంటూ ఈ సందర్భంగా చక్రవర్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Nagarjuna: అర్ధరాత్రి ఫోన్ వస్తే నాగార్జున అంతలా భయపడతారా.. ఎందుకంత భయం?

Nagarjuna: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అక్కినేని నాగార్జున ఒకరు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాగార్జున ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఇటీవల ఈయన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నా సామిరంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే నాగార్జున గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జునకు ఇండస్ట్రీలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారని అలాంటి వారిలో హీరోయిన్ టబు కూడా ఒకరిని చెప్పాలి.

వీరిద్దరి మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఉండడంతో అది ప్రేమని త్వరలోనే నాగార్జున ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నాగార్జున స్వయంగా స్పందించి ఖండించారు. తను నాకు చాలా మంచి స్నేహితురాలని టబు ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన తను మా ఇంట్లోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

టబు ఫోన్ చేస్తే అంత భయమా..
ఇలా వీరిద్దరి గురించి నాగార్జున ఇంత క్లారిటీ ఇచ్చినప్పటికి వీరి గురించి రూమర్స్ రావడం సర్వసాధారణం అయితే తాజాగా టబు నుంచి అర్ధరాత్రి సమయంలో నాగార్జునకు ఫోన్ కాల్ వచ్చింది అంటే మాత్రం ఈయనకు వెన్నులో వణుకు పుడుతుందట. ఈమె అర్థరాత్రి నాగార్జునకు కనుక ఫోన్ చేసింది అంటే తప్పకుండా ఆమె ఎవరితోనో గొడవ పడిందని, ఆ గొడవ గురించి తనకు చెప్పడానికే ఫోన్ చేసిందని నాగార్జున ఫిక్స్ అయితారట. అందుకే తన నుంచి ఫోన్ రాగానే ఎలాంటి గొడవ సృష్టించిందోనని నాగార్జున భయపడిపోతారు తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.

Nagarjuna: నాగార్జున జుట్టు నిజమైనది కాదా.. అసలు విషయాలు చెప్పిన మేకప్ మెన్!

Nagarjuna: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున ఒకరు. అక్కినేని వారసుగా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినటువంటి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి నాగార్జున ఇప్పటికీ అదే అందం అదే ఫిట్నెస్ తో పెద్ద ఎత్తున సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

నాగార్జున ఆరుపదుల వయసులో ఉన్నారు అయినప్పటికీ ఈయన చాలా చలాకీగా అంతే అందంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ వయసులో కూడా ఈయన జుట్టు చాలా ఒత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా నాగార్జున జుట్టు ఈ వయసులో ఇలా ఉండటానికి కారణమేంటి కొంపతీసి ఇది నిజమైన హెయిర్ కాదా లేకపోతే ఈయన విగ్గు పెట్టుకున్నారా అనే సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి.

విగ్గు వాడరా..
ఈ క్రమంలోనే నాగర్జునకు గత కొన్ని సంవత్సరాల పాటు మేకప్ మెన్ గా వ్యవహరిస్తున్నటువంటి చంద్ర ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాగార్జున గారు జుట్టు నిజమైన జుట్టనని ఆయన ఇప్పటివరకు ఎలాంటి విగ్గు కూడా వాడలేదని ఈ సందర్భంగా నాగార్జున మేకప్ మెన్ ఆయన జుట్టు రహస్యం గురించి చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nagarjuna: కోట్ల రూపాయలు ఇస్తూ పెళ్లిళ్లకు రమ్మని పిలుస్తున్నారు.. నాగార్జున కామెంట్స్ వైరల్!

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున ఒకరు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి నాగార్జున ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికి నాగర్జున వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నాగార్జునకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ప్రస్తుతం ఒక బిజినెస్మెన్ ఇంట్లో కనుక పెళ్లి జరిగితే పెద్ద ఎత్తున సెలెబ్రిటీలను ఆహ్వానిస్తూ ఉంటారు అయితే సెలబ్రిటీలకు కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి వారిని పెళ్లికి ఆహ్వానిస్తున్నారని తెలిపారు.

కేవలం 20 నిమిషాలు పెళ్లిలో కనిపించి ఒక ఐదు నిమిషాల పాటు పెర్ఫార్మెన్స్ చేస్తే చాలు వారికి కోట్లలో డబ్బులు చెల్లిస్తున్నారంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో తనకి కూడా ఇలాంటి ఆహ్వానాలు అందాయని కానీ తాను మాత్రం వెళ్లలేదని నాగార్జున తెలిపారు.

డబ్బు తీసుకొని వస్తున్నారు…
ఇక ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు మూడు రోజుల పాటు సందడి చేసిన సంగతి తెలిసిందే దీంతో వీరందరూ కూడా రెమ్యూనరేషన్ తీసుకొని అక్కడికి వచ్చారని వాదన వినిపిస్తున్నటువంటి తరుణంలో నాగార్జున చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించిన ఓల్డ్ వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు.

Amala: నాగచైతన్య నేను పెంచలేదు..చైతూ అఖిల్ మాదిరి కాదు.. అమల కామెంట్స్ వైరల్!

Amala: అక్కినేని హీరో నాగార్జున భార్యగా సినీ నటిగా అమల అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనంతరం నాగార్జున పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జునకు అమల రెండో భార్య. ఈయన మొదట దగ్గుబాటి లక్ష్మినీ పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

ఇలా లక్ష్మి విడాకులు ఇచ్చిన అనంతరం నాగార్జున అమలను రెండో వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా అఖిల్ నాగచైతన్య ల గురించి అమల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి నేను నాగచైతన్యను పెంచలేదని నాగచైతన్య తన తల్లి వద్ద పెరిగాడని తెలిపారు.

ఇక టీనేజ్ వచ్చేవరకు నాగచైతన్య తన తల్లి వద్ద ఉన్నారని అనంతరం నాగార్జున వద్దకు రాగా ఆయన హీరోగా తనని ప్రేక్షకులకు పరిచయం చేశారని తెలిపారు. ఇక నాగచైతన్య అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవారని తనతో అఖిల్ చాలా చనువుగా ఉండేవారని తన రాక కోసం అఖిల్ ఎదురు చూస్తూ ఉండేవారని అమల తెలిపారు.

చైతు కోసం ఎదురు చూసేవాడు…

ఇప్పటికి వీరిద్దరి మధ్య అదే అనుబంధం ఉందని అమల తెలిపారు. నాగచైతన్యకు తనకు మధ్య బాండింగ్ లేకపోయినా అఖిల్ తో మాత్రం నాగచైతన్యకు మంచి బాండింగ్ ఉంది అంటూ ఈ సందర్భంగా అమల అఖిల్ నాగచైతన్య గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nagarjuna: చైతన్య సమంత విడిపోయిన నాగార్జున అది అలాగే పెట్టారా… ఏమైందంటే?

Nagarjuna: అక్కినేని నాగచైతన్య సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో వీరిద్దరూ కూడా ఎంతో ఘనంగా 2017 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్న అనంతరం కొంతకాలం పాటు వైవాహిక జీవితంలోకి ఎంతో సంతోషంగా ఉన్నారు. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరి పెళ్లిని కాస్త బ్రేకప్ చేసుకున్నారు.

నాగచైతన్య సమంత 2021 అక్టోబర్ లో వీరి విడాకుల గురించి అధికారికంగా ప్రకటన ఇచ్చారు. ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం కెరియర్ పరంగా ఇద్దరూ కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే వీరిద్దరూ విడిపోయి కూడా దాదాపు మూడు సంవత్సరాలు దాటినప్పటికీ తరచూ సమంత నాగచైతన్య గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా సమంత నాగచైతన్యకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయిన నాగార్జున మాత్రం వీరి విషయంలో ఒక వస్తువుని అలాగే భద్రంగా దాచి పెట్టారని తెలుస్తుంది. సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చి అక్కినేని కుటుంబం నుంచి వెళ్లిపోయిన వీరి పెళ్లి ఫోటోని మాత్రం నాగార్జున తన ఇంటి హాల్లో అలాగే పెట్టారని తెలుస్తుంది.

ఫ్యామిలీ ఫోటో…


నాగార్జున ఇలా సమంత నాగచైతన్య ఫోటో పెట్టడానికే కారణం ఏంటి అనే విషయానికి వస్తే సమంత నాగచైతన్య పెళ్లిలో మాత్రమే అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసారని ఈ పెళ్లిలోనే వీరంతా కలిసి ఫ్యామిలీ ఫోటో దిగారని తెలుస్తోంది. ఇలా ఈ ఫోటోలో కుటుంబ సభ్యులందరూ కూడా ఉండటంతో ఈయన కూడా ఈ ఫోటోని భద్రంగా పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి.

Nagarjuna: ఆ సమయంలో నా మాటలు ఎవరు నమ్మలేదు.. పిచ్చెక్కినట్లు చూశారు.. నాగార్జున కామెంట్స్ వైరల్?

Nagarjuna: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా నటించిన చిత్రం నా సామిరంగ. మలయాళంలో సూపర్ హిట్ అయిన పొరింజు మరియమ్ జోస్ అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలె జనవరి 14న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయ్యింది. సంక్రాంతి పండగకి తగ్గట్లుగానే ఆ వైబ్ కనిపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ప్రణాళికతో రిలీజ్ చేశారు. కీరవాణి సంగీతం, నాగార్జున మాస్ గెటప్, అల్లరి నరేశ్, హీరోయిన్ ఆషిక రంగనాథ్ నా సామిరంగ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలవడానికి కారణాలు అని చెప్పవచ్చు.

అయితే భారీ విజయాన్ని అందుకోకపోయినప్పటికీ ఈ సినిమా పరవాలేదు అనిపించింది. ప్రస్తుతం ఈ చిత్రం బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. 38 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఈ సందర్భంగా తాజాగా నా సామిరంగ చిత్ర యూనిట్ తాజాగా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ. అక్కినేని అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు చాలా లేట్ గా కంఫర్మ్ చేశాము. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాకు సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు. చిత్ర యూనిట్ ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. సినిమా రిలీజ్ టార్గెట్ తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎవరూ ఒత్తిడి ఫీల్ అవకుండా నవ్వు ముఖాలతోనే పని చేశారు అని తెలిపారు నాగార్జున.

ఆ మాటలకు ఆశ్చర్యపోయారు..

నాన్నగారి పుట్టినరోజు సెప్టెంబర్ 20న ఈ చిత్రాన్ని లాంచ్ చేసాము. ఒకవైపు నాన్నగారి స్టాచ్యూ ఆవిష్కరణ జరుగుతోంది. అప్పటి వరకు ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తున్నట్లు నా ఫ్యామిలీకి కూడా తెలియదు. ఎక్కడికి వెళుతున్నారు అని అమల అడిగింది. ఇలా మూవీ లాంచ్ ఉంది వెళ్ళాలి అని చెప్పాను. ఇలా స్టాచ్యూ లాంచ్ జరుగుతోంది కదా కాస్త ఆలస్యంగా వెళ్ళండి అని చెప్పింది. లేదు నేను వెళ్ళాలి.. ఎందుకంటే ఈ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలని అని చెప్పాను. అప్పడు అమల పిల్లలు చైతు, అఖిల్ నాకు పిచ్చిపట్టినట్లు చూశారు. ఎవ్వరూ నమ్మలేదు. మూడు నెలల టైం కూడా లేదు ఎలా రిలీజ్ చేస్తారు అని ఆశ్చర్యపోయారు. కానీ నా టీం మాత్రం నమ్మింది. అనుకున్న టైంకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం అని నాగార్జున తెలిపారు. కీరవాణి గారు కూడా ఒక టైం టేబుల్ వేసుకుని ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు అని అని చెప్పుకొచ్చారు హీరో నాగార్జున. ఈ సందర్భంగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Kurchi Thatha: నాగార్జున నువ్వేమైనా పేదోడివా.. కోట్లు సంపాదిస్తున్నావుగా.. ఫైర్ అయిన కుర్చీ తాత?

Kurchi Thatha: కుర్చీ తాత ఇటీవల భారీ స్థాయిలో ఫేమస్ అయ్యారు ఈయన ఆ కుర్చీ మడత పెట్టు అనే డైలాగుతో ఒకసారిగా వార్తలలో నిలిచారు ఇకపోతే ఈ డైలాగుతో ఏకంగా గుంటూరు కారం సినిమాలో పాట కూడా పెట్టడంతో కుర్చీ తాత రెండు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ గా మారిపోయారు. ఇక ఈయన ఇటీవల కాలంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తున్నారు.

ఈయన కుర్చీ మడత పెట్టు అంటూ చెప్పినటువంటి డైలాగ్ ఫేమస్ అవడంతో మీడియా వాళ్ళు కూడా ఈయనతో భారీ స్థాయిలో ఇంటర్వ్యూలు తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో ఈయన కేటీఆర్ కెసిఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి గతంలో ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ కార్యక్రమం అంటే చాలామందిలో పూర్తిస్థాయి వ్యతిరేకత ఉంది అనే సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం పట్ల చాలామంది వ్యతిరేకత చూపించడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలి అంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కుర్చీ తాత సైతం బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున పై మండిపడ్డారు.

అన్ని కోట్లు ఏం చేస్తావ్…

నాగార్జునకు వేలకోట్ల ఆస్తి ఉంది అయినప్పటికీ డబ్బు కోసం కకృతి పడుతూ ఇలాంటి కార్యక్రమానికి పనిచేయడం దేనికి నీకేమైనా డబ్బు లేదా నువ్వేమైనా పేదోడివా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా మీ ఇద్దరి కొడుకులు అలాగే నీ భార్య కూడా భారీగా సంపాదిస్తుంది కదా అన్ని కోట్లు ఏం చేసుకుంటావు అంటూ నాగార్జున పట్ల గతంలో కుర్చీ తాత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Nagarjuna: బిగ్ బాస్ శోభా శెట్టికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున.. సంతోషంలో తేలిపోతున్న నటి!

Nagarjuna: బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున నుంచి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా వ్యవహరించినటువంటి శోభా శెట్టి ఊహించని గిఫ్ట్ అందుకున్నారు. ఈమె సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు..

ఇక ఈ కార్యక్రమంలో కొన్నిసార్లు మోనిత పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి శివంగిలా అందరిపై విరుచుకుపడినటువంటి ఈమె అందరూ కూడా మొదట్లోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ 14వ వారం వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూ బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా శోభా శెట్టి ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. నాగార్జున గారి నుంచి తనకు సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరి నాగార్జున ఈమెకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారనే విషయానికి వస్తే నాగార్జున సీజన్ సెవెన్ లో భాగంగా ఆరవ వారంలో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఒక వెరైటీ టీ షర్ట్ వేసుకొని వచ్చారు. అయితే శోభ మాత్రం సర్ మీ టీ షర్ట్ బాగుంది నాకు కావాలి అంటూ అడిగారు.

ఇంతకన్నా ఇంకేం కావాలి..

ఆరోజు నేను ఈ టి షర్ట్ అడగడంతో నాగార్జున సార్ దానిని గుర్తు పెట్టుకొని మరి నేను ఎలిమినేట్ అయిన రోజు ఈ టి షర్టు నాకు గిఫ్ట్ గా ఇచ్చారని ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి అంటూ ఈమె సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఆ టీ షర్ట్ ధరించి ఫోటోషూట్ కూడా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వేస్ట్… సంచలన వ్యాఖ్యలు చేసిన గీతూ రాయల్!

Nagarjuna: బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం మూడవ సీజన్ నుంచి ఈయనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే నాగార్జున హోస్టింగ్ గురించి ఇదివరకే ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి .ఈయన మేకర్స్ ఏది రాసిస్తే అదే స్క్రిప్ట్ చదువుతారని అలా కాకుండా.. కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్ చూసి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాలను గుర్తించకుండా స్క్రిప్ట్ లో ఏది రాస్తే అదే మాట్లాడుతారని కామెంట్లు తరచూ వినపడుతూ ఉంటాయి.

ఈ విధంగా నాగార్జున గురించి ఇదివరకే ఎంతోమంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే తాజాగా బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున హోస్టాగా పనికిరారు అంటూ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతు రాయల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. ఈ కార్యక్రమానికి ఈమె బజ్ యాంకర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ బిగ్ బాస్ కార్యక్రమంలో నాగార్జున స్క్రిప్ చదువుతారని ఈమె తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లను నాగార్జున అడగలేని ప్రశ్నలను తాను బజ్ కార్యక్రమంలో అడుగుతున్నాను అంటూ గీతు నాగార్జున యాంకరింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఆర్జీవి హోస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందంటూ ఈమె సలహాలు ఇచ్చారు. నాగార్జున ఎంత కూల్ గా వస్తారో కంటెస్టెంట్లతో మాట్లాడి అంతే కూల్ గా వెళ్తారు కానీ కంటెస్టెంట్ల బెండు తీయరని వారి స్క్రూలు టైట్ చేయరు అంటూ తన స్టైల్లో చెప్పారు.

హోస్ట్ గా వర్మ బెస్ట్…

ఇలా నాగార్జున స్టార్ డమ్ క్రేజ్ చూసి అది నిజం అని తెలిసిన చిన్న ఆర్టిస్టులు ఎవరు కూడా నాగార్జున గురించి అలాంటి వ్యాఖ్యలు చేయరు కానీ గీతూ అలాంటి వ్యాఖ్యలు చేసింది అంటే నిజంగానే ఈమె డేరింగ్ అనే చెప్పాలి. ఏది ఏమైనా నాగార్జున గురించి వచ్చే విమర్శలను ప్రస్తుతం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కూడా చెప్పడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.