Tag Archives: nagarjuna

Pallavi Prashanth: బిగ్ బాస్ లోకి రావడం కోసం పస్తులు కూడా ఉన్నాను… ఎమోషనల్ కామెంట్స్ చేసిన పల్లవి ప్రశాంత్!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ యూట్యూబర్ గా ఒక రైతు బిడ్డగా రైతుల పడే కష్టాలన్నీటిని తెలియజేస్తూ రైతుబిడ్డగా మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అయితే ఈయనకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అన్నది ఎప్పటినుంచో కోరికగా ఉంది అంటూ తరచూ తన వీడియోలు ద్వారా తెలియజేసేవారు. దీంతో ఈయన బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ మొదటి నుంచి కూడా తన ఆట తీరుతో అందరిని మెప్పించి భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వచ్చినటువంటి ఈయన చివరికి కప్పు గెలుచుకొని బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చారు. ఇక పల్లవి ప్రశాంత్ గెలవడంతో బిగ్ బాస్ వేదికపై ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు బిగ్ బాస్ కార్యక్రమమంటే చాలా ఇష్టం అని అయితే ఈ కార్యక్రమానికి రావడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను అని తెలిపారు. కొన్నిసార్లు పస్తులు కూడా ఉన్నానని అయితే ఈ విషయాలన్నింటిని మా ఇంట్లో వారికి తెలియనివ్వలేదని తెలిపారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో గెలుచుకున్నటువంటి ప్రైజ్ మనీ గురించి కూడా మరోసారి వేదికపైనే ప్రశాంత్ మాట్లాడారు తాను గతంలో రైతుల కోసమే ఆ డబ్బు ఉపయోగిస్తానని చెప్పాను ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నానని తెలిపారు. ఎవరైతే కష్టాలలో ఉన్నారో అలాంటి రైతులకు తన ప్రైజ్ మనీ ఇచ్చేస్తానని ప్రశాంత్ తెలిపారు.

కారు నాన్నకు..నగలు అమ్మకు..

ఇక విన్నర్ కు ప్రైజ్ మనీ తో పాటు ఒక కారు అలాగే జోయాలుకాస్ వారి బంగారు ఆభరణాలను కూడా అన్ని ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే కారును తన తండ్రికి ఇస్తానని బంగారం తన తల్లికి ఇస్తాను అంటూ ఈ సందర్భంగా ప్రైజ్ మనీ గురించి పల్లవి ప్రశాంత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో తగ్గేదే లేదంటూ ప్రశాంత్ తన స్టైల్లో చెప్పుకు వచ్చారు.

Nagarjuna -Venkatesh: ఆ కారణం వల్లే వెంకటేష్ నాగార్జున మధ్య మాటలు లేవా… అసలేం జరిగిందంటే?

Nagarjuna -Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున అలాగే వెంకటేష్ వంటి హీరోలు కూడా ఒకరిని చెప్పాలి. వీరిద్దరూ సీనియర్ హీరోలుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఇద్దరి హీరోలు వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఒకప్పుడు ఎంతో స్నేహబంధంతో ఉన్నటువంటి నాగార్జున వెంకటేష్ మధ్య గత కొంతకాలంగా మాటలు లేవని ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కూడా ఎక్కడ కలిసి కనిపించినటువంటి సందర్భాలు కూడా లేవు. మరి వీరిద్దరూ ఇలా శత్రువులుగా ఉండటానికి కారణమేంటి ఎందుకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే విషయానికి వస్తే..

నాగార్జున వెంకటేష్ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు దీంతో వెంకటేష్ చెల్లెలు దగ్గుబాటి లక్ష్మిని నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే వీరికి నాగచైతన్య పుట్టిన తరువాత వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా ఇద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా తన చెల్లికి నాగార్జున అన్యాయం చేశారన్న కారణంతోనే వెంకటేష్ నాగార్జునతో దూరంగా ఉంటున్నారు దీంతో వీరిద్దరి మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి.

మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన నాగార్జున…

ఇకపోతే ఇటీవల వీరిద్దరూ కూడా నాగచైతన్య హీరోగా నటిస్తున్నటువంటి తండేల్ సినిమా పూజా కార్యక్రమాలలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. చైతన్య వెంకటేష్ కి మేనల్లుడు నాగార్జున కొడుకు కావడంతో ఈ ఇద్దరు హీరోలు కూడా ఇక్కడ సందడి చేశారు. అయితే వెంకటేష్ అన్నపూర్ణ స్టూడియోలోకి ఎంటర్ కాగానే నాగార్జున తనని చాలా మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం వెంకటేష్ కూడా నాగార్జున భుజంపై చేయి వేసి ఇద్దరు సరదాగా మాట్లాడుతూ లోపలికి వెళ్లడం విశేషం.

Bigg Boss 7: ఎవరైనా ఏడిస్తే యాక్టింగ్.. నువ్వు ఏడిస్తే బాధనా… వీడియోలు చూపించి మరి అమర్ కు క్లాస్ పీకిన నాగార్జున?

Bigg Boss 7: బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు మూడు వారాలు సమయం ఉన్న నేపథ్యంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ వారంలో భాగంగా అశ్విని శనివారం హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక ఆదివారం కూడా మరొక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు అయితే శనివారం మాత్రం నాగార్జున హౌస్ మేట్లతో మాట్లాడుతూ వారికి తన స్టైల్ లోనే క్లాస్ పీకారు ముఖ్యంగా అమర్ దీప్ కు నాగార్జున లెఫ్ట్ రైట్ ఇచ్చారని చెప్పాలి.

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అమర్ దీప్ ఎంతో దీనంగా కెప్టెన్ అవ్వాలని కోరిక నాకుంది అంటూ ఏడ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే చాలామంది అమర్ ఏడుపు పై బాధపడుతూ సింపతి చూపిగా మరి కొంతమంది ఇది అమర్ స్ట్రాటజీ అంటూ కూడా కామెంట్ చేశారు. అయితే తాజాగా నాగార్జున కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ అమర్ దీప్ కి ఇచ్చి పడేసారు.

గతంలో పల్లవి ప్రశాంత్ కూడా ఇలాగే మాట్లాడితే నువ్వు సింపతి డ్రామాలు చేయకు అంటూ అమర్ తన పై ఫైర్ అయినా సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని నాగార్జున గత వీడియోలన్నింటిని కూడా ప్లే చేస్తూ..ప్రశాంత్ ను సెంటిమెంట్ డ్రామాలు ఆడద్దంటూ చెప్పావ్.. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావ్ అంటే నీది సెంటిమెంట్ డ్రామానా అని అడగ్గా నా వరకు వచ్చే వరకు ఆ బాధ నా వరకు వచ్చేవరకు తెలియడం లేదు సార్ అంటూ సమాధానం చెప్పారు.

నీ వరకు వస్తే అది బాధనా..

నీకొస్తే బాధ అవతలి వాళ్లకు వస్తే బాధా కాదా నీ ఫ్రెండ్స్ ఇద్దరూ ఏడొద్దని చెప్పారు.. అయినా ఏడుస్తూనే ఉన్నావ్ అని నాగ్ అనడంతో.. నా అనుకున్న మనుషులు నన్ను దెబ్బతీశారు అంటూ అమర్ మాట్లాడారు. అయితే శివాజీ అమర్ నాగార్జున మధ్య కొంత సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా ముగ్గురు మధ్య గొడవ జరుగుతూ ఉన్నప్పటికీ చివరికి అమర్ మా అమ్మ మీద ఒట్టు తన తల్లి పై ఒట్టు వేయడంతో నాగార్జున తనపై సీరియస్ అయ్యారు. నువ్వు గతంలో ఒకసారి ఇప్పుడు ఒకసారి మాట్లాడితే ప్రేక్షకులు కన్ఫ్యూస్ అవుతారని అది నీకే ప్రమాదం అంటూ నాగార్జున మరోసారి అమర్ ను హెచ్చరించారు.

Bigg Boss: షో ఒక్కటే… హౌస్ లు రెండు బిగ్ బాస్ సీజన్ ఈసారి మామూలుగా ప్లాన్ చేయలేదుగా?

Bigg Boss: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ ఉన్నటువంటి బిగ్ బాస్ రియాలిటీ షో మరొక వారం రోజులలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే తెలుగులో 6 సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం త్వరలోనే ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది.

ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం ఎవరు ఊహించని విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుందని నాగార్జున కూడా తెలియజేశారు.

ఇకపోతే తాజాగా ఈ షో గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈసారి రెండు వేర్వేరు హౌస్లు ఉంటాయట. ఒకే షోలో రెండు ఇళ్లు అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విడగొట్టి రెండు ఇళ్లలోకి పంపుతారట అయితే వీరి ప్రవర్తన వీరు గేమ్స్ లో పార్టిసిపేట్ చేసే విధానం బట్టి వీరిని హౌస్ మారుస్తూ ఉంటారని తెలుస్తోంది.

Bigg Boss: కొత్త ప్లాన్ సక్సెస్ అయ్యేనా…


ఇలా సరికొత్త ఆలోచనలతో ఈ విభిన్నమైనటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇలా ప్రతివారం కంటెస్టెంట్లు హౌసులు మారడంతో ప్రేక్షకులలో కూడా ఎక్సైట్మెంట్ ఉంటుందని తప్పకుండా ఈ కార్యక్రమానికి కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతోనే ఈసారి ఈ కార్యక్రమాన్ని ఇలా ప్లాన్ చేశారని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఒకవేళ నిజమే అయితే ఇది సక్సెస్ అవుతుందా అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.

Nagarjuna: నాగార్జున ఇప్పటికి మన్మధుడుగా కనిపించడానికి అదే కారణమా… రోజు అది ఉండాల్సిందేనా?

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నాగార్జున ఆరుపదుల వయసులోకి అడుగుపెట్టిన ఇప్పటికీ మన్మధుడుగానే ఉన్నారు. ఈ వయసులో కూడా నాగార్జున ఎంతో యాక్టివ్గా చలాకీగా ఉండడమే కాకుండా అదేవిధంగా తన బాడీ ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ ఉన్నారు.

ఇలా నాగార్జున ఇంత వయసు వచ్చిన ఆయన లావు కాకపోవడానికి ఆ అందాన్ని అలాగే మెయిన్టైన్ చేయడానికి కారణం ఏంటి అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.ఇక నాగార్జున ఏ కార్యక్రమానికి వెళ్లిన అభిమానులు ముందుగా ఆయనను ఇదే విషయం గురించి ప్రశ్నిస్తారు. అయితే తాజాగా నాగార్జున ఇలా ఉండటానికి కారణం ఏంటి ఆయన ఫుడ్ సీక్రెట్ ఏంటి అనే విషయాలను బయటపెట్టారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నేను తీసుకునే ఫుడ్ చేసే వర్కౌట్స్ అని ఇలాగే ఉండాలి అని కొన్ని నియమాలు పెట్టుకున్నాను తద్వారా నా బాడీ వాటికి ట్యూన్ అయిపోయిందని తెలిపారు. అందుకే నేను లావు కావాలనుకున్న నా బాడీ అలాగే మైంటైన్ అవుతూ ఉందని ఈయన తెలియజేశారు. ఇక తాను ఎన్ని రకాల ఫుడ్ తీసుకున్న రాత్రి పడుకునే సమయంలో మాత్రం ఒక ఫుడ్ ఖచ్చితంగా తింటానని తెలిపారు.

Nagarjuna: ఐస్ క్రీమ్ ఉండాల్సిందే…


తను రోజంతా ఎలాంటి ఫుడ్ తీసుకున్న తీసుకోకపోయిన రాత్రి పడుకునే ముందు తనకు కచ్చితంగా ఐస్ క్రీమ్ ఉండాల్సిందేనని నాగార్జున తెలియజేశారు.ప్రతిరోజు రాత్రి ఐస్ క్రీమ్ తిని తాను పడుకుంటానని ఒకవేళ ఐస్ క్రీమ్ లేకపోతే ఏదో ఒక స్వీట్ తిని తాను పడుకుంటాను అంటూ ఈ సందర్భంగా నాగార్జున తన ఫుడ్ సీక్రెట్ రివిల్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Nagarjuna: బిగ్ బాస్ 7 కోసం నాగ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…సినిమాలు చేయాల్సిన అవసరం లేదు!

Nagarjuna: కింగ్ నాగార్జున ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు గత ఏడాది ఈయన నటించిన ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత నాగార్జున ఎలాంటి కొత్త సినిమాలను ప్రకటించలేదు. అయితే నాగార్జున ఇలా సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మాత్రమే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగార్జున త్వరలోనే బిగ్ బాస్ 7 ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి రోజుకు ఒక వార్త వైరల్ అవుతుంది అయితే తాజాగా నాగార్జునకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Nagarjuna: నాలుగు సినిమాలతో సమానం..


ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం ఈయన భారీగానే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. ఈ రియాలిటీ షో కోసం నాగార్జున ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.నాగార్జున ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటే మరో రెండు సంవత్సరాల పాటు ఎలాంటి సినిమాలు చేయకపోయినా పర్వాలేదని ఈ రెమ్యూనరేషన్ నాలుగు సినిమాల కోసం తీసుకునే రెమ్యూనరేషన్ తో సమానం అంటూ నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ పై కామెంట్స్ చేస్తున్నారు.

Bigg Boss7: ఇది అంతం కాదు ఆరంభం… వైరల్ అవుతున్న నాగార్జున బిగ్ బాస్ సరికొత్త ప్రోమో!

Bigg Boss7:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఇప్పటికీ ఆరు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఏడవ సీజన్ కి సంబంధించి వరుస ప్రోమోలను విడుదల చేస్తూ ఈ షోపై భారీగానే అంచనాలను పెంచేశారు. అందరూ అనుకున్నట్టు ఈసారి ఈ కార్యక్రమం ఉండబోతుందని ఈసారి సరికొత్త రూల్స్ సరికొత్త గేమ్స్ అంటూ నాగార్జున ఈ కార్యక్రమం పై భారీ అంచనాలు పెంచేలా చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి మరొక ప్రోమో విడుదల చేశారు.

ది ఎండ్ అంటూ నాగార్జున మరొక కొత్త ప్రోమో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇందులో భాగంగా ఓ వ్యక్తి కొండ నుంచి పడబోతూ ఉండగా తన ప్రియురాలు దుపట్టా ఇచ్చి తనని కాపాడుతుంది. ఇంతలోనే తనకు తుమ్ము రావడంతో దుపట్టా వదిలేస్తుంది అప్పుడు నాగార్జున ది అండ్ ఇలాంటి క్లైమాక్స్ లు మనం బోలెడు చూసాం అయితే ఈసారి సరికొత్తగా అంటూ ఇది అంతం కాదు ఆరంభం అంటూ బిగ్ బాస్ 7 గురించి తాజాగా విడుదలైన ఈ ప్రోమో మరిన్ని అంచనాలను పెంచేస్తుంది.

Bigg Boss7: ది ఎండ్ అంటూ కొత్త ప్రోమో..


ఇక ఈ కార్యక్రమం అతి త్వరలోనే ప్రసారం కాబోతుందని ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది. అయితే ఈసారి ప్రేక్షకులకు పరిచయం లేనటువంటి మొహాలు కాకుండా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వారిని హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోయే కాంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు వినబడుతున్నాయి.

Bigg Boss Sohel: కెరియర్ డౌన్ ఫాల్ కావడంతో డిప్రెషన్ లోకి పోయాను… సోహెల్ కామెంట్స్ వైరల్!

Bigg Boss Sohel: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో ముందుకు కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వెళ్లినటువంటి వారు ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సోహెల్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఈ అన్న త్వరలోనే మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఆగస్టు 18వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ సందర్భంగా ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సోహెల్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేసాడు. తాను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తనకంటూ ఎంతో మంచి గుర్తింపు వచ్చింది ఇలా ఈ కార్యక్రమంతో మంచి పేరు సంపాదించుకున్న తనకు అనంతరం అవకాశాలు లేకపోవడంతో ఒక్కసారిగా కెరియర్ పరంగా డౌన్ ఫాల్ అయిపోయాను అని తెలిపారు.

Bigg Boss Sohel: నాగార్జున గారి ధైర్యం చెప్పారు…


ఎవరికైనా జీవితంలో డౌన్ ఫాల్ ఉండడం సర్వసాధారణం అయితే దానిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. నేను మాత్రం దానిని యాక్సెప్ట్ చేయలేకపోయానని అంతేకాకుండా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని సోహెల్ తెలిపారు. అలాంటి సమయంలో నాగార్జున గారు తనకు ఎంతో ధైర్యం ఇచ్చారని ఈ సందర్భంగా నాగార్జున గురించి అలాగే తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయినటువంటి సంఘటనల గురించి సోహెల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Nagarjuna: నాగార్జునకు కోపం వస్తే అలాంటి పని చేస్తారా… నాగార్జున సీక్రెట్ బయటపెట్టిన అఖిల్!

Nagarjuna: టాలీవుడ్ నటు సామ్రాట్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మన్మధుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది మహిళ అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇక నాగార్జునను మనం ఎలాంటి పరిస్థితులలో చూసిన ఆయన మొహంపై చిరునవ్వు ప్రశాంతత మాత్రమే కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా తాను సీరియస్ గా అయినటువంటి సందర్భాలను కూడా మనం చూడలేదు.ఇలా ఎప్పుడు సరదాగా ఉండే నాగార్జునకు కోపం వస్తే ఊహించని విధంగా రియాక్ట్ అవుతారని తెలుస్తుంది.

ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే నాగార్జునకు కూడా కోపం వస్తుందా అన్న సందేహాలను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన కూడా మనిషే కదా తనకు కూడా కోపం వస్తుందని ఆ కోపం వస్తే నాగార్జున ఏం చేస్తారో అనే విషయాలను ఒకానొక సందర్భంలో అఖిల్ బయట పెట్టారు.ఈ సందర్భంగా అఖిల్ తన తండ్రి కోపం గురించి మాట్లాడుతూ నాన్నకు కోపం వస్తే ఆయన వెంటనే కిచెన్లోకి వెళ్లిపోతారని తెలిపారు.

Nagarjuna: నాన్నకు కోపం వస్తే వంట వండుతారు..

ఇలా కిచెన్ లోకి వెళ్లి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారని నాన్న చాలా అద్భుతంగా కుకింగ్ చేస్తారు అంటూ అఖిల్ తెలియజేశారు. ఇక తాను ఎప్పుడైనా షూటింగ్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి నాన్న కిచెన్ లో ఉన్నారు అంటే ఇంట్లో ఏదో జరిగిందని అందుకే నాన్న సీరియస్ గా ఉన్నారని తనకు అర్థమయ్యే కొంత సమయం పాటు నాన్నతో ఏమీ మాట్లాడమని ఈ సందర్భంగా తెలియజేశారు.

Bigg Boss 7: బిగ్ బాస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్… త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ … ఎప్పుడంటే?

Bigg Boss 7: బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెరపై ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ అభిమానులలో అంచనాలను పెంచేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈసారి మాత్రం పాత చింతకాయ పచ్చడిగా కాకుండా కాస్త కొత్తగా ఉండబోతుందని తాజాగా నాగార్జున ప్రోమో ద్వారా తెలియచేశారు.

ఈసారి బిగ్ బాస్ కార్యక్రమం సరికొత్తగా ఉండబోతుందని తెలిపారు. అయితే అంత మాకే తెలుసు అనుకుంటే పొరపాటు పాపం పసివాళ్ళు అంటూ నాగార్జున ఈ ప్రోమోలో తెలియచేయడంతో ఈ కార్యక్రమం పై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియ కూడా పోతే అయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని సమాచారం.

ఇక ఏడవ సీజన్ ఎలాంటి విమర్శలకు తావు లేకుండా భారీ స్థాయిలో రేటింగ్ కైవసం చేసుకునే విధంగా ఈ సీజన్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఇక ఈ సీజన్ సెప్టెంబర్ మూడవ తేదీ ప్రసారం కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం కోసం మరొక వారం ముందుగానే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని పలువురు భావిస్తున్నారు.


Bigg Boss 7: ఉల్టా పల్టా అంటున్న నాగార్జున…

ఇక తాజాగా నాగార్జునకు సంబంధించిన ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో కనుక చూస్తే ఈసారి ఈ కార్యక్రమం సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పలువురు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి బిగ్ బాస్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.