Tag Archives: pm modi

యూపీ లో ఉజ్వల 2.0 పథకం ప్రారంభం!

ప్రతీ ఇంట్లో ఎల్​పీజీ గ్యాస్​ స్టవ్​ ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉజ్వల 2.0 పథకాన్ని వీడియో ద్వారా ఉత్తర్​ప్రదేశ్​లో వర్చువల్​గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.

. ఈ సంధర్భంగా యోగి మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్‌లో, ఉజ్జ్వాలా పథకం మొదటి దశలో కనీసం 1.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. కోవిడ్ సమయంలో, ప్రధాని మోదీ లబ్ధిదారులందరికీ ఆరు నెలల పాటు ఉచిత సిలిండర్లను అందించామని పేర్కొన్నారు. 2016 లో ప్రారంభించిన ఉజ్వల 1.0 సమయంలో, దారిద్య్రరేఖకు దిగువన కుటుంబాలకు చెందిన ఐదు కోట్ల మంది మహిళలకు LPG కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోగి స్పష్టం చేశారు.

కరోనాతో అనాథగా మారిన చిన్నారులకు రూ.10 లక్షలు డిపాజిట్ : కేంద్ర ప్రభుత్వం

గత ఏడాదిన్నర కాలం నుంచి కరోనా మహమ్మారి దేశం పై కొరడా జులిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఎంతోమంది బతుకులు వీధిన పడ్డాయి. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తను కోల్పోయిన భార్య ఎంతో మంది వివిధ రకాల కష్టాలను అనుభవిస్తున్నారు.

ఇటువంటి సమయంలోనే కరోనా మహమ్మారికి బలై తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. ఈ క్రమంలోనే “పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్” అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా అనాధలైన చిన్నారుల పేరిట నగదు డిపాజిట్ చేసి వారిని సైనిక, కేంద్రీయ విశ్వవిద్యాలయం, నవోదయ పాఠశాలలో చదువులు చదివిస్తూ వారి పుస్తకాలకు, బట్టలకు అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది.

ఈ చిన్నారులకు 18 సంవత్సరాలు నిండిగానే వారికినెల నెలా స్టయిపెండ్ అందిస్తారు. డిపాజిట్ చేసిన నగదును 23 ఏళ్లు నిండిన తర్వాత రూ. 10 లక్షలు ఇస్తారు. అదేవిధంగా ఉన్నత చదువుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వాటికి వడ్డీని పీఎం కేర్స్ నుంచి చెల్లిస్తారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాత్ భారత్ స్కీమ్ కింద రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమాను కల్పించనున్నారు.

కరోనా కారణంగా తల్లిదండ్రులు సంరక్షకులను కోల్పోయిన చిన్నారులు గత నెల ఏప్రిల్ 1 నుంచి మే 25 వరకు అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్రపాలిత ప్రాంతాల లోనూ ఇప్పటి వరకు 557 మంది చిన్నారులను పలు నివేదికల ఆధారంగా గుర్తించినట్లు కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.దేశవ్యాప్తంగా అనాథలైన చిన్నారుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి నందుకు మంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఉచితంగానే కేంద్రం రూ.50 వేలు ఇస్తుంది.. ఇలా చేస్తే చాలు?

కరోనా విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహించి 50 వేల రూపాయల క్యాష్ రివార్డును ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎంతో ఆసక్తి ఉన్నవారు ఈ కాంటెస్ట్ లో పాల్గొని మన ఇంట్లో ఉంటూ 50 వేల రూపాయల ప్రైజ్ మనీ పొందే అవకాశం కల్పించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాంటెస్ట్ ఏమిటి? ప్రైజ్ మనీ ఏ విధంగా పొందాలి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం కోసం ఒక లోగోను గీయాలి. ఈ లోగో గీసిన విజేతకు యాభై వేల రూపాయల ప్రైజ్ మనీ ను కేంద్ర ప్రభుత్వం అందించనునట్టు మై గౌ ఇండియా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. 

ఈ కాంటెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వారికి మే 31 వరకు గడుపు ఉంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే అభ్యర్థులు లోగోను ఎంతో అర్థవంతంగా గీయాలి. అదేవిధంగా లోగోకి సంబంధించి 100 పదాలతో వివరణ కూడా ఇవ్వాలి. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వారికి మూడు ఎంట్రీలు ఉంటాయి.

ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న విజేతకు 50 వేల రూపాయలు బహుమతితో పాటు, సర్టిఫికెట్ కూడా అందజేయనున్నారు.అదే విధంగా మరో ముగ్గురికి సర్టిఫికేట్ అందజేయనున్నారు. మరెందుకు ఆలస్యం మీ లో ఉన్న ప్రతిభను బయట పెట్టి ఈ కాంటెస్ట్ లో పాల్గొని 50వేల బహుమతిని గెలుపొందండి.

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఎకరాకు 7 వేల రూపాయలు..?

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం సరికొత్త బడ్జెట్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలను అమలు చేయడంతో మోదీ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది.

రైతుల ధర్నా వల్ల మోదీ సర్కార్ కు చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఏర్పడటంతో కేంద్రం రైతులను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్ లో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. రైతులను బడ్జెట్ ద్వారా ఆదుకోవాలని కేంద్రం భావిస్తోందని.. పీఎం కిసాన్ స్కీమ్ నగదు పెంపుతో పాటు సోలార్ పంపు స్కీమ్ గడువును కూడా పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పీఎం కుసుమ్ స్కీమ్ కొరకు రెన్యూవబుల్ మినిస్ట్రీ గతంతో పోలిస్తే ఎక్కువగా నిధులను కేటాయించిందని.. ఎకరాకు 7 వేల రూపాయల చొప్పున కేంద్రం పీఎం కుసుమ్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పీఎం కుసుమ్ యోజన స్కీమ్ ద్వారా రైతులు సోలార్ ప్యానెల్స్ ను సబ్సిడీ ధరకే పొందే అవకాశం ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ ను కొనుగోలు చేయడం ద్వారా రైతులు సొంతంగా ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవచ్చు.

సోలార్ ప్యానెల్స్ ను అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు అదనపు విద్యుత్ ను విక్రయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 20 లక్షల మంది రైతులు పీఎం కుసుమ్ యోజన స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకొని ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందుతుండటం గమనార్హం. కేంద్రం బడ్జెట్ లో క్రాప్ డైవర్సిఫికేషన్ స్కీమ్ ను అమలులోకి తెచ్చి ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎకరాకు 7 వేల రూపాయల చొప్పున ఇవ్వనుందని తెలుస్తోంది.

మోడీ గడ్డం పెంచడం వెనుక కారణం ఏమిటో తెలుసా?

ఒకప్పుడు నీటిగా గడ్డం తీయించుకొని ఎంతో చక్కగా అందంగా కనిపించే వారు. కానీ ప్రస్తుతం గడ్డం పెంచడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.అయితే ఈ కరోనా మహమ్మారి దేశంలోకి వ్యాపించడంతో ఒక్కసారిగా అందరి జీవనశైలిలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా రాకముందు వరకు ఎంతో స్టైల్ గా వివిధ రకాల కటింగులు, షేవింగ్ లో చేయించుకొని తిరిగేవారు. కరోనా దెబ్బకు ఏదో తోచిన విధంగా షేవింగ్ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి మన ప్రధానమంత్రి సైతం గడ్డం పెంచుకోవడం అందరిలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ దాదాపు పది నెలల నుంచి క్షవరం, గడ్డం పెంచు కోవడం వల్ల అందరిలో పలు అనుమానాలు తలెత్తాయి.కరోనా మహమ్మారి సైతం ఏకంగా ప్రధానమంత్రి జీవనశైలిని కూడా మార్చేసింది అంటూ పలువురు కామెంట్లు చేశారు. దాదాపు పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ప్రధాన మంత్రి గడ్డం పెంచడం వెనుక రామమందిర నిర్మాణం ఉందని పలువురు తెలియజేస్తున్నారు.

గత కొన్ని నెలల క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేశారు. అదేవిధంగా ఆలయ నిర్మాణ బాధ్యతను పూర్తి చేసే క్రమంలో నరేంద్రమోడీ ఉన్నారని ఉడుపి పెజావర పీఠాధిపతి స్వామి విశ్వప్రసన్న తీర్థ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విధమైన చారిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో కేశాలు కత్తిరించరని పీఠాధిపతి తెలిపారు. ఈ తరహాలోనే నరేంద్రమోడీ కూడా జుట్టు, గడ్డం కత్తిరించుట పోవడానికి కారణం కూడా ఇదే కావచ్చని తాజాగా కర్ణాటకలోని బాగల్కోటెలో ఉడుపి పెజావర పీఠాధిపతి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

మోదీ సర్కార్ ఇస్తున్న రూ.10,000 రుణం తీసుకోలేదా.. ఏం చేయాలంటే..?

కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంతో పోలిస్తే ఆదాయం తగ్గడంతో అప్పులపై ఆధారపడుతున్నారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అలా అమలు చేస్తున్న పథకాల్లో పీఎం స్వనిధి స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్నవారు కేంద్రం నుంచి 10,000 రూపాయల రుణం పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా అర్హత ఉన్న వీధి వ్యాపారులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉంటే కేంద్రం ఖాతాలలో నగదును జమ చేస్తోంది. ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పేరుతో అమలవుతున్న ఈ స్కీమ్ కోసం అర్హత పొందాలంటే ఇంటి నుంచే సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

https://pmsvanidhi.mohua.gov.in/ వెబ్ సైట్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లోన్ తీసుకున్న వీధి వ్యాపారులు క్రమం తప్పకుండా లోన్ ను చెల్లించడంతో పాటు ఈ.ఎం.ఐ కట్టడం ద్వారా వడ్డీరేటులో సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థలు ఇచ్చే ఐడెంటిటీ కార్డ్ ఉన్నవాళ్లే ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 12 ఈఎంఐల రూపంలో 9 శాతం వడ్డీతో ఈ రుణాలను తిరిగి చెల్లించాలి.

పీఎం స్వనిధి వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. లోన్ సక్రమంగా చెల్లించిన వీధి వ్యాపారులు 1200 రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. సక్రమంగా చెల్లించిన వారు మళ్లీ ఈ స్కీమ్ ద్వారా రుణం తీసుకునే అర్హత పొందుతారు.

రైతులకు లక్షాధికారులను చేస్తున్న బియ్యం ఇవే.. కిలో ఎంతంటే..?

సాధారణంగా కిలో బియ్యం ఎంత అనే ప్రశ్నకు ఎవరైన 30 రూపాయల నుంచి 50 రూపాయల ఖరీదు చేస్తుందని చెబుతారు. అయితే కృష్ణ బియ్యం మాత్రం ఏకంగా కిలో 300 రూపాయల నుంచి 400 రూపాయలు పలుకుతుంది. ఈ బియ్యాన్ని పండించిన రైతులు కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో కృష్ణ బియ్యం బలవర్ధక ఆహారంగా పేరు తెచ్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బియ్యం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అనేక రైతు కుటుంబాలు కృష్ణ బియ్యం పండించడం ద్వారా సంపన్న కుటుంబాలుగా మారాయని మోదీ అన్నారు. వారణాసి పర్యటనలో భాగంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన అత్యాధునిక మౌలిక వసతుల వల్ల రైతులు కృష్ణబియ్యం పండించగలుగుతున్నారని మోదీ అన్నారు. చంద్రోలి రైతుల గురించి మాట్లాడుతూ కృష్ణబియ్యంలో ఒక రకాన్ని చంద్రోలి రైతులు పండించారని అన్నారు.

కృష్ణబియ్యం పండించిన రైతుల కొరకు ప్రత్యేక సమితిని ఏర్పాటు చేయడంతో పాటు మార్కెట్ కూడా సిద్ధం చేశామని అన్నారు. విదేశీ మార్కెట్ లో సైతం కృష్ణవ్రీహీ బియ్యంకు మంచి డిమాండ్ ఉంటుందని ఆస్ట్రేలియాకు కిలో 850 రూపాయల చొప్పున ఈ బియాన్ని ఎగుమతి చేస్తున్నామని మోదీ అన్నారు. ఈ బియ్యం ప్రాచీన వరి వంగడమని మోదీ అన్నారు. కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ సుశృత సంహితలో కృష్ణ వ్రీహీ బియ్యం గురించి ప్రస్తావించారని అన్నారు.

కృష్ణ బియ్యం అతి ప్రాచీన రకాల్లో ఒకటని ఈ బియ్యం పండించిన రైతులు చెబుతున్నారు. యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఈ బియ్యాన్ని ప్రాచీన కాలంలో ఎక్కువగా వినియోగించేవారని రైతులు చెబుతున్నారు. కృష్ణ బియ్యం జీవోత్పత్తి వ్యవస్థను పెంపొందించటంలో సహాయపడతాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్..?

ప్రధాన నరేంద్ర మోదీ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్య తరగతి ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరిన వాళ్లకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను సైతం కల్పించడానికి సిద్ధమవుతోంది. రాబోయే బడ్జెట్ ద్వారా కేంద్రం ఈ నిర్ణయాన్ని అమలు చేయనుందని సమాచారం అందుతోంది.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సుప్రతిం బంద్యోపాద్యాయ్ మాట్లాడుతూ కేంద్రం మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి పన్ను మినహాయింపు ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని.. కంపెనీ కంట్రిబ్యూషన్ ‌కు ఇది వర్తిస్తుందని తెలిపారు. అయితే కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉధ్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరనుందని సమాచారం.

సుప్రతిం బంద్యోపాద్యాయ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ కు సంబంధించి 14 శాతం కంట్రిబ్యూషన్‌‌ పై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రానికి కంపెనీలకు కూడా రాయితీ ప్రయోజనాలను కల్పించాలని సూచనలు చేస్తామని తెలిపారు. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఉద్యోగులకు సైతం పన్ను మినహాయింపు ప్రయోజనాలను కల్పించాలని సూచనలు చేస్తున్నాయి.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్ 2 అకౌంట్ కు సైతం ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రతి సబ్ స్క్రైబర్ కు ఈ ప్రయోజనం కల్పించనుందని తెలుస్తోంది.

కరోనా మహమ్మారి గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ ఎక్కువగా ఉంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేంత వరకు పోరాటం తప్పదని చెప్పారు. దేశంలో లాక్ డౌన్ పోయినా కరోనా వైరస్ ముప్పు మాత్రం పోలేదని కామెంట్లు చేశారు. భారత్ మహమ్మారిపై పోరాటం చేస్తుందని.. దేశంలో రికవరీ రేటు బాగుందని మోదీ అన్నారు.

ప్రజలు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని బయటకు వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. దేశంలో 2 వేల ల్యాబులు కరోనా పరీక్షల కోసం పని చేస్తున్నాయని తెలిపారు. మరికొన్ని రోజుల్లో పండుగలు రాబోతున్నాయని.. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఒక మిలియన్ జనాభాలో 5,500 మంది కి వైరస్ నిర్ధారణ అయిందని మోదీ పేర్కొన్నారు.

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య త్వరలో పది కోట్లు దాటబోతుందని మోదీ అన్నారు. వైద్య వ్యవస్థ ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం కోసం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. నర్సులు, వైద్య సిబ్బంది, వైద్యులు సేవా భావంతో కరోనా వైరస్ చికిత్స కోసం పని చేశారని చెప్పారు. వైరస్ తగ్గుముఖం పట్టిందని భావిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

వ్యాక్సిన్ కోసం వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. రాత్రీపగలు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నారని.. దేశంలో చివరి వ్యక్తికి వ్యాక్సిన్ అందే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని.. నిర్లక్ష్యం చేస్తే జీవితాలు ప్రమాదాలు పడతాయని తెలిపారు.

మోదీ కోసం ఎయిర్ ఇండియా వన్ విమానం.. ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..?

సాధారణంగా విదేశాలలో అధ్యక్ష హోదాలో ఉన్నవారు, వీవీఐపీలు ప్రత్యేకంగా అన్ని వసతులతో, రక్షణాపరమైన సమస్యలు లేని విమానాలలో ప్రయాణిస్తుంటారనే సంగతి తెలిసిందే. అలా మన దేశంలోని వీవీఐపీలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నో ప్రత్యేకలతో తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ విమానం మన దేశానికి చేరుకుంది. పౌర విమానయాన శాఖ అధికారులు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు టెక్సాస్ నుంచి ఢిల్లీకు ఈ విమానం చేరుకుందని వెల్లడించారు.

దేశానికి చేరుకున్న ఈ ప్రత్యేక విమానం ద్వారానే ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇతర దేశాలకు ప్రయాణం చేయనున్నారు. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థను కలిగి ఉన్న ఈ విమానంలో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి క్షిపణి దాడులనైనా ఈ విమానం తట్టుకోగలదు. ఈ విమానంలో ఆకాశంలో విహరిస్తూనే సులువుగా ఆడియో, వీడియో కమ్యూనికేషన్ చేయవచ్చు.

డల్లాస్ లో తయారైన బోయింగ్ 777 విమానాన్నే ప్రధాని వాడనున్నారు. కేంద్రం రెండు విమానాలను కొన్ని నెలల క్రితమే ఆర్డర్ చేయగా జులైలో ఈ విమానాలు భారత్ కు రావాల్సి ఉంది. అయితే కరోనా, లాక్ డౌన్, ఇతర సమస్యల వల్ల ఈ నెలలో భారత్ కు చేరుకుంది. రెండు మూడు రోజుల్లో మరో విమానం భారత్ కు చేరుకోనుందని తెలుస్తోంది. ఈ విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే ఈ విమానంలో సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ సూట్స్‌ (ఎస్‌పీఎస్‌), లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రేర్డ్‌ కౌంటర్‌మెజర్స్‌ (ఎల్‌ఏఐఆర్‌సీఎం) ఉన్నాయి.

ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుని విమానంలో మాత్రమే ఎస్‌పీఎస్ ఉండగా ఆ ఘనత సాధించిన మరో విమానంగా ఎయిర్ ఇండియా వన్ గుర్తింపు తెచ్చుకుంది. గంటకు 900 మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానంలో ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేయవచ్చు. ఫ్లయింగ్‌ కమాండ్‌ సెంటర్‌ లా పని చేసే ఈ విమానంలో ప్రధాని కార్యాలయంతో పాటు సమావేశాల నిర్వహణ కోసం పెద్ద హాల్ ఉంది.

భారత వాయుసేన పైలెట్లు నడిపే ఈ విమానాల తయారీకి 8,400 కోట్ల రూపాయలు ఖర్చైంది. ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్ విమానాల బాధ్యతలను నిర్వర్తించనుంది. ఈ విమానానికి గాలిలో ఇంధానాన్ని నింపే సామర్థ్యం కూడా ఉండటం గమనార్హం.