Tag Archives: politics

Mohan Babu: రాజకీయాలకు నేను పనికిరాను… నన్ను మోసం చేశారు… రాజకీయాలపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!

Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ ప్రస్థానం గురించి మనకు తెలిసిందే. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో అంచలంచలగా ఎదుగుతూ వచ్చారు. ఇలా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా విలక్షణ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు మరోవైపు విద్యాసంస్థలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే మార్చి 19వ తేదీ మోహన్ బాబు తన 71వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు తన సినీ రాజకీయ ప్రస్థానం గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా విలేఖరి మోహన్ బాబును ప్రశ్నిస్తూ..ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత మీకు ఏ విషయంలో రాజకీయాలపై విరక్తి కలిగించేలా చేసిందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ…

ప్రస్తుతం అదంతా ఆ ప్రస్తుతం… గతం గతః జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నేను కూర్చోలేను నన్ను రాజకీయాలలో మోసం చేశారు. అయితే నన్ను వాళ్లు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారని నేను చెప్పను. ఇక అన్నయ్య ఎన్టీఆర్ నన్ను ఆ కాలంలోనే రాజకీయాలలోకి రమ్మన్నారు. అయితే నేను ముక్కుసూటితనంగా వ్యవహరించే తీరు రాజకీయాలకు పనికిరాదని నేనే వెనక్కి తగ్గాను.

Mohan Babu: రాజకీయాలలో అందరూ ఇమడలేరు…

రాజకీయాలలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేయాలి. అప్పుడే మనం రాజకీయాలలో ముందుకు పోగలం లేదంటే రాజకీయ సన్యాసం తప్పనిసరి. ఇక ఈ రాజకీయాలలో అందరూ ఇమడలేరు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని,తనని ఎవరు రాజకీయాలలో వెనక్కి లాగలేదంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు రాజకీయాల గురించి చూసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Manoj -Mounika: మనోజ్ మౌనిక రాజకీయాలలోకి రానున్నారా.. అసలు వీరి వ్యూహం ఏంటి?

Manoj -Mounika: మంచు మనోజ్ మార్చ్ 3వ తేదీ భూమ మౌనిక మెడలో మూడు ముళ్ళు వేశారు. ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ విధంగా మౌనిక మనోజ్ వివాహం జరగడంతో వీరి భవిష్యత్తు గురించి అభిమానులు పలు రకాలుగా ఊహించుకుంటూ ఉన్నారు.మంచు మనోజ్ సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కాగా,భూమా మౌనిక మాత్రం రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఇలా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి మౌనికను వివాహం చేసుకున్నటువంటి మనోజ్ త్వరలోనే రాజకీయాలలోకి రాబోతున్నారని పలువురు భావిస్తున్నారు.

ఇలా ఎంతో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి భూమా మౌనికను వివాహం చేసుకున్న అనంతరం మనోజ్ తన భార్య మౌనికతో కలిసి రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి మనోజ్ మౌనిక ఎక్కడ ప్రస్తావించలేదు. అయితే మనోజ్ రాజకీయాల కన్నా సినిమాల పైన ఆసక్తి చూపుతున్నారనేది మరికొందరి వాదన.

Manoj -Mounika: మనోజ్ రాజకీయాలలో బిజీ కానున్నారా…

ఈయనకు సిని బ్యాక్ గ్రౌండ్ ఉండడమే కాకుండా సొంత నిర్మాణ సంస్థలు కూడా ఉండడంతో ఈయన సినిమా రంగంలోనే ఉంటారని మరికొందరు కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈయన మాత్రం తన రాజకీయ ప్రస్థానం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. బహుశా ముందు ముందు తన రాజకీయ ప్రస్థానం గురించి మనోజ్ మాట్లాడే అవకాశాలు కూడా ఉండవచ్చని సన్నిహితుల సమాచారం. ఇక ప్రస్తుతం ఈయన వాటి ది ఫిష్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన మాత్రం తన కెరీర్లో మంచి సక్సెస్ సాధించి బిజీగా ఉండాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Tarakaratna Wife: రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అలేఖ్య రెడ్డి… తారకరత్న కోరికను తీర్చబోతున్నారా?

Tarakaratna Wife: నందమూరి తారకరత్న మరణ వార్త నుంచి ఇంకా ఆయన కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు.ఇలా ఉన్నఫలంగా తారకరత్న గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఒక్కసారిగా తన కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ముఖ్యంగా తన భార్య అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

తారకరత్న బ్రతికున్నప్పుడు కూడా బాలయ్య అండదండలు తారకరత్నకు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన మరణం తరువాత తారకరత్న కుటుంబ బాధ్యతలను బాలయ్య తన భుజాలపై వేసుకున్నారు. ఇక తారకరత్న లేరనే వార్తను జీర్ణించుకోలేక అలేఖ్య రెడ్డి ఏకధాటిగా కంటతడి పెట్టడం అందరిని కలిచి వేస్తోంది.ఈ క్రమంలోనే ఆమెను ఈ బాధ నుంచి బయటకు తీసుకువచ్చి తనని తన జీవితంలో బిజీగా ఉంచడం కోసం బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారట.

అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ చంద్రబాబు నాయుడుతో కలిసి అలేఖ్య రెడ్డిని రాజకీయాలలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తారకరత్నకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే కోరిక ఉండేది అయితే తన కోరికను తన భార్య అలేఖ్య ద్వారా తీర్చబోతున్నారని తెలుస్తోంది.

Tarakaratna Wife: వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అలేఖ్య రెడ్డి…

ముందుగా అలేఖ్య రెడ్డిని ఈ బాధ నుంచి బయటకు తీసుకురావడం కోసం ఆమెకు తెలుగుదేశం పార్టీలో ఏదైనా మహిళ విభాగంలో ఒక పదవిని ఇప్పించాలని అనంతరం వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం లేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Posani krishna murali: ఏపీ ఎఫ్ డిసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నటుడు పోసాని!

Posani krishna murali: నటుడు పోసాని కృష్ణ మురళి తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా దర్శకుడిగా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న ఈయన రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వైయస్ఆర్సీపీ పార్టీకి తన మద్దతు తెలుపుతున్నారు.

ఇలా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో పార్టీకి ఈయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించిన ప్రభుత్వం పోసాని కృష్ణ మురళికి అరుదైన గౌరవాన్ని అందించింది ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిని ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APFDC) చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ క్రమంలోనే ఈయన APFDC చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పదవీ బాధ్యతలను చేపట్టారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా మాజీమంత్రి పేర్ని నాని నిర్మాత మండలి అధ్యక్షుడు.సి.కళ్యాణ్..మోహన్ వడ్లపట్ల వంటి తదితరులు పాల్గొన్నారు.

Posani krishna murali: సినిమా షూటింగ్లకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేస్తాం….

ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం పోసాని మాట్లాడుతూ.. త్వరలో ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ మరియు షూటింగ్స్ జరపడం కోసం కావాల్సిన సదుపాయాలన్నింటిని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పోసాని తెలియజేశారు. ఇలా జగన్ ప్రభుత్వంలో పోసానికి కీలక బాధ్యతలు ఇవ్వడంతో పలువురు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Pawan Kalyan: డైమండ్ రాణి అంటూ రోజాపై సెటైర్లు వేసిన పవన్ కళ్యాణ్…. వైరల్ అవుతున్న కామెంట్స్!

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో భాగంగా ఈయన వైసిపి మంత్రులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రోజా గురించి ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో రోజా మెగా బ్రదర్స్ ప్రజలకు సహాయం చేయకపోవడం వల్లే సొంత జిల్లాలలో కూడా ఓడిపోయారంటూ కామెంట్లు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ యువ శక్తి కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ రోజాకు కౌంటర్ ఇచ్చారు. తాను ఒంటరిగానైనా పోరాడే శక్తి తనకు ఉం.ది అయితే తనకు గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే పొత్తు పెట్టుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని లేకపోతే ఒంటరిగానైనా పోరాడటానికి తాను ఏ మాత్రం వెనకాడనని పవన్ కళ్యాణ్ తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న గుండాలు రౌడీలను ఎలా తన్నాలో తనకు బాగా తెలుసని రెండు ముక్కలైన ఈ రాష్ట్రాన్ని మరో మూడు ముక్కలు చేయాలనే కుట్రలు ప్రయత్నాలను ఆపుతానని పవన్ తెలిపారు.ఇక రోజా గురించి ప్రస్తావిస్తూ ఆమెను డైమండ్ రాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా చివరికి ఆ రోజాతో కూడా మాటలు పడాల్సి వస్తుంది.ఛీ నా బతుకు చెడ అంటూ పవన్ కళ్యాణ్ రోజాపై కామెంట్లు చేశారు.

Pawan Kalyan: ఎదవలు సన్నాసులతో కూడా తిట్టించుకోవాల్సి వస్తుంది…

ప్రజల కోసం ఇలాంటి డైమండ్ రాణిలతో కూడా తిట్టించుకోవాల్సి వస్తుందని ఈయన వెల్లడించారు.గత కొన్ని సంవత్సరాల నుంచి ఎదవలు సన్నాసులతో కూడా తాను తిట్టించుకోవలసి వస్తుందని అయితే సాటి మనుషుల కోసం జీవించడం గొప్ప విషయంగా భావిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Taraka Ratna: సినిమాలలో మాదిరి కాకుండా రాజకీయాలలోనైనా తారక్ సక్సెస్ సాధించేనా?

Taraka Ratna: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో హీరోగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్నారు.అయితే ఈయన రాజకీయ వారసులుగా నందమూరి కుటుంబ సభ్యులు కాకుండా నారావారి కుటుంబ సభ్యులు పార్టీ పగ్గాలను తమ చేతిలోకి తీసుకున్నారు.

అయితే నందమూరి వారసులు మాత్రం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలోకి కూడా వెళ్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ఒకవైపు సినిమాలు మరోవైపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మరొక నందమూరి వారసుడు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తనవంతు కృషి చేయనున్నట్లు తెలుస్తుంది.నందమూరి హీరోగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన తారకరత్న సినిమాలలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈయన వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికలలో పోటీకి దిగి పార్టీ విజయానికి కృషి చేయనున్నట్లు సమాచారం. అయితే ఈయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారనే విషయంలో స్పష్టత లేకపోయినా టిడిపికే అనుకూలంగా ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.

Taraka Ratna: వచ్చే ఎన్నికలలో పోటీకి సై అంటున్న తారకరత్న..

ఇక ఈయన వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా పోటీ చేస్తారని ఇందులో భాగంగానే ఈయన నారా లోకేష్ ను కలిసి పార్టీ వ్యవహారాల గురించి ప్రస్తావించినట్టు తెలుస్తోంది.ఇక గత కొద్ది రోజుల క్రితం తారకరత్న ఎన్టీఆర్ కూడా సరైన సమయానికి పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారని చేసినటువంటి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన ఎన్నికలలో పోటీకి దిగబోతున్నారని తెలియడంతో అభిమానులు సినిమాలలో సక్సెస్ సాధించకపోయినా కనీసం రాజకీయాలలో అయినా సక్సెస్ సాధిస్తారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Director Bobby: చిరంజీవి రాజకీయాలకు పనికిరారు… అందుకు పవన్ మాత్రమే సరైనోడు… డైరెక్టర్ బాబీ కామెంట్స్ వైరల్!

Director Bobby: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మంచు గుర్తింపు పొందిన డైరెక్టర్ బాబి తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైజాగ్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ బాబి చిరంజీవి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ చిరంజీవి అన్నయ్యకు రాజకీయాలు ఏమాత్రం పనికిరావని తెలిపారు. ఆయనకు దేవుడు ఒక తమ్ముడినీచ్చాడు. రాజకీయాలకు పవన్ సరైనోడనీ బాబి తెలిపారు.

చిరంజీవి గారు రాజకీయాలలో ఉండి ఎవరిని కూడా ఎదిరించి మాట్లాడలేరు కానీ చిరంజీవి గారిలో ఉన్న మంచితనం ఆవేశం కలిస్తే పవన్ కళ్యాణ్ ఆయన ఎవరికైనా ఎలాంటి సమాధానమైనా చెప్పగలరు. మాటకు మాట కత్తికి కత్తి అన్నట్లుగా ఉంటారని బాబి తెలిపారు.అయితే ఒకరోజు తాను మీరెందుకు రాజకీయాలలో ఇతరులను ఎదిరించలేరు అని అడిగినప్పుడు వాళ్లకు కూడా అమ్మ నాన్నలు అక్కచెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్లు బాధపడతారని ఎంతో సౌమ్యంగా అన్నయ్య ఒకరోజు నాతో చెప్పారని బాబి గుర్తు చేసుకున్నారు.

Director Bobby: రవితేజ అవకాశం ఇవ్వడం వల్లే ఈ స్థాయిలో ఉన్నా….

ఇక చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలో తన ప్రస్థానం మొదలైంది. ఇండస్ట్రీలోకి వచ్చిన 20 సంవత్సరాలకు ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమని తెలిపారు. ఇక నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు గల కారణం రవితేజ.ఆయన నన్ను నమ్మి సినిమా ఇవ్వడం వల్లే డైరెక్టర్ గా నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని ఈ సందర్భంగా బాబీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi: నా తమ్ముడిని తిట్టిన వాళ్లే నన్ను వాళ్ళింటికి పెళ్లిళ్లకు ఆహ్వానిస్తున్నారు… చిరంజీవి కామెంట్స్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన సినిమా గురించి ఎన్నో విషయాలను ప్రస్తావించడమే కాకుండా కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకుంటున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రస్తావించడమే కాకుండా ఈయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ రాజకీయ పరిణామాలకు కూడా కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి మాట్లాడుతూ..సినిమా రంగంలో కోట్లు సంపాదించే అవకాశం ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలలోకి వెళ్లారని తెలిపారు.

ఇలా రాజకీయాలలోకి ప్రజాసేవ చేయడం కోసం వెళ్ళిన పవన్ కళ్యాణ్ ను చాలా మంది అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించి తిడుతున్నారు.అలా నా తమ్ముడిని తిట్టిన వాళ్లే నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు నన్ను ఆహ్వానిస్తున్నారని ఈయన తెలియజేశారు.

Chiranjeevi: అలా ఆహ్వానించడం బాధగా అనిపిస్తుంది…

ఇలా పవన్ ను తిట్టి నన్ను శుభకార్యాలకు ఆహ్వానించడం నాకు చాలా బాధగా ఉంటుందని చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చిరంజీవి రాజకీయ నాయకులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేదా సినీ ఇండస్ట్రీలో కొందరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న విషయం గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. ఏది ఏమైనా చిరు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: పవన్ వెంట సంచరిస్తున్న అనుమానాస్పద వ్యక్తులు.. అర్ధరాత్రి గొడవకు దిగిన యువకులు?

Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే కాకుండా జనసేన అధినేతగా రాష్ట్ర రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.సాధారణంగా రాజకీయాలలో ప్రతి ఒక్కరికి ఎంతో మంది శత్రువులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పట్ల కూడా పెద్ద ఎత్తున శత్రువులు ఉన్నారని ఆయన ప్రాణాలకు హాని ఉందంటూ జనసేన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pawan kalyan: పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న ఉంగరం ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ కి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ ప్రతి కదలికలను గుర్తుతెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారు అంటూ పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న వాహనం వెంట కొంతమంది వ్యక్తులు ఆయనని అనుసరిస్తూ అతని కదలికలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇలా ఆయన వెంట వెళ్లే వారంతా ఆయన అభిమానులు కాదంటూ నాదెండ్ల మనోహర్ తెలియ చేశారు.

Pawan Kalyan: పవన్ ఇంటి ముందు గొడవకు దిగిన యువకులు…

సోమవారం అర్ధరాత్రి సమయంలో కొందరి యువకులు ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కారును ఆపి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవ పడ్డారని ఈయన వెల్లడించారు. ఇలా పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సిబ్బందిని తీవ్ర అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా వారిపై గొడవకు దిగడంతో తప్పనిసరి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు నెంబర్లను గుర్తించి ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Chiranjeevi: బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అమ్ముకుంటున్నానని ఆరోపణలు చేశారు.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా రాజకీయ నాయకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా విజయదశమి సందర్భంగా విడుదల అయి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే చిరంజీవి తాజాగా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఎన్నో విషయాలను తెలియజేశారు.గాడ్ ఫాదర్ సినిమా విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబట్టిన రోజే నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బండారు దత్తాత్రేయ గారి నుంచి ఆహ్వానం అందిందని ఇలా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి తెలియచేశారు.

ఇక ఇండస్ట్రీలో హీరోలు వారి అభిమానుల గురించి కూడా మాట్లాడారు సాధారణంగా ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానుల మధ్య విభేదాలు ఉంటాయి. కానీ హీరోల మధ్య విభేదాలు ఉండకూడదని తెలియజేశారు.తన సినిమా మంచి విజయం సాధిస్తే తప్పకుండా ఇండస్ట్రీలో అందరిని పిలిచి భోజనాలు పెట్టే వాడినని చిరంజీవి పేర్కొన్నారు. ఇక పాలిటిక్స్ లోకి వెళ్లిన తనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని తెలియజేశారు.

Chiranjeevi: ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నా…

ఈయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అనంతరం తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాను రాజకీయాలలోకి వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అమ్ముకుంటున్నానని ఆరోపణలు కూడా చేశారు. అయితే నేనెప్పుడూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు మాటకు లొంగనివాడు హృదయ స్పందనకు లొంగుతాడని చిరంజీవి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.