Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన సినిమా గురించి ఎన్నో విషయాలను ప్రస్తావించడమే కాకుండా కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకుంటున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రస్తావించడమే కాకుండా ఈయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ రాజకీయ పరిణామాలకు కూడా కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి మాట్లాడుతూ..సినిమా రంగంలో కోట్లు సంపాదించే అవకాశం ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలలోకి వెళ్లారని తెలిపారు.
ఇలా రాజకీయాలలోకి ప్రజాసేవ చేయడం కోసం వెళ్ళిన పవన్ కళ్యాణ్ ను చాలా మంది అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించి తిడుతున్నారు.అలా నా తమ్ముడిని తిట్టిన వాళ్లే నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు నన్ను ఆహ్వానిస్తున్నారని ఈయన తెలియజేశారు.
ఇలా పవన్ ను తిట్టి నన్ను శుభకార్యాలకు ఆహ్వానించడం నాకు చాలా బాధగా ఉంటుందని చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చిరంజీవి రాజకీయ నాయకులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేదా సినీ ఇండస్ట్రీలో కొందరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న విషయం గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. ఏది ఏమైనా చిరు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…