Movie News

Krishna Vamshi: మరోసారి విడాకుల వార్తలపై ఘాటుగా స్పందించిన డైరెక్టర్ కృష్ణ వంశీ… శాడిస్ట్ పనులంటూ కామెంట్స్!

Krishna Vamshi: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ చాలా తక్కువ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణతో రంగమార్తాండ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.

త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు అదే విధంగా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.గత కొంతకాలంగా రమ్యకృష్ణ కృష్ణవంశీ విడాకులు తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ విడాకులు వార్తలను కృష్ణవంశీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు.

తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి విడాకుల ప్రస్తావన రావడంతో కృష్ణవంశీ ఈ విషయం గురించి మాట్లాడుతూ నేను రమ్యకృష్ణ విడివిడిగా ఉంటున్నాం అయితే వృత్తిపరమైన విషయాల వల్ల తను చెన్నైలోనూ నేను హైదరాబాదులోనూ ఉంటున్నాము తప్ప మా ఇద్దరికీ ఎలాంటి మనస్పర్ధలు లేవని మేము విడాకులు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

Krishna Vamshi: వృత్తిపరంగా ఇద్దరం విడిగా ఉంటున్నాం…

ఇలా మేమిద్దరం విడాకులు తీసుకున్నామంటూ వార్తలు రావడం చాలా బాధాకరం. ఇలాంటి వార్తలను రాసిన వారిని చూస్తే చాలా పాపం అనిపిస్తుంది. రాయడానికి ఇంతకన్నా ఎక్కువగా ఆలోచించలేకపోతున్నారా అనిపిస్తుందని ఇలాంటి పనులన్నీ చాలా శాడిస్ట్ పనులంటూ ఈ సందర్భంగా కృష్ణవంశీ మరోసారి తన విడాకుల వార్తలపై స్పందించి ఘాటుగా రిప్లై ఇచ్చారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago