Movie News

Devi Sri Prasad: పాటలు బాలేదని ట్రోలింగ్ కు గురై అనంతరం హిట్ అందుకున్న దేవిశ్రీ సాంగ్స్ ఇవే!

Devi Sri Prasad: తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దేవి శ్రీ ప్రసాద్ గురించి మనకు సుపరిచితమే ఈయన తన సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక దేవి అందించే సంగీతానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.

ఇకపోతే దేవిశ్రీప్రసాద్ ట్యూన్ అందించిన కొన్ని పాటలు మొదట్లో బాలేవని పెద్ద ఎత్తున ట్రోలింగుకు గురయ్యాయి. కట్ చేస్తే ఆ పాటలు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. మరి దేవి శ్రీ ప్రసాద్ ఏ పాటల కారణంగా ట్రోలింగ్ ఎదుర్కొని అనంతరం ఆ పాటలతో హిట్ కొట్టారనే విషయానికి వస్తే..

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు:చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలోని ఈ పాట మొదట్లో భారీగా ట్రోల్స్ ఎదుర్కొంది. అనంతరం సూపర్ హిట్ గా నిలిచింది.

సామి..సామి: పుష్ప సినిమాలో రష్మిక అల్లు అర్జున్ డాన్స్ చేసిన సామీ సామి అనే పాట మొదట్లో ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చడం లేదు ఈ పాట విన్నటువంటి ప్రేక్షకులు మాకు ఇదేం కర్మరా సామి అని దేవిని ట్రోల్ చేశారు. కట్ చేస్తే ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే ఇదే సినిమాలో ఉ అంటావా మామ సాంగ్ కూడా మొదట్లో ట్రోలింగ్స్ ఎదుర్కొని అనంతరం సూపర్ హిట్ గా నిలిచింది.

మైండ్ బ్లాక్: మహేష్ బాబు రష్మిక జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ అనే సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత పెద్దగా ఎవరికి నచ్చలేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఈ పాట సూపర్ హిట్ అయింది. ఇక ఇదే సినిమాలోని హీ ఈజ్ సో క్యూట్ అనే పాట కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ సినిమా విడుదల అయ్యే సమయానికి ఎంతో ఆదరణ సంపాదించుకుంది.

Devi Sri Prasad:

బుల్లెట్ సాంగ్: రామ్ హీరోగా నటించిన దివారియర్ సినిమాలోని కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ అనే పాట మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తర్వాత ఎక్కడ చూసిన ఇదే పాటకు రీల్స్ చేస్తూ ఈ పాటను బ్లాక్ బస్టర్ చేశారు.

బాసు పార్టీ: చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ ఐటెం నెంబర్ మొదట్లో దేవి వాయిస్ లో వచ్చిన లైన్స్ నువ్వు షార్ట్ ఏసుకో, నువ్వు ప్యాంటు ఏసుకో, లైన్స్ ని ఫుల్ ట్రోల్ చేశారు. మొత్తం సాంగ్ విడుదలయ్యేసరికి ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

16 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

16 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago