Movie News

Sudigali Sudheer: మల్లెమాలవారు సుదీర్ ను రానివ్వడం లేదా…. ఆది మాటలకు అర్థం అదేనా?

Sudigali Sudheer: బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా తన కెరియర్ ప్రారంభించారు. అనంతరం తన టాలెంట్ తో టీం లీడర్ గా ఎదిగారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో అంచలంచలుగా ఎదుగుతూ బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నారు సుడిగాలి సుదీర్.

Hyper Aadi -Sudigali Sudheer: ఆ విషయంలో హైపర్ ఆది.. సుధీర్ నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందా?

ఇలా ఈయనకు బుల్లితెరపై ఎంతో మంచి క్రేజ్ రావడంతో ఏకంగా వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన సుధీర్ ఏ సినిమా పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి అయితే గత ఏడాది ఈయన నటించిన గాలోడు సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.

ఇలా ఈ సినిమా మంచి హిట్ అవడంతో సుధీర్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈయన సినిమాలతో బిజీగా ఉండటం వల్లే జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన సుధీర్ తాను మల్లెమాల వారితో అనుమతి తీసుకునే బయటకు వచ్చానని త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తానని చెప్పారు.అయితే ఈ మాట చెప్పి దాదాపు రెండు మూడు నెలలు అవుతున్న సుధీర్ ఇంకా జబర్దస్త్ కార్యక్రమంలోకి రాలేదు.

Sudigali Sudheer: సుధీర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టిన మల్లెమాల…


ఇకపోతే తాజాగా హైపర్ ఆది చేసిన కామెంట్స్ కనుక చూస్తుంటే మల్లెమాల వారి కార్యక్రమాలలో పాల్గొనడం కోసం వారిని సుదీర్ బ్రతిమలాడుతున్నట్టు తెలుస్తోంది.ఓ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది రష్మితో మాట్లాడుతూ మీవాడు తిరిగి రావాలని తెగ బ్రతిమలాడుతున్నాడు అంట కదా అంటూ కామెంట్ చేశారు.దీంతో మల్లెమాలవారు సుదీర్ఘ తమ కార్యక్రమాలలో పాల్గొనడానికి అంగీకరించలేదా తనకు నో ఎంట్రీ బోర్డు పెట్టారా అంటూ కామెంట్లు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సుదీర్ సినిమాలతో పాటు అహాలో ప్రసారమవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago