Ranaveer Singh: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రణవీర్, దీపికా పదుకొనే జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇద్దరు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారాలుగా కొనసాగుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వీరిద్దరూ కొంతకాలం ప్రేమలో ఉండి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ దంపతులు పలు కారణాల వల్ల పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంటున్నారు. ఇకపోతే రణవీర్ దీపిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రణవీర్ సింగ్ తన భార్య దీపికా పదుకొనేకు అద్భుతమైన కానుకను బహుమతిగా ఇచ్చారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన బాలీవుడ్ ఒకసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇంతకీ రణవీర్ దీపికా కు ఎలాంటి కానుక ఇచ్చారనే విషయానికి వస్తే…ఇప్పటికే వీరిద్దరు ముంబైలో పలు ప్రాంతాలలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. అయితే తాజాగా మరోసారి రణవీర్ దీపికా పదుకొనేకు మరొక కొత్త బంగ్లాను కానుకగా ఇచ్చారని సమాచారం.
ముంబైలో షారుక్ సల్మాన్ ఇంటికి సమీపంలో ఈయన ఈ బంగ్లాను కొనుగోలు చేసి దీపికా పదుకొనే ఇష్టాలకు అనుగుణంగా రణవీర్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలుస్తోంది. ఇలా అన్ని హంగులతో రూపొందించిన ఈ బంగ్లా ఖరీదు ఏకంగా 119 కోట్ల రూపాయలని తెలియడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…