Tag Archives: Prime Minister

Chinmayi: చిన్మయి దేశ ప్రధాని కావాలన్న నెటిజన్… వరెస్ట్ జాబ్ అంటూ రిప్లై!

Chinmayi:టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన అద్భుతమైన గాత్రంతో ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో మహిళల పట్ల జరిగే అన్యాయం, దాడుల గురించి ప్రశ్నిస్తూ మహిళలకు అండగా నిలుస్తున్నారు.

Chinmayi: చిన్మయి దేశ ప్రధాని కావాలన్న నెటిజన్… వరెస్ట్ జాబ్ అంటూ రిప్లై!

ఈ క్రమంలోనే ఎక్కడైనా మహిళల పట్ల దాడులు జరిగితే, వాటిపట్ల స్పందిస్తూ ఆ దాడులను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉంటారు.ఇలా మహిళలకు సపోర్ట్ గా ఉండడంతో ఎంతోమంది మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా వేదికగా తనతో పంచుకొని తన సలహాలు, సూచనలు తీసుకుంటారు.

Chinmayi: చిన్మయి దేశ ప్రధాని కావాలన్న నెటిజన్… వరెస్ట్ జాబ్ అంటూ రిప్లై!

ఇలా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే చిన్మయి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన ఫాలోవర్స్ తో లైవ్ సెషన్ పెట్టారు. ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు.

ప్రధాని కావడం ఈజీ కాదు…

ఇకపోతే ఓ మహిళ నెటిజన్ చిన్మయి దేశ ప్రధాని కావాలని కోరారు.మీలాంటి వాళ్లు ప్రధాని అయితే మాకు ఎంతో బాగుంటుందని కామెంట్ చేయడంతో ఆ విషయంపై స్పందిస్తూ దేశ ప్రధాని కావాలంటే మాటలు అనుకున్నావా? ఈ దేశంలో అత్యంత వరెస్ట్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది దేశ ప్రధాని కావడమే అంటూ చిన్మయి షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మాజీ ప్రధాని పీవీ నరసింహరావుపై వెబ్ సిరీస్.. ప్రకటన చేసిన స్టార్ ప్రొడ్యూసర్..?

భారతదేశానికి ఒక తెలుగు నాయకుడు ప్రధానిగా పని చేసిన మొదటి వ్యక్తి పీవీ నరసింహరావు. ఆ పదవిలో ఉన్న ఒకే ఒక్క తెలుగువాడు కావడం అందరికీ గర్వకారణం. అలాంటి ఈ లెజెండరీ లీడర్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది .

ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ ప్రకటన చేశారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు రావు బతికి ఉన్న సమయంలో.. ఆయన ప్రధానిగా దేశానికి చేసిన సేవలు తతితర విషయాలను ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలు భారతదేశ రూపురేఖలను మార్చాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వంటి అంశాలను ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అతడి జీవితంలో ఎన్నో మరపురాని విజయాలు ఉన్నాయి. ఆహా స్టూడియోస్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించిన అల్లు అరవింద్.. పీవీ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేశారు.

గతంలో వినయ్ సీతాపతి‘హాఫ్ లయన్’ పేరుతో పీవీ జీవిత కథను పుస్తకం రూపంతో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ పుస్తకం ఆధారంగా పీవీ బయోపిక్ ని వెబ్ సిరీస్ రూపంలో తీసుకు రాబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ ఝా దర్శకత్వం వహించనున్నారు . ఈ సిరీస్ తెలుగు , హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో అందుబాటులోకి రానుంది. దీనిలో నటించే వారి వివరాలు.. సాంకేతిక వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ప్రధానమంత్రి మోడీకి గిఫ్ట్ గా చీరను పంపిన పద్మ అవార్డు గ్రహీత..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత, బెంగాల్ ప్రముఖ చేనేత కార్మికుడు బిరేన్ కుమార్ బసక్ నరేంద్రమోడీకి చీరను బహుమతిగా ఇచ్చారు. ఆ చీర పై దేశపౌరులతో పాటు నరేంద్ర మోడీ బొమ్మను చిత్రీకరించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ చేనేత కార్మికునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

వెస్ట్ బెంగాల్ లోని నదియా ప్రాంతానికి చెందిన ఈయన భారత చరిత్ర సంప్రదాయాలను చీరలపై ఎంతో అద్భుతంగా ప్రతిబింబించేలా తయారుచేస్తారు. ఈ క్రమంలోనే ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడంతో ప్రధాన మంత్రిని కలిసిన సందర్భంలో బిరేన్ కుమార్ ప్రధానమంత్రికి ఈ చీరను బహూకరించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బీరెన్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం కోల్ కత్తాకి ట్రైన్లో వెళ్లి కలకత్తా వీధులలో తిరుగుతూ చీరలు అమ్మే వాళ్లమని అప్పట్లో ఒక చీర కేవలం 15 నుంచి 35 రూపాయల వరకు అమ్మే వాళ్ళని ఈ సందర్భంగా బిరేన్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఐదు వేలమంది కార్మికులతో తాను వ్యాపారం చేస్తున్నారని ఇందులో రెండు వేల మంది మహిళలు వారి స్వయం ఉపాధిని వెతుక్కునట్టు ఆయన తెలిపారు.

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ, ఆశా బోస్లే, లతా మంగేశ్కర్, సత్యజిత్ రే, హేమంత ముఖోపాధ్యాయ్ లాంటి వాళ్లందరూ తన కస్టమర్లని బీరేన్ పేర్కొన్నారు. ఇకపోతే ఈయన యూకే బెస్ట్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోవడమే కాకుండా
2013లో స్కిల్ అండ్ క్రాఫ్ట్ మన్ షిప్ కు నేషనల్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం మోడీకి బహూకరించిన ఈ చీరకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఫోన్ పే, గూగుల్ పే అవసరం లేదు.. నేరుగా వోచర్ల ద్వారానే డబ్బులు..

భారత్ లో ఎక్కువ శాతం డిజిటల్ చెల్లింపులే ఉన్నాయి. అందులో ప్రతీ ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మరో విధానాన్ని నేడు (ఆగస్టు 2) సాయంత్రం ప్రదాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వీటిని మరింత సులభతరం చేసే మరో సాధనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. దీనిలో ముఖ్యంగా ఒక క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ ద్వారా లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కి ఓ వోచర్ పంపిస్తారు. గూగుల్‌ పే, యూపీఐ, ఫోన్‌ పే, పేటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్ వంటి చెల్లింపు విధానాల వలే ఇ-రూపీ ఒక పేమెంట్‌ ప్లాట్‌ఫారం కాదు.

ఇది నిర్దిష్ట సేవలకు ఉద్దేశించిన ఒక వోచర్ మాత్రమే. బ్యాంకు ఖాతా, డిజిటల్ పేమెంట్ యాప్, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. వీటినే ఇ-రుపీగా భావిస్తారు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్‌ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ వోచర్ల లాంటివే. ఈ వోచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి ఎలాంటి బ్యాంక్, డిజిటల్ యప్ లాంటివి సపోర్ట్ లేకుండా ఉంటుంది. ఈ ఓచర్లను జారీ చేసేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఈ వోచర్లు కావాల్సిన వారు సదరు బ్యాంకులను సంప్రదించాలి. వారికి మనకు వచ్చే డబ్బు ఎంతో తెలియజేసి.. ఫోన్ నంబర్ తో సహా వివరాలను చెప్పాల్సి ఉంటుంది.

అక్కడి నుంచి ఆ వోచర్లు అవి ఇస్తున్న వారి పేరు మీదుగా నేరుగా లబ్ధిదారుడికి చేరిపోతాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఇవి ప్రయోజనకరంగా మారనున్నాయి. స్మార్ట్ ఫోన్ లేని వారు దానికి సంబంధించిన వోచర్ కోడ్ చెబితే రిడీమ్వ అయిపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు మనకు పంపించి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఎవరికి డబ్బులు చేరాలో వారి అకౌంట్లో పడిపోతాయి. ప్రస్తుతం అమెరికా విద్యావ్యవస్థలో ఈ- ఓచర్ల విధానం అమల్లో ఉంది. పేపర్ రూపంలో ఉన్న డబ్బును క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వవ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.