Tag Archives: pune

Posani Krishna Murali: మూడోసారి కరోనా బారిన పడిన పోసాని ఆస్పత్రికి తరలింపు!

Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కరోనా బారిన పడ్డారు. ఇదివరకే ఈయన రెండుసార్లు కరోనా బారిన పడగా తాజాగా ఈయన మూడో సారి కరోనా బారిన పడ్డారు.ఈయనకు కరోనా అని తెలియడంతో కుటుంబ సభ్యులు తనని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

ఓ సినిమా షూటింగ్లో భాగంగా పూణే వెళ్లినటువంటి పోసాని గురువారం హైదరాబాద్ చేరుకున్నారు.అయితే ఆయనకు ఒంట్లో బాగా లేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోక పాజిటివ్ అని తెలియడంతో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈయన మూడోసారి కరోనా బారిన పడటం గమనార్హం.


Posani Krishna Murali: ఆందోళనలో అభిమానులు


ప్రస్తుతం కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీల సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇలా పోసాని కరోనా బారిన పడ్డారని తెలియగానే పలువురు ఈయన క్షేమంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Renu Desai: టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ అలాంటి పాత్రలో నటించబోతున్నారా.. అసలు విషయం చెప్పిన నటి?

Renu Desai:రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటిగా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె పవన్ కళ్యాణ్ తో అదే సినిమాలో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్నారు.ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ నటించిన జానీ సినిమా తర్వాత ఈమె పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు.

ఇలా వెండితెరకు దూరమైనటువంటి ఈమె కొన్ని రోజులపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ అనంతరం పవన్ కళ్యాణ్ తో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా విడాకులు తీసుకున్న అనంతరం రేణు దేశాయ్ పూణేలో తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ అక్కడే ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పటివరకు ప్రారంభించలేదు.

ఈ క్రమంలోనే ఈమె రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇదిలా ఉండగా తాజాగా రేణు దేశాయ్ ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Renu Desai: అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కు కృతజ్ఞతలు…

ఈ సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో తాను హేమలత అనే పాత్రలో నటిస్తున్నానని తెలియజేయడమే కాకుండా తన పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా వెల్లడించారు. ఈ విధంగా ఈమె తన పాత్ర గురించి తెలియజేస్తూ హేమలత లవణంగారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నటించే అవకాశం తనకు కల్పించినందుకు దర్శకుడు వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు అంటూ ఈమె తన పాత్ర గురించి వెల్లడించారు. రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

కేరళలో మరో వైరస్ కలకలం.. ఆ పండు తినడం వల్లనే ఆ వైరస్ సోకుతుందా..?

కేరళలో మరో వైరస్ కలకలం రేపుతోంది. కరోనాతో ఇప్పటికే విలవిలలాడిన జనాలకు ఈ వైరస్ తో ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఆగస్టు 27 న కోజికోడ్ లోని చాత్తమంగళం పంచాయతీ పరిధిలోని ఓ 12 ఏళ్ల బాలుకి జ్వరం వచ్చింది. వాళ్లు మామూలు జ్వరం అనుకొని వారికి దగ్గరల్లో ఉన్న క్లినిక్ కు తీసుకెళ్లారు.

కానీ ఆ బాలుడికి జ్వరం తగ్గలేదు. తర్వాత వాళ్లు అక్కడ నుంచి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి చికిత్స ఇస్తున్నప్పటికీ జ్వరం మాత్రం తగ్గలేదు. చివరకు మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో అతడిని నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. బాలుడి పరిస్థితి విషమించడంతో.. ఆదివారం ఉదయం కన్నుమూశాడు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మరింతగా అప్రమత్తమైంది. వెంటనే వైద్య బృందంతో అతడు ఉంటున్న పరిసరాల్లోకి వెళ్లి పరిశీలించారు.

అతడి తల్లిదండ్రులు మాత్రం.. తన కుమారుడు రంబుటాన్ పండ్లను తినడం వల్లనే ఇలా జరిగిందని చెప్పారు. దీంతో వైద్యబృంద సభ్యులు బాలుడి ఇంటికి సమీప ప్రాంతాల్లో ఉన్న రంబుటాన్ పండ్లను నమునాలను సేకరించింది. తర్వాత అతడికి దగ్గరి కాంటాక్ట్ ఉన్న 8 మంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.

అతడితో ప్రైమరీ కాంటాక్ట్‌లుగా మొత్తం 251 మందిని వైద్య అధికారులు గుర్తించారు. వారిని నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. చాత్తమంగళం పంచాయతీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను నిర్భదంతో ఉంచి.. పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నారు అధికారులు. ఎప్పటికిప్పుడు ఆ బాలుడి కాంట్రాక్ట్ ట్రేసింగ్ లను గుర్తించే పనిలో ఉన్నామని.. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

వీడియో వైరల్: నడిరోడ్డుపై మెరిసే కత్తితో వ్యక్తిపై దాడి.. భయంతో పరుగులు పెట్టిన జనాలు!

పట్టపగలే నడిరోడ్డుపై ఓవ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. రోడ్డుపై ఎక్కువ రద్దీ లేకున్నప్పటికీ,ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ రోడ్డుపై ఓ వ్యక్తి తన మిత్రుడితో కలిసి మాట్లాడుతుండగా వెనుక నుంచి మరొక యువకుడు కత్తితో దాడి చేయడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ విధంగా వ్యక్తి దాడిచేసిన ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అవడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పుణెలోని పింప్రీ-చింద్వాడ రోడ్డు. చిఖాలీ ఏరియా. ప్రశాంతంగా ఉంది. ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై సరదాగా మాట్లాడుకుంటున్నారు. వీరితో పాటు ఓ కుర్రాడు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే రోడ్డుపై అటుగా వెళ్తున్న ఆకాష్.. అనే కుర్రాడు 4 అడుగుల ముందుకు వెళ్లి అక్కడ ఆగి తన సంచీలోంచి ఒక కత్తిని తీసి కనిఫ్ నాథ్ క్షీరసాగర్ పై దాడి చేశారు.

ఈ విధంగా సాగర్ పై దాడి జరగడంతో అక్కడ ఉన్నటువంటి యువకుడు, కుర్రాడు పరుగులు తీశారు. అదేవిధంగా సాగర్ కూడా పరుగులు తీయడంతో అశోక్ అతనిని వెంబడించినట్లు వీడియోలో రికార్డయింది. ఈ సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు ఆకాష్ ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

క్షీరసాగర్, ఆకాష్… పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. ఓ రోజు కొంతమంది యువకులు అందరూ కలిసి ఆకాష్ ను చితకబాదడంతో అతను అక్కడి నుంచి ఇళ్లను ఖాళీ చేసే సాగర్ పై పెంచుకొని ఈ విధంగా దాడికి ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పథకం ప్రకారమే ఆదివారం మధ్యాహ్నం సాగర్ పై దాడికి ప్రయత్నించాడని, ఆ దాడిలో కింద పడిన సాగర్ ను బండరాయితో కొట్టి ఆకాష్ చంపినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొత్త వేరియంట్స్ ను గుర్తించిన NIV.. మరింత ప్రమాదం?

గత ఏడాది ఎక్కడో చైనాలో ఊహాన్ ల్యాబ్ నుంచి బయటకు విడుదలైన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద అల్లకల్లోలం సృష్టించింది. ఇప్పటికే ఈ వైరస్ వివిధ రకాల ఉత్పరివర్తనాలు చెందుతూ వ్యాధి లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. ఈ క్రమంలోనే పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సరికొత్త వేరియంట్‌ను గుర్తించింది.

ప్రస్తుతం ఇండియాలో అధికంగా వ్యాపిస్తున్న  B.1.1.28.2 రకం బ్రెజిల్ నుంచి ప్రయాణికులు ద్వారా ఇండియాకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వేరియంట్ ఇండియాలో తీవ్రరూపం దాలుస్తూ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది..ఈ క్రమంలోనే బ్రెజిల్ నుంచి వచ్చిన ప్రయాణికుల జన్యు నమూనాలను సేకరించి విశ్లేషణ జరుపగా సరికొత్త వైరస్ ను గుర్తించినట్లు NIV తెలిపింది.

ఈ విధమైనటువంటి కొత్త వేరియంట్ తీవ్రమైన కరోనా లక్షణాలను కలిగించిందని ఈ వ్యాధి తీవ్రత అధికమవుతుందని నేపథ్యంలో టీకా సామర్థ్యాన్ని పరిరక్షించాలి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ అధ్యయనంలో భాగంగా మన ఇండియాలో వేస్తున్న టువంటి కొవాగ్జిన్ టీకా సామర్థ్యం గణనీయంగా ఉండటంతో మన శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి అధికంగా పెరుగుతుందని తెలిపారు.

ఈ విధమైనటువంటి కొత్త వేరియంట్ తీవ్ర వ్యాధికారకత సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా మార్పు చెందగలదని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే SARS-CoV-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియా పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే మనదేశంలో వేస్తున్నటువంటి కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలు రెండూ సమర్థంగా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలిందని నిపుణులు వెల్లడించారు.

మంత్రాలతో డబ్బులు వర్షం కురిపిస్తున్న మాంత్రికుడు.. చివరికి ఏమైందంటే?

ప్రస్తుతం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో కొందరు మోసగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బును లూటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజుకు దొంగ బాబాలు, మంత్రగాళ్లు ఎక్కువై పోతున్నారు.ఈ క్రమంలోనే ఓ మంత్రగాడు వారిని టార్గెట్ చేసుకుని అతని దగ్గర నుంచి ఏకంగా 52 లక్షల రూపాయలను లూటీ చేసిన ఘటన పూణేలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కిసాన్ పవార్ (45) అనే వ్యక్తి తాను మంత్రికుడినంటూ 2016లో ఓ వ్యాపారితో పరిచయం ఏర్పరచుకున్నారు. వ్యాపారి కనిపించిన ప్రతిసారి చిన్న చిన్న మ్యాజిక్ లుచేస్తూ వ్యాపారికి తనపై నమ్మకం పెంచుకున్నాడు. తనకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని, తను ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మించాడు. ఈక్రమంలోని తనకు తెలిసిన మంత్ర విద్యలు ద్వారా తనకున్న కష్టాలన్నీ తొలగిస్తానని చెబుతూ అప్పుడప్పుడూ ఆ వ్యాపారి నుంచి డబ్బులు లాగే వాడు.

ఈ క్రమంలోనే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఆ వ్యాపారి నుంచి డబ్బులు తీసుకోవాలని పథకం వేసిన కిసాన్ పవర్ అనే మంత్రగాడు తనకు మంత్రాలతో డబ్బులు వర్షం కురిపించడం తెలుసని వ్యాపారిని నమ్మించాడు. ఈ క్రమంలోనే ఆ మంత్రం తనకి నేర్పిస్తానని చెప్పి అతని దగ్గర నుంచి విడతలవారీగా 52 లక్షల రూపాయలను తీసుకున్నాడు. ఈ విధంగా డబ్బులు తీసుకున్న తర్వాత వారిద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి.

ఈ ఈ క్రమంలోనే ఆ వ్యాపారి మంత్రిగాడిని కలిసి తనకు మంత్రం నేర్పించాలనీ కోరినప్పుడు ఈరోజు రేపు అంటూ వాయిదా వేస్తూ తిరిగేవాడు.ఈ క్రమంలోనే ఒకరోజు వ్యాపారి తనకు మంత్రం నేర్పించాల్సింది అని గట్టిగా నిలదీయడంతో అందుకు మంత్రగాడు మంత్రం నేర్పించాలి అంటే తప్పనిసరిగా నరబలి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు. ఈ క్రమంలోనే అతనిపై అనుమానం రావడంతో ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలోనే పూణే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలో వ్యాపారి మాటలు విన్న పోలీసులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో అతను మంత్రగాడు కాదని, చిన్నచిన్న గారడీలు చేస్తే అమాయక ప్రజలను మోసం చేస్తూ వారి దగ్గర నుంచి డబ్బును లాగుతున్నాడు అని ఇటువంటి మోసగాళ్ల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని పుణె ఏసీపీ సురేంద్రనాధ్ దేవ్ ముఖ్ హెచ్చరించారు.

అబ్బాయి మెడలోను తాళి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

సాధారణంగా మన భారతదేశంలో పెళ్లైన స్త్రీలు మాత్రమే మెడలో తాళిని ధరిస్తారు. కానీ ఆ తాళిని మగవారు ధరించడం మీరు ఎప్పుడైనా చూసారా.ఏంటి తాళి మగవాళ్ళు ధరించడం అంటే అందరికీ మన తెలుగు సినిమా జంబలకడిపంబ గుర్తుకొస్తుంది. ఈ విధంగా సినిమాలలో మగవారు తాళిని వేసుకోవడం చూసాము కానీ నిజజీవితంలో ఆడవారు మాత్రమే తాళిని ధరిస్తారు.కానీ పుణేకు చెందిన ఓ జంట మాత్రం ఇందుకు భిన్నంగా వరుడు కూడా తాళిని ధరించి అందరిని ఆశ్చర్య పరిచాడు.

పుణేకు చెందిన ఓ జంటకు గత ఏడాది సెప్టెంబర్ నెలలో వివాహం జరిగింది. కాలేజీ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఇద్దరు ప్రేమించుకున్న ఈ జంట మహారాష్ట్ర పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయి మంగళ సూత్రం ధరించినప్పుడు తాను కూడా మంగళ సూత్రం ధరించడంలో ఏ మాత్రం తప్పులేదని భావించిన వరుడు తన మెడలో కూడా మంగళసూత్రం ధరించాడు.

ఈ విధంగా అమ్మాయి చేత తాళి కట్టించుకొన్న అబ్బాయి తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అబ్బాయిల పరువు మర్యాదను తుంగలో తొక్కారని కొందరు భావించగా, మరికొందరు పాపులర్ కావడానికి ఈ విధంగా చేశాడని భావించారు. కానీ ఈ మాటలన్నీ ఆ యువకుడు మాత్రం పట్టించుకోలేదు.

ఈ సమాజంలో అబ్బాయిలు అమ్మాయిలు సమానం అయినప్పుడు అమ్మాయిలు ధరించే తాళి అబ్బాయిలు ఎందుకు ధరించకూడదని వాదించాడు. అమ్మాయిలు భర్త క్షేమం కోసం తాళి ధరించినప్పుడు, భార్య క్షేమం కోసం భర్త తాళి ధరిస్తే తప్పేంటని ప్రశ్నించాడు. ఏదిఏమైనా ఈ జంట ఇద్దరు తాళి ధరించడం పట్ల కొందరు సానుకూలంగా ప్రవర్తిస్తే మరి కొందరు భావిస్తున్నారు.