Tag Archives: rgv

RGV-Perni Nani: పేర్ని నానితో ఆర్జీవీ భేటీ.. మీడియాతో ఆర్జీవీ ఏం మాట్లాడారంటే..!

RGV-Perni Nani: పవన్ కళ్యాణ్ తో మొదలైన టికెట్ల వ్యవహారం ప్రస్తుతం ఇంకా సాగుతూనే ఉంది. అప్పుడే పవన్ కళ్యాన్ కు సపోర్టుగా ఉండి ఉంటే.. ప్రస్తుతం ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు కదా అంటూ నానీ వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా థియేటర్ కంటే.. బయట కిరాణ కొట్టు నడుపుకునే వాడు ఎక్కువగా సంపాదించుకుంటున్నాడు అంటూ కామెంట్ చేయగా పెద్ద దుమారమే లేపింది.

RGV-Perni Nani: పేర్ని నానితో ఆర్జీవీ భేటీ.. మీడియాతో ఆర్జీవీ ఏం మాట్లాడారంటే..!

సినిమా టికెట్ రేట్ల ధరలు బాగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది సినీ ప్రముఖులు, సినీ పరిశ్రమ వ్యక్తులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్, నానీతో మొదలైన ఈ టికెట్ల వ్యవహారం ఆర్జీవీ దాకా వచ్చేసింది అయితే అతడు ప్రభుత్వ పెద్దలతో సై అంటే సై అన్నట్టుగా ట్విట్టర్ వేదికగా యుద్దాన్నే చేశాడు.

RGV-Perni Nani: పేర్ని నానితో ఆర్జీవీ భేటీ.. మీడియాతో ఆర్జీవీ ఏం మాట్లాడారంటే..!

ట్విట్టర్లో ఏపీ సినిమాటోగ్రఫీ మినిష్టర్ పేర్ని నానిని ఉద్దేశించి వరుస ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ కి పేర్ని నాని కూడా స్పందించారు. ట్విట్టర్ లో రెండు రోజులు వార్ జరిగిన తర్వాత ఆర్జీవీ కలవడానికి పేర్ని నాని అపాయింట్మెంట్ ఇచ్చారు. మూడు రోజుల క్రితమే ఇలా అపాంట్ మెంట్ వచ్చినట్లు ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ ప్రకటించాడు.


ఎంతో ఉత్కంఠ నెలకొంది..

జనవరి 10న ఉదయం ఆర్జీవీ హైదరాబాద్ నుంచి విజయవాడ విమానంలో వెళ్లి అక్కడి నుంచి కారులో అమరావతి సెక్రెటేరియట్ కి వెళ్లారు. అక్కడ నానీని కలిసిన తర్వాత ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు.
తాను ఇక్కడకు పరిశ్రమ తరఫున రాలేదని.. కేవలం ఒక ఫిల్మ్ మేకర్ గా కలవడానికి మాత్రమే వచ్చానన్నారు. పెద్దల కామెంట్స్, నాగార్జున వ్యాఖ్యలపై తాను స్పందించను అంటూ చెప్పుకొచ్చాడు. టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా.. సినీ రంగంతో నాకున్న 30ఏళ్ల ఎక్స్పీఎరియన్స్ తో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని నానిగారి దృష్టికి తీసుకొచ్చా అన్నారు. ఈ వ్యవహారంపై నా అభిప్రాయం చెప్పానని.. ఫైనల్ గా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు.

Sri Reddy: ఏపీ సీఎంను అనే ముందు నన్ను దాటి వెళ్లాలి…ఆర్జీవీపై శ్రీరెడ్డి ఫైర్..!

Sri Reddy: సినిమా టికెట్ రేట్ల విషయం టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య కాక రేపుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే.. సినీ హీరో నాని, సిద్దార్థ్ వంటి వారు ఈవిషయంపై స్పందించారు.

Sri Reddy: ఏపీ సీఎంను అనే ముందు నన్ను దాటి వెళ్లాలి…ఆర్జీవీపై శ్రీరెడ్డి ఫైర్..!

హీరో నాని ఏకంగా.. సినిమా థియేటర్ల కలెక్షన్లు, కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉంటున్నాయని.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని కూడా అంతే రీతిలో స్పందించాడు. ఇదిలా ఉంటే తాజాగా వివాదాస్పద, సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వం, టికెట్ రేట్లపై ట్విట్లతో అగ్నికి ఆజ్యం పోశాడు.

Sri Reddy: ఏపీ సీఎంను అనే ముందు నన్ను దాటి వెళ్లాలి…ఆర్జీవీపై శ్రీరెడ్డి ఫైర్..!

వరసగా ట్విట్లు చేస్తూ కాక రేపాడు. దీనికి సమాధానంగా మంత్రి పేర్ని నాని కూడా ట్విట్లు చేశారు. ఆర్జీవీ ట్విట్ ను రీట్విట్ చేశాడు నాగబాబు. ఇదిలా ఉంటే ఆర్జీవీ మనం కలిసి డిస్కస్ చేద్దాం అని మంత్రితో అనడంతో అక్కడితో వివాదం ముగిసింది. తాజాగా ఈ వివాదంలోకి వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎంటర్ అయింది.

పనిపాట లేని వ్యక్తి ఆర్జీవీ అంటూ విరుచుకుపడింది..

దీంతో మరోసారి ఇది రచ్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఆర్జీవీపై విరుచుకుపడింది శ్రీరెడ్డి. పనిపాట లేని వ్యక్తి ఆర్జీవీ అంటూ విరుచుకుపడింది. పైకి ఏం పట్టించుకోనట్లు కనిపించినా… తన గురించి మాట్లాడిన వ్యక్తిపై పగ తీర్చుకునే టైపు ఆర్జీవీ అంటూ ఫైర్ అయింది. ఏ రోజైనా తన గురించి వార్త రానప్పుడు.. ఏదో ఒక సంచలన క్రియేట్ చేస్తుంటాడని విమర్శించింది. నీకు అంతకుముందు నేను దొరికాను, సురేష్ బాబు పంచన చేరావు. ఈరోజు నీకు థియేటర్ల ప్రాబ్లమ్స్ కావాల్సి వచ్చాయా అని సూటిగా ప్రశ్నించింది. ఎందులో అయిన దూరిపోయి సర్వనాశనం చేసే వ్యక్తి ఆర్జీవీ అని అంది. బాలీవుడ్ ‘ ఛీ తూ..’ అంటే తట్టాబుట్టా సర్దుకుని.. హైదరాబాద్ వచ్చేశావు. బ్లూ ఫిలిమ్స్ తీయడం, బీగ్రేడ్, సీగ్రేడ్ తీయడం, అమ్మాయిలను కూర్చోబెట్టుకుని వాళ్ల తొడల గురించి మాట్లాడటం ఆయన తీరని విమర్శించింది. నువ్వు ఏమైనా చేసుకో.. జగన్ ప్రభుత్వ జోలికి రాకు.. జగన్ గారి జోలికా రావాలంటే ముందుగా నన్ను దాటుకుని వెళ్లాలని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఆర్.జి.వి గురించి శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

RGV: ఇండస్ట్రీలో ప్రతి వాడికి స్వార్ధమే.. ‘పెద్ద దిక్కు’ అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవడూ వినడు : అర్జీవీ

Ram Gopal Varma: సినీ దిగ్గజం.. దాసరి నారణయణరావు చనిపోయిన తర్వాత సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే దానిపై పెద్ద చిక్కు వచ్చి పడింది. చాలామంది మెగస్టార్ చిరంజీవి అని భావిస్తుండగా.. పెద్దన్నగా మాత్రం తాను ఉండను అంటూ ఇటీవల అతడు వ్యాఖ్యలు చేసేశాడు. దీని తర్వాత ఇండస్ట్రీలో ఈ టాపిక్ పెద్ద సంచలనంగా మారింది. సినీ ప్రముఖులు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికీ తోచిన విధంగా వాళ్లు మాట్లాడేస్తున్నారు. చిరంజీవి అలా ప్రకటన చేసిన వెంటనే.. మోహన్ బాబు కూడా సినీ పరిశ్రమ విషయంలో మౌనంగా ఉంటున్నామని చేతకాని తనంగా అనుకోవద్దని ఘాటుగా మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశాడు.

సినీ పరిశ్రమ అంటే కేవలం నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదన్నారు. అందరినీ సమానంగా చూడాలని.. అందరూ కలిసి.. పరిశ్రమ సమస్యలపై పోరాడాలన్నారు. ఒకరోజు కూర్చొని ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు. ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదు అంటూ స్పష్టం చేశాడు.

RGV : సామీ మీరు రావాలి సామీ.. మీరే దిక్కు..

టికెట్ల వ్యవహారంపైనే ప్రస్తుతం ఇదంతా తిరుగుతోంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. టికెట్ల రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేసిందా.. ఆ ప్లాన్ వెనుకు సినిమాలో ఉన్న ఒకరిద్దరు హీరోల్ని తొక్కేయాల్నే కారణంగానే ఇలా చేస్తున్నారా..అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు ఆర్జీవీ. ఆర్జీవీ ట్వీట్ పై అతడు శిష్యూడు ఆర్ఎక్స్ 100 దర్శకుడు ట్వీట్ చేశాడు. సినీ పరిశ్రమకు మీరే పెద్ద దిక్కు ‘సామీ మీరు రావాలి సామీ’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇందతా జరుగుతున్నా.. కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజేవే అని.. కొందరు అంటుంటు.. మరి కొందరు మోహన్ బాటు అంటూ.. ఎవరికీ వారు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

RGV : ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం :

Ram Gopal Varma: దానికి ఆర్జీవీ మాత్రమే అర్హుడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ దర్శకుడు?

అజయ్ గారూ, ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడికీ వేరే వేరే స్వార్ధాలు ఉంటాయి. దాని మూలాన వాడికి మాత్రమే పనికొచ్చే మాటే ప్రతివాడూ వింటాడు. కానీ, ఎవడికో పెద్దదిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడికి మాట ఎవడూ వినడు.

Ram Gopal Varma: ఇండస్ట్రీ పెద్ద రామగోపాల్ వర్మ ఉండాలి.. : డైరెక్టర్ అజయ్ భూపతి

Ram Gopal Varma: సినీ దిగ్గజం.. దాసరి నారణయణరావు చనిపోయిన తర్వాత సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే దానిపై పెద్ద చిక్కు వచ్చి పడింది. చాలామంది మెగస్టార్ చిరంజీవి అని భావిస్తుండగా.. పెద్దన్నగా మాత్రం తాను ఉండను అంటూ ఇటీవల అతడు వ్యాఖ్యలు చేసేశాడు.

దీని తర్వాత ఇండస్ట్రీలో ఈ టాపిక్ పెద్ద సంచలనంగా మారింది. సినీ ప్రముఖులు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికీ తోచిన విధంగా వాళ్లు మాట్లాడేస్తున్నారు. చిరంజీవి అలా ప్రకటన చేసిన వెంటనే.. మోహన్ బాబు కూడా సినీ పరిశ్రమ విషయంలో మౌనంగా ఉంటున్నామని చేతకాని తనంగా అనుకోవద్దని ఘాటుగా మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశాడు.

Ram Gopal Varma: దానికి ఆర్జీవీ మాత్రమే అర్హుడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ దర్శకుడు?

సినీ పరిశ్రమ అంటే కేవలం నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదన్నారు. అందరినీ సమానంగా చూడాలని.. అందరూ కలిసి.. పరిశ్రమ సమస్యలపై పోరాడాలన్నారు. ఒకరోజు కూర్చొని ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు. ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదు అంటూ స్పష్టం చేశాడు.


సామీ మీరు రావాలి సామీ.. మీరే దిక్కు..

టికెట్ల వ్యవహారంపైనే ప్రస్తుతం ఇదంతా తిరుగుతోంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. టికెట్ల రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేసిందా.. ఆ ప్లాన్ వెనుకు సినిమాలో ఉన్న ఒకరిద్దరు హీరోల్ని తొక్కేయాల్నే కారణంగానే ఇలా చేస్తున్నారా..అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు ఆర్జీవీ. ఆర్జీవీ ట్వీట్ పై అతడు శిష్యూడు ఆర్ఎక్స్ 100 దర్శకుడు ట్వీట్ చేశాడు. సినీ పరిశ్రమకు మీరే పెద్ద దిక్కు ‘సామీ మీరు రావాలి సామీ’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇందతా జరుగుతున్నా.. కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజేవే అని.. కొందరు అంటుంటు.. మరి కొందరు మోహన్ బాటు అంటూ.. ఎవరికీ వారు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

మీ అందరినీ పెళ్లి చేసుకోవచ్చా.. అక్కడ కూడా మొదలు పెట్టేశాడుగా ఆర్జీవీ..!

రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఇతడినే చెబుతారు. ఏ మాట మాట్లాడినా.. ఏ పని చేసినా అది పెద్ద విమర్శలకు దారి తీస్తుంది. ఇతడి చుట్టూ.. కాంట్రవర్సీలు అనేవి వైఫైలా తిరుగుతాయి. ఒక వేళ అలా లేదు అంటూ.. అతడే కావాలని స్పష్టించుకుంటాడు. అయితే ఇటీవల ఆర్జీవీ తెలుగు న్యూస్ ఛానళ్లలో పలు ఇంటర్వ్యూలకు పాల్గొంటున్నాడు.

అతే కాకుండా.. ఆడియో ఫంక్షన్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా హాజరవుతున్నాడు. రియాల్టీ షోలో మాత్రం ఆర్జీవీ అస్సలు కనిపించడు. స్పెషల్ ఈవెంట్లను నిర్వహించడంలో టెలివిజన్లలో ఎక్కువగా ఈటీవీ ముందు ఉంటుంది. పండుల సమయంలో… మరేదైనా స్పెషల్ డే ఉందంటే చాలు.. ఆరోజు స్పెషల్ ప్రోగ్రాం ఉండాల్సిందే. అందులో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉంటాడు.

అలా వాళ్లు ప్లాన్ చేస్తుంటారు. అలా ఈటీవీలో కూడా ఈ సారి ఓ ఈవెంట్ పెడుతున్నారు. ఆ షో పేరుఏంటో తెలుసా.. ‘‘పెళ్లాం వద్దు.. పార్టీ ముద్దు’’. అవును మీరు విన్నది నిజమే. ఈ షోకు సంబంధించి టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఎప్పుడూ ఇలాంటి షోలో కనిపించని రామ్ గోపాల్ వర్మ ఈ షో లో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక వర్మ ఉన్నాడంటే.. అక్కడ అమ్మాయిలు ఉండాల్సిందే.. సందడి జరగాల్సిందే. అలాంటిదే ఆ వేదికపై కూడా జరిగింది.

అక్కడ స్టేజీ మీద అమ్మాయిలతో సందడి చేశాడు ఆర్జీవీ. ఆర్జీవీ ఎక్కడా కుదురుగా ఉండడు కదా.. ఎదో ఒక్కటి మాట్లాడటం.. కాంట్రవర్సీలకు లీడ్ ఇవ్వడం చేస్తుంటాడు. అలాంటిదే ఇక్కడ కూడా చేసేశాడు. ‘మీ అందరినీ పెళ్లి చేసుకోవచ్చా?’ అంటూ ప్రపోజ్‌ కూడా చేశాడు. ఈ ప్రోమో టీజర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. వర్మ అక్కడ కూడా మొదలు పెట్టేశాడుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ షో నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

పునీత్ మరణం పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో, అన్నీ ఇండస్ట్రీలలో ఎక్కడ చూసినా కూడా పునీత్ మరణం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. పలువురు సోషల్ మీడియాలో వేదికగా పునీత్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అతడి మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అతడి మరణవార్త విని చాలా మంది షాక్ కు గురయ్యారు. అయితే అప్పటివరకూ బాగానే ఉన్నా పునీత్ ఒక్కసారిగా ఆస్పత్రి పాలవ్వడం ఆ తర్వాత మరణించడం అన్నది ఇప్పటికి కూడా షాకింగ్ గానే ఉంది.

పునీత్ ఇంత చిన్న వయసులోనే నూరేళ్లు నుండి అనంత లోకాలకు వెళ్లిపోవడం ఏంటి అంటూ అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడి మరణవార్త విన్న అభిమానులు హాస్పిటల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పటికే ఇతడి మరణవార్త పై పలువురు సినీ ప్రముఖులు పునీత్ తో ఉన్న వారి అనుబంధం గురించి బయట పెడుతున్నారు.తాజాగా టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

పునీత్ మరణవార్త విన్న ఆర్జీవి ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.పునీత్‌ రాజ్‌ హఠాన్మరణ వార్త షాకింగ్‌కి గురి చేసింది. అయితే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే మన కళ్లు తెరిపించే భయంకరమైన నిజం ఎవరం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కాబట్టి జీవితాన్ని బతికుండగానే సంతోషంగా గడిపేయాలి’ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ప్రతీ అంశంలో కాంట్రవర్సీ వెతికే వర్మ పునీత్ మరణం విషయంలో మాత్రం భిన్నంగా స్పందించడంతో నెటిజన్లు ఆయనకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు.

శుక్రవారం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కుటుంబసభ్యులు బెంగుళూరులోని విక్రమ్ హాస్పటల్‌కు తరలించారు.అయితే పరిస్థితి విషమించడంతో పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణ తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

మైస‌మ్మ‌కు విస్కీ తాగించిన వ‌ర్మ‌.. మండిప‌డుతున్న ప్ర‌జ‌లు..!

ఎప్పుడూ వివాదాలతోనే కాపురం చేసే ఆర్జీవీ.. ఆయ‌న ఏం చేసినా చేయ‌క‌పోయినా కాంట్ర‌వ‌ర్సీ అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మళ్లీ సోషల్ మీడియాలో మరో వివాదంలో చిక్కుకున్నాడు. తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ కథ ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న చిత్రం కొండా.

ఈ చిత్ర షూటింగ్​ ప్రారంభ కార్యక్రమాన్ని వరంగల్​ జిల్లా వంచనగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన కొండా దంపతులతో కలిసి గ్రామదేవతలకు పూజలు చేశారు. నిజానికి దేవుళ్లంటే వ‌ర్మ‌కు న‌మ్మ‌కం లేదు. కానీ సినిమా ఓపెనింగ్ రోజు నిర్మాత‌లు చేసే పూజ‌ల‌కు మాత్రం స‌హ‌క‌రిస్తున్నారు. ఈ క్రమంలోనే గండిమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జీవీ.. అమ్మవారికి విస్కీ తాపించాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్​ ఖాతాలో పంచుకున్నారు. “నాకు వొడ్కా మాత్రమే తాగటం అలవాటున్నప్పటికీ.. గండిమైసమ్మకు మాత్రం విస్కీ తాగించాను. చీర్స్​..” అంటూ తన ట్విట్టర్​లో చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. దీనిపై నెటిజ‌న్లు కొంద‌రు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుళ్లపై నమ్మకం లేకపోతే వదిలేయండి కానీ కించపరచవద్దని కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉండగా.. బయోపిక్ లు తీయడంలో వర్మకు సాటి ఎవరూ ఉండరు. కొండా చిత్రాన్ని తెలంగాణ రాజకీయ నేపథ్యంలో కొండా మురళి – సురేఖల జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న వ‌ర్మ చెప్పాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఆర్జీవీ ఇప్పటికే విడుదల చేశారు. ప్రస్తుతం వరంగల్ నగరంలో హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ లో 1980ల నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఈ చిత్రంలో వ‌ర్మ చూపించ‌బోతున్నట్లు సమాచారం.

సమంత చైతన్యల విడాకులపై వర్మ ట్వీట్.. సెలబ్రేట్ చేసుకోవాలంటూ..!

సమంత నాగ చైతన్య ల గురించి గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలలో నిజం ఉండకూడదని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే నేడు నాగచైతన్య వారి గురించి వస్తున్న వార్తలు నిజమే అంటూ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విడాకులపై పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సంచలనాత్మక దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ సమంత నాగచైతన్య విషయంపై స్పందిస్తూ తన దైన శైలిలో ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ… పెళ్లిళ్లు వద్దు… విడాకులు తీసుకోండి సెలబ్రేట్ చేసుకోండి… పెళ్లంటే చావు.. విడాకులు అంటే పునర్జన్మ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ ఒక వీడియోని ట్యాగ్ చేశారు.

ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఏదిఏమైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వీట్ కపుల్ గా ఉన్న ఈ జంట విడాకుల నిర్ణయం తీసుకోవడం ఎంతో మంది అభిమానులను కలిచివేసిందని చెప్పవచ్చు. అయితే సమంత నాగచైతన్య విడాకులకి కారణం సినిమాలే అనే విషయం అందరికీ తెలిసిందే.

పెళ్లి తర్వాత సినిమాలలో నటించకుండా ఉండమని నాగచైతన్య కుటుంబం చెప్పడం, అందుకు సమంత తిరస్కరించడం వల్లే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని,ఈ మనస్పర్థల కారణంగానే గత కొద్ది రోజుల నుంచి వీరి మధ్య ఎడబాటు రావడం.. నేడు విడాకులతో విడిపోవడం జరిగిందని చెప్పవచ్చు.

రామ్ గోపాల్ వర్మ తన ఫ్యామిలీకి దూరంగా ఉండటానికి గల కారణం ఇదే..!

కాంట్రవర్సీ కా బాప్ రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ఎవరి మీదు ఎప్పుడు ట్వీట్ చేస్తారో అర్థం కాదు. అయితే మొదట్లో అతడి దర్శకత్వం వహించిన సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అతడి డైరెక్షన్ లో కూడా ఆ మార్క్ ని చూపించేవారు. కొంతమంది హీరోల కెరీర్ ను కూడా నెలబెట్టిన ఘనత ఆర్జీవీది.

అంతటి పాపులారిటీని సంపాదించికున్న రామ్ గోపాల్ వర్మ.. తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎందుకు ఇలా అతడు దూరంగా ఉండాల్సి వచ్చింది.. దానికి గల కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇటీవల వర్మ ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు.. తాను జీవితంలో కేవలం ఒక్కసారే భయపడ్డానని, అది కూడా కేవలం 20 సెకండ్లు మాత్రమే అని చెప్పుకొచ్చాడు.

ఓ రోజు ముంబై వెళ్తున్న సమయంలో జర్నీలో ఉండగా.. నలుగురు వ్యక్తులు తననే చూస్తున్నారనే ఫీలింగ్ లో ఉన్నాడట వర్మ. వర్మ దిగి అక్కడి నుంచి వెళ్లగా.. వారు ఆయన్ని అలాగే చూస్తున్నారట. ఆ విషయాన్ని తన డ్రైవర్ కి చెప్పగా.. డ్రైవర్ వాళ్లు లిఫ్ట్ రిపేర్ చేయడానికి వచ్చిన వారని తెలిపారు. కానీ రాంగోపాల్ వర్మ డైరెక్టర్ అని గుర్తుపట్టడం చేత, వాళ్లు అలా చూశారని ఆ తర్వాత డ్రైవర్ చెప్పినట్లు రాంగోపాల్ వర్మ నవ్వుతూ తెలిపారు.

ఇక తన ఫ్యామిలీ గురించి చెబుతూ.. ఎందుకు తన ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు అంటే.. పెళ్లి అయితే అర్థాంతరంగా జీవితం అయిపోతుందనే భావనలో వర్మ ఉన్నట్లు తెలిపాడు. అంతేకాకుడా పెళ్లి అయిన తర్వాత భార్య, పిల్లలు, చదువు, ఉద్యోగం ఇదే జీవితం అయిపోతుంది. ఇలా మన జీవితానికి ఒకటి అంటూ ఏమీ ఉండదు. అందుకే తన భార్యతో దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు ఆర్జీవీ.

‘బోడి నా కొడుకు’ అంటూ రాజమౌళిపై సంచలన కామెంట్స్ చేసిన ఆర్జీవీ!

రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఆర్జీవీ. ఎప్పుడు ఎవరి మీద కామెంట్ చేస్తారో.. ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియదు. వర్మ ఎలాంటి కామెంట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసినప్పటికీ ఎక్కువగా ఆయన చెప్పే మాటలకే చాలామంది ఫ్యాన్స్ అయిపోతుంటారు.

సినిమాలను చాలా మంది థియేటర్లు లేక ఓటీటీలకు ఇస్తుంటే.. అతడు మాత్రం ఆర్టీవీ థియేటర్ అంటూ చిన్నపాటి ఓటీటీ లాంటిది ఏర్పాటు చేసుకొని తన సినిమాలను అందులోనే విడుదల చేస్తుంటారు. అలా అందరు ఒక వైపు ఉంటే.. అతడు మాత్రం నాదారే రాహదాని అన్నట్లు ఓ వైపు ఉంటాడు. అయితే ఇటీవల సునీల్ నటించిన ‘కనబడుట లేదు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆర్జీవీ, విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ ఈవెంట్‌లో వర్మ స్పీచ్ అందరికంటే హైలెట్ అయింది.

రచయిత కే.విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిలో రాజమౌళి పేరు ప్రస్తావించారు. విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి వర్మ అడిగి నవ్వులు పూయించారు.

నా పెద్ద డౌట్ ఏంటంటే.. మీ గడ్డానికి స్ఫూర్తి ఎవరు? నరేంద్రమోడీనా? లేకపోతే రామాయణం మించిన అద్భుతమైన బాహుబలి కథను ఇచ్చారు కాబట్టి వాల్మీకి కంటే పెద్దగా ఉండాలని అనుకున్నారా? లేదా నా బోడి కొడుక్కే అంత ఉంటే.. నాకు ఎంత ఉండాలని రాజమౌళి కంటే ఎక్కువగా ఉండాలని పెంచుతున్నారా? అని విజయేంద్ర ప్రసాద్‌ను ఆట పట్టించారు వర్మ. ఇక ఆ మాటలకు విజయేంద్రప్రసాద్ నవ్వుతూనే ఆర్జీవికి రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. దీంతో అక్కడ జనాలు విజల్స్ తో క్లాప్స్ కొట్టారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.