సమంత నాగ చైతన్య ల గురించి గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలలో నిజం ఉండకూడదని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే నేడు నాగచైతన్య వారి గురించి వస్తున్న వార్తలు నిజమే అంటూ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విడాకులపై పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సంచలనాత్మక దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ సమంత నాగచైతన్య విషయంపై స్పందిస్తూ తన దైన శైలిలో ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ… పెళ్లిళ్లు వద్దు… విడాకులు తీసుకోండి సెలబ్రేట్ చేసుకోండి… పెళ్లంటే చావు.. విడాకులు అంటే పునర్జన్మ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ ఒక వీడియోని ట్యాగ్ చేశారు.
ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఏదిఏమైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వీట్ కపుల్ గా ఉన్న ఈ జంట విడాకుల నిర్ణయం తీసుకోవడం ఎంతో మంది అభిమానులను కలిచివేసిందని చెప్పవచ్చు. అయితే సమంత నాగచైతన్య విడాకులకి కారణం సినిమాలే అనే విషయం అందరికీ తెలిసిందే.
పెళ్లి తర్వాత సినిమాలలో నటించకుండా ఉండమని నాగచైతన్య కుటుంబం చెప్పడం, అందుకు సమంత తిరస్కరించడం వల్లే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని,ఈ మనస్పర్థల కారణంగానే గత కొద్ది రోజుల నుంచి వీరి మధ్య ఎడబాటు రావడం.. నేడు విడాకులతో విడిపోవడం జరిగిందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…