Categories: FeaturedMovie News

నాగార్జున నుంచి నాగచైతన్య వరకు విడాకుల గోల.. ఏమైంది అక్కినేని ఫ్యామిలీకి..!

అక్కినేని ఫ్యామిలీకి ఏమైంది. ఎందుకు ఇలా వైవాహిక బంధం బ్రేకప్, విడాకుల వరకు వెళ్తున్నాయి. ముందునుంచి కూడా ఆ ఫ్యామిలీలో లైఫ్ పార్టనర్ విషయంలో వివాదాలు ఎదుర్కొన్నారు. తాజాగా సమంత, నాగచైతన్య విడాకులను చైతు, సమంత అధికారికంగా ప్రకటించారు. తాము విడాకులు తీసుకున్నట్లు సమంత, నాగచైతన్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు. దీంతో ఒక్కసారిగా అభిమానుల షాక్ అయ్యారు.

గత నెల రోజుల నుంచి వస్తున్న వార్తలను నిజం చేసేశారు. అందుకే ఈ విషయమై ఎన్నిసార్లు ప్రస్తావించినా అధికారికంగా ఇంతవరకు సమాధానం చెప్పలేదని అభిమానులు అంటున్నారు. ఏదేమైనా ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులకు మింగుడు పడటం లేదు. ఇదిలా ఉండగా.. ఇలా అక్కినేని ఫ్యామిలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఒక పెద్ద వృక్షంలా అవతరించింది.

ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున, అమల, సుమంత్‌, సుశాంత్‌, సుప్రియ, నాగచైతన్య, అఖిల్‌ సినిమా రంగంలో ఉన్నారు. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోను ఎన్నో షూటింగ్ లు, టీవీషోలు, ఈవెంట్లు, సినిమా ఓపెనింగ్ లకు కేరాఫ్ గా నిలిపారు. సినిమా రంగంలో ఇంత విజయవంతంగా రాణిస్తున్న అక్కినేని ఫ్యామిలీకి ఈ బ్రేకప్ లు, విడాకులు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. మొదట్లో నాగార్జున దగ్గర నుంచి ప్రస్తుతం నాగచైతన్య వరకు అందరూ విడాకుల విషయంలో ఇబ్బంది పడినవారే.

ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున, అమల, సుమంత్‌, సుశాంత్‌, సుప్రియ, నాగచైతన్య, అఖిల్‌ సినిమా రంగంలో ఉన్నారు. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోను ఎన్నో షూటింగ్ లు, టీవీషోలు, ఈవెంట్లు, సినిమా ఓపెనింగ్ లకు కేరాఫ్ గా నిలిపారు. సినిమా రంగంలో ఇంత విజయవంతంగా రాణిస్తున్న అక్కినేని ఫ్యామిలీకి ఈ బ్రేకప్ లు, విడాకులు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. మొదట్లో నాగార్జున దగ్గర నుంచి ప్రస్తుతం నాగచైతన్య వరకు అందరూ విడాకుల విషయంలో ఇబ్బంది పడినవారే.

మొదట నాగార్జునతోనే విడాకుల ప్రస్తావన మొదలైందనే చెప్పాలి. మొదట 1984 లో విక్టరీ వెంకటేష్ సోదరి దగ్గుపాటి లక్ష్మీని వివాహం చేసుకున్న నాగార్జున తర్వాత వీళ్లకు నాగచైతన్య జన్మించాడు. నాగార్జున సినీ పరిశ్రమలో రాణిస్తుండటం.. లక్ష్మీ వైద్యురాలిగా రాణిస్తుండటంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడం.. వృత్తి పరంగా వేర్వేరుగా ఉండటంతో ఆరేళ్ల తర్వాత విడిపోయారు. తర్వాత నాగార్జున అమలను ప్రేమించి 1992లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అఖిల్‌ జన్మించారు. తర్వాత అమలు సినిమాలు తగ్గించి.. సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతూ వస్తోంది.

అక్కినేని నాగేశ్వరరావు పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు సుమంత్ కుమార్. ఇతని విషయానికి వస్తే.. అతడు తెలుగు హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కీర్తి రెడ్డి తొలిప్రేమ చిత్రంతో పాపులారిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే. 2004లో వీరి వివాహం జరగ్గా.. రెండేళ్లకి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సుమంత్‌ సింగిల్ గానే ఉన్నాడు.

నిర్మాత, నటిగా ఉన్న సుప్రియ యార్లగడ్డ సైతం వివాహ జీవితం వివాదంగా మారింది. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించి.. ఇష్టం సినిమాలో హీరో చరణ్ రెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. 2012 లో అతడికి గుండెపోటు వచ్చి చనిపోయాడు. కానీ అంతకంటే ముందే వీరిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని.. డైవర్స్‌ తీసుకునేందుకు సిద్ధమయ్యారని, ఇంట్లో గొడవల వల్లే మెంటల్‌గా డిస్ట్రర్బ్ అయిన చరణ్‌ రెడ్డి హార్ట్ ఎటాక్ కి గురైనట్టు వార్తలొచ్చాయి. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ.. అప్పటి నుంచి సుప్రియ కూడా సింగిల్ గాను ఉన్నారు.

ఇక నాగచైతన్య తమ్ముడు అఖిల్ విషయానికి వస్తే.. వివాహానికి సంబంధించి పెద్ద వివాదంగా మారింది. శ్రియా భూపాల్‌తో నాలుగేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ల పెళ్లి పీటల దాకా రాలేదు. ప్రస్తుతం నాగచైతన్య పరిస్థితి కూడా ఇలానే అవ్వడంతో ఆ ఫ్యామిలీకి ఏమయిందో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago