టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య డైవర్స్ విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ జరుగుతుంది. ఆల్మోస్ట్ డైవర్స్ కన్ఫమ్ అంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్న వార్తలన్ని రూమర్లే నటి సమంత చెప్పడంతో వీరు విడాకులు తీసుకోలేదని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
తాజాగా వీరి విడాకుల విషయం గురించి నాగచైతన్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల నుంచి మా మధ్య వస్తున్న విడాకుల విషయంలో ప్రతీ ఒక్క మీడియా ప్రతినిధులు వివిధ రకాల వార్తలను ప్రచురించారు. ఏమాయ చేసావే సినిమాతో కలిసిన మా స్నేహ బంధం దాదాపు 10 సంవత్సరాల వరకు సాగిందని..దానిని 4 సంవత్సరాల క్రితం పెళ్లితో ముడివేశామని చెప్పాడు.
ఇక నుంచి తాము వేరే దారులను చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. దానికి సంబంధించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఇటువంటి సందర్బంలో తమకు మీడియా సపోర్ట్ గా ఉండాలంటూ వేడుకున్నాడు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని.. ఈ క్లిష్ట సమయంలో తన వెంట ఉండాలని ఆయన అభిమానుల్ని కోరారు.
సమంత నాగచైతన్య విషయంలో వచ్చిన పుకార్లు అన్నీ నిజం అయ్యాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అటువంటి నిర్ణయం కరెక్ట్ కాదంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఏదిఏమైనా నాగచైతన్య ఈ విధంగా విడాకుల విషయం తెలియజేయడంతో అభిమానులకు మింగుడు పడలేదని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…