ఏ మాయ చేసావే సినిమా ద్వారా మొట్ట మొదటి సారి తెరపై సందడి చేసిన చైతన్య సమంత ఆ తరువాత పలు సినిమాలలో నటించి హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి 2017లో పెళ్లి బంధం ద్వారా ఒక్కటయ్యారు. గత నాలుగు సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ జంటగా నిలిచిన వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.గత కొద్ది రోజుల నుంచి వీరి గురించి వస్తున్న వార్తలు నిజమేనని నేడు నాగచైతన్య విడాకుల విషయం గురించి అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రకటన అనంతరం సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సమంత తన స్టోరీలో.. నేను ఎంతో బాధ నిస్పృహలో ఉన్న సమయంలో నాకు ఒక విషయం అర్థం అయింది. చివరికి ప్రేమే గెలుస్తుందనేది నిజం. కొందరు దుర్మార్గులు, హంతకులు, నమ్మకద్రోహులు ఉంటారు. వెన్నుపోటు పొడుస్తూ ఎవరికీ తెలియకుండా ఉండటంలో వారికి వారే నిపుణులు. ఇలాంటి వారు చివరికి నాశనం అవుతారు. చరిత్ర కూడా ఇదే చెబుతుంది. ఈ విషయాన్ని నాకు మా అమ్మ చెప్పింది అంటూ తన స్టోరీస్ ని ముగించారు.
ఈ విధంగా సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎంతో ఎమోషనల్ గా బాధపడుతూ పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విడాకుల తర్వాత తన తల్లి చెప్పిన విషయాలను సమంత పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఏదిఏమైనప్పటికీ సమంత నాగ చైతన్యల వివాహ బంధంలో విడిపోవడం అభిమానులకు ఎంతో బాధను కలిగించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…