సమంత నాగ చైతన్య జంటగా మొట్టమొదటిసారిగా ఏ మాయ చేసావే సినిమా ద్వారా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా వీరిద్దరూ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట ఆ తరువాత మనం సినిమాలో నటించి మరో సారి ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఇలా వెండి తెరపై జంటగా వీరిద్దరూ కలిసి అడుగుపెడితే ఆ సినిమా పక్క హిట్ అని చెప్పవచ్చు.
వీరిద్దరూ కలిసి నటించిన ఆటోనగర్ సూర్య కొంత వరకు గుర్తింపు తెచ్చుకోలేకపోయినప్పటికీ వీరి కాంబినేషన్లో వచ్చిన మజిలీ, మనం, ఏం మాయ చేసావే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇలా వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించి ప్రేమలో పడిన ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని గత నాలుగు సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా గడిపారు.
ఇలా ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి వైవాహిక జీవితంలో పలు మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే వీరి గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వెలువడ్డాయి. వీరు విడాకులు తీసుకోబోతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఆ వార్తలో నిజం లేదు అంటూ అభిమానులు కొట్టిపారేశారు.
అయితే గత కొద్ది రోజుల నుంచి వస్తున్న వార్తలలో నిజం ఉందని నేడు నాగచైతన్య అధికారిక ప్రకటన చేశారు. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు.ఇలా వెండితెరపై జంటగా అడుగు పెట్టి హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్న ఈ జంట నిజ జీవితంలో మాత్రం ఆ బంధాన్ని నిలుపుకోవడంలో ఫెయిల్యూర్ అయిందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…