Tag Archives: sai pallavi

Karthika Deepam: నాగచైతన్య సాయి పల్లవిని ఇమిటేట్ చేసిన డాక్టర్ బాబు వంటలక్క.. వీడియో వైరల్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని దాదాపు 1569 ఎపిసోడ్లు పాటు ప్రసారమైనటువంటి ఈ సీరియల్ మంచి ఆదరణ పొందడంతో ఈ సీరియల్ కి సీక్వెల్ తీసుకువస్తున్నారు.

కార్తీకదీపం 2 ద్వారా నేటినుంచి ఈ సీరియల్ ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తండేల్ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలకు సంబంధించినటువంటి రీల్ వీడియోని నాగచైతన్య వాలంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇందులో భాగంగా నాగచైతన్య బుజ్జితల్లే.. వచ్చేత్తున్న కదే, కాస్త నవ్వవే` అని ప్రేమగా పిలుస్తాడు చైతూ.దీనికి సాయిపల్లవి కూడా అంతా బాగా రియాక్ట్ అవుతుంది. మొదట్లో బాధలో నుంచి ఆమె నవ్విన తీరు ఆకట్టుకోవడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ రీల్ ను డాక్టర్ బాబు వంటలక్క ఇద్దరు చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సీరియల్ కి సీక్వెల్..
ఇక ఈ సీరియల్ నేటి నుంచి ప్రసారం కాబోతుంది ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు కార్తీకదీపం 2 ఇది నవ వసంతం అనే పేరిట ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సీరియల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమాలకు సీక్వెల్స్ రావడం చూసాము కానీ సీరియల్స్ కు సీక్వెల్ రావడం ఇది మొదటి సారి అని చెప్పాలి. ఇలా సీరియల్ కి సీక్వెల్ వస్తుంది అంటే ఈ సీరియల్ కి ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.

Sai Pallavi: ఫస్ట్ టైం సాయి పల్లవిని రిజెక్ట్ చేసిన హీరో…ఎవరో తెలుసా?

Sai Pallavi: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సాయి పల్లవి ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే సాయి పల్లవి ఒక సినిమాలో నటించాలి అంటే ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే .ఈమె నటించాలి అంటే హీరోల డామినేషన్ ఉండకూడదు కథ ప్రాధాన్యత ఉండాలి.

ఎలాంటి గ్లామర్ షోకి తావుండకూడదు. రొమాంటిక్ సీన్స్ అస్సలు చేయదు ఇలా వీటన్నింటినీ చూసుకొని ఈమె సినిమాలకు కమిట్ అవుతుంది. ఇక తనకు సినిమా కథ నచ్చకపోతే ఆపక్క ఎంత పెద్ద హీరో అయినా ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చిన సినిమాలలో అసలు నటించదు.ఇలా ఇప్పటికే సాయి పల్లవి ఎంతో మంది స్టార్ హీరోలను రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇలా సాయి పల్లవి ఇప్పటివరకు స్టార్ హీరోలను రిజెక్ట్ చేశారు కానీ మొదటిసారి సాయి పల్లవిని ఒక టాలీవుడ్ హీరో రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి సాయి పల్లవిని రిజెక్ట్ చేసినటువంటి ఆ టాలీవుడ్ హీరో ఎవరు అనే విషయానికి వస్తే.. సాయి పల్లవిని రిజెక్ట్ చేసినది మరెవరో కాదు నటుడు విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ…
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో ముందుగా సాయి పల్లవిని అనుకున్నారట అయితే విజయ్ దేవరకొండ ఆమె అయితే వద్దని చెప్పేసారట ఎంత ఫ్యామిలీ స్టార్ సినిమా అయినా కాస్త కూస్తో రొమాన్స్ ఉంటుంది కానీ ఆమె వాటిని కూడా చేయనంటారు అడిగి కాదనిపించుకోవడం ఎందుకు అంటూ సాయి పల్లవి అని రిజెక్ట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు.

Varun Tej: సాయి పల్లవితో కలిసి మళ్ళీ నటించకపోవడానికి అదే కారణం: వరుణ్ తేజ్

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సాయి పల్లవి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ఫిదా. ఈ సినిమా ఎంతగా సక్సెస్ అయిందో మనకు తెలిసిందే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారా సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇక మొదటి సినిమాతో సాయి పల్లవి ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు.

ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ సాయి పల్లవి ఇద్దరూ కూడా వారి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక వరుణ్ తేజ్ ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇకపోతే వరుణ్ తేజ్ కి ఇటీవల అభిమానుల నుంచి ఒక ప్రశ్న ఎదురయింది. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న ఎదురుకాగా నాకు ఇష్టమైన హీరోయిన్ ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంది అంటూ చెప్పారు లావణ్య తర్వాత మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటే సాయి పల్లవి పేరే చెప్పారు. తాజాగా మరోసారి మీరు సాయి పల్లవితో కలిసి మరోసారి ఎందుకు సినిమా చేయలేదు అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.

ఫిదాను మించి ఉండాలి..
ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతూ నేను సాయి పల్లవి కలిసి మరో సినిమా చేయాలని ఇద్దరం కూడా కథ విన్నాము. కానీ ఇద్దరం ఈసారి చేయబోయే సినిమా ఫిదా సినిమాకు మించి ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ సినిమాని చేయలేకపోయామని అందుకే ఇప్పటివరకు తిరిగి మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదని వరుణ్ తెలిపారు.

Sai pallavi: నాగచైతన్యతో సాయి పల్లవి లిప్ కిస్.. రూల్స్ బ్రేక్ చేసిందా.. క్లారిటీ ఇచ్చిన నటి?

Sai pallavi: సాయి పల్లవి పరిచయం అవసరం లేని పేరు ఈమె ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా వచ్చారు. అనంతరం తెలుగులో ఫిదా సినిమాలో నటించి ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైనటువంటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ ఎన్నో రూల్స్ పెట్టుకొని ఇండస్ట్రీలో కొనసాగుతుందనే విషయం మనకు తెలిసిందే.

ఈమె సినిమాకు ఒప్పుకోవాలి అంటే ఆ సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. అంతేకాకుండా ఎలాంటి గ్లామర్ షోకి తావు ఉండకూడదు లిప్ కిస్ వంటి సన్నివేశాలలో తాను నటించను అంటూ ఖరాకండిగా చెప్పేస్తూ ఉంటారు. అయితే ఇలా కొన్ని రూల్స్ పెట్టుకున్నటువంటి సాయి పల్లవి ఓ సినిమా విషయంలో తన రూల్స్ బ్రేక్ చేసింది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. నాగ చైతన్య సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో వీరిద్దరూ కూడా ఒక సన్నివేశంలో లిప్ కిస్ పెట్టుకుంటారు. ఈ సినిమాలో నిజంగానే సాయి పల్లవి నాగచైతన్యకు లిప్ కిస్ ఇచ్చారా ఈ సినిమా విషయంలో ఈమె తన రూల్స్ బ్రేక్ చేశారా అన్న సందేహం అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయం గురించి స్వయంగా సాయిపల్లవి క్లారిటీ ఇచ్చారు.

నో కిస్ పాలసీ..
ఆ సన్నివేశంలో సరైన ఎక్స్ ప్రెషన్స్ పలికించేందుకు తనే ఎక్కువ సమయం తీసుకుందని చెప్పింది. అది ఫేక్ కిస్ అని.. కెమెరా హ్యాండిల్ చేసే విధానంలో రియల్ కిస్ లా కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇక నో కిస్ పాలసీకి సాయి పల్లవి కట్టుబడే ఉన్నానని తెలిపారు. ఇక తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో తండేల్ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

Samantha: తనని చూస్తూ అలా ఉండిపోయాను.. చైతన్య హీరోయిన్ పై సమంత కామెంట్స్!

Samantha: సినీనటి సమంత అనారోగ్య సమస్యల బారిన పడటంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత గత కొద్దిరోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా సమంత మరో నటి సాయి పల్లవి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సమంతకు సాయి పల్లవి డాన్స్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. గతంలో ఆమె ఒక షోలో పెర్ఫార్మెన్స్ చేస్తున్న సమయంలో ఆ కార్యక్రమానికి తాను జడ్జిగా వెళ్లానని సమంత తెలిపారు.

స్టేజ్ మీద సాయి పల్లవి డాన్స్ చేస్తూ ఉంటే తనని అలా చూస్తూ ఉండిపోయానని కల్లార్పకుండా తన డాన్స్ చూస్తున్నానని ఈమె తెలియజేశారు. ఈ విధంగా సాయి పల్లవి గురించి సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సాయి పల్లవి నాగచైతన్య కలిసి ఇదివరకే లవ్ స్టోరీ సినిమాలో నటించారు. త్వరలోనే తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

తండేల్…

లవ్ స్టోరీతో హిట్ కొట్టినటువంటి నాగచైతన్య తదుపరి మరో హిట్ సినిమాని అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే మరోసారి సాయి పల్లవితో కలిసి ఈయన నటిస్తున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Sai pallavi: సాయి పల్లవి అసలు పేరు ఇది కాదా.. ఈమె ఏకంగా ఇన్ని భాషలు మాట్లాడుతుందా?

Sai pallavi: సాయి పల్లవి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రేమమ్ అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె తెలుగు ప్రేక్షకులకు ఫిదా సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు.

వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఈ సినిమాలోని సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పాలి. ఇలా అప్పటినుంచి కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య సరసన తండెల్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఇదిలా ఉండగా తాజాగా సాయిపల్లవికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా సాయి పల్లవి తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. సాయి పల్లవి అసలు పేరు సాయి పల్లవి సింతామరై.

మల్టీ టాలెంట్..

ఈమె పుట్టిన తేదీ 9 – 5 – 1992, క్వాలిఫికేషన్ డాక్టర్, డ్యాన్సర్, యాక్టర్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమెకు తెలుగుతో కలిపి ఏకంగా 8 భాషలలో మాట్లాడగలనంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు మరి సాయి పల్లవి మాట్లాడే ఎనిమిది భాషలు ఏంటి అనే విషయానికి వస్తే..తమిళ్, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, హిందీ, జార్జియం, బడగా ఇలా అన్ని భాషలు తాను మాట్లాడతానని ఈమె చెప్పడంతో ఈ వీడియో చూసిన పలువురు వామ్మో సాయి పల్లవిలో మామూలు టాలెంట్ లేదు ఈమె మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Sai pallavi: చిరంజీవి గారి డాన్స్ ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్!

Sai pallavi: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఫిదా సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి సాయి పల్లవి. ఈమె ఇండస్ట్రీలో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగారు. కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చిరంజీవి డాన్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె నటన ఎంతో సహజ సిద్ధంగా ఉంటుందో ఈమె డాన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సాయి పల్లవితో కలిసి డాన్స్ చేయాలి అంటే హీరోలు కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది అంతలా ఈమె డాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది ఇలా మంచి డాన్సర్ అయినటువంటి ఈమె చిరంజీవి డాన్స్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ స్టెప్స్ వేయలేకపోయాను..

చిరంజీవి ఎంతో అద్భుతమైనటువంటి డాన్సర్ అని ఈమె తెలిపారు. ఆయనలా డాన్స్ చేయాలని ఆయన వేసిన స్టెప్స్ ఎన్నోసార్లు వేయాలని ప్రయత్నం చేసిన ఇలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చిరంజీవి గారి డాన్స్ కి ఉన్నంత గ్రేస్ నాకు రాలేదని ఆయనలా నేను చేయలేకపోయాను అంటూ ఈ సందర్భంగా సాయి పల్లవి చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sai Pallavi: చెల్లెలి నిశ్చితార్థం వేడుకల్లో స్టెప్పులు ఇరగదీసిన సాయి పల్లవి.. నెట్టింట వీడియో వైరల్?

Sai Pallavi: ఎట్టకేలకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేసింది సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్. గత నాలుగు ఐదు రోజులుగా సోషల్ మీడియాలో పూజా కన్నన్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. పూజా ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ ఈ పరిచయం చేయడంతో వీరిద్దరూ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు ఎంగేజ్మెంట్ జరగనుంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపించాయి. మొదట్లో కొంతమంది ఎవర్ని ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేయగా నెమ్మదిగా ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూరుతూ వచ్చింది.

ఇక తాజాగా పూజా కన్నన్ తన అక్క సాయి పల్లవి తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయగా ఆ ఫొటోస్ లో మెహేంది పెట్టుకోవడంతో ఆ వార్తలు నిజమే అని నమ్మారు. దానికి తోడు తాజాగా పూజా కన్నన్ ఆమె ప్రియుడి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎట్టకేలకు పూజా కన్నన్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ తన ప్రియుడితో తాజాగా ఎంగేజ్మెంట్ వేడుకలను జరుపుకుంది.. ఇటీవలే తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన పూజా తన లవర్‌ వినీత్‌ను కూడా అందరికీ పరిచయం చేసింది.

డాన్స్ ఇరగదీసిన సాయి పల్లవి..

తాజాగా పూజ, వినీత్‌ల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. నటి సాయి పల్లవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ సందర్భంగా సాయి పల్లవి తన స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేసింది. కుటుంబ సభ్యులందరితో కలిసి సాయి పల్లవి ఆమె చెల్లెలు ఇద్దరు కూడా డాన్సులు వేస్తూ తీన్మార్ స్టెప్పులు ఇరగదీశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పూజాకి అందరూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే సాయి పల్లవి అభిమానులు ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FSaipallaviFC%2Fstatus%2F1749276519627997510&widget=Video

Pooja Kannan : సాయి పల్లవి చెల్లి పూజా ఎంగేజ్మెంట్ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం.. ఫొటోస్ వైరల్?

Pooja Kannan: పూజా కన్నన్.. సోషల్ మీడియాలో గత నాలుగు ఐదు రోజులుగా ఈ పేరు మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. హీరోయిన్ సాయి పల్లవి చెల్లిలిగా భారీగా గుర్తింపును తెచ్చుకుంది పూజా కన్నన్. అయితే త్వరలోనే పూజ పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. దీంతో గత రెండు మూడు రోజులుగా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. ఇప్పటికే సాయి పల్లవి ఇంట్లో పెళ్లి సందడి కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అయితే మొదట్లో అందరూ ఈ కేవలం గాసిప్స్ అనుకుంటుండగా ఇటువంటి సమయంలోనే తాజాగా పూజా కొన్ని ఫోటోలను షేర్ చేసి ఆ వార్తలు నిజమే అని చెప్పకనే చెప్పింది.

ప్రస్తుతం పూజా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా లేడీ సూపర్ స్టార్ అయిన సాయి పల్లవి మాదిరిగానే పూజా కన్నన్ కూడా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. పూజా 2021లో విడుదలైన చిత్తిరాయి సెవ్వానం అనే చిత్రంతో హీరోయిన్ గా అలరించింది. సముద్రఖనికి కూతురు పాత్రలో నటించింది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే నటించి మెప్పించింది. సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పూజా కన్నన్ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటారు. అక్క సాయిపల్లవితో కలిసి ఫొటోలకూ ఫోజులిస్తూ సందడి చేస్తుంటుంది.

పెళ్లి గురించి మరో అప్డేట్ ఇచ్చిన పూజా..

ఇక రీసెంట్ గా గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తన ప్రియుడి గురించి చెప్పింది. తన ప్రియుడు వినీత్ ని పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా తన పెళ్లిపై మరో అప్డేట్ ఇచ్చింది. ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు రెడీ అని చెప్పింది. ఇందుకు సంబంధించి ఒక ఫొటోను షేర్ చేసింది. అక్క సాయిపల్లవితో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది. చేతులకు మెరిసిపోతున్న మెహందీని కూడా చూపిస్తూ సంతోషం వ్యక్తం చేసింది. రేపు సాయిపల్లవి ఎంగేజ్ మెంట్ జరిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి ఎప్పుడనేది తెలియలేదు. డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. పూజా చేతులకు పెట్టుకున్న మెహేంది ని చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఎంగేజ్మెంట్ పెళ్లి వార్తలు నిజమే అని చాలామంది నమ్ముతున్నారు.

Sai pallavi: సాయి పల్లవి ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. పెళ్లికి సిద్ధమైన నటి?

Sai pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సాయి పల్లవి ఒకరు. ఈమె ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక తెలుగులో ఫిదా సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే ప్రేక్షకులందరినీ కూడా ఫిదా చేశారు. ఇక ఈమె సినిమాలో ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవి ఇంట పెళ్లి బాజాలు మూగబోతున్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందా అనే విషయానికి వస్తే పెళ్లి జరుగుతుంది కానీ సాయి పల్లవికి కాదని తన చెల్లెలు పూజ వివాహం జరగబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈమె ఇప్పటికే ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది తాజాగా ఆ వ్యక్తితో కలిసి ఉన్నటువంటి ఫోటోలను పూజ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. పూజ తన ప్రియుడుతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ తన పేరు వినీత్ అని ఇప్పటివరకు ఆయన తన క్రైమ్ పార్ట్నర్ గా ఉన్నారు. త్వరలో లైఫ్ పార్ట్నర్ కాబోతున్నారని తెలిపారు.

ప్రియుడిని పరిచయం చేసిన పూజ…

ఈ విధంగా పూజ తన ప్రియుడని పరిచయం చేయడంతో అక్క కంటే ముందుగా చెల్లి పెళ్లి చేసుకోబోతుందని పలువురు భావిస్తున్నారు. అయితే ఈమె తన పేరు తప్ప మిగిలిన ఏ విషయాలను కూడా వెల్లడించలేదు. ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి పూజ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది.