Tag Archives: Sarayu

Bigg Boss Sarayu: రామ్ చరణ్ తో డేటింగ్ చేస్తే చాన్స్ వస్తే అసలు వదులుకోను… బిగ్ బాస్ సరయు కామెంట్స్ వైరల్!

Bigg Boss Sarayu: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బిగ్ బాస్ సరయు ఒకరు. ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో కేవలం ఒకే ఒక వారం రోజుల పాటు కొనసాగిన పెద్ద ఎత్తున సంచలనంగా మారారు. అయితే అప్పటికే ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి బూతు పదాలతో పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమం గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ కార్యక్రమం ఒక చెత్త షో అని ఎవరు కూడా దీనిని చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి అంటూ అందరికీ బిగ్ బాస్ కార్యక్రమం గురించి చెబుతూ వార్తలలో నిలిచారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సరయు పెళ్లి గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ పెళ్లిపై తనకు ఏమాత్రం నమ్మకం లేదని అందుకే తాను జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఇలా బ్యాచిలర్ గానే ఉండిపోతానని తెలిపారు. పెళ్లి చేసుకొని జీవితాన్ని వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అంటూ ఈమె మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bigg Boss Sarayu: రామ్ చరణ్ కు పెళ్లయితే బాగా ఏడ్చాను…


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని సరయు తెలియజేశారు. ఒకవేళ తనకు రామ్ చరణ్ తో కలిసి డేటింగ్ చేసే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోనని ఈ సందర్భంగా ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఈమె చేసినటువంటి ఈ రొమాంటిక్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగినప్పుడు తాను బాగా ఏడ్చానని ఈ సందర్భంగా ఈమె తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వరాలు అవుతున్నాయి.

Bigg Boss Sarayu: బిగ్ బాస్ చూస్తూ మీ టైం వేస్ట్ చేసుకోకండి… అదొక చెత్త షో… సరియు కామెంట్స్ వైరల్!

Bigg Boss Sarayu: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో కూడా ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది. ఇలా ఈ కార్యక్రమం ప్రసారమవుతున్నటువంటి తరుణంలో ఈ కార్యక్రమం గురించి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా సరయు ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ… ఇలాంటి రియాలిటీ షో లన్ని కూడా ఫేక్ అని తెలియజేశారు.కొనుక్కొని లేదా వారు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చి మన అనుకున్న వాళ్ళను ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఫ్లాట్ ఫామే ఈ రియాలిటీ షో. ఇలాంటి వాటిని చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి.

ఎందుకంటే తాను బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చాను కనుక ఈ విషయాలు చెబుతున్నాను అంటూ ఈమె బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఇలా నెగిటివ్ కామెంట్లు చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొని మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Bigg Boss Sarayu: ఈ రియాలిటీ షో వల్ల టైం వేస్ట్…


ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో మాత్రమే కాకుండా తిరిగి ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా ఈమె పాల్గొన్నారు. ఇక్కడ నాలుగు వారాలపాటు హౌస్ లో కొనసాగి అనంతరం ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఈమె సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ పలు సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు.

Big Boss Non Stop: “నేనంటే ప్రేక్షకులకు ఇష్టం లేదు.. నేను వెళ్ళిపోతా..” కన్నీళ్లు పెట్టుకున్న సరయు!

Big Boss Non Stop: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో 5 సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా 24 గంటల పాటు ప్రసారం అవుతుంది.ఇకపోతే మొదటివారం నామినేషన్ లో భాగంగా ఏడు మంది కంటెస్టెంట్ లో వున్న సంగతి మనకు తెలిసిందే.

Big Boss Non Stop: నేనంటే ప్రేక్షకులకు ఇష్టం లేదు.. వెళ్ళిపోతాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సరయు!

ఈ ఏడుగురిలో ముమైత్ ఖాన్, సరయు మినహా మిగిలిన కంటెస్టెంట్ లు అందరూ కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లారు. వీరిద్దరు మాత్రమే మిగిలి ఉండగా సరయు బిగ్ బాస్ ప్రకటించక ముందే తాను ఇక ఇంటిలోనుంచి వెళ్లిపోతానని ఖచ్చితంగా ప్రేక్షకులు తనను ఎలిమినేట్ చేసి ఉంటారని భోరున ఏడ్చింది.

తన పట్ల ప్రేక్షకులు ఎంతో వ్యతిరేకంగా ఉన్నారని బిగ్ బాస్ హౌస్ లోన్ తన ఉండటం ప్రేక్షకులు కూడా ఆదరించకపోతున్నారని, బిగ్ బాస్ నుంచి తానే ఎలిమినేట్ అయ్యేది అంటూ బోరున ఏడ్చారు. ప్రేక్షకులకు ఇంత వ్యతిరేకత ఎందుకంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

ఆ అనుభవంతోనే బోరున ఏడ్చిన సరయు….

సరయు ఇదివరకే బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమంలో ఈమె ఎవరు ఊహించని విధంగా మొదటి వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఆ అనుభవం రీత్యా నాన్ స్టాప్ కార్యక్రమంలో కూడా ఈమె మొదటి వారమే నామినేషన్ లిస్టులో ఉండటంతో ఈసారి కూడా తానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతానని భావించి బోరున ఏడ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈవారం ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

Bigg Boss Nonstop: బిగ్ బాస్ నాన్ స్టాప్… మొదటి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss Nonstop: బుల్లితెరపై ఎంతో ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతూ నిరంతరం వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఇది వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్న వారితో పాటు మరికొందరు కొత్తవారు ఎంట్రీ ఇచ్చారు. ఫిబ్రవరి 26వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభమైంది.

ఇలా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అప్పుడే గొడవలు పోట్లాటలు జరుగుతున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లోపెద్ద టాస్క్ ఏది అనే విషయానికి వస్తే నామినేషన్ ప్రక్రియ అని చెప్పాలి. ఈ నామినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో మనందరికీ. ఈ క్రమంలోని మొదటి వారం హౌస్ లోనామినేషన్ ప్రక్రియ జరిగింది.

Bigg Boss Nonstop: బిగ్ బాస్ నాన్ స్టాప్… మొదటి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరు?

ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా జూనియర్ గా ఉన్నటువంటి చాలెంజర్స్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్ లను. సీనియర్ గా ఉన్నటువంటి వారియర్స్ నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో టాగ్ వేస్తూ హౌస్ లో ఉన్న పలువురు కంటెస్టెంట్ లను నామినేట్ చేశారు.

ఎలిమినేషన్ వేటు ఎవరిపై పడనుంది…

ఈ వారం నామినేషన్ లో భాగంగా నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, అరీయాన, హమీద,మిత్రా, చైతూ లు నామినేట్ అయ్యారు. మరి ఈ వారం సేఫ్ జోన్ లో ఎవరు ఉంటారు… హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారు. ఎలిమినేషన్ వేటు ఎవరిపై పడనుందనే విషయం తెలియాల్సి ఉంది.

Sarayu: బిగ్ బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. బంజారహిల్స్ స్టేషన్ కి తరలింపు!

Sarayu: బోల్డ్ కామెంట్స్ ద్వారా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే సెవెన్ ఆర్ట్స్, బిగ్ బాస్ బ్యూటీ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నోరు తెరిచింది అంటే నోటి నుంచి బూతు పదాలు బయటకు వస్తాయి. ఇలా బూతులతో ఎంతో ఫేమస్ అయిన సరియు నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు.

Sarayu: బిగ్ బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. బంజారహిల్స్ స్టేషన్ కి తరలింపు!

ఇదిలా ఉండగా తాజాగా ఈమె హిందూ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో ఈమె పై పోలీస్ కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఓ హోటల్ ప్రచార పాటలో భాగంగా హిందూ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఈమెపై 153a, 295a సెక్షన్ ల కింద బంజారాహీల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Sarayu: బిగ్ బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. బంజారహిల్స్ స్టేషన్ కి తరలింపు!

హోటల్ ప్రమోషన్ పాటలో భాగంగా సరయు మద్యం తాగుతూ… గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని రాజన్న సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ ఆదివారం ఈమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదులో భాగంగా
దేవుడి బొమ్మలు ధరించి.. లిక్కర్ సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఈ ప్రమోషన్ ద్వారా తెలియజేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు.

అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు…

ఈ విధంగా ఈమె పై పోలీస్ కేసు నమోదు అవడంతో సోమవారం అర్థరాత్రి బంజారా హిల్స్ పోలీసులు బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ విధమైనటువంటి వివాదంలో చిక్కుకున్నారు. అదే విధంగా బిగ్ బాస్ విన్నర్ విజయ్ నటించిన  ‘సకల గుణాభిరామ’ సినిమా లో సరయు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Sarayu: అభ్యంతకర విడియో..! బిగ్ బాస్ సరయుపై కేసు నమోదు !

Sarayu: బిగ్ బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ సరయుపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు చేపూరి ఆశోక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Sarayu: వివాదంలో బిగ్ బాస్ బ్యూటీ సరయు.. ఆ పాట హిందూ మనోభావాలను దెబ్బ తీసిందంటూ?

దీంతో కేసు నమోదు చేసిన సిరిసిల్ల పోలీసులు.. అనంతరం దాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమె హోటల్‌ ప్రమోషన్ సాంగ్‌లో ఆమెతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని అశోక్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Sarayu: వివాదంలో బిగ్ బాస్ బ్యూటీ సరయు.. ఆ పాట హిందూ మనోభావాలను దెబ్బ తీసిందంటూ?

అంతే కాకుండా ఆ ప్రమోషన్ సాంగ్ తో దేవుడి బొమ్మలు ధరించి.. లిక్కర్ సేవించి హోటల్ ను సందర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని వెల్లడించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

సన్నీ హీరోగా నటిస్తున్న చిత్రం సకల గుణాభిరామలో..


ఇది హిందువుల మనోభావాలను కించపరచడమే అని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలను హిందూ సమాజం సహించదన్నారు. ఈ కేసుపై సరయు వాదన తెలియాల్సి ఉంది. ఇక సరయు విషయానికి వస్తే.. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ద్వారా ఆమె ఎంతో పాపులర్ అయ్యారు. బోల్డ్ కంటెంట్ తో.. బోల్డ్ సంభాషణలతో ఆమె ఎంతో ప్రసిద్ధి. ఈ ఫేంతోనే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. అయితే మొదటి వారంలోనే ఆమె ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ హీరోగా నటిస్తున్న చిత్రం సకల గుణాభిరామలో ఈమె కీలక పాత్ర చేస్తుంది.

నేను వర్జిన్ కాదు.. అతడితో ఏడేళ్ళు సహజీవనం చేశా.. బిగ్ బాస్ సరయు బోల్డ్ కామెంట్స్..

సరయు గురించి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందే చాలామందికి తెలుసు. ఆమె 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ లో ఎక్కువగా పాపులారటీ తెచ్చుకున్నారు. దీనిలో దాదాపు అన్ని బూతులే మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలోనే ఎక్కువ డబుల్ మీనింగ్ ఉంటాయి.. కానీ ఏదో ఒక మెసేజ్ ను ఆ వీడియో చివర్లో సందేశాత్మకంగా ఇస్తారు. ఇలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు.

ఇందులో పాపులర్ అయిన సరయు.. 19 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. కానీ ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేక.. అందులో ఇమడలేక .. గొడవలకు దిగుతూ.. అరుస్తూ.. మొదటి వారానికే బయటకు వచ్చేసింది. ఇలా బిగ్ బాస్ 5 నుంచి మొదటి వారమే బయటకు వచ్చిన సరయు గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ గురించి చెప్పారు. తాను ఒకరిని ప్రేమించానని.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అతడితో ఏడు సంవత్సరాలు రిలేషన్ లో కూడా ఉన్నానని.. ఈ విషయం వాళ్ల కుటుంబసభ్యులకు, మా కుటుంబసభ్యులకు కూడా తెలుసు అంటూ చెప్పింది. అతడికి సర్వం అర్పించానని.. తాను వర్జిన్ కాదు అంటూ చెప్పుకొచ్చారు.

అంతలా అతడిని నమ్మాను అంటూ చెప్పారు. కానీ చివరకు కట్నం దగ్గర ఇద్దరం విడిపోయామని.. అందులో మొదట రూ.25 లక్షలు, తర్వాత కోటి.. తర్వాత ఆస్తిలో సగం అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటారో అని.. తానే మొహం మీద ‘తాను నీకు తగిన దానిని కాదు’ అంటూ చెప్పాననీ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సరయు తన గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

మీకు దమ్ముంటే.. ఇలా చేయండి.. తర్వాత నాపై కామెంట్లు చేయండి: సరయు

బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఎలిమినేషన్ గా సరయు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ‘7 ఆర్ట్స్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ లో ప్రతీ వీడియో హాట్ హాట్ గా ఉంటాయి. బూతులు మాట్లాడుతూ.. ఎక్స్‌పోజింగ్ చేస్తూ ర‌చ్చ చేస్తూ ఉండేది. కానీ ఆమె హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి ఎలాంటి బూతులు మాట్లాడకుండా ఉంది కానీ.. హౌస్ మేట్స్ తో మాత్రం కలిసిలేదు.

సరిగా ఇతర కంటెస్టెంట్ లతో దూరంగా ఉండాలనే ఆలోచనతోనే ఉండేది. అదే ఆమెను బయటకు తీసుకువచ్చేట్టు చేసిందా.. అనేది కూడా అనుమానం వ్యక్తం చేశారు ఆమె అభిమానులు. ఇదిలా ఉండగా..నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడుతున్న సమయంలో కూడా ఏంటి సరయు బూతులు మాట్లాడటం లేదు.. ఏమైంది అని అడగ్గా.. మీరు తిడతారేమోనని మాట్లాడటం లేదుసార్ అంటూ సమాధానం ఇచ్చింది.

ఇక బటయకు వచ్చిన దగ్గర నుంచి సిరి, షణ్ముఖ్ లు మైండ్ గేమ్ ఆడుతున్నారని విరుచుకుపడంది. బిగ్ బాస్ బజ్ లో అయితే రవి, సిరి, షణ్ముఖ్ ఫొటోలను తన కాలిలో విరగొట్టేసింది. షణ్ముఖ్‌కి దమ్ముంటే మాగాడిలా ఆట ఆడాలని లేదంటే ఆడదానిలా గాజులేసుకుని మూలన కూర్చోవాలని చెప్పింది. అలాగే సిరి హనుమంత్ మగాళ్లను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఆమె బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ ఫ్యాన్స్ ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో పాటు.. సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్లు కూడా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

హౌస్ లో ఏం జరిగిందో మీకు తెలియదని.. అన్ని ఆధారాలతో తాను సెప్టెంబర్ 15 న యూట్యూబ్ లో వీడియో అప్ లోడ్ చేస్తానని సవాల్ విసిరింది. కానీ ఎలాంటి ఆధారలతో వీడియో చేయలేదు. దానికి గల కారణం తెలియదు. కానీ ఆమె షణ్ముఖ్ ఫ్యాన్స్ కు మరో సవాల్ విసిరింది.. దమ్ముంటే సైదాబాద్ లోని చిన్నారి కుటుంబసభ్యులను ఓదార్చండి అంటూ చెప్పింది. తర్వాత నా గురించి కామెంట్లు పెట్టండంటూ సమాధానం ఇచ్చింది.

బిగ్ బాస్ ‘సరయు’ వారం రోజుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో సరయు ఒకరు. ఆమె సెవెన్ ఆర్ట్స్ ఆనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. ఆ ఛానల్ లో ఎంతో బోల్డ్ మాట్లాడే సరయు.. హౌస్ లోకి వెళ్లిన మొదటి వారం రోజులు డిగ్నిటిగా ఉన్నారు. శనివారం నాగార్జున మాట్లాడే సమయంలో కూడా బూతులు మాట్లాడటం లేదు ఎందుకు సరయు.. అని అడిగితే.. మీరు తిడతారని చేయలేదు సార్ అని సమాధానం ఇస్తుంది.

అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే.. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమె ఒకరు ఒక వైపు.. మిగతావారందరూ ఒకవైపు అన్నట్లుగా వ్యవహరించారాని ఆమె అభిప్రాయపడ్డారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె అదే చెప్పారు.

బిగ్ బాస్ బజ్ లో అయితే ప్రతీ కంటెస్టెంట్ ను బూతు పురాణంతో ఒక ఆట ఆడుకుంది. బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా చేసిన అరియానా అలానే చూస్తూ ఉండిపోయింది. ముఖ్యంగా సిరి, షణ్ముఖ్ ఫొటోలను విరిచి పారేసింది. ఇంటి నుంచి బయటకు పంపించారన్న కోపం ఆమె విపరీతంగా తీర్చుసుకుంది. ఇదిలా ఉండగా.. ఆమె ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి ఒక వారం రోజులకు ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే ఆమె అభిమానులు మాత్రం సరయు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు టార్గెట్ చేసి పంపించేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎలిమినేషన్ కు ప్రధాన కారణం నామినేషన్స్‌లో ఉన్నప్పుడు మిగతా కంటెస్టెంట్లతో పోటీ పడుతూ ఆడాలి. స్క్రీన్‌ స్పేస్‌ కోసం ప్రయత్నించాలి. కానీ సరయూ ఈ రెండూ చేయలేదనే తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతూ సిరి, షణ్ముఖ్ గుట్టు బయట పెట్టిన సరియు.. పద్ధతి మార్చుకోవాలంటూ..!

బుల్లితెరపై ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమం మొదటివారం ఎంతో విజయవంతంగా పూర్తయింది. ఈ క్రమంలోనే మొదటి వారం నామినేషన్ కి సెలెక్ట్ అయిన వారిలో యాంకర్ రవి, మానస్, కాజల్, హమీద, సరియు,జెస్సి నామినేట్ కాగా వీరిలో సరయు ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఆదివారం నాగార్జున బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ సరయు ఎలిమినేట్ చేశారు. ఇలా హౌస్ నుంచి బయటకు వచ్చిన సరయు స్టేజ్ పై నాగార్జునతో మాట్లాడుతూ హౌస్ లో ది బెస్ట్ వరస్ట్ కంటెస్టెంట్స్ అంటూ ఐదుగురు సభ్యులను సెలెక్ట్ చేసింది.

ది బెస్ట్ కంటెస్టెంట్ అంటూ సరియు శ్వేత, మానస్‌, ప్రియాంక, విశ్వ, హమీద బెస్ట్ హౌస్మేట్స్ అంటూ వారిపై ప్రశంసలు కురిపించింది. అదే విధంగా ది వరెస్ట్ కంటెస్టెంట్స్ అంటూ సిరి, షణ్ముఖ్‌, సన్నీ, లహరి, కాజల్‌ అంటూ వారి పేర్లను తెలియజేసింది. కాజల్ ఎప్పుడూ కూడా అందరి దృష్టిలో పడాలని ఆరాటపడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదు అంటూ సరియు తెలియజేశారు. ఇకపోతే సిరి, షణ్ముఖ్ వీరిద్దరూ ముందుగానే ఒక ప్లాన్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారని ఆ ప్లాన్ ప్రకారమే ఆట ఆడుతున్నారు తప్ప నిజాయితీగా ఆడటం లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

ఇప్పటికైనా అసలు ఆట ఆడండి నిజాయితీగా ఆడండి అంటూ సిరి, షణ్ముఖ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సన్నీ గురించి మాట్లాడుతూ వీరిద్దరూ ఇదివరకే ఒక సినిమాలో కలిసి నటించారు. అక్కడ వచ్చిన భేదాభిప్రాయాలు గురించి సన్నీ హౌస్ లో చూపిస్తున్నాడని సన్నీ గురించి తెలియజేసింది. ఇక లహరిని సరియు ఓ ఆటాడుకుందని చెప్పవచ్చు.

ఈ సందర్భంగా లహరి గురించి మాట్లాడుతూ ముందు నీ వాయిస్ కంట్రోల్ చేసుకో, ఏమీ లేని వారే ఎగిరెగిరి పడుతుంటారు లహరి ఇతరులపై పెద్దగా అరుస్తూ ఉంటుందని ముందుగా అది తగ్గించుకో అంటూ తెలిపారు ఇలా ఒకరిని తొక్కుతూ ఎదగడం మంచిది కాదు నీది ఏదైనా ఉంటే నీ దగ్గర పెట్టుకో అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి సరయు ఉన్నది హౌస్లో ఒక వారమే అయినప్పటికీ ఇవ్వాల్సిన వారికి భారీ ఇచ్చినట్టు తెలుస్తోంది.