Tag Archives: shooting

Balakrishna: సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న బాలయ్య.. అదే ప్రధాన కారణమా?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి బాలయ్య అద్భుతమైనటువంటి హిట్ అందుకున్నారు.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగుకు బాలకృష్ణ బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది ఏకంగా రెండు నెలలపాటు సినిమా షూటింగ్లకు ఈయన దూరం కాబోతున్నారు.

వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి బాలయ్య ఉన్నఫలంగా షూటింగుకు బ్రేక్ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో ఈయన ఎన్నికలలో బిజీ కానున్నారు ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ వచ్చే ఎన్నికలలో కూడా అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు.

ఎన్నికలలో బిజీబిజీ…

ఇలా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈయన సినిమా షూటింగులు అన్నింటికీ కూడా కాస్త బ్రేక్ ఇచ్చేసి రాజకీయాలలో బిజీ కానున్నారు ఎన్నికలలో భాగంగా పెద్ద ఎత్తున హిందూపురం నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఏపీ అంతటా కూడా బాలకృష్ణ పర్యటించబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించే పనులలో బాలయ్య బిజీ కాబోతున్నారని తెలుస్తుంది.

Jagapathi Babu: ఆ సినిమా షూటింగ్ సమయంలో వారం రోజులు తిండి పెట్టలేదు… చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న జగపతిబాబు!

Jagapathi Babu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ప్రతి ఒక్కరు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్న సంఘటనలను మనం చూసే ఉంటాం. ఇలా ఎంతోమంది కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి చేదు సంఘటనలను ఏదో ఒక సందర్భంలో బయటపెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నటుడు జగపతిబాబు సైతం తాను కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి తెలియజేశారు.

జగపతిబాబు ఎన్నో సినిమాలలో హీరోగా నటించారు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతోమంది యంగ్ హీరోలకు ఈయన తండ్రి పాత్రలలో నటిస్తున్న మెప్పించారు.ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా ఉన్నటువంటి జగపతిబాబు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ సాహసం సినిమా షూటింగ్ సమయంలో తన జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక చేదు సంఘటన జరిగిందని తెలిపారు. ఈ సినిమాలో తాను సెకండ్ హీరోగా చేస్తున్నానని అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వారం రోజులపాటు కనీసం తనకు తిండి పెట్టలేదని తిన్నావా అని అడిగే వారు కూడా లేకుండా పోయారని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.

Jagapathi Babu: నా జీవితానికి గుణపాఠం…

ఈ విధంగా తాను తిండి తిప్పలు లేకుండా ఉండడంతో ఒక లైట్ బాయ్ వచ్చి తన పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారని జగపతిబాబు తెలిపారు. అయితే ఆ చేదు సంఘటన నా జీవితానికి ఒక గుణపాఠంగా మారిందని ఈయన తెలిపారు. సాధారణంగా ఇతర భాషల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చే సెలబ్రిటీలకు మంచి గౌరవం ఉంటుందని అదే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి ఏమాత్రం గౌరవం ఉండదంటూ ఈయన అప్పటి విషయాలను గుర్తు చేసుకొని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Venkatesh: ‘ఓరి దేవుడా’ సినిమా కోసం వెంకీ అంతా రెమ్యూనరేషన్ తీసుకున్నాడా?

Venkatesh: దగ్గుబాటి కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విక్టరీ వెంకటేష్ గురించి తెలియనివారు ఉండరు. ఎన్నో దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్న వెంకటేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇటీవల వెంకటేష్ నటించిన ఎఫ్3 సినిమా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక ప్రస్తుతం వెంకటేష్ హీరోగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలలో కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమాలో కూడా వెంకటేష్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా కథని మలుపు తిప్పే కీలక పాత్రలో వెంకటేష్ 15 నిమిషాల పాటు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

తమిళ భాషలో మంచి హిట్ అయిన ‘ఓ మై కడువులే’ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేసి ‘ఓరి దేవుడా’ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాకి మాతృకను తెరకెక్కించిన అశ్వత్‌ మారిముత్తునే దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడిగా మితిలా పార్కర్‌ నటించింది. అంతే కాకుండా ఆశ భట్, మురళీ శర్మ, రాహుల్‌ రామకృష్ణ వంటి వారు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Venkatesh: ఐదు రోజుల కోసం కోట్లలో రెమ్యూనరేషన్..

ఇదిలా ఉండగా తాజాగా విక్టరీ వెంకటేష్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సినిమాలలో ఫుల్ లెన్త్ పాత్రలో నటించినందుకు వెంకటేష్ 5 నుండి 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. అయితే ఈ సినిమాలో కేవలం 15 నిమిషాల పాత్ర కోసం వెంకటేష్ 5 రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఐదు రోజుల షూటింగ్ కోసం వెంకటేష్ ఏకంగా మూడు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియదు కానీ.. వెంకటేష్ రెమ్యురేషన్ మరీ ఎక్కువగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Sarkaru Vaari Paata: మహేష్ బాబు లేకుండా ‘‘సర్కారు వారి పాట’’ షూటింగ్.. ఎందుకో తెలుసా?

Sarkaaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ సర్కార్ వారి పాట’. దాదాపుగా ఏడాది కాలం నుంచి మహేష్ బాబును తెరపైన చూడలేదు. గతేడాది వచ్చిన ‘సరిలేరు నీకేవ్వరు’ సినిమాలో ఫ్యాన్స్ ను, ఆడియన్స్ ను అలరించినప్పటికీ.. అనుకున్నంతగా పెద్ద హిట్ సాధించలేదు. 

Sarkaru Vaari Paata: మహేష్ బాబు లేకుండా ‘‘సర్కారు వారి పాట’’ షూటింగ్.. ఎందుకో తెలుసా?

ఈ సంక్రాంతికైనా.. తమ స్టార్ హీరోను థియేటర్లలో చూస్తమని అనుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.  ప్రస్తుతం మహేష్ బాబు కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నారు మహేష్. అయితే ఈలోపలే కరోనా ఎటాక్ కూడా అయింది.

Sarkaru Vaari Paata: మహేష్ బాబు లేకుండా ‘‘సర్కారు వారి పాట’’ షూటింగ్.. ఎందుకో తెలుసా?

దీంతో హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. దీనితో పాటు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించడంతో బాధలో ఉన్నారు మహేష్. చిన్నప్పటి నుంచి తన అన్న రమేష్ బాబు అంటే మహేష్ బాబుకు ఎనలేని గౌరవం.


మహేష్ లేకుండానే ‘సర్కారు వారి పాట’..

వీటన్నింటి మధ్య సర్కారు వారి పాట షూటింగ్ జరగాల్సి ఉంది. మరోవైపు హీరోయిన్ కీర్తి సురేష్ కు కూడా కరోనా సోకడంతో షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది.  ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ లేకుండానే సర్కార్ వారి పాట షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ వైజాగ్ బీచ్ రోడ్, జగదాంబ సెంటర్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమాను ఈ ఏడాది ఎప్రిల్ 1న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.  సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. యువ సంగీత కెరటం థమన్ ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Ramcharan: షూటింగ్ కు వెళ్లడం బోరింగ్..! అదొక్కటే కాదు క్రమశిక్షణ కూడా ముఖ్యమే..!

Ramcharan: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో ఆశిష్. ఈయన నటిస్తున్న తొలి సినిమా ’రౌడీ బాయ్స్’. అందాల తార అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా, శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది.

Ramcharan: షూటింగ్ కు వెళ్లడం బోరింగ్..! అదొక్కటే కాదు క్రమశిక్షణ కూడా ముఖ్యమే..!

దిల్ రాజు కుటుంబం నుంచి హీరోగా వస్తుండటంతో  ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా బుధవారం హైదరాబాద్లో జరిగిన ‘రౌడీ బాయ్స్ మ్యూజికల్ ఈవెంట్’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథిగా వచ్చారు.

Ramcharan: షూటింగ్ కు వెళ్లడం బోరింగ్..! అదొక్కటే కాదు క్రమశిక్షణ కూడా ముఖ్యమే..!

ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో టాలెంట్ ముఖ్యం కాదని.. దాని కన్నా ముఖ్యం క్షమశిక్షణ అని అన్నారు. మా నాన్న చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్, యాక్టింగ్ నేర్పించలేదని.. అంతకన్నా ముఖ్యమైన క్రమ శిక్షణని నేర్పించాడని అన్నారు.

ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల వాయిదాతో..

రాజు, లక్ష్మణ్ గార్లు ఉండటం వల్లనో .. నేను, మహేశ్ బాబు, ప్రభాస్ సపోర్ట్ చేయడం వల్లనో గొప్ప స్థాయి రాదు.. నీ కష్టమే నిలబెడుతుందని ఆశిష్ గురించి అన్నారు. రోజూ వర్క్ అవుట్ చేయడం, షూటింగ్ కు వెళ్లడం బోరింగ్ ఉంటుందని కానీ.. ప్రస్తుతం స్టార్లుగా ఉన్నవాళ్లంతా ఇదంతా చేసే వచ్చారని తెలిపారు. అనుపమా మంచి నటి అని రామ్ చరన్ కొనియాడారు. ఇదిలా ఉంటే తన ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల వాయిదా పడటంపై రామ్ చరణ్ స్పందించారు. మూడేళ్ల కష్టపడి చేసిన సినిమా అని.. సరైన సమయంలోనే రావాలని రామ్ చరణ్ అన్నారు. ఎప్పుడు రావాలనే అంశాన్ని దానయ్య, రాజమౌళి నిర్ణయిస్తారని తెలిపారు. ‘ రౌడీ బాయ్స్ ’ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు రామ్ చరణ్.

డబ్బులు ఇచ్చేది అందుకే.. ‘అర్జెంటుగా షూటింగ్ కు వెళ్ళు..’ అంటూ బాలకృష్ణకు ఆర్డర్ వేసిన ఎన్టీఆర్!

సీనియర్ నటుడు, విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు నటించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన రామారావు ఇప్పటికే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. రామారావు నటించిన ఎన్నో సినిమాలలో డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. నిజానికి సింగీతం శ్రీనివాస్ దర్శకధీరుడు కె.వి.రెడ్డి శిష్యునిగా ఇండస్ట్రీలోకి “మాయాబజార్” సమయంలోనే అడుగు పెట్టారు.

ఈ విధంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సింగీతం శ్రీనివాస్ ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈయన దర్శకత్వంలో ఎన్టీఆర్ తో సినిమా తీయాలనే ఆశ అలాగే మిగిలిపోయింది. కానీ ఆయన కుమారుడు బాలకృష్ణ హీరోగా మూడు సినిమాలను తెరకెక్కించారు. ఇందులో రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా ఒకటి మాత్రం ఫ్లాప్ సినిమాగా నిలబడిపోయింది. గత కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో సింగీతం శ్రీనివాస్ ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బాలకృష్ణ హీరోగా “ఆదిత్య 369”, “భైరవ ద్వీపం” “కృష్ణార్జున యుద్ధం” సినిమాలను తెరకెక్కించారు. సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ అచ్చం ఎన్టీ రామారావు గారి ఆలోచనా విధానాన్ని అతని పద్దతులను ఆచరించే వారిని శ్రీనివాస్ తెలియజేశారు. ఎన్టీఆర్ గారు పౌరాణిక వేషాలు వేసేటప్పుడు ఖాళీ సమయంలో తనపై ఉన్న నగలను తీయకుండా సాయంత్రం షూటింగ్ కి ప్యాకప్ చెప్పే సమయం వరక ఒంటిపై అలాగే వేసుకునేవారు, వాటిని తీసేస్తే మరి వేసుకోవడానికి సమయం పడుతుందని చెప్పేవారు. అచ్చం బాలకృష్ణ కూడా అదే పద్ధతులను అనుసరించేవారు.

ఆదిత్య 369 సినిమా షూటింగ్ జరిగేటప్పుడు భవిష్యత్ కాలం షాట్స్ తీసేటప్పుడు లైటింగ్ సెట్ చేసుకోవడానికి కాస్త సమయం ఎక్కువ పట్టేది. ఈ క్రమంలోనే సెట్స్ కి వచ్చిన ఆర్టిస్టులందరూ ఖాళీగా కూర్చునేవారు. అందుకోసమే బాలకృష్ణ గారిని కాస్త ఆలస్యంగా సెట్ కి రమ్మని చెప్పారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఇంట్లో కూర్చొని ఉండడంతో ఎన్టీఆర్ తన దగ్గరకు వెళ్లి ఏంటి షూటింగ్ లేదా అని అడిగారట.. ఉంది డైరెక్టర్ గారు ఆలస్యంగా రమ్మన్నారని బాలకృష్ణ చెప్పడంతో నిర్మాతలు మనకు డబ్బులు ఇచ్చేది వారికి ఎప్పుడూ మనం అందుబాటులో ఉండటం కోసమే ముందు మేకప్ వేసుకుని షూటింగ్ కి వెళ్ళు అంటూ ఆర్డర్ వేయడంతో బాలకృష్ణ వెంటనే షూటింగ్ కి వచ్చారని, అది అన్నగారి పద్ధతి ఆ పద్ధతినే బాలకృష్ణ కూడా అనుసరిస్తూ వచ్చారని ఓ సందర్భంలో సింగీతం శ్రీనివాస్ వెల్లడించారు.