Tag Archives: singer

Singer Sid Sriram: ఒక్క పాట కోసం సింగర్ సిద్ శ్రీరామ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?

Singer Sid Sriram: టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ లలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ఈ యంగ్ సింగర్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకు గల కారణం ఈ హీరో పాడే ప్రతి ఒక్క పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈయన పాటలు కూడా ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోవడంతో ఈయనకు భారీ డిమాండ్ ఏర్పడింది.

ఒక్క పాట కోసం సింగర్ సిద్ శ్రీరామ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?

ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రతి సినిమాలోనూ తనతో పాట పాడించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క దర్శకుడు సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ కోసం ఎదురుచూడటంతో ఈయనకు ఇండస్ట్రీలో ఎంతో డిమాండ్ ఏర్పడింది.

ఒక్క పాట కోసం సింగర్ సిద్ శ్రీరామ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?

ఇప్పటివరకు సిద్ శ్రీరామ్ పాడిన సామజ వరగమన, నీలి నీలి ఆకాశం, మగువా..మగువా.., నా కనులు ఎప్పుడు, శ్రీవల్లి అద్భుతమైన పాటలను పాడి మంచి గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఏర్పడిన ఈ సింగర్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

సింగర్ గా భారీ రెమ్యూనరేషన్…

సాధారణంగా సింగర్ కు తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తారు. అయితే సింగర్ సిద్ది శ్రీరామ్ మాత్రం ఒక పాట పాడితే ఆయనకు సుమారుగా ఐదు నుంచి ఏడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంటే ఆయన పాడే పాటలకు ఏవిధమైనటువంటి క్రేజ్ ఉందో మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా సింగర్ గా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం విశేషం.

Latha Mangeshkar:లతా మంగేష్కర్ కోసం సంపాదించిందంతా ఇచ్చేసిన ఆటో డ్రైవర్.. అతనేవరంటే?

Latha Mangeshkar:ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన మధురమైన గాత్రంలో కేవలం భారతదేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాలు గెల్చుకున్నారు లతా మంగేష్కర్. కాగా ఈ నెల 8న కరోనా బారిన పడిన ఆమె ప్రస్తుతం ముంబయి బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వయసు రీత్యా ఐసీయూలో ఉంచి ఆమెకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. కాగా మంగేష్కర్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Latha Mangeshkar:లతా మంగేష్కర్ కోసం సంపాదించిందంతా ఇచ్చేసిన ఆటో డ్రైవర్.. అతనేవరంటే?

ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై గురించి ఆమెను పరీక్షిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ స్పందించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని… అయితే ఆమెను ఇంకా ఐసీయూలోనే ఉంచి పరిశీలిస్తున్నామని తెలిపారు. లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని… ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆటో డ్రైవర్ లతా మంగేష్కర్ కోసం చేసిన ఓ పనికి అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు.mu

Latha Mangeshkar:లతా మంగేష్కర్ కోసం సంపాదించిందంతా ఇచ్చేసిన ఆటో డ్రైవర్.. అతనేవరంటే?

లతా మంగేష్కర్ కోసం ఉన్నదంతా ఇచ్చేసిన ఆటో డ్రైవర్ సత్యవాన్…

ముంబయి పట్టణంలో నివసించే సత్యవాన్ గీతే లతా మంగేష్కర్‌కి పెద్ద అభిమాని. లతా మంగేష్కర్‌ను అతను సరస్వతి దేవి రూపంగా భావిస్తాడు. అందుకే తన జీవనాధారమైన ఆటోను కూడా గాయని బొమ్మలతోనే అందంగా అలంకరించాడు. తన ఆటోలో కూడా ఆమె ఆలపించిన పాటలనే వింటూ ఉంటాడు. కాగా లతా మంగేష్కర్ కరోనాతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని నిరంతరం ప్రార్థనలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదనను ఆమె ఆరోగ్య ఖర్చుల కోసం దానం చేశాడు.

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా పాజిటివ్.. ఐసీయూలో చికిత్స..!

Lata Mangeshkar: భారత్ లో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల వరకు కేవలం 10 వేల లోపు ఉన్న కరోనా కేసులు ప్రస్తుతం లక్షల్లో నమోదవుతున్నాయి. దీనితో పాటే.. ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలోని ప్రతీ రాష్ట్రం అప్రపమత్తమయ్యాయి.

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా.. ఐసీయూలో చికిత్స..!

దీనిలో భాగంగానే నైట్ కర్ప్యూ, లాక్ డౌన్ లు లాంటివి పెడుతున్నారు. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్లను కూడా విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా సెలెబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కమల్ హాసన్, మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విక్రమ్, సత్యారాజ్, డైరెక్టర్ ప్రియదర్శన్, సంగీత దర్శకుడు థమన్, త్రిషకు కూడా కరోనా బారిన పడ్డారు. అందులో కొంతమంది కోలుకున్నారు. మరికొంత మంది ఇంట్లోనే హోం క్వారంటైనల్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు కరోనా.. ఐసీయూలో చికిత్స..!

ఇలా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్​ కూడా కరోనా బారినపడ్డారు. లతా మంగేష్కర్ మేనకోడలు రచన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమెకు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.


Lata Mangeshkar : ఆందోళనలో అభిమానులు..

ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఇక ఆమె రెండు సంవత్సరాల క్రితం వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆమె అక్కడ చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆమె వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్స్ ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రతీ ఒక్కరు మాస్క్ లు ధరించాలని.. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న వేళ.. అనవసరంగా బయటకు రావొద్దని.. భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

AR Rahman: ఘనంగా ఏఆర్‌ రెహమాన్‌ కూతురి నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా..?

AR Rahman: ఏ ఆర్ రెహమాన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు ఈ ఆస్కార్ గ్రహీత. తమిళ ఇండస్ట్రీలో మొదలైన రెహమాన్ సంగీత ఝరి విశ్వ వ్యాప్తం అయింది. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ కూడా అందుకున్న విషయం మనకు తెలసిందే.

AR Rahman: ఘనంగా ఏఆర్‌ రెహమాన్‌ కూతురి నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా..?

అయితే తాజాగా ఏ ఆర్ రెహమాన్ పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్ ఎంగేజ్ మెంట్ జరిగిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్వరలోనే రెహమాన్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. చెన్నైలో కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో రెహమాన్ కూతురు ఎంగేజ్ మెంట్ జరిగిందని తెలుస్తోంది.

AR Rahman: ఘనంగా ఏఆర్‌ రెహమాన్‌ కూతురి నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా..?

అయితే ఖతీజా తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. ఆడియో, వ్యాపారవేత్త అయిన రియాసిద్దీన్‌ షేక్‌ మహ్మద్‌తో త్వరలో ఆమె నిఖా జరగనుంది. అయితే పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఖతీజా పెట్టిన ఫోటోలు వైరల్ గా మారాయి. 

ఖతీజా సింగర్ గా కూడా గుర్తింపు ..

ఏఆర్ రెహమాన్ కు ఇద్దరు కూమార్తెలు కాగా… ఒక కుమారుడు ఉన్నాడు. ఖతీజా పెద్ద కూతురు కాగా చిన్నకూతురు పేరు రహీమా, కుమారుడి పేరు అమీన్ రెహ్మాన్. ఖతీజా సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో రోబో సినిమాలో ’ మర మనిషి‘ పాటను పాడింది.  ఆ తరువాత ‘ఫరిష్టోన్’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను కూడా విడుదల చేసింది. ఈ మ్యూజిక్ వీడియో ఉత్తమ యానిమేషన్ మ్యూజిక్ వీడియోగా గుర్తింపు పొందింది. మరో కుమార్తె బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. అందుకు తగ్గట్లు నటనలో శిక్షణ తీసుకుంటుంది.

Indian Idol 9 Winner: ఇండియన్ ఐడల్ విజేతకు ఎంగేజ్ మెంట్..ఫొటోలు వైరల్..!

Indian Idol 9 Winner: లొల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ అలియాస్ రేవంత్. ఇతడు ఒక ప్లేబ్యాక్ సింగర్. తెలుగు భాషలో తన పాటలకు ప్రసిద్ధి చెందాడు. అతడు తెలుగు, కన్నడ చిత్రాలకు దాదాపు 200 పాటలకు పైగా పాడారు. ఇక దేశవ్యాప్తంగా సింగర్స్ కు ఎంతో ప్రాముఖ్యత ఉన్న షో.. ఇండియన్ ఐడల్.

Indian Idol 9 Winner: ఇండియన్ ఐడల్ విజేతకు ఎంగేజ్ మెంట్..ఫొటోలు వైరల్..!

ఈ ఇండియన్ ఐడల్ లో నే బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ 5 విజేతగా నిలిచి బిగ్ బాస్ లోకి వెళ్లాడు. ఇక రేవంత్ కూడా 9వ సీజన్ లో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్నాడు. అతడు బాహుబలి: ది బిగినింగ్ చిత్రంలోని ” మనోహరి ” పాట పాడాడు. దీనికి గాను అతడికి IIFA ఉత్సవాల్లో ఉత్తమ నేపథ్య గాయకునిగా స్టార్ మా మ్యూజిక్ అవార్డు ను అందుకున్నాడు.

Indian Idol 9 Winner: ఇండియన్ ఐడల్ విజేతకు ఎంగేజ్ మెంట్..ఫొటోలు వైరల్..!

ఇక 2010లో అతడు సూపర్ సింగర్ 5 మ్యూజిక్ షో తో మొదలైన అతడి ప్రయాణం.. సీటీమార్ చిత్రంలోని సీటీమార్ టైటిల్ సాంగ్ వరకు సాగింది. ఇంకా అతడు ఎన్నో పాటలను తన గాత్రంతో వినిపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా.. అతడికి గురించి తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. అతడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇన్ స్టాలో ఫొటోలు వైరల్..

దానికి సంబంధించి ఫొటోలను అతడు ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశాడు. కాబోయే భార్య పేరు అన్వితగా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డిసెంబర్ 24న ఆమెతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. దీంతో ఎంతో మంది సెలెబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తను పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి ఓపెన్ అయిన శ్రీరామచంద్ర.. ఆ విషయంలో నిర్ణయం వారిదే..?

బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ గెలవడానికి శ్రీరామ చంద్ర , షణ్ముఖ్ జస్వంత్ తమ సొంత గేమ్ స్ట్రాటజీని కలిగి ఉన్నారు. వాళ్లిద్దరికి బయట కూడా అలానే అభిమానులు కలిగి ఉన్నారు. కానీ బిగ్ బాస్ షోలో వారి ప్రదర్శన విషయానికి వస్తే.. శ్రీరామ్.. షన్ను ఒక్కసారి మాత్రమే గొడవపడ్డారు.

తరువాత వారు ఎటువంటి వాగ్వాదాలకు దిగలేదు. ఇలా వాళ్లిద్దరు హౌస్ లో మంచి స్నేహితులుగా సాగారు. సిరితో షణ్ముఖ్ టైం ఎక్కువగా స్పెండ్ చేస్తున్న సమయంలో శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్ తో కనెక్ట్ కాలేకపోయారు. ఇక వీరిద్దరు కలిసి స్నేహితులుగా ముందుకు సాగితే బిగ్ బాస్ టైటిల్ ఫలితం వేరే విధంగా ఉండేదని ఒక వర్గం ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు.

ఇక శ్రీరామచంద్ర సెకండ్ రన్నరప్ కు హౌస్ నుంచి వెనుదిరిగాడు. ఇండియన్ ఐడల్ 5 గెలుచుకున్న శ్రీరామచంద్ర .. బిగ్ బాస్ 5 కూడా గెలుచుకుంటానని.. 5 అనే అంకె సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకున్నానని.. కానీ అది జరగలేదని చెప్పుకొచ్చాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత అతడు వివిధ ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

ఇక ఓ ఇంటర్వ్యూలో ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తన పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడు.. తను పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో మొత్తం బాధ్యత తన తల్లిదండ్రులదే అని చెప్పుకొచ్చాడు. గత మూడు సంవత్సరాల నుంచి తన పెళ్లి గురించి ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారని చెప్పాడు.

అమ్మానాన్నలను మంచిగా చూసుకోవాలి.. ఇంట్లో వాళ్తతో ఎక్కువగా కలిసి పోయే గుణం ఉండాలి.. అంతకంటే ముఖ్యంగా తన ఆలోచనలకు తగ్గట్టూ ఉండాలని అతడు.. తన కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం ఉందన్నాడు.

ఆటోడ్రైవర్ గా మారిన రాహుల్ సిప్లిగంజ్.. ఏమంత కష్టం ఏమోచ్చిందో ఏమో!

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. ఇతడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా పాటల, జానపద పాటల గాయకుడు. అతడు రచయిత కూడా. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్ లో ప్రాచూర్యం పొందిన రాహుల్.. 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో సినిమారంగంలోకి ప్రవేశించాడు.

ఆ తరువాత దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’, రచ్చ సినిమాలో ’సింగరేణి ఉంది’, ఛల్ మోహన రంగా సినిమాలో ‘పెద్దపులి’ వంటి పాటలతో గుర్తింపు పొందాడు. ఇలా అతడు ఎన్నో సినిమాలకు పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చకున్నాడు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో ‘నాటు నాటు నాటు సాంగ్’ తో మళ్లీ వెలుగులోకి వచ్చాడు.

ఆ పాట హిట్ కావడంతో ఇటీవల రాహుల్ మళ్లీ మీడియా ముందు ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇక అతడు ముంబాయ్ వీధుల వెంట తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. అదేంటి అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ముంబాయ్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో భాగంగా రాహుల్ కూడా ముంబయ్ వెళ్లాడు.

అక్కడ ఓ ఆటోను నడపుతూ.. ఉత్సాహంతో డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఆటో డ్రైవర్ గా మారిన రాహుల్.. ఆటో నడిపే వారి విషయంలో గౌరవం పెరిగిందని.. తాను చాలా విషయాలు నేర్చుకున్నాను అంటూ ఓ వీడియో ను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఓ నెటిజన్ ‘చిచ్చా.. సైడ్ బిజినెస్ బాగుందంటూ’ సరదాగా కమెంట్ చేశాడు.

బిగ్ బాస్ 5లో శ్రీరామచంద్ర రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా..?

తెలుగులో ప్రసారం అయిన బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ పూర్తయింది. 105 రోజుల ఈ జర్నీ ఎట్టకేలకు మొన్న గ్రాండ్ గా ముగిసింది. అయితే హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లు అడుపెట్టగా.. మొదటి వీక్ లో సరయు ఎలిమినేట్ అయింది.

తర్వాత స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్లు అందరూ హౌజ్ నుంచి బయటకు వచ్చేశారు. అందులో ముఖ్యంగా యాంకర్ రవి బయటకు రావడం అటు అభిమానులకు.. సగటు ప్రేక్షకుడికి రుచించలేదు. ఎలిమినేషన్ అంతా ఫేక్ అంటూ ఆరోపించారు. అంతక ముందు విశ్వా విషయంలో కూడా అంతే జరిగింది.

ఆటలో ఎంతో చురుకుగా ఉండే విశ్వా కూడా హౌస్ నుంచి అనూహ్యంగా బయటకు వచ్చాడు. ఇక టాప్ 5లో మిగిలిన సిరి, మానస్, సన్నీ, షణ్ముఖ్ మరియు శ్రీరామంచంద్రలు మిగిలారు. ఇందులో మొదట సిరి ఎలిమినేట్ కాగా.. తర్వాత టాప్ 4 గా మానస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. తర్వాత శ్రీరామచంద్ర టాప్ 3 గా బయటకు వచ్చేశారు.ఇక హౌస్ నుంచి వచ్చిన వాళ్లు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

ఈ విషయాలను తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఈ విషయంలో సోషల్ మీడియాలో తెగ వెతుకుతుంటారు. అయితే తాజాగా ఇండియన్ ఐడల్ 5 విజేత శ్రీరామ్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలిసిపోయింది. ఆ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడికి వారానికి రూ. రెండు నుంచి రూ.3లక్షల చొప్పున అందుకున్నాడట. అతడు మొత్తం 15 వారాలు హౌస్ లో ఉన్నాడు. దీనిని బట్టి చూస్తే అతడు మొత్తంగా రూ. 35 లక్షల వరకు సంపాదించాడని తెలుస్తోంది.

హమీదాతో రిలేషన్ పై శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్.. సెంటిమెంట్ వర్కౌట్ కాలేదంటూ..!

బిగ్ బాస్ సీజన్ -5 ముగిసింది. వీజే సన్నీ విజేతగా నిలిచారు. దాదాపు 15 వారాల పాటు హౌజ్ లో గడిపిన కంటెస్టెంట్లు తమతమ విషయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా అందరిలో అంచనాలు క్రియేట్ చేసిన శ్రీరామ్ చంద్ర టాప్ -3లో నిలిచారు.

ఇండియన్ ఐడల్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన తర్వాత.. ఫైనల్ బరిలో ఖచ్చితంగా శ్రీరామ్ ఉంటారని ప్రేక్షకులు ముందు నుంచే అనుకుంటున్నారు. అయితే టాప్ 3తోనే శ్రీరామ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇండియన్ ఐడల్ గా దేశవ్యాప్తంగా సుపరిచితమైన శ్రీరామచంద్రకు సోనూ సూద్, శంకర్ మహాదేవన్ వంటి వారూ కూడా మద్దతు పలికారు.

అయితే తన బిగ్ బాస్ జర్నీ గురించి తాజాగా శ్రీరామ చంద్ర కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  అయితే తన ఓటమికి కారణాలు తెలియవని.. నా ఆటను నేను ఆడానని.. కానీ ప్రేక్షక్షుల నిర్ణయాన్ని గౌరవిస్తా అన్నారు. గతంలో ఇండియన్ ఐడల్ -5 గెలిచానని.. బిగ్ బాస్ -5 కూడా గెలుస్తాననే నమ్మకం ఉండేదని… సెంటిమెంట్ వర్కవుట్ కాలేదన్నారు.

సన్నీ, షణ్మక్ ఇద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. ఇక  హమీదాతో తన రిలేషన్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీరామ్ మేం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. క్లోజ్ అవుతున్న క్రమంలోనే హమీదా ఎలిమినేట్ అయ్యారని.. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదని శ్రీరామ చంద్ర చెప్పారు.

మరోసారి సింగర్ గా మారిన దిల్ రాజు.. వీడియో వైరల్..

సినిమాల్లో కాస్త డిఫరెంట్ గా హీరోలు, హీరోయిన్లతో పాటలు పాడించడం ఈ మధ్య చాలనే చూస్తున్నాం… గతంలో ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రమే పాటలు పాడాలన్నా సంప్రదాయం నుంచి ప్రస్తుతం కాస్త వెరైటీగా హీరోలు, హీరోయిన్లు తమ గొంతును సవరించుకుంటున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో వెంకీ, చిరంజీవి, పవన్ కళ్యాన్, రవితేజ, ఎన్టీఆర్ వంటి వారు తమ సినిమాల్లో పాటలు కూడా పాడారు. మరో వైపు రాశీ ఖన్నా, శృతి హాస‌న్ వంటివారు కూడా పాటలు పాడారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ పాట పాడారు.

కరీంనగర్ లో జరిగిన  ‘అమిగోస్ డ్రైవ్ ఇన్’ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు పాటలు పాడడం విశేషం. ఆయన నిర్ణయం సినిమాలోని ‘హలో గురు ప్రేమ కోసమే’ అనే పాటను పాడుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. దీంతో ఆయనలోని సింగింగ్ టాలెంట్ను బయటకి తీశారు. మొదట మొహమాటంగా పాడినట్లు కనిపించినా.. తరువాత పాటలో లీనమై పాటను పాడారు. 

గతంలో కూడా దిల్ రాజు సినిమాలో పాటపాడారు. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ ను దిల్ రాజు నిర్మించారు. ఆ సినిమాలో ‘అన్నయ్యెచ్చినాడు’ అంటూ మొదటి సారిగా పాటను పాడారు. ఆస్పూర్తితోనే మళ్లీ తనలోని గాయకుడిని బయకు తీశారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు పాడిన పాట వీడియో వైరల్ అయింది.