Tag Archives: Suhasini

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం లోని రెండో పాటను విడుదల చేసిన బాహుబలి విజయేంద్ర ప్రసాద్

ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం “హనీమూన్ ఎక్స్‌ప్రెస్”. తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు.

అయితే కళ్యాణి మాలిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్వరపరిచిన మరో రొమాంటిక్ పాట ‘ప్రేమ’ ను బాహుబలి విజయేంద్ర ప్రసాద్ గారు విడుదల చేసి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ అందమైన ప్రేమ గీతానికి అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో ప్రాణం పోశారు.

అయితే ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు ఆర్ పి పట్నాయక్, గోపి మోహన్, చైతన్య ప్రసాద్, రవి వర్మ తదితరులు ప్రత్యక్షం గాను, ఆస్కార్ అవార్డు విజేత ఎమ్ ఎమ్ కీరవాణి, అవసరాల శ్రీనివాస్, ఇంద్రగంటి మోహన కృష్ణ గార్లు వీడియో కాల్స్ తో తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ముఖ్యంగా కీరవాణి గారు కళ్యాణి మాలిక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఇటీవల విడుదల అయిన నిజమా పాట అద్భుతంగా ఉంది, యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది అని కొనియాడి ఇప్పుడు రెండో పాట ‘ప్రేమ’ కి మరింత ఆదరణ లభించాలి అని ఆశీర్వదించారు.

సమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA))
బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd)
చిత్రం పేరు : హనీమూన్ ఎక్స్‌ప్రెస్

నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు

సంగీతం : కళ్యాణి మాలిక్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్
లిరిక్స్ : కిట్టు విస్సప్రగడ
ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా వి ఎమ్ కె
ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి
ఆడియో : టి సిరీస్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)
రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని

Balakrishna: సుహాసినితో నాది జన్మజన్మల అనుబంధం… షాకింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ!

Balakrishna: బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంత మంచి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడవ సీజన్ కూడా ప్రసారమవుతుంది. ఇప్పటికే ఈ సీజన్లో రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. మూడవ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి ప్రోమో ఇటీవల విడుదలైంది.

ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి సీనియర్ నటి సుహాసిని అలాగే శ్రీయ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు జయంతి సి పరాంజీ కూడా హాజరయ్యారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలోకి వీరందరూ ఎంట్రీ ఇవ్వగానే బాలకృష్ణ గారికి వెల్కమ్ చెప్పడమే కాకుండా సుహాసినితో తనకున్నటువంటి అనుబంధం గురించి తెలియజేశారు.

ఇక వీరిద్దరూ కలిసి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నాకు సుహాసినికి జన్మజన్మల అనుబంధం ఉందని తెలియజేశారు. ఇక శ్రియతో నాకు మిలీనియం బంధం ఉంది అంటూ బాలయ్య ఈ సందర్భంగా తెలిపారు. సుహాసిని బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ అప్పట్లో బాలకృష్ణ గారు ఎంతో సిగ్గుపడేవారు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీయ గట్టిగా అరిచేశారు.

పాత కక్షలు ఉన్నాయి…

వెంటనే హరీష్ శంకర్ మీరు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు అనడంతో వెంటనే బాలయ్య నువ్వు అసలు మాట్లాడుకు నువ్వు ఒక పక్కన కూర్చో అంటూ చెప్పారు. దీంతో జయంత్ ఎందుకలా అని ప్రశ్నించడంతో బాలయ్య మాట్లాడుతూ ఆయనతో నాకు పాత కక్షలు చాలా ఉన్నాయని బాలయ్య చెప్పటం గమనార్హం. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో వైరల్ గా మారింది.

Suhasini: సినిమా రివ్యూ ఇవ్వడానికి నువ్వెవరు.. ఉమైర్ సందు పై సుహాసిని స్ట్రాంగ్ కౌంటర్?

Suhasini: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తెరకెక్కే ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియాస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలవుతుందంటేనే ఆ సినిమాపై ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు.ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్.ఈ సినిమా నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూ ఉమైర్ సందు ఇచ్చారు.. దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఈ సినిమా గురించి రివ్యూ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.సినిమాలో హైలెట్ పాయింట్స్ ఇవే అంటూ సినిమా గురించి ఈయన తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతంగా ఉందని,సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్, విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని చెప్పారు.

ఈ సినిమా ద్వారా ఐశ్వర్యారాయ్ తిరిగి ఫామ్ లోకి వచ్చిందని చాలా ట్విస్టుల నడుమ ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడి చేత క్లాప్స్ కొట్టించేలా ఉందంటూ ఈ సినిమా గురించి ఈయన పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల కాకుండానే ఈయన రివ్యూ ఇవ్వడంతో మణిరత్నం భార్య నటి సుహాసిని అసలు నువ్వు ఎవరు? విడుదల కాని సినిమాని మీరు ఎలా చూశారు అంటూ ఈమె కౌంటర్ వేశారు.

Suhasini: రివ్యూయర్ పై మండిపడిన సుహాసిని..

ఈ విధంగా సుహాసిని ఉమైర్ సందు ట్వీట్ కి రిప్లై ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ అంటే ఈయన సినిమా చూడకుండానే ఫేక్ రివ్యూ ఇస్తున్నారా అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఆయన దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు ఆయన సినిమా చూసే అవకాశం ఉంటుంది అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికి సుహాసిని ఈ సినిమాకి ఇచ్చిన రివ్యూ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.

Focus Movie: విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విడుదలైన ఫోకస్ చిత్రం నుంచి సుహాసిని ఫస్ట్ లుక్ !

Focus Movie: విజయ శంకర్, అషు రెడ్డి ప్రధాన పాత్రలలో జి సూర్య తేజ దర్శకత్వంలో రిలాక్స్ మూవీ మేకర్స్ స్కైరా క్రియేషన్స్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఫోకస్. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.

Focus Movie: విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విడుదలైన ఫోకస్ చిత్రం నుంచి సుహాసిని ఫస్ట్ లుక్ !

ఇప్పటికే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి విజయ్ శంకర్ అషు రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం కీలక పాత్రలో నటిస్తున్నారు.

Focus Movie: విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విడుదలైన ఫోకస్ చిత్రం నుంచి సుహాసిని ఫస్ట్ లుక్ !

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన సుహాసిని మణిరత్నం పోస్టర్ ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సూర్య తేజ డెబ్యూ మూవీ ఫోకస్ చిత్రం టీజర్ ఇప్పుడే చూశాను చాలా అద్భుతంగా ఉంది.ఇంకా ఇతర నటీనటుల పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి సినిమాకు ఎంకరేజ్ చేయండి అంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

మార్చిలో విడుదల కానున్న ఫోకస్…


ఈ పోస్టర్ విడుదల సందర్భంగా దర్శకుడు సూర్య తేజ మాట్లాడుతూ…ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సుహాసిని మణిరత్నం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉందని, మార్చి నెలలో ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలియజేశారు. ఇక ఈ సినిమాలో షియాజీ షిండే, భానుచందర్, భరత్ రెడ్డి సూర్య భగవాన్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

‘ఆఖరిపోరాటం’ సినిమాలో చాన్స్ కోసం సుహాసినితో దర్శకేంద్రుడు ఏమన్నారో తెలుసా?

అలనాటి హీరోయిన్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన ఈమె నటనలోనే కాకుండా కథకురాలిగా.. నిర్మాతగా అనుభవం ఉంది. సుహాసిని మొదట 1980 లో ‘నెంజతై కిల్లతే ’ అనే తమిళ చిత్రంలో నటించారు. తర్వాత ఈమె ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్ళిచేసుకున్న విషయం తెలిసిందే.

అయితే సుహాసిని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఆమె రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ‘మంచిదొంగ‌’, ‘ఆఖ‌రి పోరాటం’ చిత్రాల్లో న‌టించారు. మంచిదొంగ సినిమాలో చిరంజీవి సరసన.. ఆఖరిపోరాటం సినిమాలో నాగార్జున సరసన నటించిన విషయం తెలిసిందే.

మంచిదొంగ సినిమాలో సుహాసిని లాయర్ పాత్ర వేయగా.. మరో హీరోయిన్ గా విజయశాంతి ఇన్ స్పెక్టర్ రోల్ చేశారు. ఆఖరిపోరాటంలో మెయిన్ రోల్ గా శ్రీదేవి నటించగా.. సుహాసిని ఆ సినిమాలో చేయమని మొదట చెప్పింది చిరంజీవి అట. నువ్వు ఆఖరిపోరాటం కథను తప్పనిసరిగా వినాలంటూ చెప్పాడట మెగస్టార్. ఈ రెండు సినిమాల్లో మొదట షూటింగ్ మొదలైంది ఆఖరిపోరాటం కాగా.. మొదట థియేటర్లలో విడుదలైంది మాత్రం మంచిదొంగ.

ఆఖరి పోరాటంలో సుహాసిని పాత్రకు మొదట రేవతి అనుకున్నారట. కానీ రైటర్ జంధ్యాల ఆ పాత్రకు సుహాసిని అయితే సరిపోతుందని చెప్పారట. అయితే రాఘవేంద్రరావును సుహాసిని కలిసినప్పుడు నువ్వు ఈ పాత్ర చేయకపోతే రేవతి చేసే విధంగా ఒప్పించు లేదంటే.. నువ్వే చేయాలి అంటూ ఆ దర్శకుడు అన్నాడట. అలా చిరంజీవి రికమండ్ చేయడం.. రాఘవేంద్రరావు స్వయంగా అడగడంతో ఆఖరిపోరాటంలో సుహాసిని నటించారు.

సుహాసిని -మణిరత్నం పెళ్లి ఎలా జరిగిందో తెలుసా?

దక్షిణాది రాష్ట్రాలలో డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి దర్శకుడు మణిరత్నం ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. మణిరత్నం సినీనటి హీరోయిన్ సుహాసిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి పెళ్లి గురించి అనేక వదంతులు వచ్చాయి. వీరిది ప్రేమ పెళ్లా? లేక పెద్దలు నిశ్చయించిన పెళ్లా? అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. నిజానికి వీరి పెళ్లి ఎలా జరిగింది వీరి పెళ్లి జరగడానికి కారణం ఎవరు అనే విషయానికి వస్తే..

1988 జూన్ నెలలో సుహాసిని తండ్రి చారుహాసన్ కి వెన్ను సమస్యలు రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే సుహాసిని చూస్తూ ఆయన డిసెంబర్ లో ఏ విధమైనటువంటి సినిమాలను ఒప్పుకోకు అని చెప్పారు.తన తండ్రి అలా ఎందుకు చెప్తున్నాడు అర్థం కాని సుహాసినికి తన తండ్రి అసలు విషయం చెప్పాడు.బయట నీ గురించి దర్శకుడు మణిరత్నం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఒకసారి వెళ్లి అతనిని కలువు అంటూ సమాధానం చెప్పాడు.

తన తండ్రి అలా చెప్పగానే సుహాసిని మొహంలో ఆనందం, ఆశ్చర్యం రెండు వ్యక్తమయ్యాయి. అయితే తానెప్పుడు మణిరత్నం గారితో మాట్లాడకపోయినా అతనంటే సుహాసిని ఒక రకమైన గౌరవం ఉండేది. ఈ క్రమంలోనే అతనితో తన తండ్రి మాట్లాడమని చెప్పినప్పుడు ఎంతో ఆనంద పడింది. ఈ క్రమంలోనే అతనితో ఎలా మాట్లాడాలి అని తన స్నేహితురాలు సలహామేరకు ఫోన్ చేసి మణిరత్నం గారితో మాట్లాడింది.

ఈ విధంగా మొదటి సారి వీరిద్దరూ కలుసుకుని ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు.ఈ క్రమంలోనే మణిరత్నం మరోసారి కలుద్దాం అంటూ వెళ్ళాడు. ఆ తర్వాత మరోసారి కలుసుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ విషయాన్ని దాదాపు ఒక వారం రోజుల వరకు ఎవరికీ చెప్పకుండా ఉన్నారు. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు పెళ్లి గురించి మాటలు రావడంతో వీరి పెళ్లి నిశ్చయమైంది.

ఈ విధంగా సుహాసిని మణిరత్నం మధ్య ఏదో జరుగుతుందని బయట వచ్చిన వార్తలే వారి పెళ్లికి పునాదులు వేశాయి. ఈ విధంగా పెద్దల సమక్షంలో 1988 ఆగస్టు 25న వీరి వివాహం జరిగింది. వీరికి నందన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.