Tag Archives: tamil nadu

Amala Paul: లైంగిక వేధింపులకు గురై పోలీసులను ఆశ్రయించిన నటి అమలాపాల్.. కస్టడీలోకి మాజీ ప్రియుడు!

Amala Paul: తెలుగు తమిళ సినిమాలలో నటిగా పలు సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్న అమలాపాల్ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉన్నప్పటికీ తమిళంలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈమె హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలలో నటిస్తున్నారు.

ఇకపోతే గతంలో ఓ డైరెక్టర్ తో ప్రేమలో పడిన ఈమె అతనిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి వైవాహిక జీవితం ఏడాది పాటు కూడా సవ్యంగా సాగలేదని తెలుస్తుంది ఇలా విడాకులతో విడిపోయిన ఈ జంట ప్రస్తుతం ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.విడాకుల అనంతరం అమలాపాల్ కాస్త గ్లామర్ షో చేస్తూ బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి కూడా సిద్ధపడ్డారు.

ఇకపోతే తాజాగా అమలాపాల్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె తమిళనాడులోని విల్లుపురం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి తనని తన మాజీ ప్రియుడు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తన మాజీ ప్రియుడి పై నటి ఫిర్యాదు చేసింది. ఈమె ఫిర్యాదును అంగీకరించిన పోలీసులు ఈమె మాజీ ప్రియుడు పవీందర్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

Amala Paul: ఆర్థిక లావాదేవీలలో మనస్పర్థలు రావడమే…

అమలాపాల్ గతంలో పవీందర్‌ తో కలిసి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆపరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. అయితే ఈ నిర్మాణ సంస్థలో భాగంగా వాటాలలో తేడాలు రావడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.. ఈ క్రమంలోనే అమలాపాల్ తన వాటా కావాలని డిమాండ్ చేయడంతో గతంలో వీరిద్దరూ కలిసి ఎంతో సన్నిహితంగా దిగిన ఫోటోలు వీడియోలను చూపించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ తనపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఈమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు తన మాజీ ప్రియుడుని అదుపులోకి తీసుకున్నారు.తనతో పాటు మరో పదకొండు మందిపై ఫిర్యాదు చేయగా మిగిలిన వారి కోసం పోలీసులు గాలి చర్యలు చేపట్టారు.

Dosa King Movie: మరో రియల్ స్టోరీతో రాబోతున్న జై భీమ్ దర్శకుడు.. న్యాయం కోసం 18 ఏళ్లు పోరాడిన యువతి కథ ఆధారంగా?

Dosa King Movie: సూర్య హీరోగా తమిళ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జై భీమ్. ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ఓ దళిత మహిళ తనకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాటం చేసింది తనకు లాయర్ చంద్రు ఏ విధంగా సహాయం చేశారు అనే నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా ఎలాంటి మంచి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో కూడా నిలబడింది. ఇలా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు వివాదాలలో కూడా చిక్కుకుంది.ఇకపోతే నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకులను సందడి చేసిన డైరెక్టర్ జ్ఞానవేల్ మరొక నిజజీవిత కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఇక ఈ సినిమాని దర్శకుడు తమిళ తెలుగు భాషలలో కాకుండా హిందీలో దోశ కింగ్ అనే సినిమా చేయబోతున్నారు. శరవణ భవన్‌’ పి.రాజగోపాల్‌ ‘దోసె కింగ్‌’ గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు హోటల్లు దేశ విదేశాలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.అయితే ఈయనకు జోస్యం పిచ్చి కారణంగా ఓ జ్యోతిష్యుడు చెప్పిన విధంగా తన దగ్గర మేనేజర్ గా పని చేసే వ్యక్తి కుమార్తె జీవజ్యోతి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తన వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు.

న్యాయం కోసం 18 ఏళ్లు పోరాడిన జీవ జ్యోతి..

ఈ క్రమంలోనే అప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన రాజగోపాల్ తనని మూడో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కూడా దారుణంగా సినిమా స్టైల్ లో చంపించారు. దీంతో జీవ జ్యోతి తనపై న్యాయం కోసం 18 సంవత్సరాలు పోరాటం చేసి చివరికి గెలిచింది. అయితే ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ కష్టాలను ఆమె ఏ విధంగా ఎదుర్కొని ఈ కేసు గెలిచిందనే కథాంశంతో జ్ఞానవేల్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

మందుబాబులకు షాక్.. వ్యాక్సిన్ వేయించుకోని వారికి మద్యం లేదంటూ?

కరోనా మహమ్మారి కొన్ని వేల కుటుంబాలను చీకటిబయం చేసింది. ఎంతో మంది విధి లేక రోడ్డున పడ్డవారు కూడా ఉన్నారు. కరోనా నియంత్రణకు కేవలం నివారణ ఒక్కటే మార్గం అని వైద్యులు, అధికారులు మొదటి నుంచి చెబుతున్నారు.

కచ్చితంగా మాస్క్, శానిటైజర్లను ఉపయోగించాలని.. కరోనా నిబంధనలు పాటించాలిన చెబుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చినదగ్గర నుంచి కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకున్నట్లే అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు.. తమిళనాడు లోని మైలాడుతురై జిల్లా అధికార యంత్రాంగం మందుబాబులకు షాక్ ఇచ్చింది.

తమిళనాడు ప్రభుత్వం నియంత్రణలో ఉన్న టాస్మాగ్ దుకాణాలలో మద్యం కొనుగోలు చేసేవారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపెట్టాలనే నిబంధన పెట్టింది. ప్రజలు ఈ ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని.. కోవిడ్-19 రహిత జిల్లాగా మార్చేందుకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ ప్రకటనతో మద్యం ప్రియులు కొంత మంది టెన్షన్ పడుతున్నారు.

మద్యం తాగడం అలవాటుగా మారిన వారు సడన్ గా ఇళా బంద్ చేస్తే తట్టుకోలేరు. కనుక వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు మద్యం దుకాణాలకు కాకుండా.. ఇక వ్యాక్సిన్ కేంద్రాలకు పరుగు పెడుతున్నారు. మందుబాబులకు కాస్తంత అసహనం అనిపించినా.. ఈ ఆలోచన చాలా బాగుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా చేస్తే బాగుంటదని అభిప్రాయపడుతున్నారు.

నిద్రిస్తున్న మహిళపై అత్యాచారం.. ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్టు చేసిన పోలీసులు

రోజురోజుకు మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయి ఇంటి నుంచి బయటకు కాలు పెట్టింది మొదలు.. జాగ్రత్తగా, భంద్రంగా ఇంటికి వచ్చే దాక నమ్మకం లేకుండా పోతోంది. తల్లిదండ్రులకు ఇలాంటి ఘటనల వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో.. ఓ మహిళా అధికారిపై ఫ్లైట్ లెఫ్టినెంట్‌ లైంగిక దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన మహిళా అధికారిణి(28) కోయంబత్తూరు రెడ్‌ఫీల్డ్ ఎయిర్‌ఫోర్స్ ట్రెయిన్ కాలేజీలో కొన్ని నెలలుగా శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఆట సమయంలో ఆమె గాయపడ్డారు. గాయానికి చికిత్స పొంది, తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

అదే కాలేజీలో శిక్షణ పొందుతున్న చత్తీస్‌గఢ్‌కు ఫ్లైట్ లెఫ్టినెంట్ అమరేందర్ (29) ఆమె గదిలోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు తొలుత వాయుసేన అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె స్థానిక గాంధీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేశారు. నిందిత అధికారిపై సెక్షన్ 376 కింద కేసు నమోదుచేశామని కోయబత్తూరు పోలీస్ అధికారి దీపక్ దమన్ తెలిపారు.

అతడిని పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతామన్నారు. ఇదిలా ఉండగా..ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది సాయుధ దళాల సిబ్బందిని అరెస్టు చేయడం స్థానిక పోలీసుల పరిధిలోకి రాదని తెలిపారు. దానిపై స్పందించిన పోలీసుల అధికారులు అరెస్టు పరిధిపై చర్చ జరుపుతున్నామని తెలిపారు.

దారుణ హత్యకు గురైన మహిళా కానిస్టేబుల్.. కారణం ఏంటంటే..!

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనే ఒకటి తమిళనాడులోని విరుదునగర్‌లో చోటుచేసుకుంది. 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది.

భార్యభర్తల మధ్య విబేధాల కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరణించిన కానిస్టేబుల్ భానుప్రియగా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విరుదునగర్‌ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో భానుప్రియ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు ఐదు సంవత్సరాల క్రితం విష్నేష్ తో వివాహం జరిగింది. వీరిద్దరికి నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.

ప్రస్తుతం వీరి కుటుంబం కులకరై ప్రాంతంలో నివసిస్తోంది. అయితే ఇటీవల దంపతుల మధ్య చిన్న సమస్యల కారణంగా గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విష్నేష్ తన నివాసాన్ని మధురైకి మార్చాలని అనుకున్నాడు. కానీ అతడి భార్య దానికి సిద్ధంగా లేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఇలా ఏదో ఒక సమస్య కారణంగా గొడవ పడుతూనే ఉన్నారు. ఓ రోజు తీవ్ర ఆవేదనకు గురైన విష్నేష్ ఆమె గొంతును బెల్ట్ తో బిగించి హత్య చేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించి.. వివరాలను సేకరించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. భానుప్రియ మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వరకట్నం కోసం వేధించాడా.. అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

కోవిడ్ పై పోరాటానికి తమిళనాడు బీజేపీ కొత్త అస్త్రం!

కోవిడ్ థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు బిజెపి నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు సహాయపడేందుకు 26,000 మంది వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై పేర్కొన్నారు.

కాగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన డీఎంకే వంటి పార్టీలు వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తున్నాయని గుర్తు చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

ఇష్టం లేని పెళ్లి.. పోలీసుల రంగప్రవేశం.. చివరకు ఏం జరిగిందంటే..?

వారిద్దరు దగ్గరి బంధువులు. వరుసకు ఆమెకు అతడు మేనమామ అవుతాడు. అయితే ఇరువురి కుటుంబ సభ్యులు వారిద్దరికి పెళ్లి నిశ్చయించారు. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు ఓ గంటలో పెళ్లి జరుగుతుందనగా ఓ వీడియో తీసి తన స్నేహితులకు పంపించింది. దీంతో పోలీసులు పెళ్లి మండపానికి వచ్చి పెళ్లిని ఆపు చేశారు. అసలెందుకు ఇలా జరిగింది.. ఎందుకు పోలీసులు పెళ్లిని క్యాన్సిల్ చేశారో తెలియాలంటే.. పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే…

తమిళనాడు రాజధాని చైన్నైలోని పుజల్ ప్రాంతానికి చెందిన జనతుల్లా ఫిర్డోసి అనే 22 ఏళ్ల మహిళకు తన మేనమామతో కుటుంబసభ్యులు బలవంతంగా ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్లకు ఈ విషయం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆమె చేసేది లేక.. పెళ్లి పీటలపైనే ఓ వీడియో తీసుకుంది.

తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. తన మేనమామకు ఇదివరకే ఓ మహిళతో సంబంధం ఉందని.. ఈ పెళ్లి జరిగితే తాను ఆత్మహత్య చేసుకుంటానని తన వీడియోలో రికార్డు చేసి స్నేహితులకు పంపించింది. ఈ వీడియోను పోలీసులకు చేరవేయండంటూ వేడుకుంది. దీంతో ఆ వీడియో కాస్త పోలీసుల దాకా వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి మండపం వద్దకు చేరుకున్నారు.

పెళ్లి ఆపేందుకు ఇరువురి కుటుంబసభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు. వాళ్లు ఎంత చెప్పినా వినకపోవడంతో ఇరువురి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. వధువు, వరుడు తరఫు బంధువులకు అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయవద్దని కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఏదైనా సమస్య ఎదరైతే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

సినిమాలకు స్వస్తి చెప్పన్నున్న యంగ్ హీరో..?

కోలీవుడ్ యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఉదయనిది స్టాలిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ స్టార్ హీరో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి మనవడిగా, ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు గా అందరికీ పరిచయమే. ఈ క్రమంలోనే స్టాలిన్ కొడుకు గా ఇటు రాజకీయాలలోనూ, అటు సినిమాలలోనూ ఎంతో చురుకుగా ఉంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఈ నటుడి గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కోలివుడ్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఉదయనిధి స్టాలిన్ ఇకపై సినిమాలకు స్వస్తి చెప్పబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ హీరో క్రైం థ్రిల్ల‌ర్ “క‌న్నేనంబ‌తే” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఉదయనిది ఆర్టిక‌ల్ 15 ను కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత ఉదయనిది దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తన చివరి సినిమాను చేయనున్నారని కోలీవుడ్ సమాచారం.

సెల్వరాఘవన్ దర్శకత్వంలో సినిమా పూర్తయిన తర్వాత ఉదయనిది ఇకపై సినిమాలకు స్వస్తి పలకనున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఉదయనిధి తన దృష్టిని మొత్తం రాజకీయాల వైపు మళ్లీస్తున్నట్లు తెలుస్తోంది.

తండ్రి బాటలోనే వెళ్తూ ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయా రంగంలోకి అడుగు పెట్టడం వల్లే సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఉదయనిది స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నారనే విషయంలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలంటే ఈ హీరో స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని గంటల్లోనే… పెళ్లిపీటలు ఎక్కిన యువతి.. ఏం జరిగిందంటే?

సాధారణంగా ఏ యువతి అయినా పెళ్లి తర్వాత గర్భం దాల్చి బిడ్డకు జన్మనిస్తుంది. కానీ తమిళనాడుకు చెందిన ఓ యువతి మాత్రం బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కింది. అయితే ఈ విధంగా వీరి పెళ్లి చేయడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం…

తమిళనాడులోని రాణిపేట జిల్లా, వాలాజాపేటకు చెందిన జ్యోతి.. అదే ప్రాంతానికి చెందిన ఉదయ్‌కుమార్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు.ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడటంతో జ్యోతి గర్భం దాల్చింది. ఇదే విషయమే ఉదయ్ కుమార్ కి చెప్పి తనను పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో అందుకు ఉదయ్ కుమార్ నిరాకరించాడు. అదేవిధంగా ఉదయ్ కుమార్ జ్యోతికి దూరంగా ఉంటున్నాడు.

జ్యోతి గర్భం దాల్చిన విషయం తమ కుటుంబ సభ్యులకు తెలియడంతో తనకు గర్భం తొలగించాలని చూశారు. అయితే ఆమె ఆరోగ్యపరంగా ఎంతో బలహీనంగా ఉండటం చేత ఆమెకు గర్భం తొలగించడం కుదరలేదు. ఈ క్రమంలోనే నెలలు నిండడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు జ్యోతిని వాలాజాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా శనివారం జ్యోతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనివ్వగానే ఆ బిడ్డను అక్కడే వదిలి పారిపోవాలని చూసిన జ్యోతికి ఆరోగ్యం సహకరించక ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయింది.

ఈ విషయం గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో జ్యోతి అసలు విషయం చెప్పింది. ఈ క్రమంలోనే పోలీసులు ఉదయ్ కుమార్ ను పిలిపించి.. జ్యోతిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. లేదంటే తనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తోందని చెప్పడంతో ఉదయ్ కుమార్ పెళ్లికి అంగీకరించారు. ఈ విధంగా తన బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే జ్యోతి పెళ్లి పీటలు ఎక్కింది.

కరోనాకు దేవత విగ్రహ ప్రతిష్ట.. ప్రత్యేక పూజలు?

సాధారణంగా మనకు ఏదైనా ఆపదవచ్చినప్పుడు, లేదా కరువు ఏర్పడినప్పుడు వర్షాలు కురవాలని,అనావృష్టి పరిస్థితుల నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున తమ గ్రామ దేవతలకు పూజలు నిర్వహించడం, బలిదానాలు చేయడం వంటివి చూస్తుంటాము.ఈ విధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని శాంతింప చేయడం వల్ల ఆ గ్రామంలోని ప్రజలు ఎంతో సుఖసంతోషాలతో ఉంటారని భావిస్తారు.

ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఎంతో భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలని, ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని వేడుకుంటూ కోయంబత్తూరులోని ఓ దేవస్థానం కరోనా దేవతను ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు, మహాయాగం చేపట్టనుంది.తమిళనాడులోని కామాచ్చిపురి ఆధీనంలో ఇటువంటి భయంకరమైన వ్యాధి ప్రబలినప్పుడు ఆ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడం కోసం విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయడం పూర్వం నుంచి ఒక ఆచారంగా వస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించనున్నట్లు కామాచ్చిపురం అధీనం ఇన్‌చార్జి శివలింగేశ్వర్ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటం కోసమే 48 రోజుల పాటు కరోనా దేవతకు మహాయాగం చేస్తున్నట్లు ఈ యాగానికి భక్తులేవరిని అనుమతించడం లేదని శివ లింగేశ్వర్ తెలిపారు.

ప్రజలను భయాందోళనకు గురిచేసే వ్యాధులకు ఈ విధంగా ప్రత్యేక పూజలు హోమాలు చేయడం ఇది కొత్తేమీ కాదు, ఇదివరకే ఎంతో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు కోయంబత్తూరులోని ప్లేగు మారియమ్మన్ ఆలయమే నిర్మించడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. గతంలో ప్లేగు, కలరా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు ప్లేగు మారియమ్మన్ దేవతలను పూజించినట్లే ప్రస్తుతం కరోనా దేవతను ప్రతిష్టించి 48 రోజుల పాటు పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.