Tag Archives: tdp

అన్నగారి తర్వాత టిడిపి పగ్గాలు చంద్రబాబుకి ఎందుకిచ్చావ్.. మోహన్ బాబు ప్రశ్నకు బాలయ్య సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆహా యాప్ ద్వారా ప్రసారమౌతున్న “అన్ స్టాపబుల్” అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా మంచు మోహన్ బాబు వచ్చారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ టాక్ షో కి సంబంధించిన ప్రీమియర్స్ ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ మోహన్ బాబును ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అయితే మోహన్ బాబు కూడా బాలకృష్ణను ఒక ప్రశ్న అడిగారు. అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన వారసుడిగా అతని మరణం తర్వాత పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్న విన్న బాలకృష్ణ తనదైన శైలిలో మోహన్ బాబుకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సమాధానం చెబుతూ..మా తెలుగుదేశం పార్టీ పెట్టిందే వారసత్వ రాజకీయాలకు అతీతంగా అలాంటిది పెద్దాయన మరణం తర్వాత పార్టీ పగ్గాలు మేము తీసుకుంటే దానికి అర్థం ఉండదని ఈ సందర్భంగా బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఇక చంద్రబాబుకి పార్టీ పగ్గాలు ఎందుకు ఇచ్చారనే విషయానికి వస్తే ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో కష్ట పడే వ్యక్తిత్వం కలవారు. గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుంచి అన్ని చూసి వచ్చిన మనిషి చంద్రబాబు అంటూ బాలకృష్ణ మోహన్ బాబు ప్రశ్నకు ఇలా సమాధానం తెలియజేశారు.

రోజాను ఆర్థికంగా ఆదుకున్నది ఎవరో తెలుసా..?

ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు బబర్దస్త్ జడ్జిగా సుపరిచితం. సినిమాల్లో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్న రోజా తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె చిత్తూరు జిల్లా, చిన్న గొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు.

పొలిటికల్ సైన్స్ లో ఆమె నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. రోజా తమిళ చిత్ర దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని వివాహమాడిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. పెళ్లి అయిన తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. ప్రొడక్షన్ కంపెనీని నిర్మించి భర్త సెల్వమణిని దర్శకుడిగా పెట్టి అనేక సినిమాలను నిర్మించింది. దీనికి పెట్టుబడిగా ఆమె తన ఆరు సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ ను పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది.

తర్వాత అతడి దర్శకత్వంలో మొదటి మూడు సినిమాలు హిట్ అయినా తర్వాత అంతగా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. తర్వాత ఆమె ఆర్థికంగా ఎంతో ఇబ్బందులను గురవుతున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మొదట టీడీపీలో కి వెళ్లిన ఆమె 2004, 2009 శాసనసభ ఎన్నికలలో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు.

2014 శాసనసభ ఎన్నికలలో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై గెలుపొందారు. తర్వాత 2019 లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటు జబర్దస్త్ లో కూడా ఆమె న్యాయ నిర్ణేతగా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఆర్థిక పరమైన కష్టాల నుంచి బయటకు రావడానికి వైసీపీ, జబర్దస్త్ గట్టెకించాయనే చెప్పాలి.

టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేపట్టనున్నారా..? దీనిపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే..

ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా తయారు అయింది. తెలంగాణలో అయితే టీడీపీ కనుమరుగైపోయిందనే చెప్పాలి. కొన్ని నెలల క్రితం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఉన్న కాస్తంత బలగం కూడా కనపడకుండా పోయింది. అయితే ఇప్పటికీ టీడీపీ అంటే అభిమానం ఉన్నవారు ఎప్పటికైనా టీడీపీ మళ్లీ పుంజుకుంటుంది.. కానీ దానికి నాయకులు జూనియర్ ఎన్టీఆర్ ఉండాలని కోరుకున్నట్లు సమాచారం.

తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే.. ఆంధ్రాలో ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లీడ్ చేస్తున్నారు కావునా.. అక్కడ పర్వాలేదు. కానీ అక్కడ కూడా టీడీపీ నాయకులు ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీకి మళ్లీ పూర్వవైభవం రావాలంటే.. ఆ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే అనే నినాదంలో టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. కొన్నిసార్లు చంద్రబాబు పర్యటనల్లో సైతం జూనియర్ ఎన్టీఆర్ రావాలనే నినాదాలు వినిపించాయి.

కొందరైతే స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే అని నినాదాలు చేశారు. అయితే టీడీపీ శ్రేణులు నిజంగానే ఎన్టీఆర్ రాకను ఆహ్వానిస్తున్నారా అనేది మాత్రం తెలియదు. అయితే ఆ మధ్య టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బచ్చయ్య చౌదరి జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే బాగుంటందని చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. అప్పటి నుంచి పెద్ద దుమారం రేపింది.

దీనిని మీడియా వేరే రకంగా చూపించిందని.. తన ఉద్దేశ్యం అది కాదని.. జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కోసం పని చేస్తే బాగుంటుందనే కారణంతో అన్నానని.. కానీ దానికి టీడీపీ పగ్గాలు మొత్తం ఎన్టీఆర్ తీసుకోవాలనే అర్థం కాదని వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయంపై వాళ్ల కుటుంబసభ్యులే చర్చించుకోవాలన్నారు.

బైక్ రేస్ పై వస్తున్న వార్తలు అబద్దం.. ఆ వార్తలను ఖండించిన డీసీపీ ..

శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వైద్యులు అతడి ఆరోగ్య బులెటిన్ ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నారు. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని.. ట్రీట్ మెంట్ కు సాయి ధరమ్ తేజ్ సహకరిస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. బైక్ రేస్ కారణంగానే అతడు ప్రమాదానికి గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారాయి. సీనియర్‌ నటుడు కుమారుడు నవీన్‌, సాయితేజ్‌ రేసింగ్‌ పెట్టుకొని డ్రైవింగ్‌ వెళ్లారనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు కొట్టిపారేశారు.

దుర్గం చెరువు బ్రిడ్జి మీద ఉన్న సీసీ టీవీ పుటేజీని తాము పరిశీలించామని.. అక్కడ కేవలం సాయి ధరమ్ తేజ్ ఒక్కరే వెళ్తున్నారని.. రేసింగ్ అంటూ వస్తున్న వార్తలు పచ్చి అబద్దమని.. వాటిని నమ్మొద్దంటూ.. ఫేక్ వార్తలంటూ కొట్టి పారేశారు. అతడు వెళ్తున్న మార్గంలో అతడి కంటే ముందు ఒక ఆటో మాత్రమే వెళ్తుందని.. దానిని ఓవర్ టేక్ చేసే క్రమంలో అక్కడ ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయి పడిపోయాడంటూ చెప్పుకొచ్చాడు.

తలకు హెల్మెట్ ధరించడంతో తలకు ఎలాంటి దెబ్బలు తగల్లేదని చెప్పాడు. ఆ ఆటోను ఎడమ వైపు నుంచి కాకుండా కుడివైపు నుంచి ఓవర్ టేక్ చేయడంతో ఇలా జరిగిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంపై అతడిపై ట్రాఫిక్ ఉల్లంఘల కింద పోలీసులు రెండు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి_ నారా లోకేష్

గుంటూరు జిల్లా దళిత యువతి రమ్య హత్య పై నారా లోకేష్ స్పందించారు. రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దిశ చట్టం వల్ల రాష్ట్రంలో ఒక్క ఆడపిల్లకు అయిన న్యాయం జరిగిందా అని లోకేష్ ప్రశ్నించారు.

సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం జగన్.. మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారని లోకేష్ మండిపడ్డారు. సీఎం ఇంటి పక్కన సొంత నియోజకవర్గంలో అత్యాచారాలు జరిగితే.. ఇంతవరకు నిందితుల్ని పట్టుకోలేక పోవడం జగన్ చేతకాని తనానికి నిదర్శనమని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ఏపీలో సీఎం జగన్ రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు-

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు టిడిపి నేత అచ్చెన్నాయుడు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం పక్కనపెట్టి.. సీఎం జగన్ రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం జగన్ ..ప్రతి ఒక్కరి పై కేసులు పెట్టి వేధిస్తున్నారని అచ్చం నాయుడు ధ్వజమెత్తారు. జగన్ పాలన కంటే బ్రిటిష్ పాలన బాగుండేదని.. ఏపీ ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. టిడిపి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సీఎం జగన్ పై టిడిపి నేత అనురాధ ఫైర్!

ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ. గతంలో నేతన్నలకు రూ.50వేలకు పైబడి పథకాలు, సబ్సిడీలు అందేవన్నారు. సీఎం జగన్ వాటిని రద్దు చేసి.. నేతన్న నేస్తం పేరుతో రూ. 24వేలు అందిస్తూ చేనేత కార్మికులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు ఉంటే.. కేవలం 80 వేల మందికి సహాయం అందుతుందని పేర్కొన్నారు.

జగన్ ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో హడావుడి చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తుందని అనురాధ ఆరోపించారు. చేనేత రంగానికి ఊతమివ్వాలంటే.. పని చేసే వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సాయాన్ని పునరుద్ధరించి చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరు

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు హైకొర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందని విచారణ వెళ్ళిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా నాయకులు రాళ్ల దాడి చేశారు. దీంతో తేదేపా, వైకాపా వర్గీయులు బాహాబాహీకి దిగారు. దీంతో తనపై దాడికి యత్నించిన వారిని అరెస్ట్ చేయాలంటూ వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ క్రమంలో ఉమ వర్గీయులు పలువురుపై దాడి చేశారనే నేఫథ్యంలో అతని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీంతో దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

జమిలి ఎన్నికలు.. చంద్రబాబు భలే కామెడీ చేస్తున్నారే..?

ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికార పార్టీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏడు పదుల వయస్సులో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకే నవ్వు తెప్పిస్తూ ఉండటం గమనార్హం. చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు 2022 సంవత్సరంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అమలాపురం టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో పులివెందుల రాజ్యాంగం అమలవుతోందని.. జగన్ రాష్ట్రాన్ని పాలించలేక చేతులెత్తేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

జగన్ వర్గం న్యాయ వ్యవస్థనే అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేస్తోందని.. కోర్టులపై సైతం విమర్శలు చేస్తోందని అన్నారు. జగన్ కేంద్రంతో కేసుల మాఫీ కోసమే సన్నిహితంగా మెలుగుతున్నారని వ్యాఖ్యానించారు. లక్ష కోట్ల రూపాయల సంపద అయిన అమరావతిని జగన్ సర్కార్ విధ్వంసం చేసిందని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపులకు రిజర్వేషన్ తెచ్చిందని అయితే.. వాళ్లకు జగన్ రిజర్వేషన్ ఇవ్వట్లేదని అన్నారు.

జగన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బీసీలలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలను సైతం జగన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ కు భవిష్యత్తులో గుణపాఠం చెబుతామని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ వల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో జమిలి ఎన్నికలు అంటూ చంద్రబాబు కామెడీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.