Tag Archives: telangana

Chiranjeevi: మెగా విందుకు హాజరైన రేవంత్ రెడ్డి.. చిరంజీవికి ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం?

Chiranjeevi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ నటుడు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇటీవల భారత ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా చిరంజీవి ఎంతో అత్యుత్తమమైనటువంటి ఈ పురస్కారాన్ని అందుకోవడంతో అభిమానులు ఇతర సినీ సెలబ్రిటీలో ఈయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి చిరంజీవిని అభినందిస్తూ ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు.

భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి చిరంజీవికి శుభాకాంక్షలని తెలిపారు. అనంతరం ఈయన చిరంజీవితో మాత్రమే కాకుండా రామ్ చరణ్ తో కూడా కాసేపు ముచ్చటించారు. ఇక ఈయనతో పాటు ఉపముఖ్యమంత్రి స్పీకర్ ఇతర తెలంగాణ మంత్రులు కూడా హాజరయ్యారు.

చిరంజీవికి అభినందనలు..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ కన్నా ముందు పద్మవిభూషణ్ అందుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు . అక్కినేని పద్మ శ్రీ, పద్మభూషణ్ తో పాటు 2011లో కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది.

Telangana: ఫ్రీ బస్సు స్కీంను తెలంగాణ మహిళలు ఇలా వాడుతున్నారా… మామూలు వాడకం కాదుగా?

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహిళలందరికీ కూడా తెలంగాణ పరిధిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితం అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకం అమలులో ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీలో మహిళల ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరిగిందని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు.

ఇలా ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో మహిళలు ప్రయాణం చేస్తున్నారు. లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీలో ప్రయాణం చేసే వారి సంఖ్యలో ఉందని అధికారులు తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఈ ఉచిత స్కీం ద్వారా మహిళలు ఏ ఏ ప్రదేశాలకు ప్రయాణం చేస్తున్నారా అనే విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఉచిత ప్రయాణం కావడంతో మహిళలందరూ కూడా ఎక్కువగా దైవ దర్శనాలకు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు వేములవాడ, కాలేశ్వరం వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే రూట్లలో ప్రయాణం చేసినట్లుగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు.

పుణ్యక్షేత్రాలకు ప్రయాణం…

ఈ పథకం డిసెంబర్ 9వ తేదీ అమలులోకి తీసుకువచ్చారు. 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్దరాత్రి వరకు 94,128 మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు. 10వ తేదీ ఆదివారం రోజు 2,26,645 మంది మహిళలు ప్రయాణం చేశారు. 11వ తేదీ రెండు లక్షలకు పైగా ప్రయాణం చేశారు. ఇలా ప్రతిరోజు లక్షల సంఖ్యలోనే మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారని అధికారులు తెలిపారు.

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుంది అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపు మేరకు చివరికి ఈ సీఎం రేసు నుంచి ఉత్తమ్ రెడ్డి బట్టి విక్రమార్క తప్పుకోవడంతో ఆ అవకాశం రేవంత్ రెడ్డిని వరించింది అని చెప్పాలి. ఇక ఈయన ముఖ్యమంత్రిగా నిన్న ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం కూడా చేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా ఎలాంటి పొలిటికల్ నేపథ్యం లేకుండా స్టూడెంట్ లీడర్ గా ఉన్నటువంటి ఈయన అనంతరం జడ్పిటిసి గాను ఎంపీగాను కొనసాగుతూ రాజకీయాలలో అంచలంచలుగా ఎదిగారు. ఇలా రాజకీయాల్లో కొనసాగుతూ నేడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

రేవంత్ రెడ్డి విద్యాభ్యాసం తన కుటుంబం గురించి అలాగే తన భార్య పిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి అయితే తాజాగా ముఖ్యమంత్రిగా తెలంగాణ బాధ్యతలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి నామినేషన్ సమయంలో అఫీడవిట్లో తన ఆస్తిపాస్తుల వివరాలను తెలియజేశారు.

30 కోట్ల ఆస్తిపాస్తులు..

రేవంత్ రెడ్డి తన ఆస్తి మొత్తం విలువ 30,95,52,652 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. తన దగ్గర ఐదు లక్షల 34 వేల నగదుతో పాటు ఆయన భార్య గీతారెడ్డి దగ్గర 1235 గ్రాముల బంగారం విలువ 83,36,000 ఉన్నాయట. అలాగే 7,17,800 విలువచేసే వజ్రాల ఆభరణాలు ఉన్నాయట. వెండి 9,700 గ్రాముల వరకు ఉన్నట్టు సమాచారం.రేవంత్ రెడ్డి ఆయన భార్య దగ్గర పేరు మీద ఉన్న అప్పు 1,30,19,901 ఉందని తెలుస్తుంది. ఇక వీరికి ఒక మెర్సిడెజ్ బెంజ్ కార్, హోండా సిటీ ఉన్నాయి.ఇక రేవంత్ రెడ్డి దగ్గర 50,000 ఖరీదు చేసే రైఫిల్. రెండు లక్షల ఖరీదు చేసే పిస్టల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సమాచారం మొత్తం రేవంత్ రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు.

Revanth Reddy: రజనీకి ఉద్యోగం ఇచ్చి మాట నిలబెట్టుకున్న రేవంత్…ఏ ఉద్యోగం ఇచ్చారు జీతం ఎంతో తెలుసా?

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆరు గ్యారెంటీ హామీల ఫైల్ పై ఆయన సంతకం చేశారు. ఇక రెండవ సంతకం దివ్యాంగ మహిళ అయినటువంటి రజనికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తూ రేవంత్ రెడ్డి రెండవ సంతకం చేశారు.

ఇక ఈయన ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే రజిని ఆహ్వానించి ఆమెకు ప్రభుత్వ కొలువులో నియామక పత్రాన్ని అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 17వ తేదీ గాంధీభవన్ లో రేవంత్ రెడ్డిని కలిసినటువంటి రజిని హైదరాబాద్ నగరం నాంపల్లి దగ్గరలోని బోయిగూడకు చెందినది. ఈమె లయోలా స్కూల్, వనితా కాలేజీల్లో చదివారు. ఓపెన్ యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఈమె తనకు ఉద్యోగం లేదు అంటూ తన బాధను మొత్తం చెప్పకున్నారు అయితే తన పరిస్థితి విన్నటువంటి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి తన ఉద్యోగ నియామక పత్రంపై సంతకం చేస్తానని తెలియజేశారు.

టీఎస్‌ఎస్ఓసీఏ మేనేజర్ గా రజిని..

ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రజనికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తూ మొదటి ఉద్యోగ నియామక పత్రకం పై సంతకం చేశారు.ఆమెకు తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్‌ఎస్ఓసీఏ)లో ప్రాజెక్టు మేనేజర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగం కల్పించారు ఇక ఈమెకు నెలకు 50 వేల వరకు వేతనం రాబోతుందని నియామక పత్రాలలో పేర్కొన్నారు.

Telangana: రేపటి నుంచి టిఎస్ఆర్టిసి లో మహిళలకు ఉచిత ప్రయాణం…ఫ్రీ కదా అని ఎక్కారో 500 ఫైన్?

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా చేశారు. ముఖ్యమంత్రిగా ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 11 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించి అనంతరం మొదటి క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ మీటింగ్ లో భాగంగా ఎన్నికల సమయంలో వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ హామీల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

క్యాబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్లో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడారని ఈయన తెలియజేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకు మహిళలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అయితే ఈ ఉచిత ప్రయాణాన్ని డిసెంబర్ 9వ తేదీ నుంచి అమలు చేయబోతున్నారని తెలుస్తోంది.

డిసెంబర్ 9వ తేదీ కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకురాబోతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక బస్సులోకి ఎక్కిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా తమ ఆధార్ కార్డు కండక్టర్ కి చూపించాల్సిన అవసరం ఉంటుందని కండక్టర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత టికెట్ ఆ మహిళకు ఇస్తారు.

టికెట్ లేకపోతే జరిమానా…

ఈ టికెట్ మనం ఎక్కడైతే దిగుతామో అక్కడి వరకు జాగ్రత్తగా పెట్టుకోవాలి అలా కాకుండా ఉచితం కదా అని ఫ్రీగా ఎక్కి కూర్చుంటే మధ్యలో చెకింగ్ వచ్చినప్పుడు వారి దగ్గర ఆ టికెట్ లేకపోతే 500 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుందని అందుకే తప్పనిసరిగా ఆధార్ కార్డు తమ వెంట తీసుకుని వెళ్లి కండక్టర్ కి ఆధార్ నెంబర్ చెప్పి టికెట్ తీసుకోవడం కంపల్సరీ అని తెలుస్తుంది. టికెట్ తీసుకోకపోయినా లేదా తీసుకున్న టికెట్ మధ్యలో పడేసిన చెకింగ్ అధికారులు వచ్చినప్పుడు టికెట్ లేకపోతే ఫైన్ చెల్లించాల్సిందేనని తెలుస్తుంది.

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి… రేవంత్ కే మద్దతు తెలుపనున్న కాంగ్రెస్ పెద్దలు?

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇలా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందన్న ఆందోళనలో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పెద్దలతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఫలించాయని మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని విషయాన్ని ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తుంది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క కొనసాగుతున్నారని సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్ పీఠంలో ఎవరు ముఖ్యమంత్రిగా కొనసాగాలనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం ఎంపికతో పాటు సీఎల్పీ నేత ఎంపికపై నాయకులు చర్చించారు.


రేవంత్ రెడ్డికే అధికార పీఠం…

ఇలా ఈ చర్చలు అన్నింటిలో కూడా ఎక్కువగా రేవంత్ రెడ్డికి మద్దతు లభించిందని దీంతో ఆయనని ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ హై కమాండ్ హైదరాబాద్ వేదికగా మరి కాసేపట్లో ఈ విషయాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తే త్వరలోనే ప్రమాణ స్వీకారపు ఏర్పాట్లు కూడా నిర్వహించబోతున్నారని సమాచారం.

Nani: తెలంగాణ కాంగ్రెస్ విజయంపై నాని ఫన్నీ కామెంట్స్… ఏమన్నారంటే?

Nani: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి నాని తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలన్నింటికీ కూడా నాని సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ఈయనని ప్రశ్నలు వేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో మీరు ఓటు వేశారు కదా మరి కాంగ్రెస్ గెలవడం పై మీ అభిప్రాయం ఏంటి అంటూ నానిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాని తన స్టైల్లో సమాధానం చెప్పారు..

ఈ సందర్భంగా నాని స్పందిస్తూ ఎన్ని రోజులు థియేటర్లో ఒక సినిమా ఆడుతూ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది అయితే ఇప్పుడు థియేటర్లో మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని ఈ సినిమాని కూడా బ్లాక్ బాస్టర్ చేద్దాం అంటూ సినిమా స్టైల్ లోనే కాంగ్రెస్ గెలవడం పట్ల ఈయన కామెంట్స్ చేశారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ తో ఫోటో…

ఇకపోతే ఒక అభిమాని అన్న మీరు ఎన్టీఆర్ తో కలిసి దిగినటువంటి ఒక రేర్ ఫోటోని షేర్ చేయండి అంటూ కూడా ప్రశ్నించారు.దీంతో నాని ఎన్టీఆర్ తో కలిసి దిగిన రేర్ అన్ సీన్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక హాయ్ నాన్న సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు.

Allu Aravind: కాంగ్రెస్ గెలవడంతో అభినందనలు తెలిపిన అల్లు అరవింద్… సినీ పెద్దలతో కలుస్తాం అంటూ?

Allu Aravind: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో భాగంగా ఈయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల పలు విషయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పట్ల ఈయన సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా కాంగ్రెస్ నేతలకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

ఇలా తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు బారాస పార్టీ తెలంగాణని పరిపాలించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సినీ సెలబ్రిటీలు కాంగ్రెస్ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే సినీ పెద్దలతో కలిసి తమకు కాంగ్రెస్ నేతలను కలుస్తామంటూ అల్లు అరవింద్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు పూర్తిస్థాయి మద్దతు తెలియజేసిందని అలాగే ఈ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమకు మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నట్లు అల్లు అరవింద్ తెలియజేశారు. ఇక కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని ప్రకటించబోతున్నారు ఇలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత సినీ పెద్దలు అందరూ కూడా కలవబోతున్నారని తెలుస్తుంది.

సినీ పెద్దలతో కాంగ్రెస్ నేతలను కలుస్తాం…

ఇదివరకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర పరిశ్రమకు ఎంతో మద్దతు తెలియజేశారు. ఇకపై ఆటోగ్రఫీ మినిస్టర్ గా ఎవరు ఉంటారు, వారు చిత్ర పరిశ్రమకు ఎలాంటి మద్దతు తెలియచేయబోతున్నారన్న విషయాలపై చిత్ర పరిశ్రమలో కూడా చర్చలు మొదలయ్యాయని తెలుస్తుంది.

Bandla Ganesh: కేటీఆర్ గన్ను గురిపెట్టిన బుల్లెట్ రివర్స్ లో పెట్టారు… బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్!

Bandla Ganesh: బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ముందు నుంచి కూడా ఎంతో గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత తొమ్మిదవ తేదీ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందని అయితే నేను ఏడో తేదీ రాత్రి నుంచి అక్కడే ఉంటానని మీడియాతో ఈయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిజమయ్యాయి. చివరికి ఈయన ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ విజయం అందుకుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడంతో బండ్ల గణేష్, కేటీఆర్ పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.

ముఖ్యంగా కేటీఆర్ గన్ను పట్టుకొని ఉన్న ఫోటోనీ షేర్ చేస్తూ…3.0 అంటూ వచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తామని ఒక పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఈ ఫోటో పట్ల బండ్ల గణేష్ కామెంట్ చేశారు. కేటీఆర్ గన్ను పట్టుకున్నారు కానీ బుల్లెట్ రివర్స్ లో పెట్టారని అది తిరిగి వారికి తగిలిందని బారాస ఓడిపోవడానికి కేటీఆర్ బుల్లెట్ రివర్స్ పెట్టడమే కారణం అంటూ ఈయన కేటీఆర్ పట్ల చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఆయన గన్ను గురిపెట్టడం చూస్తే రాత్రికి రాత్రి బ్యాలెట్ బాక్స్ లు ఏమైనా చేశారా అన్న భయం కూడా కలిగి నేను బ్యాలెట్ బాక్స్ లు జాగ్రత్త అంటూ కార్యకర్తలను కోరానని తెలిపారు. అయితే కేటీఆర్ గన్ను గురిపెట్టడం చూస్తే నాకు అతడు సినిమానే గుర్తుకు వచ్చింది. అంటూ ఈయన కేటీఆర్ పై కామెంట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు గర్వంతో మేము మనుషులం కాదు దేవుళ్ళమంటూ గొప్పలు చెప్పుకున్నారు.

గర్వంతో మాట్లాడారు..

నేనెప్పుడూ కేసీఆర్ హరీష్ రావు పై కామెంట్ చేయడం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి పెద్ద ఎత్తున అందరూ ధర్నాలకు దిగితే కేటీఆర్ గర్వంతో మీరు విజయవాడకు పోయి ధర్నాలు చేసుకోండి హైదరాబాదులో కాదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇది భారతదేశం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చినంత పని చేశారు. ప్రస్తుతం కేటీఆర్ పట్ల బండ్ల గణేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Revantha Reddy: రేవంత్ రెడ్డి ప్రేమ వివాహం గురించి ఈ విషయాలు తెలుసా… సినిమాని మించిన ట్విస్టుల?

Revantha Reddy: రేవంత్ రెడ్డి అనుముల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ ప్రభంజనం సృష్టించారు. పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఈయన కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో హస్తం జెండాను ఎగురవేశారు. ఇలా ముఖ్యమంత్రి పదవికి మరికొన్ని గంటలలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు.

ఇలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నటువంటి రేవంత్ రెడ్డి విజయం వెనుక తన భార్య గీతారెడ్డి కూడా ఉన్నారు. ఇలా ఈయన చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థి సంఘానికి లీడర్ గా కొనసాగారు ఇలా మొదలైనటువంటి ఈయన ప్రస్థానం నేడు ముఖ్యమంత్రి పదవి అధిష్టించే వరకు చేరుకుంది. ఇక ఈయన రాజకీయ ప్రస్థానం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే రేవంత్ రెడ్డిది ప్రేమ వివాహమని చెప్పాలి.

నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డి గ్రామంలో జన్మించినటువంటి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఇలా చదువుతున్న సమయంలోనే ఈయన విద్యార్థి సంఘానికి లీడర్ గా ఉన్నారు. అదే సమయంలోనే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు కుమార్తె గీతారెడ్డి ప్రేమలో పడ్డారు. ఇక వీర ప్రేమ విషయం గీతారెడ్డి తండ్రికి తెలియడంతో ఆమెను ఢిల్లీలో ఉన్నటువంటి తన సోదరుడు జైపాల్ రెడ్డి వద్దకు పంపించారు. అక్కడికి వెళ్లిన వీర ప్రేమ ప్రయాణం మాత్రం ఆగలేదు. జైపాల్ రెడ్డినే రాయబారిగా మార్చి తమ ప్రేమను గెలిపించుకున్నారు.

రేవంత్ విజయం వెనుక భార్య గీతా రెడ్డి…

రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి పట్టుదల మొండితనం చూసినటువంటి జైపాల్ రెడ్డి తన సోదరుడికి నచ్చ చెప్పారట ఎంతో కసి మొండిదల ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎప్పటికైనా ఉన్నత స్థాయిలో ఉంటారని తన సోదరుడికి నచ్చచెప్పి ఈ పెళ్లికి ఒప్పించారు. ఇక వీరిద్దరిది కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లికి ఒప్పుకున్నారు. తర్వాత ఈయన జెడ్పిటిసి మెంబర్ గాను ఎమ్మెల్యే గాను, ఎంపీగాను రాజకీయపరంగా అంచలంచలుగా ఎదుగుతూ నేడు ముఖ్యమంత్రిగా గెలుపొందారు. ఇక ఈయన ప్రజాస్వామ్యం అంటూ బయటకు రాగా తన భార్య మాత్రం తన పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ తన భర్త విజయానికి కారణం అయింది.