Tag Archives: telugu film industry

Kajal Aggarwal: మరోసారి తల్లి కాబోతున్న కాజల్.. ఇక సినిమాలకు దూరమైనట్టేనా?

Kajal Aggarwal: వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వెండితెర నటిగా అన్ని భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ 2020వ సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వివాహం తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న కాజల్ అగర్వాల్ నీల్ కిచ్లుఅనే అబ్బాయికి జన్మనిచ్చారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ తో ఈ బాబుకి ఏడాది కూడా పూర్తి అయింది. ఇక బాబు పుట్టిన తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ తిరిగి సినిమాలలోకి వచ్చారు.

ఈ క్రమంలోనే ఈమె కమిట్ అయినటువంటి ఇండియన్ 2సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నటువంటి భగవంత్ కేసరి సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ నటించే అవకాశాన్ని అందుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత కాజల్ తిరిగి సినిమాలలో కనిపించదన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kajal Aggarwal:మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న కాజల్..


కాజల్ అగర్వాల్ మరోసారి తల్లి కాబోతున్నారని అందుకే ఈమె సినిమాలకు దూరం కాబోతున్నారని తెలుస్తుంది. తన భర్త కోరిక మేరకు ఇంకొక బిడ్డకు జన్మనివ్వడానికి కాజల్ సిద్ధమయ్యారట.ఈ క్రమంలోనే ఈమె మరోసారి గర్భం దాల్చిందని అందుకే సినిమాలకు దూరం కాబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇలా కాజల్ రెండోసారి తల్లి కాబోతున్నారన్న వార్త అభిమానులకు నిజంగానే గుడ్ న్యూస్ అయినప్పటికీ ఈమె సినిమాలకు దూరమవుతారని తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కాజల్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Tollywood Anchors: తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్లు వీళ్లే?

Tollywood Anchors: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ల పేర్లు చెప్పమంటే వెంటనే సుమ, అనసూయ ,రష్మీ, శ్రీముఖి, ప్రదీప్, రవి ఇలా వరుసగా అందరి పేర్లు టకటక చెప్పేస్తాము.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వరుస సినిమా కార్యక్రమాలు టీవీ షోలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న యాంకర్లు సైతం నేటితరం యాంకర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా కొనసాగుతున్నటువంటి వీళ్ళు ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే…

సుమ: దాదాపు రెండు దశాబ్దాలకుపైగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్నటువంటి సుమ వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు. సుమ షెడ్యూల్ చూసుకొని సినిమా ఈవెంట్లు నిర్వహించుకుంటారు అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.ఇక సుమ ఒక్కో ఈవెంట్ కు సుమారు మూడున్నర లక్ష నుంచి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.

ప్రదీప్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మేల్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన కూడా ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో షో కి ప్రదీప్ రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

అనసూయ:జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరమై వెండి తెర సినిమాలతో బిజీగా ఉన్నారు.

రష్మీ:జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మీ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె కూడా ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

శ్రీముఖి: ప్రస్తుతం బుల్లితెరపై శ్రీముఖి హవ కొనసాగుతుంది ఏ టీవీ ఛానల్ లోకి వెళ్లిన శ్రీముఖి కార్యక్రమం ఏదో ఒకటి ప్రసారమవుతోంది.ఇక శ్రీముఖి కూడా ఒక్కో ఈవెంట్ కి సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

రవి: ప్రదీప్ తర్వాత మేల్ యాంకర్ గా గుర్తింపు పొందిన రవి ఒక్కో ఈవెంట్ కి లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Tollywood Anchors:

శ్యామల: యాంకర్ శ్యామల సైతం యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె కూడా ఒక్కో ఎపిసోడ్ కి సుమారు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వీరితోపాటు యాంకర్ వర్షిని మంజూష వంటి వాళ్ళు ఒక్కో ఎపిసోడ్ 50 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

Actor Krishna Burugula: దర్శకుడు రవిబాబు పరిచయం చేసిన నటుడు కృష్ణ బూరుగుల వరుస అవకాశాలు దక్కిన్చుకుంటున్నాడు

Actor Krishna Burugula: రవిబాబు తన రీసెంట్ మూవీ క్రష్ (Crrush) చిత్రంలో కృష్ణ బూరుగుల ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కీ హీరోగా పరిచయం చేసాడు. క్రష్ చిత్రం తోనే నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు దర్శకుడు “సునీల్ కుమార్ రెడ్డి” రీసెంట్ మూవీ “మా నాన్న నక్సలైట్” తో మరోసారి తన అద్భుతమైన నటనని ప్రదర్శించాడు.

ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం లో తన నటన హైలైట్ గా చూడొచ్చు. నటుడిగా రెండవ చిత్రం అయిన, ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు. కృష్ణ బూరుగుల నటనలో శిక్షణ పొంది షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ, అప్రంటీస్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. వందల ఆడిషన్లు ఇచ్చారు.. సొంతంగా ఒక 100 ఆడీషన్ వీడియోలు తీసి యూట్యూబ్ లో ఇంకా తన సొంత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి వాటిని ఇండస్ట్రీ వ్యక్తులకి పంపించి సినిమా అవకాశాలు దక్కించుకుంటూ నటుడిగా బిజీ గా వున్నాడు.

ఇప్పుడు కొరటాల శివ గారు సమర్పణలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కృష్ణమ్మ చిత్రం లో రెండవ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ సమర్పణలో వస్తున్న ఎ టి ఎం (ATM) అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఎగ్జీకుటీవ్ ప్రొడ్యూసర్ కృష్ణ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లు మొదలుపెట్టనున్నాడు.

గతంలో కూడా రవిబాబు చాలా మంది నటులని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు అందులో అల్లరి నరేష్, విజయదేవరకొండ.. మంచి నటులుగా నిరూపించుకొని స్టార్స్ అయ్యారు. కృష్ణ బూరుగుల ప్రయాణం అలాగే ముందుకువెళ్ళే సూచనలు కనబడుతున్నాయి.. చూద్దాం ఇతగాడు ప్రయాణం ఎలా ముందుకుతీసుకెలతాడో.

Chiranjeevi -Raviteja: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నుంచి తప్పుకున్న రవితేజ… కారణం అదేనా?

Chiranjeevi -Raviteja: ప్రస్తుతం మల్టీ స్టార్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి.ఇలా ఇద్దరు అభిమాన హీరోలను ఒకే తెరపై చూడటానికి అభిమానులు సైతం ఇష్టపడుతున్నారు. ఇలా మల్టీస్టారర్ చిత్రాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడంతో దర్శక నిర్మాతలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఎన్నో మల్టీ స్టార్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రంగా బాబి దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Chiranjeevi -Raviteja: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నుంచి తప్పుకున్న రవితేజ… కారణం అదేనా?

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన ప్రకటన వెలువలనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరొక హీరో పాత్ర ఉండబోతుందని ఆ పాత్రలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్నయ్య సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా రవితేజ మెగాస్టార్ అభిమాని కావడంతో చిరంజీవితో కలిసి నటించే అవకాశం రాగానే ఎంతో సంతోష పడుతూ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

Chiranjeevi -Raviteja: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నుంచి తప్పుకున్న రవితేజ… కారణం అదేనా?

అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ సినిమా నుంచి రవితేజ పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా మెగాస్టార్ సినిమా నుంచి రవితేజ తప్పుకోవడానికి ఓ కారణం ఉంది.మెగాస్టార్ నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా అనుకున్న సమయానికి షూటింగ్ పనులు జరిగి ఉంటే రవితేజ ఈ సినిమాలో తప్పకుండా నటించేవారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి సినిమాలలో నటించడం వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది.

డేట్స్ కుదరని పక్షంలో చిరు సినిమా నుంచి తప్పుకున్నా రవితేజ..

ఈ విధంగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో మరోవైపు రవితేజ కూడా వరుస సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాలేకపోతున్నాయి.ఇలా డేట్స్ కుదరని పక్షంలో రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ఆ పాత్రలో బాబి మరొక హీరో కోసం వేట మొదలు పెట్టారని తెలుస్తోంది.మరి వీరి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎలాంటి నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది.

Sreeja Konidela: శ్రీజ డాటర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Sreeja Konidela: సాధారణంగా అభిమానులు వారి అభిమాన హీరో హీరోయిన్ లు, నటీనటుల విషయాల గురించి తెలుసుకోవాలని ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. తెర వెనుక వారి అభిమాన హీరో హీరోయిన్లు ఏ విధంగా ఉంటారు అన్నది తెలుసుకోవాలి అని చాలామంది కుతూహలంగా ఉంటారు. ఇక అందులోనూ ఫ్యామిలీ గురించి అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తపన పడుతూ ఉంటారు. మెగా ఫ్యామిలీలో చిన్న చిన్న పార్టీల నుంచి పెద్ద పార్టీలకు బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసింది.

Sreeja Konidela: శ్రీజ డాటర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ అందరూ ఒక చోట కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని తాజాగా మెగా డాటర్ శ్రీజ కూతురు 14 బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ గురించి మనందరికీ తెలిసిందే. శ్రీజ హీరో కళ్యాణ్ దేవుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కదా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కాగా వారిలో పెద్దమ్మాయి పేరు నివృతి, ఇక రెండవ అమ్మాయి పేరు నవిష్క. తాజాగా పెద్దమ్మాయి నివృత్తి 14వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిర్వహించారు మెగా ఫ్యామిలీ.

Sreeja Konidela: శ్రీజ డాటర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో మెగాస్టార్ చిరంజీవితో అలాగే రామ్ చరణ్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో నివృత్తి బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు శ్రీజ డాటర్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీజ తన కూతురు నివృత్తి బర్త్డే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. నాకు అత్యంత విలువైన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

శ్రీజ డాటర్ నివృతి ఫొటోస్ వైరల్..

నువ్వు నాకు దొరికిన అద్భుతం. ఐ లవ్ యు సో మచ్ అంటూ శ్రీజ పోస్ట్ లో రాస్తూ కూతురితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ మనవరాలు నివృతికి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలియజేసారు. మెగాస్టార్ కూడా నివృతితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. మొత్తానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

Star Heros: విలన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా మారిన టాప్ 5 హీరోలు వీళ్ళే!

Star Heros: సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా మారుతాయో అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒకప్పుడు నటీనటులుగా వెలిగిన వారు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో మొదటి విలన్ పాత్రల ద్వారా ఎంట్రీ ఇచ్చిన చాలామంది ఆ తర్వాత స్టార్ లుగా మారి గుర్తింపు ఏర్పరచుకున్నారు. మొదట విలన్ పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టిన వారు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్నారు. కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వారు చాలామంది ఉన్నారు.

Star Heros: విలన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా మారిన టాప్ 5 హీరోలు వీళ్ళే!

అందులో టాలీవుడ్ లో మొదట విలన్ పాత్రలు చేసి ఆ తర్వాత హీరోగా మెప్పించినవారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా రాణిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు మొనగాడు, ఇది కథ కాదు లాంటి సినిమాలలో విలన్ గా నటించి మెప్పించారట. మొదట విలన్ పాతల్లో నటించి మెప్పించిన చిరంజీవి యాక్టింగ్ చూసి సినిమాలలో హీరోగా అవకాశాలు ఇచ్చారట. అలా చిరంజీవి అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు.

Star Heros: విలన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా మారిన టాప్ 5 హీరోలు వీళ్ళే!

కాగా చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే తెలుగు ఇండస్ట్రీ లో డైలాగ్ కింగ్ మోహన్ బాబుని పిలుస్తారు. ముందుగా ఈ హీరో కూడా విలన్ పాత్రతో ఇండస్ట్రీలో మెప్పించి తర్వాత హీరోగా రాణించి, తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా ఎదిగాడు. మరొక హీరో డైలాగ్ మోహన్ బాబు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట విలన్ గా కెరీర్ ను ప్రారంభించిన మోహన్ బాబు ఆ తర్వాత చిన్న చిన్నగా హీరో పాత్రలలో నటిస్తూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు మోహన్ బాబు. టాలీవుడ్ హీరో గోపీచంద్ కూడా మొదట ఇండస్ట్రీకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా రాణించాడు.

విలన్ నుంచి స్టార్ లుగా మారిన వారు వీరే..

తొలివలపు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన గోపీచంద్ జయం, యజ్ఞం లాంటి మూవీస్ లో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. మరొక హీరో డాక్టర్ రాజశేఖర్. మొదట తలంబ్రాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ తలంబ్రాలు సినిమాలో నటనకు గాను నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా హీరోగా మారుతూ ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజశేఖర్. జెడి చక్రవర్తి ఇతను కూడా కెరీర్ ఆరంభంలో మొదట్లో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత చూస్తుండగానే హీరోల పాత్రలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు జె.డి చక్రవర్తి. కాకా జేడి చక్రవర్తి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే..

Pavithra Lokesh: నటి పవిత్ర లోకేష్ కు భారీ షాక్.. రెండు బడా ప్రాజెక్ట్స్ నుంచి తప్పించిన మేకర్స్?

Pavithra Lokesh: నటి పవిత్ర లోకేష్ ఈమె పుట్టి పెరిగింది కన్నడ చిత్ర పరిశ్రమలో అయిన ఈమె అచ్చ తెలుగు అమ్మగా ఎంతో మంది టాలీవుడ్ హీరోలకు అమ్మ పాత్రలలో నటించి తెలుగులో కూడా విపరీతమైన ఆదరణ సంపాదించుకుంది.పవిత్ర లోకేష్ అంటేనే తల్లి పాత్రలకు పెట్టింది పేరు అనేలా గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం నరేష్ తో వివాదం కారణంగా తన ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది.

Pavithra Lokesh: నటి పవిత్ర లోకేష్ కు భారీ షాక్.. రెండు బడా ప్రాజెక్ట్స్ నుంచి తప్పించిన మేకర్స్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన పవిత్ర లోకేష్ నటుడు నరేష్ తోసహజీవనం చేస్తున్నారనే వార్తలు రావడంతో పెద్ద ఎత్తున వీరి వివాదం వార్తల్లో నిలిచింది. ఇక వీరి వ్యవహారంలోకి నరేష్ మూడో భార్య రమ్య రావడంతో నటి పవిత్ర పరువు కాస్త గంగలో కలిసిపోయింది. నరేష్ తో తనకి ఎలాంటి సంబంధాలు లేవని కేవలం మంచి స్నేహితుడు అంటూ పవిత్ర చెప్పుకొచ్చారు.

Pavithra Lokesh: నటి పవిత్ర లోకేష్ కు భారీ షాక్.. రెండు బడా ప్రాజెక్ట్స్ నుంచి తప్పించిన మేకర్స్?

ఇక నరేష్ తో తనకు ఏ విధమైనటువంటి రిలేషన్ లేదని చెప్పిన పవిత్ర ఆదివారం బెంగుళూరులోని ఒక రెస్టారెంట్ లో నరేష్ తో పాటు ఒకే రూమ్లో ఈమె రెడ్ హ్యాండెడ్ గా నరేష్ మూడో భార్య రమ్యకు పట్టుబడ్డారు. దీంతో వీరి వివాదం మరింత ముదిరిపోయింది. ఈ విధంగా నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడంతో పలువురు మేకర్స్ పవిత్ర లోకేష్ పట్ల అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పవిత్ర లోకేష్ కెరియర్ ఇబ్బందులలో పడనుందా…

ఇప్పటికే ఈమె తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలలో తల్లి పాత్రలలో నటించే అవకాశాన్ని అందుకున్నారట. అయితే ఈమె వ్యవహారం వల్ల ఆ రెండు సినిమాలలో నటించే అవకాశాన్ని కోల్పోయిందని, పవిత్ర లోకేష్ వల్ల వారి సినిమాకి డామేజ్ అయ్యే అవకాశాలు ఉండడంతో మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా ఈమెకు రెండు సినిమాల నుంచి తప్పించడంతో ఈమె కెరియర్ పతనానికి ఇదే నాంది అని పలువురు భావిస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది.

Upasana: త్వరలోనే మెగా గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఉపాసన..? వారసుడోస్తున్నాడు అంటూ ఖుషి అవుతున్న ఫ్యాన్స్ !

Upasana: మెగా వారసుడు రామ్ చరణ్ వారసుడి కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటివరకు వీరు పిల్లల గురించి ఏ విషయం క్లారిటీ ఇవ్వలేదు. వీరితోపాటు పెళ్లయిన వారు, వీరి కన్నా చాలా ఆలస్యంగా పెళ్లయిన వారు కూడా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. అయినా వీళ్లు మాత్రం ఇప్పటివరకు పిల్లల గురించి ఎలాంటి ప్లానింగ్ చేయలేదు.

Upasana: త్వరలోనే మెగా గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఉపాసన.. వారసుడోస్తున్నాడు అంటూ ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

ఈ క్రమంలోనే తరచూ పిల్లల గురించి ఉపాసనకు ఎంతోమంది నెటిజన్లు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అయితే ఉపాసన మాత్రం తనకు సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతానని ఈ ప్రశ్నలను దాటివేశారు.ఇదిలా ఉండగా ఉపాసన సద్గురిని కలిసినప్పుడు తాను తన వైవాహిక జీవితంలో 10 సంవత్సరాల నుంచి ఎంతో సంతోషంగా ఉన్నాను కానీ అందరూ నన్ను పిల్లల గురించి ప్రశ్నిస్తున్నారు అంటూ సద్గురుని ప్రశ్నించింది.

Upasana: త్వరలోనే మెగా గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఉపాసన.. వారసుడోస్తున్నాడు అంటూ ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

ఈ ప్రశ్నకు సద్గురు సమాధానం చెబుతూ ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు అవసరం లేదు ఒకవేళ నువ్వు ఆడపులివి అయితే పులి పిల్లని లేదా పిల్లలు గురించి ఆలోచించడం మానేయాలి అంటూ తెలిపారు.ఈ విధంగా ఎవరైతే పిల్లలను వద్దనుకుంటారో వారికి తాను ఒక గిఫ్ట్ ఇస్తానని సద్గురు తెలిపారు.అయితే ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సద్గురు ఇచ్చే గిఫ్ట్ తీసుకోవడానికి మా తాతయ్య అంగీకరించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.

పిల్లల గురించి ప్లాన్ చేస్తున్న ఉపాసన…

సద్గురు పిల్లలు వద్దనుకున్న వారికి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. అయితే ఆ గిఫ్ట్ తీసుకోవడానికి మెగా కుటుంబ సభ్యులు ఇష్టపడడం లేదు అంటే త్వరలోనే ఉపాసన పిల్లల విషయంలో ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. మెగా స్టార్ గ్రాండ్ చైల్డ్ కమింగ్ సూన్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఉపాసన ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో వేచి చూడాలి.

Pavithra Lokesh: మీడియా వెంబడిస్తోంది అంటూ పోలీస్ స్టేషన్ మెట్లేక్కిన నటి పవిత్ర లోకేష్?

Pavithra Lokesh: గత కొద్ది రోజుల్లో నుంచి సోషల్ మీడియాలోనూ, వార్తల్లోనూ నరేష్ నటి పవిత్ర లోకేష్ హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. ఇలా వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారని,త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో ఒక్కసారిగా వీరి వ్యవహారం ఎన్నో వివాదాలకు కారణం అవుతుంది. ఒకవైపు నరేష్ తన భార్య రమ్య పై తీవ్ర ఆరోపణలు చేయగా రమ్య నటి పవిత్ర లోకేష్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.

Pavithra Lokesh: మీడియా వెంబడిస్తోంది అంటూ పోలీస్ స్టేషన్ మెట్లేక్కిన నటి పవిత్ర లోకేష్?

ఈ విధంగా వీరు ఒకరిపై మరొకరిని దూషించుకుంటూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు.అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తున్నప్పటికీ, వీరిద్దరు మాత్రం మంచి స్నేహితులమని తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ మా మధ్య ఏ విధమైనటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ వీరి గురించి అనేక కథనాలు వెలువడటంతో నటి పవిత్ర ఏకంగా పోలీస్ మెట్లు ఎక్కారు.

Pavithra Lokesh: మీడియా వెంబడిస్తోంది అంటూ పోలీస్ స్టేషన్ మెట్లేక్కిన నటి పవిత్ర లోకేష్?

ఈ క్రమంలోనే మైసూర్ లోని వీవీ పురం పోలీస్ స్టేషన్‌లో పవిత్ర పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తనని కొందరి మీడియా ప్రతినిధులు వెంటపడుతున్నారని,తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తూ తనకు ఏమాత్రం మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అంటూ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదివరకే ఈమె తన పేరుపై ఫేక్ అకౌంట్లు సృష్టించి అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా ప్రస్తుతం మీడియా తనకు ప్రతిష్ట భంగం కలిగిస్తున్నారని
మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మీడియా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు..

ఇకపోతే గత కొన్ని రోజుల క్రితం నరేష్ మూడో భార్య రమ్య పవిత్ర లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యలను కూడా ఈమె తప్పు పట్టారు.కేవలం తను నన్ను బాడ్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారనీ తనకు ఏదైనా ఫ్యామిలీ సమస్యలు ఉంటే తన ఫ్యామిలీ పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇలా నన్ను బ్యాడ్ చేయడం భావ్యం కాదు అంటూ తన మాటలను తప్పుపట్టారు. ఏది ఏమైనా ప్రస్తుతం వీరి వ్యవహార శైలి మాత్రం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడితో ముగుస్తుందో తెలియాల్సి ఉంది.

Actor Shivaji: ఈ పదేళ్లు సినిమాల్లో ఉండి ఉంటే కోట్లు సంపాదించేవాడిని.. కానీ ఆ ఒక్క కారణంతో నా సినీ కెరీర్ ని ఆపేసా: హీరో శివాజీ

Actor Shivaji: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు శివాజీ గురించి అందరికీ సుపరిచితమే ఈయన గతంలో పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరమైనా శివాజీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. సినిమా వేడుకలో సందడి చేశారు. శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా శివాజీ పాల్గొన్నారు.

Actor Shivaji: ఈ పదేళ్లు సినిమాల్లో ఉండి ఉంటే కోట్లు సంపాదించేవాడిని.. కానీ ఆ ఒక్క కారణంతో నా సినీ కెరీర్ ని ఆపేసా: హీరో శివాజీ

ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇకపోతే జూన్ 4వ తేదీ అల్లూరి 125 వ జయంతి వేడుకలను జరుపుకోవడంతో ఆయన జయంతి సందర్భంగా అల్లూరి సినిమా నుంచి టీజర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో శివాజీ మాట్లాడుతూ పలు ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.అల్లూరి అంటేనే అందరికీ సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తుకు వస్తారని, ఈయన అప్పటి అల్లూరి సీతారామరాజు సినిమాని గుర్తు చేసుకున్నారు.

Actor Shivaji: ఈ పదేళ్లు సినిమాల్లో ఉండి ఉంటే కోట్లు సంపాదించేవాడిని.. కానీ ఆ ఒక్క కారణంతో నా సినీ కెరీర్ ని ఆపేసా: హీరో శివాజీ

ఈ సినిమా ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని రగిలించిన సినిమా అది అంటూ శివాజీ పేర్కొన్నారు. వేణుగోపాల్ గురించి ఈయన మాట్లాడుతూ.. గోపిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది తానేనని వెల్లడించారు. కొంతకాలం నుంచి గోపితో ఎంతో మంచి అనుబంధం ఉందని ఈయన ప్రతి ఒక్క కథను కూడా తనకే వివరిస్తాడని శివాజీ వెల్లడించారు. ఇక అల్లూరి కథ కూడా నాకు వివరించారని ఈ సినిమా విన్న తర్వాత గుండెల మీద చేయి వేసుకొని ఈ సినిమా చేయొచ్చు అంటే సలహా ఇచ్చామని శివాజీ పేర్కొన్నారు.

ఆ బస్సు ఘటన నన్ను ఇండస్ట్రీకి దూరం చేసింది…

ఇకపోతే శివాజీ చివరిగా ‘బూచమ్మా బూచాడు’ అనే సినిమాలో నటించారు. అయితే ఈయన సినిమాలకు దూరం కావడానికి ప్రధాన కారణం పాలెం బస్సు సంఘటన తనని సినిమా ఇండస్ట్రీకి దూరం చేసిందనీ ఈ సందర్భంగా. అప్పటినుంచి తాను సినిమాలలో నటించి ఉంటే ఎంత వరస్ట్ గా అన్నా 10 నుంచి 15 కోట్ల వరకు డబ్బులు సంపాదించే వాడినని కేవలం ఆ బస్సు ఘటన నన్ను ఇండస్ట్రీకి దూరం చేసిందని వెల్లడించారు. ఈ విధంగా హీరో శివాజీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.