Tag Archives: temple

Rajasekhar: దేవుడంటే నాకు నమ్మకం లేదు… ఫుల్లుగా తాగి గుడికి వెళ్ళాను: రాజశేఖర్

Rajasekhar: వెండితెర నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి  వారిలో నటుడు రాజశేఖర్ ఒకరు. ఒకప్పుడు ఈయన ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో హీరోగా కాకుండా రాజశేఖర్ నెగిటివ్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

తాజాగా నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాజశేఖర్ తన గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. తనకు దేవుడంటే నమ్మకం లేదు దేవుడు అంటే ఒక రాతి బొమ్మ అని మాత్రమే నేను భావిస్తానని ఈయన తెలిపారు.

ఇలా దేవుడిపై నాకు నమ్మకం లేదని అయితే నేను నాకంటే వయసులో పెద్దదైన ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు నన్ను రా పోరా అంటూ మాట్లాడేది ఇలా అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడంతో నేను దేవదాసుగా మారి తాగుడుకు బానిసగా మారిపోయాను ఇలా ఒకరోజు ఫుల్లుగా తాగడంతో నా స్నేహితుడు నువ్వు దేవుడిని నమ్మవు అందుకే నీకు ఇలా జరిగింది అంటూ మాట్లాడారు దాంతో ఆరోజు పక్కనే ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి దేవుడితో చాలెంజ్ చేశాను.

రాతి విగ్రహం…

ఆరోజు ఫుల్లుగా తాగి ఉన్న నేను దేవుడి గుడిలోకి వెళ్లి నేను ప్రేమించినటువంటి అమ్మాయి నాకు ఎస్ చెబితే కనుక నువ్వు నిజంగా దేవుడేనని నమ్ముతాను అని మాట్లాడారట ఇలా దేవుడి గుడిలో నేను ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కొద్ది రోజులకు ఆ అమ్మాయి నన్ను చూసి ఏమండీ వెళ్ళండి రండి అంటూ గౌరవం ఇచ్చి మాట్లాడేదని అలా తన ప్రేమ ఒప్పుకోవడంతో దేవుడిపై నాకు నమ్మకం కలిగింది అంటూ ఈయన తెలిపారు. ఈయన ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు జీవితనే అని రాజశేఖర్ తెలిపారు.

Samantha: సమంతకు గుడి కట్టారు… విగ్రహం కూడా సమంతదే పెట్టాలిగా… అభిమాని పై భారీ ట్రోల్స్!

Samantha: సాధారణంగా హీరో హీరోయిన్ల మీద ప్రేక్షకులకు అమితమైన అభిమానం ఉంటుంది. ఈ క్రమంలో హీరో, హీరోయిన్ల మీద ఉన్న వారి అభిమానాన్ని వివిధ రకాలుగా తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానంతో హీరో హీరోయిన్లకు గుడి కట్టించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అందాలతో ఆకట్టుకొనే హీరోయిన్లకు అభిమానులు ఎక్కువ.

కోలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టించారు. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ తో పాటు హన్సిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్ల కే కాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా అభిమానులు గుడి కట్టించారు.ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంతకి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఒక అభిమాని సమంత మీద తనకి ఉన్న అభిమానాన్ని చాటుకోవటానికి ఏకంగా ఆమెకు గుడి కట్టించాడు.

తాజాగా సమంత పుట్టినరోజు సందర్భంగా సమంతకి గుడి కట్టించి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అయితే సమంత గుడి, ఆ గుడిలోని సమంత విగ్రహం మీద ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి. అసలు గుడి అయితే కట్టారు విగ్రహం కూడా సమంతది పెడితే బాగుంటుంది అని కొందరు, విగ్రహానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని ముందే చెప్పాలిగా అంటూ మరికొందరు ఇలా వివిధ రకాలుగా కౌంటర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Samantha: విగ్రహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలిగా…

ఇక దీని గురించి ఫన్నీ మీమ్స్‌ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నువ్ సమంత అని చెప్పే వరకు నాకు తెలియలేదు బ్రో అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక బ్రహ్మానందం స్టిల్స్‌ను వాడుకుంటూ ఈ విగ్రహం మీద నానా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత గుడి, విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Mystery temple: ఆ గుడిలోకి వెళ్లారంటే… ప్రాణాలతో తిరిగి రాలేరు.. ఎక్కడో తెలుసా..?

Mystery temple:సాధారణంగా ప్రజలు తమ కోరికలు, బాధలను నెరవేర్చాలని దేవుడిని ప్రార్థించేందుకు గుడులకు వెళ్తుంటారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు గుడిలో దేవుడిని దర్శించుకుంటారు. మనకు ఎన్ని బాధలు ఉన్నా.. ఒక్కసారి దేవుడి ఆలయానికి వెళ్లి ఆయనను చూస్తే.. కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మనసు తేలిక అవుతుంది.

Mystery temple: ఆ గుడిలోకి వెళ్లారంటే… ప్రాణాలతో తిరిగి రాలేరు.. ఎక్కడో తెలుసా..?

కానీ ఎవరైనా చావడానికి గుడికి వెళ్తారా..? అయితే ఓ గుడికి వెళ్తే మాత్రం చావడం ఖాయం. తెలిసి తెలిసి ఆ గుడిలోకి అడుగుపెట్టే సాహసం చేస్తారా.. ఇలాంటి ఆలయం ఎక్కడు ఉందో అని అందరికి ఆసక్తి ఉంటుంది. 

Mystery temple: ఆ గుడిలోకి వెళ్లారంటే… ప్రాణాలతో తిరిగి రాలేరు.. ఎక్కడో తెలుసా..?

ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే.. దక్షిణ టర్కీలోని పాముక్కలే సమీపంలో ఉంది. ఆలయంలో పక్షులు, జంతువులు చనిపోవడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. స్థానికులు ఈ గుడిని ‘ నరక ద్వారం’గా పిలుస్తారు. అయితే ఆ గుడిలోకి వెళ్లిన జంతువులు ఎందుకు మరణిస్తున్నాయనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు. 

మరణాలుకు ఈ వాయువే కారణం:

తాజాగా ఈ మిస్టరీని సైంటిస్టులు చేధించారు. ఈ ఆలయం దిగువ భాగం నుంచి ప్రమాదకర కార్బన్ డయాక్సైడ్ వాయువు వస్తుందని నిర్థారించారు. సైంటిస్టుల పరిశోధన ప్రకారం.. ఆలయం దిగువభాగాన పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉందని భావిస్తున్నారు. దీంతోనే గుడిలోపలకి వెళ్లిన జంతువులు, పక్షులు మరణిస్తున్నాయమని తేల్చారు. సాధారణంగా.. 10 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంటేనే.. 30 నిమిషాల్లో ఎవరైనా మత్తులోకి జారుకుంటారు.. తరువాత మరణిస్తారు. అయితే ఈ గుహలో ఈ విషవాయువు 91 శాతం వరకు ఉందని తేల్చారు.

గుడికి వెళుతున్నారా…? అయితే ఈ రూల్స్ తప్పక పాంటించండి..!

దేవుడి భక్తి అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానికి కొంత మంది గుళ్ల చుట్టూ తిరుగుతుంటారు. మరికొంత మందికి ఆ అలవాటు ఉండదు. ఇక ఆలయాలు దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయాలను భూమిలోని మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు.

ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు నిర్మించారు. అందుకే అలాంటి ఆలయాల్లో అడుగుపెట్టగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ఆలయాల్లోకి ప్రవేశించినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

ఆ నియమాలు ఏంటంటే.. ముందుగా గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అక్కడ ఎలాంటి ధ్వజ స్తంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ ప్రదక్షిణ చేసే సమయంలో దాట కూడదు. దేవుడి విగ్రహం కింద నిలబడి ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు. దేవాలయంలో దేవుడికి వెనకాల కూర్చోకూడదు. దేవాలయంలోకి ప్రేవేశించిన ఏ భక్తుడు ఏడవకూడదు.

ఖాళీ చేతులతో దేవుడి గుడిలోకి వెళ్ల కూడదు. వస్త్రాలను కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా ధరించడానికి వీళ్లేదు. ఇక గుడి దగ్గర యాచించే వాళ్లకు తోచిన సహాయం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గుడిలోకి జుట్టు విరబోసుకొని వెళ్లకూడదు. దేవుడికి ఎదురుగా నష్టాంగ నమస్కారం చేయకూడదు.

గుడిలో పెళ్లి.. బంధువుల లొల్లి.. చివరకు ఇలా జరిగింది..!

సాధారణంగా పెళ్లి అనేది ఇంటి దగ్గర పందిరి వేసి.. మేలతాళాల మధ్య పంతులు కుదిర్చిన ముహుర్తానికి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది అయితే ఫంక్షన్ హాల్ లాంటివి బుక్ చేసుకొని అక్కడే పెళ్లి చేసుకొని.. వింధు కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారు. అయితే మరికొంత మంది దైవ సన్నిధిలో పెళ్లి చేసుకొని రిసెప్షన్ మాత్రం ఇంటి దగ్గర పెట్టుకుంటారు.

ఇలా తమిళనాడులోని ఓ దేవాలయంలో కొన్ని జంటలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే అక్కడకు వెళ్లి పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రతీ ఏడాది ఆ దేవాలయంలో వందల పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే ఒకొక జంటకు కేవలం 30 నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు. ఈ లోపు ముహూర్తం చూసుకొని తాళి కట్టి.. పెళ్లి కార్యక్రమం పూర్తి చేయాల్సి ఉంటుంది.

తర్వాత మరో జంటకు అక్కడ మరో 30 నిమిషాల్లో తాళి కట్టి జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన వధూవరుల కుటుంబసభ్యులు ఒకరినొకరు కొట్టుకున్నారు. మా వాళ్ల పెళ్లి జరగాలని ఒకరు అంటే.. లేదు మావాళ్ల పెళ్లి జరగలాని మరొకరు పట్టుపట్టడంతో ఇలా గొడవ చోటు చేసుకుంది. ఇలా గుడిలోని పెళ్లి వేడుకల్లో వధూవరులతో సహా బంధువులు కొట్టుకోవడం వైరల్‌గా మారింది.

అక్కడకు చేరుకున్న దేవాదాయ అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీనికి సంబంధించి వీడియో ను ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. దేవాలయంలో ఇలా వాగ్వాదం చోటుచేసుకోవడంతో దేవాదాయ శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయంలో కనీసం నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంలో నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుడికి వెళ్ళినప్పుడు ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో తెలుసా..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయాన్ని సందర్శించినప్పుడు మొదటగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు పూర్తిచేసిన తరువాత ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకుంటాను. అయితే కొందరు దేవుడి ఆలయం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలో పూర్తిగా అవగాహన ఉండదు. వారికి తోచిన విధంగా 3,5,7,9 ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తారు. మరికొందరు ప్రత్యేకమైన కోరికలు కోరుకొని స్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం మనం చూసే ఉంటాం. అయితే ఏ దేవుడి గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

సూర్య భగవానుడికి, నవగ్రహాలకు,18 ప్రదక్షిణాలు చేయాలి. అదేవిధంగా సుబ్రమణ్యేశ్వర స్వామికి,27 ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి జరుగుతుంది.
*సోమవారం శివుడికి18 మహాలక్ష్మి అమ్మవారికి 20 ప్రదక్షిణలు చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
*మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ 21 ప్రదక్షణలు చేయాలి.
*బుధవారం సరస్వతీదేవికి17, వినాయకుడుకి 27 ప్రదక్షిణలు చేయాలి.
*గురువారం సాయిబాబా దేవాలయంలో 16 ప్రదక్షిణలు చేయాలి.
*శుక్రవారం దుర్గా మాత ఆలయంలో 20 ప్రదక్షిణలు చేయాలి.
*శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి 21 ప్రదక్షిణలు శనీశ్వరునికి 18 ప్రదక్షిణలు చేయాలి.

ఈ విధంగా ఇష్టమైన రోజు ఇష్టమైన దేవునికి ఇన్ని ప్రదక్షిణలు చేసి ఆలయంలోనికి దేవుని దర్శనార్థం ఆలయంలోనికి ప్రవేశించాలి. ఈ విధంగా ప్రదక్షిణలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా, అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.

గుడిలో శఠగోపం పెట్టడం వెనుక గల కారణం ఇదే..!

సాధారణంగా మనం దేవాలయాలను దర్శించినప్పుడు ముందుగా దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం ఆలయం లోపలికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత తలపై శఠగోపం పెట్టడం మనం చూస్తుంటాం. అసలు ఈ శఠగోపం అంటే ఏమిటి? గుడిలో మనకు తల పై శఠగోపం ఎందుకు పెడతారు? దీని ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

శఠగోపం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం ఆలయంలో ఉన్న దేవతలకు ప్రతీకగా భావిస్తారు.గుడికి వెళ్ళిన ప్రతి భక్తునికి గర్భగుడిలో ఉన్న దేవుడిని తాకే అవకాశం ఉండదు కాబట్టి ఈ ఆలయంలో ఉన్న పూజారి ఈ శఠగోపం స్వామివారి పాదాల వద్ద ఉంచి దానిని తెచ్చి మన తలపై పెడతాడు. అంతేకాకుండా శఠగోపం పై స్వామి వారి పాదాలు ఉంటాయి.దీనిని తలపై పెట్టుకోవడం వల్ల సాక్షాత్తు ఆ దేవుని పాదాల దగ్గర వెళ్ళి నమస్కరించినట్లు భావిస్తారు.

ఆలయంలో ఉన్న పూజారి ఈ శఠగోపం మన తలపై పెట్టినప్పుడు మన మనసులో ఉన్న కోరికను కోరుకోవడం వల్ల సాక్షాత్తు ఆ దేవుని పాదాల చెంతకు వెళ్లి చెప్పినట్లు.శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్ధం. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ శఠగోపం రాగి, వెండి, కంచు వంటి పదార్థాలతో వలయాకారంలో తయారుచేస్తారు.శఠగోపం వల్ల ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా ఎంతో ప్రయోజనకరం. లోహంతో తయారు చేసిన ఈ శఠగోపం తలపై ఉంచినప్పుడు మనలో విద్యుదావేశం జరిగి అధిక మొత్తంలో విద్యుత్ బయటకు వెళ్ళటం వల్ల మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

దేవుడికి హారతి ఇచ్చే సమయంలో గంట కొట్టడానికి కారణం ఇదే..!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయాలను దర్శించడం ఒక ఆనవాయితీగా ఉంది. అయితే దేవాలయంలోకి వెళ్ళిన ప్రతి భక్తుడు ముందుగా ద్వారం వద్ద ఉన్న గంట కొట్టి దేవాలయంలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా హారతి ఇచ్చే సమయంలో కూడా గంటను కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. అయితే గుడిలో హారతి ఇచ్చే సమయంలో గంట ఎందుకు కొడతారు?ఆ విధంగా కొట్టడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

గుడికి వెళ్ళిన ప్రతి భక్తుడు మొదటగా దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి గుడిలోకి వెళ్ళే ముందు గంటకొట్టి దేవుడికి నమస్కరించుకుని వెళుతుంటారు. ఆ విధంగా గంటను కొట్టినప్పుడు ఓం అనే ప్రణవనాదం వెలువడుతుంది. దీని ద్వారా మన మనసులో ఉన్న చింతలు, బాధలు తొలగిపోయి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సాధారణంగా దేవుడికి హారతి ఇచ్చే సమయంలో ఎదురుగా మండపంలో ఉన్న గంటను కొడుతుంటారు. కానీ దేవుడికి హారతి ఇచ్చే సమయంలో మండపంలో ఉన్న గంటను కొట్టకూడదు. ఎందుకంటే ఓంకార నాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోలోపల వింటూ ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి.

ఇక హారతి ఇచ్చే సమయంలో గంట కొట్టడం ద్వారా సమస్త దేవతలందరికీ ఆహ్వానం పలుకుతున్నామని చెప్పడానికి, మన మనసులు ఉన్న ఇతర ఆలోచనలు తొలగిపోయే మన ధ్యాస మొత్తం దేవుడిపై ఉండటానికి హారతి ఇచ్చే సమయంలో గంట కొడతారు. అలాగే హారతి ఇచ్చే సమయంలో భక్తులు ఎవరు కూడా కళ్ళు మూసుకుని దేవుని నమస్కరించకూడదు. హారతి వెలుగులో దేవుని చూస్తూ నమస్కరించుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.