Tag Archives: tirupati

Niharika: జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిహారిక.. అక్కడి నుంచి పోటీకి సిద్ధం?

Niharika: నిహారిక పరిచయం అవసరం లేని పేరు మెగా డాక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. తన భర్తకు విడాకులు ఇచ్చి తండ్రి వద్దకు వచ్చిన నిహారిక ప్రస్తుతం హీరోయిన్గా సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే నిహారిక త్వరలోనే రాజకీయాలలోకి కూడా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీల నుంచి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే నిహారిక తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా నిహారిక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారనే వార్తలు రావడంతో అభిమానులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కచ్చితంగా నిహారిక విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అయితే ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన సోదరుడు వరుణ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తనకు ఇదే ప్రశ్న ఎదురయింది.

అవసరమనిపిస్తే ప్రచారం చేస్తాం…

నిహారిక రాజకీయాలలోకి రాబోతుందంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. ఇక మేము రాజకీయాలలోకి రావడం అనేది మా పెద్దల నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని ఒకవేళ ఎన్నికల ప్రచారంలో మాకు అవసరం అనిపిస్తే కనుక పెదనాన్న బాబాయ్ నాన్న చెప్పినట్టు మేము ఎన్నికల ప్రచారానికి వస్తామని ఈ సందర్భంగా వరుణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Adipurush: ఆది పురుష్ సినిమా చూడాలంటే థియేటర్లకు అలా వెళ్లాల్సిందేనా… వైరల్ అవుతున్న న్యూస్!

Adipurush: ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఆది పురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కాబోతోంది ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాని చూడటానికి థియేటర్ కి వచ్చే వారందరూ కూడా చెప్పులు లేకుండా థియేటర్లోకి వచ్చే సినిమా చూడాలి అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు చెప్పులు బయటే వదిలి వెళ్తాము అలాంటిది రామాయణం తరహాలో రాబోతున్న సినిమాని చూడటానికి కూడా చెప్పులు థియేటర్ బయట వదిలి వెళ్లాలంటూ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో చిత్ర బృందం కూడా పాల్గొని సందడి చేశారు.

Adipurush: చెప్పులు వేసుకుని చిత్ర బృందం…


ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేదికపై ప్రభాస్ తో సహా ఇతర చిత్ర బృందం కూడా చెప్పులు లేకుండా తిరగడం మనం చూసాము అందుకే థియేటర్లో ఈ సినిమాని వీక్షించే సమయంలో చెప్పులు కూడా వేసుకోకుండా సినిమాని చూడాలని అందుకే చెప్పులు లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లాలని ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Prabhas: తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా… పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్!

Prabhas:టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గాను ఫాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ పెళ్లి గురించి తరచూ ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. పెళ్లి వయసు దాటిపోయిన ఈయన ఇంకా పెళ్లి గురించి ఆలోచించకపోవడంతో అభిమానులు తరచూ ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ ఫలానా హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ తరచూ ఈయన పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిసిపోతుంది. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కృతి సనన్ జంటగా ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టమని ప్రభాస్ తెలిపారు. ఇలా ప్రభాస్ మాట్లాడుతూ ఉండగా తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Prabhasఎప్పుడు జరిగిన తిరుపతిలోనే…


ప్రభాస్ మాట్లాడుతూ ఉన్న సమయంలోనే అన్నా పెళ్లెప్పుడు అంటూ అభిమానులు గట్టిగా కేకలు వేయడంతో తన పెళ్లి ఎప్పుడు జరిగినా కూడా తిరుపతిలోనే జరుగుతుంది అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ఈ శుభవార్తను ఎప్పుడూ చెబుతారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Vignesh Shivan: తిరుమల వ్యవహారం పై స్పందించిన విగ్నేష్… కంగారులో మర్చిపోయాం.. క్షమించండి అంటూ బహిరంగ క్షమాపణ!

Vignesh Shivan: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి నయనతార ఎట్టకేలకు జూన్ 9వ తేదీన తన ప్రియుడు విఘ్నేష్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో వీరి వివాహం జరిగింది. అయితే ఈ జంట పెళ్లయిన మరుసటిరోజే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వచ్చారు. అయితే స్వామివారిని దర్శించుకున్న అనంతరం నయనతార దంపతులు తిరుమల మాడ వీధులలో చెప్పులు ధరించడం పెద్దఎత్తున వివాదానికి దారి తీసింది.

Vignesh Shivan: తిరుమల వ్యవహారం పై స్పందించిన విగ్నేష్… కంగారులో మర్చిపోయాం.. క్షమించండి అంటూ బహిరంగ క్షమాపణ!

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నయనతార పై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇకపోతే నయనతార విగ్నేష్ దంపతుల వ్యవహారశైలిపై టిటిడి అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపోతే ఈ వ్యవహారశైలిపై విగ్నేష్ స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా విగ్నేష్ మాట్లాడుతూ…

Vignesh Shivan: తిరుమల వ్యవహారం పై స్పందించిన విగ్నేష్… కంగారులో మర్చిపోయాం.. క్షమించండి అంటూ బహిరంగ క్షమాపణ!

అందరికీ నమస్కారం.. నిజానికి మా పెళ్లి తిరుపతిలోనే చేసుకోవాలని భావించాము. కాని కొన్ని కారణాల వల్ల తిరుపతిలో కాకుండా మా పెళ్లి మహాబలిపురంలో చేసుకోవలసి వచ్చింది.పెళ్లయిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా స్వామివారి దర్శనం కోసం తిరుపతి వచ్చామని గత నెలలో మేము స్వామివారి దర్శనం కోసం ఐదుసార్లు తిరుపతికి వచ్చినట్లు తెలిపారు. స్వామివారి దర్శనం తర్వాత ఆలయం బయట ఫోటోషూట్ చేయించుకోవాలని భావించాము.

తెలియకుండానే తప్పు జరిగింది…

బయట రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కాసేపు ఆగి ఆ హడావిడిలో చెప్పులు వేసుకున్నాము అనే విషయం కూడా మరిచిపోయి వచ్చామని, ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలని కానీ ,ఆలయ కట్టుబాట్లను అగౌరవపరచారని కానీ తాము ఆ పని చేయలేదని,పొరపాటున జరిగిన ఈ తప్పు వల్ల మనోభావాలు దెబ్బ తిన్న వారందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ విగ్నేష్ బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. అదే విధంగా తమ పెళ్లికి శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కూడా విగ్నేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Manchu Lakshmi: తిరుపతిలో మోహన్ బాబు ఇంటిని హోమ్ టూర్ చేసిన మంచు లక్ష్మి… ఎంత అందంగా ఉందో?

Manchu Lakshmi: మంచు లక్ష్మీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మోహన్ బాబు కుమార్తెగా, నటిగా, వ్యాఖ్యాతగా అందరికీ ఎంతో సుపరిచితమైన మంచు లక్ష్మి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మి నిత్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.

Manchu Lakshmi: తిరుపతిలో మోహన్ బాబు ఇంటిని హోమ్ టూర్ చేసిన మంచు లక్ష్మి… ఎంత అందంగా ఉందో?

ఈ క్రమంలోనే ఇప్పటికే తను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల హోమ్ టూర్స్ చేశారు. ఈ క్రమంలోనే ఇదివరకే హైదరాబాదులో మోహన్ బాబు ఇంటిని హోమ్ టూర్ చేసిన మంచు లక్ష్మి తాజాగా తిరుపతిలో ఉన్న ఇంటిని హోమ్ టూర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది.

Manchu Lakshmi: తిరుపతిలో మోహన్ బాబు ఇంటిని హోమ్ టూర్ చేసిన మంచు లక్ష్మి… ఎంత అందంగా ఉందో?

ఇక తిరుపతి ఇల్లు తన తండ్రికి ఎంతో ప్రత్యేకమని మంచు లక్ష్మి తెలియజేశారు. ఎంతో విశాలంగా ఆహ్లాదకరంగా ఉన్న ఇంటిలో మోహన్ బాబు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని లక్ష్మీ ప్రసన్న ఈ వీడియో ద్వారా తెలిపారు.

ఇంద్ర భవనం లాంటి ఇల్లు….

ముఖ్యంగా ఈ ఇంటిలో రోజ్ వుడ్ తో తయారు చేసిన ఎన్నో వస్తువులను చూపించారు. అలాగే పెద్ద రాయుడు సినిమాలో మోహన్ బాబు నిత్యం కూర్చుని ఊగే ఉయ్యాలని కూడా మంచు లక్ష్మి ఈ వీడియో ద్వారా చూపించారు. అది తన తండ్రి ఫేవరేట్ అని చెన్నై ఇంటి నుంచి తిరుపతి తెచ్చుకున్నారని ఈ వీడియో ద్వారా తెలిపారు. అలాగే అందరి గదులు, కిచెన్ అన్నింటినీ ఈ వీడియో ద్వారా లక్ష్మీప్రసన్న అభిమానులతో పంచుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ అందమైన ఇంద్ర భవనం పై మీరు ఓ లుక్కేయండి.

Actor Naresh: అవి తిరుపతిలో దొరకలేదంటూ నరేష్ ట్వీట్…వారితో చేరి నువ్వు అలాగే తయారయ్యావ్… నెటిజెన్స్ ఫైర్!

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. మా ఎన్నికల సమయంలో ఈయన చేసిన హంగామా అందరికీ గుర్తుంది. విష్ణు గెలుపుకు తానే సూత్రధారి అంటూ వ్యవహరించారు. మా ఎన్నికల సమయంలో రచ్చ చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అలాగే తన మూడవ భార్య తన పేరు చెప్పుకొని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన విషయం గురించి కూడా నరేష్ వార్తల్లో నిలిచారు.

Actor Naresh: అవి తిరుపతిలో దొరకలేదంటూ నరేష్ ట్వీట్…వారితో చేరి నువ్వు అలాగే తయారయ్యావ్… నెటిజెన్స్ ఫైర్!

ఇక తన భార్యకు తనకు ఏమాత్రం సంబంధం లేదని నరేష్ తేల్చిచెప్పారు.కావాలంటే ఈ కేసు విషయంలో తన సపోర్ట్ పూర్తిగా పోలీసులకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇలా ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో ఉండే నరేష్ ఈ మధ్య నెటిజన్ల ట్రోలింగ్ గురవుతున్నారు. తాజాగా నరేష్ మరోసారి ట్వీట్ చేయడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

Actor Naresh: అవి తిరుపతిలో దొరకలేదంటూ నరేష్ ట్వీట్…వారితో చేరి నువ్వు అలాగే తయారయ్యావ్… నెటిజెన్స్ ఫైర్!

ఈ క్రమంలోనే తాజాగా ఏదో పని నిమిత్తం నరేష్ తిరుపతి వెళ్లినట్టు ఉన్నారు.అయితే తిరుపతి వెళ్లిన సందర్భంగా నరేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తిరుపతిలో ఒక గంట నుంచి నాకెంతో ఇష్టమైన నైక్ ఏయిర్ షూస్ మాత్రం దొరకలేదు. వాటి కోసం హైదరాబాద్ వెళ్లాల్సిందే అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఈయన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచు ఫ్యామిలీతో కలిసి నువ్వు అలాగే తయారయ్యావు..


ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు గంటలో ఏం తిరిగావ్..అంటూ ట్వీట్ చేయగా మరికొందరు తిరుపతి వెళ్లిన నీకు మీ బ్రాండెడ్ షూస్ పని ఏంటి అని ప్రశ్నించారు. మరికొందరైతే దారుణంగా ఆ డబ్బా బ్యాచ్ మంచు ఫ్యామిలీతో కలిసి నువ్వు కూడా అలాగే తయారవుతున్నావ్ అంటూ తీవ్రస్థాయిలో నరేష్ పై ఫైర్ అవుతున్నారు.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..! వాటిపై రాయితీ ప్రకటన..!

Tirumala: దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల – తిరుపతి ఒకటి. దేశంలోని నలుమూలల నుంచి రోజూ వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటు ఉంటారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతి విరజిల్లుతోంది. ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగతోంది.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..! వాటిపై రాయితీ ప్రకటన..!

కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి తిరుపతి వెంకన్న దర్శనానికి అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. తాజాగా ఓమిక్రాన్, కరోనా భయాల వల్ల కూడా శ్రీవారి దర్శనాలకు బ్రేక్ పడింది. దీనికి తోడు గతేడాది చివరలో కురిసిన వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. 

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..! వాటిపై రాయితీ ప్రకటన..!

ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల దర్శనం టికెట్లను కూడా టీటీడీ ప్రారంభించింది. దీంతో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పరిస్థితులు ప్రస్తుతం చక్కబడటంతో రానున్న కాలంలో మరింత మంది ప్రజలు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉంది. 

72 గంటల పాటు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని..

అయితే ఈ నేపథ్యంలో భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ. దూరప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే వారి సౌకర్యార్థం ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. తిరుమల- తిరుపతి మధ్య రాకపోకలకు ఒకేసారి టికెట్ తీసుకుంటే… 10 శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తిరుమల-తిరుపతికి వచ్చిన తర్వాత 72 గంటల పాటు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ విధానం నేటి నుంచి అమలులోకి వస్తున్నట్లు వెల్లడించారు.

Nagarjuna: రెండేళ్ల తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న అక్కినేని దంపతులు..!

Nagarjuna: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి సినిమా విడుదల సమయంలోను లేత సినిమా హిట్ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం చాలా మందికి ఆనవాయితీగా ఉంటుంది.ఈ క్రమంలోనే బంగార్రాజు సినిమా విడుదలైన తర్వాత నాగార్జున కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Nagarjuna: రెండేళ్ల తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న అక్కినేని దంపతులు..!

ఈ క్రమంలోనే నాగార్జున ఆయన సతీమణి అమల స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Nagarjuna: రెండేళ్ల తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న అక్కినేని దంపతులు..!

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా, ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.స్వామివారి దర్శనం అనంతరం అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడారు.

ప్రజలందరూ సంతోషంగా ఉండాలి..

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ…కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు స్వామివారి దర్శనం చేసుకోలేక పోయానని,ఇవాళ స్వామివారి ఆశీస్సులు పొందామని చెప్పారు. అలాగే ప్రపంచ ప్రజల అందరికి మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నాననీ నాగార్జున చెప్పారు.

తిరుపతిలో వింత ఘటన.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..!

ఇటీవల తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. దాని ఎఫెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతికి తాకింది. అక్కడ కూడా విపరీతమైన వర్షం కురవడంతో.. తిరుమలపై ఎన్నో కట్టడాలు నేలమట్టం అయ్యాయి. భక్తులు వెళ్లే దారి మొత్తం స్తంభించిపోయింది.

తిరుమల దర్శనానికి వచ్చే భక్తులను కూడా రావొద్దని అధికారులు సూచించారు. అయితే అక్కడి పరిస్థితులు ఇప్పుడు బాగానే ఉన్నాయి. భక్తులు కూడా వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. అయితే శ్రీకృష్ణానగర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ రింగులతో నిర్మించిన ఓ వాటర్ ట్యాంక్​.. భూమిలోంచి పైకి వచ్చింది. దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

వర్షాల కారణంగా నీరంతా ఒకేదగ్గర చేరడంతో.. తిరుపతి శ్రీ కృష్ణా నగర్‌లో అక్కడి కట్టడాలు, వస్తువుల అన్నీ మునిగిపోయాయి. అక్కడ భూమి లోపల పాతిపెట్టిన ఓ నీటి ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా.. భూమి ఉపరితలం పైకి ఎగసి వచ్చింది. అది దాదాపు 25 సిమెంట్ వరలతో నిర్మించారు. దాదాపు అది 25 అడుగుల విస్తీర్ణంతో ఉంది.

ఇలాంటిది ఒక్కసారిగా బయటపడటం కాస్త ఆసక్తికరంగా మారింది. నీటి తొట్టిలోకి దిగి మహిళ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె ఒక్కసారిగి ఉలిక్కిపడిపోయింది. కంగారు పడి కళ్లు మూసుకున్న సందరు మహిళ కళ్లు తెరిచి చూసే సరికి భూమి ఉపరితలంలో ఉంది. ప్రస్తుతం ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది.

తిరుపతి పై వరుణుడి ప్రతాపం.. జల సందిగ్ధంలో తిరుపతి వాసులు..!

తిరుమల తిరుపతి పై వరుణుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత మూడు రోజుల నుంచి కుండపోతగా వర్షం కురవడంతో తిరుపతి జల సందిగ్ధంలో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఈ తిరుపతిని నువ్వే కాపాడాలి శ్రీనివాస అంటూ స్వామివారిని వేడుకుంటున్నారు. ఇక తిరుమల గిరులపై అధిక వర్షపాతం నమోదు కావడం చేత తిరుపతి నగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

కనుచూపుమేరా వరద నీరు పొంగిపొర్లడంతో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.ఈ క్రమంలోనే వరద ఉధృతికి ఎన్నో వాహనాలు కొట్టుకుపోగా మనుషులు పశువులు కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు వదులుతున్నారు. ఇక అధిక మొత్తంలో నీరు ఇళ్లలోకి చేరడం వల్ల ఇంటిలోని సామాన్లు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి.

ఎత్తయిన చెట్లు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి తిరుపతి మొత్తం చీకటిలో ఉండిపోయింది. ఈ విధమైనటువంటి దుర్భర పరిస్థితి నుంచి తిరుపతి నువ్వే కాపాడాలి స్వామి అంటూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఇలా తిరుపతిని వరద ముంచెత్తడంతో ప్రజలు కొంతమేర భయాందోళనకు గురవుతున్నారు.

ఎప్పుడో 1996 సంవత్సరంలో ఈ విధమైనటువంటి వార్తలు వచ్చాయని ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి వరద రాలేదని అక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు. ఇక తిరుమల కొండలలో వరద నీరు జలపాతాలను పోలి ఉన్నప్పటికీ అధిక వర్షపాతం నమోదు కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి.దీంతో భక్తులు ఎవరూ కూడా తిరుమలకు రాకూడదని ఆలయ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.