Tag Archives: tollywood

Nayanatara: నయనతారకు సంతానయోగం లేదు.. అవన్నీ డ్రామాలే.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!

Nayanatara: సినీ నటి నయనతార గత రెండు సంవత్సరాల క్రితం డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ దంపతుల పెళ్లి చేసుకున్నటువంటి నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లిదండ్రులకు మారిపోయారు. ఇలా వీరీద్దరు సరోగసి ద్వారా తల్లిదండ్రులుగా మారడంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది.

అయితే పెళ్లికి ముందే వీరు సరోగసి ప్లాన్ చేశారని అందుకు తగ్గ ఆధారాలు అన్నింటిని కూడా చూపించడంతో ఈ వివాదం కాస్తా సద్దుమణిగింది కానీ నయనతార హీరోయిన్గా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈమె పిల్లల్ని కంటే కనుక తాను అందం కోల్పోవాల్సి ఉంటుందని తద్వారా కెరియర్ కూడా కోల్పోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే సరోగసి ద్వారా పిల్లలని ప్లాన్ చేశారంటూ చాలా వార్తలు వచ్చాయి..

తాజాగా ఈ వార్తలు గురించి వేణు స్వామి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నయనతార అందం కాపాడుకోవడం కోసమే పిల్లలని సరోగసి ద్వారా కన్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఇవన్నీ కూడా ఒట్టి డ్రామాలే అంటూ ఈయన కొట్టి పారేశారు. అసలు విషయం ఏమిటంటే నయనతార జాతకంలో అసలు సంతాన యోగమే లేదు అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆరోగ్య సమస్య..
ఆమె జాతకం ప్రకారం తనకు సంతాన యోగం లేదు తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అందుకే సంతానం కలగాలని సంతానం కలగకపోవడంతోనే ఆమె సరోగసి ద్వారా తల్లిగా మారారు అంటూ ఈయన అసలు విషయం తెలియజేశారు. వేణు స్వామి నయనతార గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

Rashmika: రష్మిక ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…. ఇప్పుడు భారీగానే అందుకుంటుందిగా?

Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినటువంటి రష్మిక తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలోనూ అలాగే హిందీ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు.

ఈమె ఇటీవల తన 28వ పుట్టినరోజు వేడుకలను ఎంత ఘనంగా జరుపుకున్నారు. రష్మికకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త సంచలనంగా మారింది. రష్మిక కర్ణాటకలోనే జన్మించి అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేశారు.

ఇలా కాలేజీ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు..ఇలా మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నటువంటి ఈమెను చూసి కిరిక్ పార్టీ సినిమా అవకాశాలు కల్పించారు. ఈ సినిమా కోసం ఈమె ఏ విధమైనటువంటి ఆడిషన్స్ కూడా నిర్వహించలేదు. ఇక ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రష్మిక మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

మోడలింగ్ రంగంలో..
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం ఈమె తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ కేవలం 1.5 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో చలో సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమాకు 50 లక్షలు తీసుకున్నటువంటి రష్మిక అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ రెమ్యూనరేషన్ కూడా పెంచుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

Vijay Devarakonda: అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ… ఎన్ని లక్షలకు అమ్మారో తెలుసా?

Vijay Devarakonda: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నటుడు విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన అవార్డును వేలం వేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటనకు గాను ఏకంగా ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. అయితే ఈ అవార్డును ఈయన 2018 వ సంవత్సరంలో అమ్మేశారట. తనకు అవార్డులంటే పెద్దగా ఇష్టం ఉండదని విజయ్ దేవరకొండ పలు సందర్భాలలో వెల్లడించారు.

ఇలా తనకొచ్చిన కొన్ని అవార్డులను అమ్మగా మరికొన్ని ఆఫీసులో ఉన్నాయని మరికొన్ని ఇంట్లో ఉన్నాయని తెలిపారు. అయితే అర్జున్ రెడ్డి సినిమాకు వచ్చినటువంటి ఈ అవార్డును తాను వేలం పాటలో పెట్టానని ఒక ఐదు లక్షలకు అమ్ముడు పోతే పర్లేదు అనుకున్నాను కానీ ఈ అవార్డును ఏకంగా 25 లక్షలకు కొనుగోలు చేశారని ఈయన తెలిపారు.

25 లక్షలు..
ఈ అవార్డు వేలం వేసిన సమయంలో దివి ల్యాబ్స్ కుటుంబానికి చెందినటువంటి శ్యామలాదేవి అనే మహిళ 25 లక్షలకు ఈ అవార్డు కొనుగోలు చేశారు. ఈ స్థాయిలో ఈ అవార్డు వేలంపాటలో పోవడంతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి ఆమెకు అవార్డును అందజేశామని తెలిపారు. అయితే ఈ అవార్డు వేలం పాటలో వచ్చిన 25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించానని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Mrunal Thakur: మెంటల్ నా ** అంటే అర్థం తెలుసా… రిపోర్టర్ ప్రశ్నకు మృణాల్ షాకింగ్ ఆన్సర్!

Mrunal Thakur: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈమె సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇక త్వరలోనే ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమెకు రిపోర్టర్ నుంచి ఓ ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎదురైంది.ఫ్యామిలీ స్టార్ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండని మెంటల్ నా కొడకా అంటూ మృణాల్ ఠాకూర్ తిడుతుంది.దీనిపైనే రిపోర్టర్ కొశ్చన్ అడుగుతూ పాపం సినిమాలో విజయ్‌ను అలా తిట్టారు కదా? అసలు దానికి అర్థం తెలుసా? ఆ సిట్యూవేషన్ ఏంటి? అని అడిగారు.

నిజంగానే మెంటల్ నా కొడకా…
ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ..అయ్యో అలా అడగకండి. నిజంగానే మెంటల్ నా కొడకా. కానీ తను చాలా లవబుల్ కూడా అందుకే ఏవండి అని ప్రేమగా పిలిచింది. కానీ కోపంలో పిలిచేది వేరుగా ఉంటుంది. ఒక రిలేషన్‌లో చాలా ఫేజెస్ ఉంటాయి. క్యూట్, హనీమూన్ ఫేజ్, గర్ల్ ఫ్రెండ్- బాయ్ ఫ్రెండ్, లవర్‌, తర్వాత భర్తగా, చివరగా మెంటల్ నా కొడకా కూడా ఉంటుంది. నాకు ఆ పదానికి కూడా తెలుసు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి పేద రైతులు దొరకలేదా.. ప్రైజ్ మనీ విషయంలో మోసం చేసినట్టేనా?

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణం వ్యక్తిలాగా బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టి అనంతరం సెలబ్రిటీగా మారినటువంటి పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో ఈయన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి విన్నర్ గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ ఆ డబ్బును తాను వాడుకోనని పేద రైతులకు పంచుతానని మాట ఇచ్చారు. అయితే ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి కూడా దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు పెద్దగా సహాయ కార్యక్రమాలు చేసిన సందర్భాలు మాత్రం కనిపించలేదు దీంతో ఈయన పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఈ విధంగా పల్లవి ప్రశాంత్ పట్ల విమర్శలు రావడంతో ఒక కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఏడాదికి సరిపడా బియ్యం కూడా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇకపై కూడా మరికొంతమంది రైతులకు తాను సహాయం చేస్తానని నేను చేసే సహాయానికి సంబంధించిన వీడియోలను అందరితో పంచుకుంటానని తెలిపారు.

డబ్బు పంచడం ఇష్టం లేదా..
ఇక ఈయన సహాయం చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పటివరకు మరో వీడియో షేర్ చేయలేదు. అయితే తాను పేద రైతులను గుర్తించి వారికి మాత్రమే సహాయం చేస్తానని తెలిపారు. ఇక తన ఇంటి వద్దకు ఎవరు కూడా సాయం చేయమని రావద్దని తానే పేదవారిని గుర్తించి సాయం చేస్తానని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఈయన పేదవారిని గుర్తించలేకపోతున్నారా లేకపోతే డబ్బు పంచడం ఈయనకు ఇష్టం లేదా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Pawan Kalyan: గ్లాస్ డైలాగుపై మరోసారి స్పందించిన పవన్.. మీరు ఒప్పుకోవాలంటూ రియాక్ట్ అయిన హరీష్?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించి పూర్తిగా రాజకీయాల పైన ఫోకస్ పెట్టారు. ఇలా రాజకీయాల పరంగా ఈయన ఎంతో బిజీగా ఉండడంతో తన సినిమా షూటింగ్లన్నీ కూడా వాయిదా పడిన సంగతి మనకు తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలలో బిజీ అవుతున్నటువంటి తరుణంలో ఆయన నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఇటీవల భగత్స్ బ్లేజ్ అంటూ ఒక వీడియో విడుదలైన సంగతి మనకు తెలిసిందే.

ఈ వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ గ్లాస్ డైలాగులు అదిరిపోయాయని చెప్పాలి. పగిలే కొద్ది గ్లాస్ కి పదును ఎక్కువ.. గ్లాస్ అంటే సైజు కాదు అది కనిపించని సైన్యం అంటూ చెప్పినటువంటి ఈ డైలాగ్స్ భారీ స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ డైలాగు పట్ల తాజాగా పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

తనకు సినిమాలలో ఇలాంటి డైలాగులు చెప్పడం అంటే ఇష్టం ఉండదని నేను హరీష్ శంకర్ దగ్గర చెప్పాను ఎందుకు ఇలాంటి డైలాగ్స్ పెట్టారని అడగగా అందుకు హరీష్ సమాధానం చెబుతూ మీకు తెలియదు మా బాధలు మాకు ఉన్నాయి ఇలాంటి డైలాగ్స్ రాకపోతే అభిమానులు ఊరుకోరు అంటూ హరీష్ సమాధానం చెప్పారని పవన్ వెల్లడించారు.

అభిమానులు ఊరుకోరు..
ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ.. మీ ప్రేమకు ధన్యవాదాలు సర్కార్ మీరు అంగీకరించాలే కానీ ఇలాంటివి ఇంకా రాస్తాము అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Prabhas: ప్రభాస్ కి ఎవరైనా నచ్చితే ఆ గిఫ్ట్ ఇచ్చేస్తారా.. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి నటుడు ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు ఇండియన్ స్టార్ సెలబ్రిటీలలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.

ఇక ప్రభాస్ సినిమాలలో నటిస్తే కనుక ఒక్కో సినిమాకు సుమారు 150 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తుంది. ఇలా స్టార్ హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ ఈయన చాలా ఉన్నతంగానే ఉంటారు. అందరితో సరదాగా కలిసిపోయి ఒక సాధారణ వ్యక్తిలా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు.

ఇక ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు ప్రభాస్ తో ఒకటి రెండు సార్లు మాట్లాడితే చాలు తప్పకుండా ఆయనకు స్నేహితులుగా మారిపోతారు. ఇలా ప్రభాస్ కి ఇండస్ట్రీలో ఇతర భాషలలో కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారనే చెప్పాలి. ఇలా తన స్నేహితులలో ఏ వ్యక్తి అయినా ప్రభాస్ కి విపరీతంగా నచ్చేశారు అంటే వారికి తప్పకుండా ఒక గిఫ్ట్ పంపిస్తారని తెలుస్తుంది.

గిఫ్ట్ గా వాచ్..
ప్రభాస్ కి ఎవరైనా బాగా నచ్చితే వెంటనే వారికి వాచ్ గిఫ్ట్ గా ఇస్తారట. ఇలా ప్రభాస్ నుంచి ఎంతోమంది హీరోలు టెక్నీషియన్లు దర్శకులు తన నుంచి వాచ్లను గిఫ్ట్ గా అందుకున్నారని తెలుస్తోంది. ఈ విధంగా ప్రభాస్ గురించి ఈ వార్త వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Nayanatara: ఆస్తులు మొత్తం తన పేరు పైకి రాయించుకున్న నయనతార.. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?

Nayanatara: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా 20 సంవత్సరాల నుంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకొని సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్స్ గా నయనతార పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే జవాన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ఇక ఈమె డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైతే నయనతార తన భర్తను ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసిందో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

విడాకుల దిశగా అడుగులు..
ఇదిలా ఉండగా తాజాగా నయనతార తన భర్త పేరుపై ఉన్నటువంటి ఆస్తులను మొత్తం తిరిగి తన పేరు మీద రాయించుకుందని తెలుస్తుంది. తన భర్త తన సర్వస్వం అంటూ ఈమె సినిమాలలో సంపాదించినది మొత్తం తన భర్త పేరు మీదగా ట్రాన్స్ఫర్ చేశారట అయితే ఉన్నఫలంగా ఈమె ఆస్తులు అన్నింటిని కూడా తన పేరు మీద రాయించుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరుగుతున్నాయా వీరు కూడా విడాకులు దిశగా అడుగులు వేస్తున్నారా వీరి జీవితంలో వేణు స్వామి చెప్పినది నిజం అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Mrunal Thakur: విజయ్ దేవరకొండ వ్యక్తిత్వం పై షాకింగ్ కామెంట్ చేసిన మృణాల్… అలాంటి వ్యక్తి అంటూ?

Mrunal Thakur: సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతోంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ తో పాటు నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమె కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీ అయ్యారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి మృణాల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరో విజయ్ దేవరకొండ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈమె విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ హీరో విజయ్ దేవరకొండను అందరు కూడా రౌడీ హీరో ఫ్యామిలీ స్టార్ అని పిలుస్తూ ఉంటారు ఆయన ఈ రెండు కాదని తెలిపారు. విజయ్ సెట్స్ లో కాలా కామ్ గా, కూల్ గా ఉంటారని తెలిపింది.

తన సీన్స్ ను చాలా డిసిప్లయిన్ గా చేస్తుంటారని చెప్పింది. చాలా కూల్ గా ఉంటారు..విజయ్ దేవరకొండ అందరూ అనుకున్నట్టు మాస్ కాదని ఆయన చాలా క్లాస్, చాలా కామ్ గా, రియాలిటీగా, జెన్యూన్ గా ఉంటారని తెలిసింది. ఇక ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే తాను రౌడీ స్టార్ ఫ్యామిలీ స్టార్లకు మించిన వ్యక్తిత్వం తనది అంటూ విజయ్ దేవరకొండ గురించి మృణాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Allu Arjun: బన్నీ, అట్లీ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత?

Allu Arjun: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమా వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటించబోతున్నాడు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అయితే అల్లు అర్జున్ తదుపరి సినిమా ఆ డైరెక్టర్ తోనే అంటూ ఇప్పటికే చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ వాటిలో ఏది కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే గత కొద్ది రోజులుగా బన్నీ నెక్స్ట్ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతోనే అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ మూవీ వర్క్ కూడా స్టార్ట్ అయిందని ఇటీవల ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమాతో సమంత రీ ఎంట్రీ ఇస్తున్నారట. ఖుషి సినిమా తరువాత సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అట్లీ సినిమాతో రీ ఎంట్రీ

తన అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం చికిత్స తీసుకుంటూ వస్తున్న సమంత, అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఓకే చెప్పారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. కాగా సమంత గతంలో అట్లీ తెరకెక్కించిన మెర్సల్, తేరి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అలాగే ఇక అల్లు అర్జున్‌తో కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది సామ్. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు తన రీ ఎంట్రీకి ఈ హిట్ కాంబినేషన్ అయితేనే పర్ఫెక్ట్ అని సమంత భావించినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని అల్లు అర్జున్ బర్త్ డే నాడు అనౌన్స్ చేయబోతున్నారట. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజునే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారట.