Tag Archives: unemployed

Budget 2022-23: కేంద్ర బడ్జెట్..! నిరుద్యోగులకు తీపి కబురు..! వాటిల్లో రూ.60 లక్షల ఉద్యోగాలు.. !

Budget 2022-23: కొన్ని నిమిషాల క్రితమే కేంద్ర బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొదటి నుంచి ఎదురు చూస్తున్న మినహాయింపులు ఇస్తారా .. లేదంటే.. అంతకముందు ఉన్న బడ్జెట్ల మాదిరిగానే ఉంటుందా అనేది తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే.

Budget 2022-23: కేంద్ర బడ్జెట్..! నిరుద్యోగులకు తీపి కబురు..! వాటిల్లో రూ.60 లక్షల ఉద్యోగాలు.. !

అయితే ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించామని తెలిపారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులు తలకిందులు అయ్యాయని.. వాటి నుంచి ప్రతీ ఒక్కరూ బయటపడాలని కోరుకుంటున్నాట్లు పేర్కొన్నారు.

Budget 2022-23: కేంద్ర బడ్జెట్..! నిరుద్యోగులకు తీపి కబురు..! వాటిల్లో రూ.60 లక్షల ఉద్యోగాలు.. !

ఇక ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ యొక్క ఉపయోగంపై క్యాంపెయిన్ జరుగుతోందని.. ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ గడియల్లో ఉన్నామని, మరో 25 ఏళ్ల విజన్‌తో తమ ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందన్నారు.


16 సెక్టార్లలో ఎక్కువ ఉద్యోగాల కల్పన..

ఇక డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని ఆ విధంగానే కేంద్రం ముందుకు వెళ్తుందని అన్నారు. డిజిటల్ ఎకానమీని కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుందన్నారు. సవాళ్లను ఎదుర్కొనే స్థితిలో ఉన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక ఈ ప్రసంగంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు కేంద్ర మంత్రి. రాబోయే రోజుల్లో ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్‌తో 16 సెక్టార్లలో ఎక్కువ ఉద్యోగాల కల్పన జరుగుతుందని అన్నారు. అంతే కాకుండా.. వాటిల్లో 60 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు.

నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఇంజనీర్ ఉద్యోగాలు..!

నోయిడాకు చెందిన హాస్పిటల్ సర్వీసెస్ కన్సలెన్సీ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 21 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి నెల 1వ తేదీలోగా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత ఆధారంగా భారీ వేతనం లభిస్తుంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విద్యార్థుల విద్యార్హతలు, ఇతర వివరాలను బట్టి అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. http://www.hsccltd.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

మొత్తం 21 ఉద్యోగాలలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌) ఉద్యోగాలు 20 ఉన్నాయి. కనీసం 60 మార్కులతో పాసై మూడు సంవత్సరాల అనుభవం, కంప్యూటర్ పై అవగాహన, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం జనవరి నాటికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఆర్కిటెక్చ‌ర్‌) ఒక ఉద్యోగ ఖాళీ మాత్రమే ఉండగా ఆర్కిటెక్చ‌ర్ ‌లో కనీసం 60 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం జనవరి 1 నాటికి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, హెచ్ఎస్‌సీసీ(ఇండియా) లిమిటెడ్‌, సెక్ట‌ర్‌-1, నోయిడా(యూపీ)-201301 అడ్రస్ కు అభ్యర్థులు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, అనుభవాన్ని బట్టి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 29,000 రూపాయల నుంచి 1,11,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

నిరుద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. 8 లక్షల మందికి ట్రైనింగ్..?

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల గతేడాది దేశంలోని లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో డిగ్రీలు పూర్తి చేసి కొత్త ఉద్యోగాల కోసం వెతికే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలోని నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ ద్వారా నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించనుంది.

ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 స్కీమ్ లో మొత్తం 300 కోర్సులు అందుబాటులో ఉండగా మోదీ సర్కార్ ఈ స్కీమ్ ద్వారా 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని భావిస్తోందని సమాచారం. 948 కోట్ల రూపాయలు మోదీ సర్కార్ ఈ స్కీమ్ అమలు కోసం ఖర్చు చేయనుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ అమలు ద్వారా యువత నచ్చిన రంగంలో ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. దేశంలోని 717 జిల్లాల్లో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేయనుంది.

https://pmkvyofficial.org వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిష్టర్ చేసుకుని ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ట్రైనింగ్ సర్టిఫికెట్ అందుతుంది. స్కిల్ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ మూడో విడతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువత ఈ స్కీమ్ ద్వారా వొకేషనల్ ట్రైనింగ్ ను పొందవచ్చు.

యువత ఈ స్కీమ్ సహాయంతో నచ్చిన రంగంలో ఉపాధి పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. గతంలో కూడా మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ అమలు ద్వారా భారీగా ప్రయోజనం చేకూరిన సంగతి తెలిసిందే.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో ప్రకటన విడుదల చేయగా పరీక్షల నిర్వహణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సిద్ధమైంది. నిజానికి చాలా నెలల క్రితమే పరీక్షలు జరగాల్సి ఉన్నా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పరీక్షలు జరగలేదు. స్టీల్ ప్లాంట్ లో మొత్తం 188 ఉద్యోగాల భర్తీ జరగనుంది.

డిసెంబర్ నెల 13, 14 తేదీలలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు త్వరలో స్టీల్ ప్లాంట్ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. గ్యాడ్యుయేషన్ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే మెకానికల్ బ్రాంచ్ చదివిన వాళ్లకు అత్యధికంగా 77 ఖాళీలు ఉన్నాయి.

ఆ తరువాత ఎలక్ట్రికల్ 45, కెమికల్ 26, మెటలర్జీ 19, సివిల్ 5, సిరామిక్స్ 4, మైనింగ్ కు సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వైజాగ్ స్టీల్ ప్రకటన విడుదల చేసి మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేపడుతుంది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు ఎంపికైన వారికి భారీ మొత్తంలో వేతనం లభిస్తుంది. అయితే పోస్టులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుంది.

సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రశ్నలు కఠినంగా ఉంటాయి కాబట్టి సమాధానాలను ఎంచుకునే విషయంలొ జాగ్రత్త వహిస్తే సులువుగా ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.

నిరుద్యోగులకు ఎయిమ్స్ శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగాలు..?

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 108 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఫార్మ‌కాల‌జీ, డెర్మ‌టాల‌జీ, పీడియాట్రిక్స్, బ‌యోకెమిస్ట్రీ, ఫిజియాల‌జీ, మైక్రోబ‌యాల‌జీ, అనాటమి మొదలైన విభాగాల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఎయిమ్స్ సిద్ధమైంది. https://aiimsbhubaneswar.nic.in/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన రోజు నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. అర్హత, అనుభవం ఉన్నవాళ్లకు ఎయిమ్స్ ఈ ఉద్యోగాలకు భారీ మొత్తంలో వేతనం ఇస్తోందని తెలుస్తోంది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెస‌ర్, అడిష‌న‌ల్ ప్రొఫెస‌ర్ ఉద్యోగాలను ఎయిమ్స్ భర్తీ చేస్తోంది.

all india institute of medical sciences, bhubaneswar, sijua, dumuduma, bhubaneswar-751019 అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పోస్టును బట్టి స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా (ఎండీ/ ఎంఎస్‌) లలో అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఉద్యోగాలకు పోటీ తక్కువగానే ఉంటుంది.

అయితే సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉంటే మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడం సాధ్యమవుతుంది. వెబ్ సైట్ లో నోటిఫికేషన్ ను చదివి ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా హైదరాబాద్ లో ఉద్యోగాలు..?

గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని ప్రముఖ సంస్థలు నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతుండగా హైదరాబాద్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈఎస్ఐసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 187 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈఎస్ఐసీ సిద్ధమవుతోంది.

ఫోరెన్సిక్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, బ‌యోకెమిస్ట్రీ, మైక్రోబ‌యాల‌జీ, పాథాల‌జీ, ఫిజియాలజీ, అనాటమీలలో ఇతర విభాగాల్లోని ఖాళీలను ఈఎస్ఐసీ భర్తీ చేస్తోంది. https://www.esic.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

మొత్తం ఉద్యోగాల్లో సీనియ‌ర్ రెసిడెంట్ ఉద్యోగాలు 103 కాగా ఫ్యాక‌ల్టీ పోస్టులు 46, అడ్జంక్ట్ ఫ్యాక‌ల్టీ సూప‌ర్ స్పెష‌లిస్ట్ పోస్టులు 15, స్పెషాలిటీ స్పెష‌లిస్ట్ పోస్టులు 7, క‌న్స‌ల్టెంట్‌ పోస్టులు 4, రిసెర్చ్ సైంటిస్ట్‌ పోస్టులు 2 ఉన్నాయి. ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నవంబర్ 11వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈఎస్ఐసీ అభ్యర్థులకు అర్హతకు, అనుభవానికి తగిన వేతనం అందిస్తోంది.

నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. 10,000 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్నారు. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా జగన్ సర్కార్ రాబోయే 24 నెలల్లో ఏకంగా 10,000 మంది నర్సులను నియమించుకునేందుకు సిద్ధమైంది. నర్సుల నియామకం ద్వారా జగన్ సర్కార్ గ్రామీణ ప్రాంతాల్లో సైతం వైద్య సేవలు అందేలా చేయాలని భావిస్తోంది.

రాష్ట్రంలో జగన్ సర్కార్ ఇప్పటికే వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హెల్త్ క్లినిక్స్ ద్వారా మారుమూల పల్లెల్లో సైతం మెరుగైన వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ సర్కార్ రాష్ట్రంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల కోసం భవనాల నిర్మాణాలను చేపడుతోంది. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలో ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందేలా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది.

బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులను ఈ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నియమించుకోనుంది. ప్రస్తుతం జగన్ సర్కార్ 4,060 ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వగా మిగిలిన ఉద్యోగాలకు త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ నిపుణులు శిక్షణ ఇస్తారు.

జగన్ సర్కార్ నర్సులకు శిక్షణ సమయంలో అకామిడేషన్, భోజన వసతి కల్పించడంతో పాటు స్టైఫండ్ ఇవ్వనుంది. ప్రభుత్వం హెల్త్ క్లినిక్ ల ద్వారా ప్రజలు ఎక్కువగా బాధ పడుతున్న వ్యాధులకు వేగంగా చికిత్స అందే విధంగా చర్యలు చేపడుతుండటం గమనార్హం.

నిరుద్యోగులకు శుభవార్త.. 9,640 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం..!

దేశంలోని నిరుద్యోగులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్లలో ఎక్కువ మంది బ్యాంకు ఉద్యోగాల కోసం కలలు కంటారు. అలా కలలు కంటున్న వారికి ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది. గ్రామీణ బ్యాంకుల్లో 9640 ఉద్యోగాలకు గత నెలలలోనే గడువు ముగియగా మరోసారి వాళ్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఐబీపీఎస్ నిర్ణయం వల్ల దరఖాస్తు చేసుకోని వారికి ప్రయోజనం కలగనుంది.

https://ibps.in/ ద్వారా అభ్యర్థులు నవంబర్ నెల 9వ తేదీ వరకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిన్నటి నుంచి 9,640 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులలో పని చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల వివరాలను పరిశీలిస్తే తెలంగాణలో 470 ఖాళీలు ఉండగా ఏపీలో 366 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 5 ఆర్ఆర్‌బీల్లో 836 పోస్టులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.

9,640 ఉద్యోగాలలో ఆఫీస్ అసిస్టెంట్‌(మ‌ల్టీప‌ర్ప‌స్‌) ఉద్యోగాలు 4,624, ఆఫీస‌ర్‌(అసిస్టెంట్ మేనేజ‌ర్‌) – 3,800 ఉద్యోగాలు, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 837 ఉద్యోగాలు, ఆఫీస‌ర్‌ (స్కేల్‌-3) 156 ఉద్యోగాలు, అగ్రికల్చర్ ఆఫీసర్ 100 ఉద్యోగాలు, ఐటీ ఆఫీస‌ర్ 58 ఉద్యోగాలు, లా ఆఫీస‌ర్ 26 , మార్కెటింగ్ ఆఫీస‌ర్‌ 8, ట్రెజ‌రీ మేనేజ‌ర్ 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ, కొన్ని ఉద్యోగాలకు సీఏ అర్హతగా ఉంది.

రాత పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా స్కేల్ 1 ఆఫీసర్ల భర్తీ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు 175 రూపాయలు, మిగిలిన వారికి 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆఫీసర్‌ పోస్టులకు 2020 డిసెంబర్ 31న, ఆఫీసర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 2021 సంవత్సరం జనవరి 2,4 తేదీలలో పరీక్షలు జరుగుతాయి.

నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త… 2,173 వాలంటీర్ల ఉద్యోగాలు..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిన జగన్ సర్కార్ తాజాగా రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

జగన్ సర్కార్ రాష్ట్రంలోని నెల్లూరు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాలలో 2,173 ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ప్రాతిపదికన ఎంపిక చేసే గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ప్రభుత్వం నెలకు 5,000 రూపాయల వేతనం చెల్లిస్తుంది. https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ లో ఉద్యోగానికి సంబంధించిన పూరి వివరాలు పొందుపరిచారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా జగన్ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాలపై అవగాహనతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో 211, అనంతపురం జిల్లాలో 981, చిత్తూరు జిల్లాలో 981 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆయా జిల్లాల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నెల్లూరు జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 23 చివరి తేదీ కాగా చిత్తూరు జిల్లా అభ్యర్థులకు 25వ తేదీ, అనంతపురం జిల్లా అభ్యర్థులకు 31వ తేదీ చివరి తేదీగా ఉంది. స్థానిక గ్రామ పంచాయితీ పరిధిలో నివశించే వాళ్లను మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. గతంలోనే ఈ పోస్టుల భర్తీ జరగాల్సి ఉన్నా కోర్టు కేసులు నమోదు కావడంతో ఉద్యోగ నియామక ప్రక్రియ అంతకంతకూ వాయిదా పడుతూ వస్తోంది.

కోర్టు కేసులన్నీ ఇప్పటికే క్లియర్ కావడంతో ఆ పోస్టుల భర్తీ చేపట్టే దిశగా మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను ఆరు నెలలు లేదా సంవత్సరంలో భర్తీ చేయాలని మంత్రి వర్గ ఉపసంఘం భావిస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన నిన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అధికారులు హాజరయ్యారు.

మంత్రి కేటీఆర్ వైద్య, ఆరోగ్య శాఖ గడిచిన ఆరు నెలల నుంచి అద్భుతంగా పని చేస్తోందని.. కరోనా వైరస్ విజృంభణ వల్ల వైద్య, ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన బాగా పెరిగిందని ఫలితంగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టాయని కేటీఆర్ వెల్లడించారు. మంత్రి ఈటల త్వరలో ప్రభుత్వ మెడికల్‌ షాపులను ఏర్పాటు చేయనున్నామని కీలక ప్రకటన చేశారు.

ఈ మెడికల్ షాపుల ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులను అందించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు వైద్యం అందేలా మంత్రివర్గ ఉపసంఘం కీలక సూచనలు చేసింది. తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో ప్రతిరోజూ 10 వేల పరీక్షలు జరుగుతుండగా 60 రకాల పరీక్షలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం త్వరలో 100 కొత్త ఆంబులెన్స్ లను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు.