Tag Archives: whatsapp

Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్..! ఇక ఆ సమస్య ఉండదు.. !

Whatsapp: వాట్సాప్ ప్రస్తుతం ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. నిత్య జీవితంలో వాట్సాప్ ఓ భాగంగా మారిపోయింది. సమాచారం షేర్ చేసుకోవలన్నా.. వ్యక్తులను కలపాలన్నా ఓ ప్రత్యేక యాప్ గా వాట్సాప్ ఉంది. అంతలా స్మార్ట్ ఫోన్ యూజర్లతో పెనవేసుకుంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో కూడా వాట్సాప్ కీలక భూమిక పోషిస్తోంది.

Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్..! ఇక ఆ సమస్య ఉండదు.. !

ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న వాట్సాప్ యాప్ ను ఎప్పటికప్పుడు కొత్తగా మరికొన్ని ఫీచర్లు తీసుకువస్తోంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంతకు ముందు ఉన్న ‘డిలీట్ ఎవ్రీ వన్’ ఆప్షన్ టైంను పెంచనుంది. వాట్సాప్ చేసిన తరువాత యూజర్ తన మేసేజ్ ను డిలీట్ చేసేందుకు డిలీట్ ఎవ్రీ వన్ ఆప్షన్ ను ఉపయోగిస్తుంటారు.

Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్..! ఇక ఆ సమస్య ఉండదు.. !

అయితే దీని టైమ్ లిమిట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు కేవలం 1 గంట 8 నిమిషాల 16 సెకన్లు మాత్రమే టైమ్ లిమిట్ ఉండేది. ఇప్పుడు దీన్ని 2 రోజుల 12 గంటల వరకు టైమ్ లిమిట్ పెంచారు. దీంతో చాటా పేజీతో పాటు అవతలి వ్యక్తి చాట్ పేజీ నుంచి కూడా మెసేజ్ డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేలా వాట్సాప్ కమ్యూనిటీ  బ్లాగ్ వాట్సాస్ బీటా ఇన్ఫో( వాబీటా ఇన్ఫో) తెలిపింది. 


గ్రూప్ లో లాగే కమ్యూనిటీ అడ్మిన్ లో..

దీంతో పాటు గ్రూప్స్ కు భిన్నంగా కమ్యూనిటీ అనే కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ  ఫీచర్ ను బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేలా వాబీటా ఇన్పో తెలిపింది. కమ్యూనిటీ ఫీచర్ పేరుతో వేరే గ్రూప్ లోకి ఒకేచోట చేర్చవచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్ కి మరిన్ని అదనపు ఫీచర్లతో ఇస్తుంది. అలాగే ఒక కమ్యూనిటీ లో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాటిక  ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ రక్షణ ఉంటుంది. దీంతోపాటు కమ్యూనిటీ అడ్మిన్ గా ఉన్నవారు కమ్యూనిటీ లో ఉన్న అన్ని గ్రూపులకు మెసేజ్ పంపిచ్చు. గ్రూప్ లో లాగే కమ్యూనిటీ అడ్మిన్ లో ఇతరులను ఇన్వైట్ లింక్,  క్యూఆర్ కోడ్ మాన్యువల్గా కమ్యూనిటీ లోకి ఆహ్వానించవచ్చు. అయితే కమ్యూనిటీ లోకి వచ్చిన కొత్త వ్యక్తి అన్ని గ్రూపులకు మెసేజ్ పంపలేరు. ఇది కమ్యూనిటీ అడ్మిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

ఇకపై వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ లో.. వీడియో కాల్స్?

రోజురోజుకు సరి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ యూజర్లకు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోంది వాట్సాప్. ఒకప్పుడు కేవలం మెసేజ్ లు పంపుకునే స్థాయి నుంచి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఫార్వర్డ్ మెసేజ్ వంటి ఎన్నో ఆప్షన్లను యూజర్ల ముందుకు తీసుకు వచ్చింది. ఇప్పటివరకు కేవలం మొబైల్ ఫోన్ కి మాత్రమే పరిమితమైన ఈ యాప్ ఇకపై డెస్క్‌టాప్ మీద వాడుకొనే వీలు కల్పించింది.

కరోనా పరిస్థితుల దృష్ట్యా చాలా సంస్థలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎన్నో మీటింగులలో పాల్గొనాల్సి వస్తుంది. అప్పటివరకు ఎలాంటి ఉపయోగం లేనటువంటి వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ కు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి పెద్ద ఎత్తున కొత్తతరహా యాప్స్ పుట్టుకు వచ్చాయి.

ఈ విధంగా ప్రస్తుతం అధిక డిమాండ్ ఏర్పడినటువంటి ఈ యాప్ లో ఎలాంటి అవకతవకలు లేకుండా యూజర్లకు సరి కొత్త వెర్షన్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటివరకు కేవలం ఫోన్ కి మాత్రమే పరిమితమైన ఈ యాప్ ను ఇకపై డెస్క్‌టాప్ వర్షన్‌లో కూడా యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ప్రస్తుతం ఈ ఆప్షన్ కేవలం విండోస్ 10 64-బిట్ వెర్షన్ 1903 లేదా కొత్త, మ్యాక్ ఓఎస్ 10.13 లేదా కొత్త వెర్షన్‌లలో మాత్రమే వీడియో కాల్ సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే వెబ్ వాట్సాప్ లో కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇదే కనుక అందుబాటులోకి వస్తే వెబ్ వాట్సాప్ కి అధిక డిమాండ్ ఏర్పడుతుంది అని చెప్పవచ్చు.

కేంద్రం సూచించిన కొత్త నిబంధనలకు అన్ని సంస్థలు అంగీకారం… ట్విట్టర్ తప్పా?

భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, గూగుల్, వాట్సాప్, ట్విట్టర్ పాటించాలని, లేకపోతే ఆ సంస్థల పై కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సూచించిన కొత్త నిబంధనలకు ట్విట్టర్ తప్ప ఇతర సంస్థలన్నీ నిబంధనలను పాటించాలనే అంగీకారానికి వచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం సోషల్‌ మీడియా సంస్థలు తమ నోడల్‌ అధికారి, ఫిర్యాదుల్ని పరిష్కరించే అధికారి, కంప్లయెన్స్‌ అధికారికి సంబంధించిన విషయాలను తెలియజేయాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలను పాటిస్తూ సంబంధిత అధికారులకు సంబంధించిన విషయాలను తెలియజేయడానికి అన్ని సోషల్ మీడియా సంస్థలు అంగీకారం తెలిపిన, ట్విట్టర్ మాత్రం అందుకు సమ్మతంగా లేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన కొత్త నిబంధనలను పాటించడం ద్వారా తమ ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టును వాట్సప్ ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ కూడా ఈ నిబంధనల వల్ల తమ ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వ్యాఖ్యానించింది.

ఈ నిబంధనల ప్రకారం భారతదేశంలో తమ సంస్థలో పని చేసే చీఫ్‌ కంపిలియన్స్‌ ఆఫీసర్లు (సీసీవో), కాంటాక్ట్‌ పర్సన్‌ (ఎన్‌సీపీ), ఫిర్యాదుల స్వీకరణ అధికారి (జీపీ) వివరాలను తెలియజేశాయి. కానీ ట్విట్టర్ మాత్రం కేవలం సీసీవో వివరాలను వెల్లడించక పోవడంతో ట్విట్టర్ ,కేంద్రం మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో వర్తించే చట్టానికి లోబడి ఉంటాం కానీ ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నట్టే సేవల్లో పారదర్శకత, చట్ట నిబంధనల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ, గోప్యతను పరిరక్షించే సూత్రాల ద్వారా మేం మార్గనిర్దేశం చేస్తామని ట్విట్టర్ అధికార ప్రతినిధి ఈ సందర్భంగా తెలిపారు.

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ నంబర్లతో ట్రైన్ టైమ్, ఇతర వివరాలు తెలుసుకునే ఛాన్స్..?

దేశంలోని చాలామంది ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి రైళ్ల ద్వారా ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే చాలా సందర్భాల్లో ట్రైన్ అనుకున్న సమయానికి రాకపోవడం, ఇతర ఇబ్బందులను ప్రయాణికులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే రైళ్ల ద్వారా ప్రయాణాలు చేసేవాళ్లు కొన్ని ఫోన్ నంబర్ల ద్వారా రైలు ఎక్కడుందో, ఆలస్యంగా నడుస్తుందో లేక సరైన సమయానికి వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

రైలు ప్రయాణికులు సులభంగా పీఎన్ఆర్ స్టేటస్ ను కూడా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 91 – 9881193322 నంబర్ ను స్మార్ట్ ఫోన్ లో సేవ్ చేసుకొని వాట్సాప్ యాప్ ద్వారా పీఎన్ఆర్ నెంబర్ ను ఎంటర్ చేసి సులభంగా రైలు ప్రయాణానికి సంబంధించిన అప్ డేట్స్ ను తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ నెంబర్ ఆధారంగా రైలు ప్రయాణానికి సంబంధించిన ప్రతి అప్ డేట్ వాట్సాప్ యాప్ కు వస్తుంది.

ఈ నంబర్ ను సేవ్ చేసుకోవడం ద్వారా రైలు ప్రయాణానికి సంబంధించి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా, ఎవరినీ అడకుండా సులభంగా ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల రైల్వే శాఖ పరిమిత సంఖ్యలోనే రైళ్లను నడుపుతోంది. ఆ నంబర్ మాత్రమే కాకుండా మరో నంబర్ ద్వారా కూడా వాట్సాప్ ట్రైన్ అప్ డేట్స్ తెలుసుకోవచ్చు.

91 – 7349389104 నంబర్ ద్వారా కూడా రైలు ప్రయాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌ లలో రైల్వే శాఖ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. రైల్వే శాఖ తెచ్చిన కొత్త ఫీచర్ల ద్వారా రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.

యూజర్లకు గుడ్ న్యూస్.. అనుమానాలను పటాపంచలు చేసిన వాట్సాప్..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కొత్త పాలసీపై వాట్సాప్ యూజర్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాట్సాప్ స్పందించి ప్రైవసీ పాలసీ సందేహాలకు సంబంధించి స్పష్టతనిచ్చింది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంబంధించి పంపిన సందేశాల గోప్యత విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాట్సాప్ పేర్కొంది.

సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లకు చెక్ పెట్టే దిశగా వాట్సాప్ అడుగులు వేసింది. ట్విట్టర్ వేదికగా వాట్సాప్ యూజర్లకు సంబంధించిన మెసేజ్ లు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో భద్రంగా ఉంటాయని పేర్కొంది. వాట్సాప్ గ్రూపులు ప్రైవేట్ గానే ఉంటాయని.. వాట్సాప్, ఫేస్ బుక్ షేర్ చేసిన లొకేషన్ ను చూడలేవని వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్, ఫేస్ బుక్ యూజర్లకు సంబంధించిన మెసేజ్, కాల్స్ ను చూడలేదని వినలేదని తెలిపింది.

వాట్సాప్ యూజర్ల యొక్క కాంటాక్ట్ లకు సంబంధించిన వివరాలను ఫేస్ బుక్ తో పంచుకోదని వాట్సాప్ యూజర్లు డేటాను డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు మెసేజ్ లు కనిపించని విధంగాస్ సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది. కొత్త ప్రైవసీ పాలసీ గురించి వాట్సాప్ యూజర్లలో నెలకొన్న సందేహాలన్నింటికీ చెక్ పెట్టే దిశగా వాట్సాప్ వివరణ ఇచ్చింది. యూజర్లు వ్యక్తిగత సమాచారం గోప్యతకు సంబంధించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వాట్సాప్ తెలిపింది.

డేటా షేరింగ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని వాట్సాప్ తెలిపింది. యూజర్లకు బిజినెస్ ఫీచర్లను మెరుగ్గా అందించే దిశగా అడుగులు వేస్తున్నామని వాట్సాప్ పేర్కొంది. అయితే వాట్సాప్ నియమనిబంధనలకు అంగీకరించకపోతే మాత్రం వాట్సాప్ ఖాతా డిలేట్ అవుతుందని పేర్కొంది.

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ద్వారా కొత్త సర్వీసులు..?

రైల్వే శాఖ భారతదేశంలోని రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తరచూ రైలు ప్రయాణాలు చేసే వాళ్ల కోసం కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైలోఫీ అనే సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఈ సర్వీసుల వల్ల రైలు ప్రయాణికులు రియల్ ట్రైమ్ పీఎన్ఆర్ స్టేటస్ ను తెలుసుకోవడంతో పాటు రైలు ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసులను పొందే అవకాశం ఉండటంతో కస్టమర్లు సులువుగా ప్రయాణించే రైలుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అరచేతిలో స్మార్ట్ ఫోన్ తో పీఎన్ఆర్ స్టేటస్, అప్‌కమింగ్ రైల్వే స్టేషన్, ప్రీవియస్ రైల్వే స్టేషన్, లైవ్ ట్రైన్ స్టేటస్ తో పాటు ఇతర సమాచారాన్ని కూడా సులువుగా పొందవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్‌ కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పొందడంతో పాటు రైలు ఆలస్యమయ్యేలా ఉంటే ఆ వివరాలు కూడా తెలుస్తాయి.

రైలోఫీ తెచ్చిన ఈ సర్వీసుల వల్ల రైలు ప్రయాణికులకు భారీగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. అయితే ఈ సర్వీసులు పొందాలంటే వాట్సాప్ కస్టమర్లు ఖచ్చితంగా యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. +91 – 9881193322 ఫోన్ నంబర్ ను మొబైల్ లో సేవ్ చేసుకుంటే ఈ సర్వీసులను సులభంగా పొందవచ్చు. నంబర్ ను సేవ్ చేసుకున్న తరువాత పీఎన్ఆర్ నెంబర్‌ ను ఎంటర్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది.

ఆ తరువాత వాట్సాప్ నంబర్ కు ఎప్పటికప్పుడు రైలు సర్వీసులకు సంబంధించిన పూర్తి వివరాలు సందేశాల రూపంలో వస్తూ ఉంటాయి. ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసే వాళ్లు ఈ సర్వీసులను వినియోదించడం వల్ల రైలు ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావని చెప్పవచ్చు.

వాట్సాప్ యూజర్లకు శుభవార్త… యాప్ లో మరిన్ని కొత్త ఫీచర్లు..?

మనం ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో ఒకటైన వాట్సాప్ యాప్ యూజర్లకు మరింత చేరువ అయ్యేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వేబ్‌టెయిన్‌ఇన్ఫో తెలిపిన సమాచారం ప్రకారం 12 కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులొకి తెచ్చేందుకు వాట్సాప్ యాప్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. , రిపోర్ట్‌ టు వాట్సాప్‌, రీడ్ లేటర్, వీడియో మ్యూట్, ఇతర ఆప్షన్లను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం వాట్సాప్ యాప్ ను మొబైల్ ఫోన్ తో పాటు వెబ్‌ యాప్‌ ద్వారా ఉపయోగించుకునే అవకాశాన్ని వాట్సాప్ యాప్ కల్పిస్తోంది. అయితే భవిష్యత్తులో ఒకే అకౌంట్‌ ద్వారా ఒకేసారి నాలుగు డివైస్‌ లలో వాట్సాప్ యాప్ ను వినియోగించవచ్చని తెలుస్తోంది. వాట్సాప్ యూజర్లకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత దగ్గరవుతోంది.

అడ్వాన్స్‌డ్‌ వాల్‌పేపర్‌ ఫీచర్‌ సహాయంతో వాట్సాప్ యూజర్లకు ఒక్కో కస్టమర్ ను ఒక్కో వాల్ పేపర్ సహాయంతో సేవ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మెసేజ్ లను తదుపరి కాలంలో యూజర్లు చదివేందుకు రీడ్ లేటర్ ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఆర్కీవ్‌డ్‌ చాట్స్ ఫీచర్‌ పరిధిలోకి రీడ్ లేటర్ ఫీచర్ రానుంది. రీడ్ లేటర్ ఫీచర్ ద్వారా ఆర్కీవ్‌ చేసిన చాట్‌ నుంచి కాల్స్, మెసేజెస్ రాకుండా చేసుకోవచ్చు.

రీడ్‌లేటర్‌ను ఆన్‌ చేస్తే ఆ చాట్ కు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రావని నిపుణులు చెబుతున్నారు. రీడ్ లేటర్ ఫీచర్ ద్వారా మధ్యలో అంతరాయాలకు చెక్ పెట్టవచ్చని వెల్లడిస్తున్నారు. రిపోర్ట్‌ టు వాట్సాప్‌ ఫీచర్‌ ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుందని ఈ ఫీచర్ సహాయంతో కాంటాక్టు నుంచి తదుపరి సందేశాలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.