Tag Archives: work from home

Work From Home: ఇంటి దగ్గర పని చేసింది చాలు..! ఇక ఆఫీస్ లకు వచ్చేయండి..!

Work From Home: చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో దాడులు చేస్తూనే ఉంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరగుతున్నాయి.  కరోనా కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రెండేళ్ల నుంచి ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు.

కరోనా కారణంగా ఆఫీసులంతా మూతపడ్డాయి. వరసగా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ లు ఇలా వస్తూనే ఉన్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఇళ్లకు పరిమితం అయ్యారు. ఇంటి నుంచే పనులు కొనసాగిస్తున్నారు. ఇటీవల డిసెంబర్, జనవరి నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ సమయంలో థర్డ్ వేవ్ రావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా..


అయితే తాజాగా ఏప్రిల్ నుంచి మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా ఉద్యోగులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఇక తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రావు కూడా ఇక కరోనా ముగిసిందని, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండేళ్ల నుంచి ఐటీ కంపెనీలు తెరుచుకోకపోవడంతో.. ఆ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. మళ్లీ ఐటీ కంపెనీలు తెరుచుకుంటే.. ఉపాధి లభిస్తుందనే ఆలోచనలో ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. వీరందరిని మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా కంపెనీలు కబురు పెట్టాయి.

ఆఫీస్ కు టైం అయిందిరా..! వర్క్ ఫ్రం హోం క్లోజ్ చేయాల్సిందే..?

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఏడాదిన్నరగా చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇక వాటికి చెక్ పెట్టేందుకు కొన్ని సాప్ట్ వేర్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యోగులను ఆఫీస్ కు రావాలని ఆదేశిస్తున్నాయి. కరోనా కేసులు నమోదవుతున్నా.. ఎక్కువగా ఉండటం లేదు. దీంతో పాటు.. వ్యాక్సిన్ కూడా చాలామంది తీసుకున్నారు.

ఎకానమీ కూడా బాగానే పుంజుకోవడంతో.. ఇక ఇంట్లో పనికి సెలవు పెట్టి.. ఆఫీస్ బాట పట్టాల్సిందే అంటూ ఐటీ సంస్థలు చెబుతున్నాయి. దీనిలో భాగంగానే బ్యాంకులు, ఫిన్ టెక్ సంస్థలు, ఎన్బీఎఫ్సీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో గర్భిణులు, 65 ఏళ్లు పైబడిన వారికి మినహాయింపు ఇస్తున్నారు.

వాళ్ల వరకు ఇంటి నుంచి పని చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. కొన్ని కంపెనీలు వారి ఉద్యోగస్తులకు దగ్గరుండి మరీ టీకాలు ఇప్పించారు. దీంతో రెండో డోస్ పూర్తయిన పదిహేను రోజుల తర్వాత ఆఫీస్ కు రమ్మని కబురు కూడా పెట్టారు. మరికొన్ని కంపెనీల విషయానికి వస్తే.. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాగ కంగారు పడుతున్నాయి.

థర్డ్ వేవ్ రాదని ప్రభుత్వం కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు.. ఎప్పుడైనా అది విరుచుకు పడే అవకాశం ఉందని చెప్పడంతో కొన్ని కంపెనీలు జంకుతున్నాయి. అయితే వ్యాక్సిన్‌‌‌‌ తీసుకున్న ఎంప్లాయిస్‌‌‌‌లను మాత్రమే ఆఫీసుకు రమ్మన్నామని, మిగతా వారికి అక్టోబరు 31 దాకా వర్క్‌‌‌‌ ఫ్రం హోం ఉంటుందని విప్రో తెలిపింది. మగ ఎంప్లాయిస్‌‌‌‌ వర్క్‌‌‌‌ ఫ్రం హోంనే కోరుకుంటున్నారని.. మహిళల్లో ఎక్కువ మంది ఆఫీసులకు రావడానికి రెడీగా ఉన్నారని హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ వర్గాలు తెలిపాయి.

టీసీఎస్ ఐటీ సంస్థ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం లేనట్లే.. ఎప్పటి నుంచంటే..

కరోనా మొదలైన దగ్గర నుంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మొదటి వేవ్ నుంచి సెకండ్ వేవ్ వరకు ఎంతో మంది ప్రజలు కరోనా కారణంగా మరణించారు. వారిని నమ్ముకున్న ఎంతో మంది కుటుంబసభ్యులు ఇబ్బందులకు గురయ్యారు. మరికొంత మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇతర రంగాల్లో పని చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ ఆ ఎఫెక్ట్ ఐటీ ఉద్యోగుల పై పడలేదనే చెప్పాలి.

ఎందుకంటే.. లాక్ డౌన్ సమయంలో కూడా.. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ను అనుసరించాయి. అదే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఐటీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్, ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ కంపెనీలు వెల్లడించాయి.

దీంతో ఇప్పుడు ఆ పనికి స్వస్తి పలకనున్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం.. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో వర్క్ ఫ్రం హోంకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్ తెలిపింది. వచ్చే సంవత్సరం జనవరిలోనైనా.. లేదా ఈ సంవత్సరం చివర్లో అయినా ఉద్యోగులను కార్యాలయానికి రప్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆ సంస్థ సీఈఓ రాజేశ్‌ గోపీనాధన్‌ తెలిపారు.

మొత్తం 5 లక్షల మంది ఉద్యోగుల్లో 80 శాతం మందికి వర్క్ ఫ్రం హోమ్ కు స్వస్తి తెలపనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. టీసీఎస్ కంపెనీలో ఈ విధానం అమలైతే మాత్రం ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇదే కోవలోకి వెళ్లనున్నారు.

ఎక్కువగా కూర్చుంటున్నారా.. అయితే మీకు ఈ సమస్య గ్యారెంటీ!

ప్రస్తుత కాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తీసుకునే ఆహార పదార్థాలలోనే కాకుండా మన శరీరాన్ని ఉంచుకునే విధానంలో కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారికే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే నిత్యం కూర్చోవడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని. నిత్యం ఆఫీసులలో, ఇంట్లో కూర్చోవడం వల్ల అనేక శారీరక సమస్యలు రావడంతో వాటివల్ల మెదడు పని చేసే శక్తి కూడా సక్రమంగా ఉండదు. దీనివల్ల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇక గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉద్యోగస్తులు అందరూ ఇంట్లో కూర్చొని తెగ పనులు చేసుకుంటున్నారు. అంతేకాకుండా నిత్యం కంప్యూటర్లు, ఫోన్ లో ముందు కూర్చొని సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. ఇక వీటి నుండి తప్పించుకోవడానికి.. కంప్యూటర్ల ముందు పనిచేసే వారికి ఇలాంటి సమస్యలు ఉండకూడదు అంటే అందులో కొన్ని నియమాలను పాటించాలి.

ముందుగా ఒకే చోట కూర్చొని పనిచేసే వాళ్లు మధ్యలో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మనశ్శాంతి ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక భోజనం చేసిన తర్వాత రెండు గంటలకు మళ్ళీ గ్రీన్ టీ తీసుకోవాలి. ముఖ్యంగా రోజుకు 2 లేదా 3 కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ప్రతి రెండు గంటలకు ఏదో ఒకటి తింటూ ఉండాలి. స్నాక్స్ లో భాగంగా పాప్ కాన్ లాంటివి తీసుకోవడం మంచిది. ఇందులో ఫైబర్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ముఖ్యమైనది. ఎక్కువగా సి విటమిన్ లో ఉండే పండ్లను తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు డార్క్ చాక్లెట్ లను తింటూ ఉండాలి. దీనివల్ల ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. గుండెకి వచ్చే సమస్యలు కూడా దరికి చేరవు.

వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు షాక్.. ఉద్యోగం ఉండాలంటే ఆ పనికి ఒప్పుకోవాలి..

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పిస్తున్నాయి. కొందరికి ఇది బాగానే ఉన్నా.. మరికొందరికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. దీనిలో భాగంగానే ఓ కంపెనీ తమ ఉద్యోగుకలు షాక్ ఇచ్చింది. తమ ఉద్యోగుల ఇళ్ళల్లో కెమెరాలు ఇన్‌స్టాల్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఒక వేళ కెమెరాలు పెట్టేందుకు అంగీకరించకుంటే ఉద్యోగం నుంచి కూడా తీసేయడానికి వెనకాడటం లేదు. దీంతో ఈ కంపెనీ తీరు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. టెలీ పర్ఫార్మెన్స్ అనే ఓ ప్రముఖ కాల్ సెంటర్ కంపెనీ ఉద్యోగుల ఇళ్లలోని పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి, రికార్డ్ చేయడానికి ఏఐ-ఆధారిత కెమెరాలను ఇన్‌ స్టాల్ చేస్తామని ప్రకటించింది.

కొలంబియాలో వర్క్ చేస్తున్న ఉద్యోగులపై కెమెరాల ఏర్పాటుపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కుటుంబసభ్యుల సమ్మతికి సంబంధించి సంతకం కూడా తీసుకుంటారట. 3.80 లక్షల మంది ఉద్యోగులు ఉన్న ఈ బీపీఓ కంపెనీ.. భారత్ లో 70 వేల మంది ఉన్నారు. కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో వారంతో ఆందోళన చెందుతున్నారు. తాము బెడ్ రూంలో పని చేస్తాం.. అయితే బెడ్ రూంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారా.. అంటూ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగి తమ కంపెనీ సిస్టంలో లాగిన్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి.. భద్రతా కారణాల వల్లనే తాము ఈ పని చేస్తున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత ప్రైవసీకి తమ సంస్థ కట్టుబడి ఉందని.. ఇతర సమాచారం సేకరించాల్సిన అవసరం తమకు లేదని ఈ సంస్థ వెల్లడించింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వెన్ను,మెడ నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇవి పాటించాల్సిందే!

ప్రస్తుతం ఈ కరోనా కారణంగా చాలా ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే ఉద్యోగస్తులు అందరూ ఇంటినుంచి పనులు చేయడం ప్రారంభించారు. అయితే ఎక్కువ సేపు కూర్చొని ఉండటం వల్ల చాలా మందిలో తీవ్రమైన వెన్ను నొప్పి, మెడనొప్పితో సతమతమవుతున్నారు. ఈ విధమైనటువంటి సమస్య నుంచి విముక్తి పొందాలంటే తప్పనిసరిగా ఈచిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

ఒక ఉద్యోగి ఆఫీసులో పని చేయడానికి ఇంటి నుంచి పని చేయడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆఫీసులో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి ఉంటారు కనుక ఏ విధమైనటువంటి సమస్యలు చుట్టుముట్టావు. కానీ ఇంటి నుంచి పని చేసేటప్పుడు ఎన్నో సమస్యలు వెంటాడతాయి. దీని కారణంగానే ఎంతోమంది మెడనొప్పి, తీవ్రమైన నడుము నొప్పి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు వారు పనిచేసే సమయంలో ప్రతి గంటకు కాస్త విరామం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి దూరం కావచ్చు. ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల నొప్పులు అధికమవుతాయి.అదేవిధంగా మీ భుజాలను మోకాళ్ళను వంచి పని చేసేటప్పుడు ఈ నొప్పులు మరింత తీవ్రతరం అవుతాయి కనుక కొద్దిగా ఎత్తులో కూర్చుని పని చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

మీరు ఉపయోగించేటటువంటి లాప్టాప్, మొబైల్ స్క్రీన్ లను సరైన క్రమంలో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఎల్లప్పుడు మీ కంటికి మీ మానిటర్ సమాంతరంగా ఉండే విధంగా చూసుకోవాలి . రోజంతా కూర్చుని పని చేయటం వల్ల మనపై అధిక ఒత్తిడి పడుతుంది కనుక ప్రతి రోజు సాయంత్రం తగిన వ్యాయామాలు చేయటం లేదా కాసేపు నడవడం వంటివి చేయడం ద్వారా ఈ విధమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ హాస్పిటల్!

ప్రస్తుతం కరోనా కారణంగా పలు ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులు సైతం ఇంటి నుంచి పనిచేయడం ప్రారంభించారు. ఈ విధంగా వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఉండటంవల్ల చాలామంది ఉద్యోగులకు గంటలతరబడి ఆఫీస్ కు ప్రయాణం చేసే బాధ తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే ఇంటిని, ఆఫీసు పనిని చేయడం కష్టంగా మారింది. అయితే మన పరిస్థితులు ఎలా ఉన్నా పని మాత్రం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. తాజాగా ఓ ఉద్యోగి భార్య ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే ఆ ఉద్యోగి తన వర్క్ ఫ్రమ్ హోమ్ ని కాస్త…వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ గా మార్చాడు. ఆస్పత్రిలో ఓ వార్డులో తన భార్య అప్పుడే పుట్టిన పాపాయినీ లాలిస్తుంటే భర్త మాత్రం అక్కడే టేబుల్ పై ల్యాప్‌ టాప్ తో ఆఫీసు పని చేస్తున్నాడు.

సామ్ హోడ్జెస్ అనే నెటిజన్‌ వర్క్‌ ఫ్రం హాస్పిటల్‌ ఫోటోల్ని నెట్టింట్లో షేర్‌ చేయగా.. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే సదరు ఉద్యోగి స్పందిస్తూ…ఏప్రిల్‌ 2న నా భార్య పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఒక తండ్రిగా తన పిల్లలను వదిలి దూరంగా ఉండడం చాలా కష్టంగా మారింది. అందుకే కుటుంబం పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తూ… తన పనికి కట్టుబడి ఉండటం వల్లే ఆస్పత్రి నుంచి పని చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. అయినా వర్క్ ఫ్రొం హోమ్ కంటే వర్క్ ఫ్రొం హాస్పిటల్ చేయడం తనకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సదరు ఉద్యోగి తెలిపారు.

వర్క్‌ ఫ్రం హోమ్‌ కావాలి.. ఆఫీసులు వద్దు?

గత ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చడంతో వివిధ రకాల ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ ని సూచించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఉద్యోగులు సైతం ఆఫీసులో వద్దు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా ఇంటి నుంచి పనిచేస్తూ జూమ్ మీటింగ్స్, కాల్స్ అన్ని కూడా ఇంటి నుంచే కానిచ్చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఈ విధమైనటువంటి పరిస్థితులలో ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఓ ఫన్నీ వీడియోను ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే హర్ష్ గోయెంకా ప్రస్తుతం ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి ఎందుకు ఇష్టం చూపడం లేదో తెలియజేశారు.

ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్‌గా పనిచేస్తున్న హర్ష్ గోయెంకా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ నెటిజన్లకు పలు సూచనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వర్తించే ఉద్యోగులను “ప్రజలు ఆఫీసుకు ఎందుకు వెళ్ళకూడదనీ నేను అడిగాను”అనే క్యాప్షన్ తో ఈ పోస్ట్ షేర్ చేయడంతో దీనికి ఉద్యోగులు చెప్పిన ఫన్నీ సమాధానాలను చార్ట్ రూపంలో వివరించారు.

కొందరు ఉద్యోగులు ట్రాఫిక్ లో సమయం ఎందుకు వృధా చేసుకోవాలి అని చెప్పగా, మరికొందరు నా కుటుంబంతో గడపడం ఎంతో ఇష్టంగా ఉంది. నేను ఇంట్లోనే ఎక్కువ పని కలిగి ఉన్నాను. నా తోటి ఉద్యోగులను కలవకపోవడం నాకు సంతోషంగా ఉంది. మరికొందరు ఎక్కువ సేపు పూర్తి ప్యాంటు ధరించాల్సి ఉంటుంది అనే సమాధానాలను చెప్పారు.

ఈ సమాధానాలలో ఎక్కువగా నేను పూర్తి ప్యాంటు ధరించాల్సి ఉంటుంది అనే సమాధానం చాలామంది తెలియజేశారు. మరికొందరు నా షూస్, సాక్సులు ఎక్కడున్నాయో తెలియదు. మరికొందరు నా బట్టలు ప్రస్తుతం నాకు సెట్ అవుతాయనే నమ్మకం లేదంటూ ఫన్నీ సమాధానాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫన్నీ సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సర్జరీ తర్వాత అలా అయిపోయిన ఎమ్మెల్యే రోజా..?

నటిగా ,రాజకీయ అభ్యర్థిగా ఎంతో చురుగ్గా ఉండే రోజా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన సంగతి మనకు తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం ఆమె రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్న క్రమంలో ఆమె ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.రాజకీయాలలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం ఇంట్లో ఉన్నప్పటికీ తన అధికారిక కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు.

తన నియోజకవర్గంలో సమస్యలు, కరోనా కట్టడి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి పది రోజుల నుంచి ఆన్ లైన్ ద్వారా అధికారులతో ఆమె టచ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ముఖ్యపట్టణమైన పుత్తూరు మునిసిపాలిటీ అధికారులు, నేతలతో రోజా జూమ్ మీటింగ్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కరోనా కట్టడి చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులతో మాట్లాడారు.

కరోనాతో బాధపడుతున్నవారు ఆసుపత్రిలో చేరకుండా హోమియోపతి, అల్లోపతి వంటి మందులను వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగరి నియోజకవర్గ ప్రజలకు తెలిపారు. ముఖ్యంగా ఈ దశ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న క్రమంలో యువత కూడా మరణిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉన్న సమయంలో రోడ్లపై విచక్షణారహితంగా ప్రవర్తించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ఈ విధంగా రోజా సర్జరీ తర్వాత ఇంటికే పరిమితమైన తన విధులను ఎంతో చక్కగా నిర్వహించడంతో ఈమె ఎక్కడున్నా ఫైర్ బ్రాండ్ అని మరోసారి నిరూపించుకున్నారు.

ప్రతి 10 మందిలో ఆరుగురు అందులోనే బతుకుతున్నారు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో వివిధ రకాలకు చెందిన కంపెనీలన్నీ వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. ఈ విధంగా వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించడంతో ఎక్కువ శాతం పనులు ఇంటర్నెట్ పైన ఆధారపడి ఉన్నాయి. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది.

కరోనా కేసులు పెరగటం వల్ల పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేశారు.లాక్ డౌన్ వల్ల చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వారి వరకు ఇంట్లోనే గడపడంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది అని చెప్పవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎక్కువ శాతం వారి రోజును ఇంటర్నెట్ లోనే గడుపుతున్నారు. ఇంటర్నెట్ ఉపయోగించి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిలో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు.

ఇక పెద్దవారు అయితే వారికి నచ్చిన సినిమాలను, పుస్తకాలను గురించి కూడా ఇంటర్నెట్ ఉపయోగించి చదువుతున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ విధించడంతో కార్పొరేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ వినియోగం అధికమైందని చెప్పవచ్చు. ప్రపంచంలో రెండింట మూడు వంతు మంది ప్రజలు మొబైల్ ఫోన్స్ వాడుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది.

ఈ ఏడాది ప్రపంచంలో ఇంటర్నెట్ ఉపయోగించే వారి సంఖ్య ఏకంగా 4.72 బిలియన్లకి చేరుకున్నట్టు తెలిపింది. అదేవిధంగా ప్రతి పది మందిలో ఆరు మంది ఇంటర్నెట్ లోనే జీవిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం 13 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తూ ప్రపంచంలోనే రెండవ ఇంటర్నెట్ వినియోగ దేశంగా నిలిచింది. అమెరికాలో అయితే కేవలం 6.3 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు.