కొందరు పిల్లలు చిన్నతనంలోనే తమ అసాధారణ టాలెంట్ ను చూపిస్తుంటారు. వారు చూపిస్తున్న ప్రతిభకు ఆశ్చర్యపోతుంటారు. కానీ వారి ప్రతిభను ప్రపంచం గుర్తించదనే చెప్పాలి. కొంతమంది ప్రతిభను ప్రపంచానికి చూపించలేక చాలామంది ఉన్నారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి వాళ్లు ప్రపంచానికి తెలుస్తున్నారు.
వాళ్లు చూపించిన ప్రతిభకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగానే.. ఇలా ట్యాలెంట్ ఉన్న చాలా మంది పిల్లలు వెలుగులోకి వస్తున్నారు. అయితే వారిలో కొందరి వీడియోలు పాపులర్ అవుతున్నప్పటికీ.. వారి పూర్తి వివరాలు తెలియకపోవడం ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి. తాజాగా ఓ బుడ్డోడు అతడు చూపించిన ప్రతిభ అమోఘం అని చెప్పాలి. ఆ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇంతకీ అతని ట్యాలెంట్ ఏమిటంటే.. అతను పక్షులు, జంతువుల శబ్దాలను ఇట్టే అనుకరిస్తాడు. పేరు చెప్పగానే.. వాటి వాయిస్ అచ్చు గుద్దినట్టు దించేస్తున్నాడు. అతడు మిమిక్రీ చేస్తున్న క్రమంలో కళ్లు మూసుకొని వింటే.. ఆ పక్షులు పక్కనే సంచరిస్తున్నాయా.. అన్న భావన కలుగుతుంది. Svideo ఫేస్‌బుక్‌లో అకౌంట్ నుంచి షేర్ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. 19 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి.
https://www.facebook.com/113366706871310/videos/898100694076340/?t=0
దీనిని బట్టే అర్థం అవుతుంది.. ఆ వీడియోకు ఏ స్థాయిలో పాపులర్ అయిందో. అతడు తన స్కూల్ పిల్లల మధ్యలో నిల్చొని.. పక్కన ఉన్నవారు పక్షులు, జంతువుల పేర్లు చెబుతుంటే.. వాటి వాయిస్ ను చాలా సులువుగా అనుకరించాడు. అచ్చు గుద్దినట్టుగా వాయిస్‌లను దించేశాడు. ఈ బడ్డోడి ట్యాలెంట్ చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆ పిల్లాడికి కామెంట్లలో ప్రశంసల వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. అతడు ఎవరు.. ఏ ప్రాంతానికి చెందిన వాడు అనేది మాత్రం వివరాలు తెలియరాలేదు.
కోర్టు ఆదేశాలతో ‘మెగా’ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) చరిత్రలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినిమాలపై సోషల్ మీడియాలో…
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…