Tamannaah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాల కాలం అవుతున్నప్పటికీ ఇంకా ఏమాత్రం అవకాశాలు తగ్గకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈమె కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె హీరో సత్యదేవతో కలిసి గుర్తుందా సీతాకాలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమన్నా ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కథలో కంటెంట్ ఉండి ప్రేక్షకులు అభిరుచికి అనుగుణంగా సినిమాలు చేయడానికి తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు.తన మొదటి సినిమా శ్రీ సినిమా చేసే ముందు ఎలాంటి ఆసక్తి ఉందో ఇప్పటికీ సినిమాలపై అదే ఆసక్తి ఉందని వెల్లడించారు. ఇక కథ నచ్చితే ఆ సినిమాలో హీరో చిన్న హీరోనా పెద్ద హీరోనా అని తేడా ఎప్పుడూ చూడనని ఈమె తెలియజేశారు.
ఇక హీరో సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూసిన తర్వాత అతనితో కలిసిన నటించాలనే భావన కలిగింది. ఇలా గుర్తుందా సీతాకాలం సినిమాతో అవకాశం వచ్చిందని తెలిపారు. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా ఓటీటీల ద్వారా యాక్టింగ్ పరంగా ఇంకో ఫ్లాట్ ఫామ్ దొరికిందని నేను భావిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా తమన్నా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…