Thamanna: మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయిన తమన్నా… ఏం జరిగిందంటే?
Thamanna:సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే హీరో హీరోయిన్లు కెరియర్ మొదట్లో వారికి సంబంధించిన సినిమా విషయాల గురించి ఫైనాన్షియల్ విషయాల గురించి వారే దగ్గరుండి అన్ని విషయాల గురించి చూసుకుంటారు.అయితే వారి కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాలు పడి సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో వారికంటూ ఒక మేనేజర్ నియమించుకొని వారికి సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలన్నింటినీ కూడా మేనేజర్ కి అప్ప చెబుతారు.
ఇలా ప్రతి ఒక్క హీరో హీరోయిన్ తప్పనిసరిగా మేనేజర్ ను నియమించుకొని పూర్తిగా ఫైనాన్షియల్ విషయాలన్నీ వారికే వదిలేస్తారు. ఇకపోతే గత దశాబ్ద కాలం నుంచి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుని కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తన కెరియర్ లోఎంతో బిజీగా గడుపుతున్న తమన్నా తనకు సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలన్నింటిని కూడా తన మేనేజర్ కి అప్ప చెప్పి తన పూర్తి దృష్టిని సినిమాలపై ఉంచారు. ఇలా తమన్నా సినిమాలపై దృష్టి సారించడం వల్ల మేనేజర్ మాత్రం ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ లను చెల్లించకుండా ఆ డబ్బులను తన వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించారు.
ఇలా ప్రభుత్వానికి కట్టాల్సిన పనులు చెల్లించకపోవడంతో ప్రభుత్వం తమన్నాకు నోటీసులు పంపించారు.ఇలా ప్రభుత్వం నుంచి నోటీసులు రావడంతో షాక్ అయిన తమన్నా ఏం జరిగిందని ఆరా తీయగా మేనేజర్ చేతివాటం బయటపడటంతో అప్పటినుంచి అప్రమత్తమైన ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ఎంతో జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అయితే కేవలం తమన్నా మాత్రమే కాకుండా ఇలా మేనేజర్ చేతిలో మోసపోయిన ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…