సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా విషాధాలు చోటుచేసుకున్నాయి.. ఈ మధ్య వరుసగా నటులు, దర్శకులు, సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. ఇటీవలే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా అసువులు బాసారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే తాజాగా మరో హాస్యనటుడు కన్నుమూయడం సినీ పరిశ్రమంలో విషాదం నింపింది.కరొనా వ్యాక్సిన్ తీసుకున్నప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కు నిన్న తీవ్రమైన గుండెపోటు వచ్చింది.వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి ఎక్మో ద్వారా ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది ఫలించలేదు. ఈరోజు ఉదయం కన్నుమూశారు.
తమిళ సినీ ఇండస్ట్రీలో వివేక్ టాప్ కమెడియన్ గా చాలా కాలంగా ఉన్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా పరిచయమే. అగ్రదర్శకుడు శంకర్ తీసే సినిమాల్లో ఖచ్చితంగా వివేక్ కు కీలక క్యారెక్టర్ ఉంటుంది. మాధవన్ తీసిన ‘రన్’ సినిమా ద్వారా బాగా పేరొచ్చింది. రజినీకాంత్ ‘శివాజీ’ లో ఆయన స్నేహితుడిగా కీలక పాత్రలో వివేక్ నటించారు. రెండు సినిమాల్లో హీరోగానూ చేశారు. ఈ మధ్య హీరోగా పోవడంతో అవకాశాలు తగ్గాయి. కొద్దిరోజుల క్రితం ధనుష్ హీరోగా వచ్చిన రఘువరన్ బీటెక్ లోనూ వివేక్ కనిపించారు. మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్న వేళ హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అసువులు బాసారు. 2009లో వివేక్ కు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి. తమిళనాట బెస్ట్ కమెడియన్ గా ఐదు సార్లు అవార్డు దక్కించుకున్నారు.
తమిళనాట ప్రముఖ సేవా కార్యక్రమాల్లోనూ వివేక్ చురుకుగా పాల్గొంటారు.. అంతేకాకుండా ఇటీవలే ఆయన కరోనా కు సంబంధించిన టీకా కూడా వేసుకున్న ఆయన ప్రజలంతా కరోనా టీకా వేసుకోవాల్సిందిగా సూచించారు..ఆ తర్వాతే ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు.. ఇక ఇదిలా ఉంటె వివేక్ మృతి పట్ల తమిళ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…