దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా కంట్రోల్ కావడం లేదు. దీంతో ఎప్పుడు ఎవరి గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందా అని అంతా భయంతో వణికి పోతున్నారు. తమ వాళ్లకు ఏమీ కాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో కరోనా విళయతాండవం చేస్తోంది.
ఇప్పటి వరకు అక్కడ దాదాపు 14 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా 94 మంది మృత్యువాత పడ్డారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జనాలల్లో మార్పు రాకపోవడంతో కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇదిలా వుంటే తమిళ స్టార్ హీరో అజిత్ దంపతులు ఈ రోజు చెన్నైలోని అపోలో హాస్పటల్ కు వెళ్లడం ఫ్యాన్స్‌ని కలవరానికి గురిచేసింది.
మాస్కులు ధరించి భార్య షాలినితో కలిసి అజిత్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తమ ఆరాధ్య నటుడికి ఏం జరిగిందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేయడం మొదలైంది. అయితే జనరల్ చెకప్ కోసమే అజిత్ దంపతులు ఆసుపత్రికి వచ్చారని, అంతకు మించి భయపడాల్సిన పనేమీ లేదని అజిత్ అభిమానులు కొంతమంది ఈ వార్తలపై క్లారిటీ ఇస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…